వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా జట్టు టి20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. శుక్రవారం ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టోనీ యురా 61, ఆసద్ వాలా 59, చార్ల్స్ అమిని 53 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పిలిప్పీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేనియల్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అర్ష్‌దీప్ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్ కరికో, హిరిహిరి ఒక వికెట్ పడగొట్టారు.
ఇప్పటికే ఐర్లాండ్ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా అర్హత సాధించడంతో టి20 వరల్డ్‌కప్ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్ నుంచి.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి.
ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆
— ICC (@ICC) July 28, 2023
Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq
చదవండి: Ashes 2023: పాంటింగ్‌పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను'
Comments
Please login to add a commentAdd a comment