philippenes
-
వివాదాస్పద చైనా నూతన మ్యాప్.. భారత్‌తో గొంతు కలిపిన పలు దేశాలు
భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు చైనా నూతన జాతీయ మ్యాప్‌ను తిరస్కరించాయి. చైనా ఇటీవల తన జాతీయ పటం కొత్త వెర్షన్‌ను ప్రచురించింది. దీనిలో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ దేశంలోని భాగంగా చూపింది. భారత్ తీవ్ర నిరసన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను చైనా తన మ్యాప్‌లో చూపించడంపై భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు సరిహద్దు వివాద పరిష్కారాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని భారత్ పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ.. చైనా వాదనలను తిరస్కరించింది. అవి నిరాధారమైనవిగా పేర్కొంది. చైనా చర్యపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ ‘అసంబద్ధమైన వాదనలు చేసినంత మాత్రాన ఇతరుల భూభాగం మీది అయిపోదు’ అని అన్నారు. మండిపడిన ఫిలిప్పీన్స్ చైనా మ్యాప్- 2023 వెర్షన్‌పై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మండిపడింది. చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఈ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేసింది. ఇది దక్షిణ చైనా సముద్రంలో చైనా సరిహద్దులు కలిగివుండటాన్ని చూపిస్తోంది. సముద్ర ప్రాంతాలపై చైనా తన సార్వభౌమాధికారంతో పాటు అధికార పరిధిని చట్టబద్ధం చేయడానికి ఈ కొత్త ప్రయత్నాలు చేస్తోందని, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మా తెరెసిటా దాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ గతంలోనూ చైనా తీరుపై నిరసన వ్యక్తం చేసింది. ఫిలిప్పీన్స్ 2013లో చైనా జాతీయ పటాన్ని ప్రచురించడాన్ని నిరసించింది. దీనిలో కలయాన్ దీవులు,స్ప్రాట్లీస్‌లోని కొన్ని భాగాలను చైనా తన జాతీయ సరిహద్దులుగా చూపింది. చైనా వాదనలు ఖండించిన మలేషియా చైనా స్టాండర్డ్ మ్యాప్ ఎడిషన్ 2023లో దక్షిణ చైనా సముద్రంపై చైనా చేస్తున్న వాదనలకు వ్యతిరేకంగా రాతపూర్వక నోట్‌ను పంపనున్నట్లు మలేషియా ప్రభుత్వం తెలిపింది. మలేషియా ప్రాదేశిక జలాలను కూడా కలిగి ఉన్నట్టు చైనా తన మ్యాప్‌లో చూపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా వాదనలను మలేషియా గుర్తించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మ్యాప్‌పై వియత్నాం నిరసన చైనా దుశ్చర్యలపై వియత్నాం కూడా మండిపడింది. వియత్నాం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫామ్ థు హాంగ్ మాట్లాడుతూ, హోంగ్ సా (పారాసెల్), ట్రూంగ్ సా (స్ప్రాట్లీ) దీవులపై వియత్నాం తన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటిస్తోందని, చైనా చేస్తున్న సముద్ర వాదనలను గట్టిగా తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ‘తైవాన్ను చైనా పాలించనేలేదు’ తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చైనా నూతన ప్రామాణిక మ్యాప్‌పై మండిపడింది. తైవాన్ను ఎప్పుడూ చైనా పాలించలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ నూతన మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: డ్రగ్స్ కాపిటల్‌గా ఫిలడెల్ఫియా.. ఫుట్‌పాత్‌లపై ‘బానిసల’ వికృత చేష్టలు! -
T20 WC: టి20 ప్రపంచకప్-2024కు అర్హత సాధించిన పసికూన
వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా జట్టు టి20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. శుక్రవారం ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టోనీ యురా 61, ఆసద్ వాలా 59, చార్ల్స్ అమిని 53 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పిలిప్పీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేనియల్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అర్ష్‌దీప్ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్ కరికో, హిరిహిరి ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ఐర్లాండ్ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా అర్హత సాధించడంతో టి20 వరల్డ్‌కప్ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్ నుంచి.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆 Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq — ICC (@ICC) July 28, 2023 చదవండి: Ashes 2023: పాంటింగ్‌పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను' -
ఫిలిప్పీన్స్‌లో అనుమానాస్పద స్థితిలో పెద్దపల్లికి చెందిన మెడికో మృతి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 ఇంక్లైన్ కాలనికి చెందిన మెడికో విద్యార్థి నాగపూజిత ఫిలిప్పీన్ దేశంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వైద్య విద్య అభ్యసించేందుకు నాలుగేళ్ల క్రితం నాగపూజిత ఫిలిప్పీన్స్‌కి చేరుకుంది. కాగా 2022 మార్చి7న పరీక్షలు రాసి హాస్టల్‌కి వచ్చి పడుకుంది. ఆమెను లేపేందుకు రూమ్మేట్స్ ప్రయత్నించగా అచేతనంగా కనిపించింది. ఆ తర్వాత నాగపూజిత చనిపోయిన విషయాన్ని గోదావరిఖనిలో ఉన్న తల్లిదండ్రులకు రూమ్మేట్స్ చేరవేశారు. తన కూతురు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ నాగపూజిత తండ్రి నాగ శ్రీనివాస్ గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా 2022 మార్చి 29న నాగపూజిత బాడి హైదరాబాద్‌కి చేరుకుంది. దీంతో గోదావరిఖని పోలీసులు గాంధీ హాస్పటిల్‌కి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. చదవండి: London: హైదరాబాద్ వాలా రెస్టారెంట్లో ఎన్నారై యువతిపై కత్తితో దాడి -
ఇరాక్‌ను విడిచిపెట్టి వచ్చేయండి
మనీలా : ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆయా దేశాలు తమ పౌరులను పశ్చిమాసియా దేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.మంగళవారం రాత్రి ఇరాక్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆయా దేశాలు తమ పౌరులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తమ పౌరులను వెనక్కి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఎడ్వర్డో మెనెజ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. 'ఇరాక్‌లో మా దేశానికి చెందిన 1600 మంది పౌరులు పనిచేస్తున్నారు. అలాగే ఇరాక్‌కు వలస వెళ్లిన వారిని కూడా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్లిపోవాలని తెలిపాం. మా పౌరులను స్వదేశానికి రప్పించేందుకు మూడు కార్గో విమానాలు, ఓడలను పంపాము. ముందుగా మా పౌరులను ఇరాక్ నుంచి ఖతార్, లొరెంజానాకు తరలిస్తాం. అక్కడి నుంచి కార్గో విమానాలు, ఓడల ద్వారా వారిని స్వదేశానికి తీసుకొస్తామని' ఎడ్వర్డో మెనెజ్ ఆ ప్రకటనలో తెలిపారు. (ఈ దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటివి) -
మొసలితో పోరాడి.. చెల్లెల్ని కాపాడుకున్నాడు!
మొసలిని చూడగానే ఎలాంటి వారైనా భయపడి పరుగులు తీస్తారు. అదే చిన్నపిల్లల గురించైతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అటువైపునకు వెళ్లడానికే జంకుతారు. కానీ ఓ బాలుడు మాత్రం అత్యంత సాహసోపేతంగా మొసలిని భయపెట్టి అందరిచేత ఔరా! అనిపించుకుంటున్నాడు. వివరాలు ఫిలిప్పైన్‌కు చెందిన హసీం(15) అనే బాలుడు తన చెల్లెలు హైనా లిసా జొసీ హబి(12)తో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వారు బాంబో వంతెనను దాటవలసి వచ్చింది. అయితే మొదట హసీం వంతెన దాటి ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడి వెనకాలే వస్తున్న హైనా కూడా వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కిందకు జారిపోయింది. ఇంతలో ఓ మొసలి హైనా కాలును పట్టుకుని నదిలోకి లాగుతుండటం గమనించిన హసీం.. వెంటనే వంతెన మీద నుంచి ముసలిపై రాళ్లు విసిరి తన చెల్లెలిని రక్షించాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన గురించి హైనా మాట్లాడుతూ.. తను వంతెన దాటుతున్నప్పుడు ఏదో తన కాలును పట్టుకుని కిందకి లాగినట్లు అనిపించడంతో వంతెనను పట్టుకున్నాడని చెప్పింది. మొసలి తన కాలును దవడలతో పట్టుకోవండంతో భయంతో బిగ్గరగా అరిచానని, వెంటనే తన సోదరుడు వచ్చి మొసలిని రాళ్లతో కొట్టి.. పైకి లాగాడని తెలిపింది. ఈ సందర్భంగా ‘అన్నయ్య నా ప్రాణాలను కాపాడాడు ఐ లవ్ హిమ్ సో మచ్’ అంటూ సోదరుడిపై ప్రేమ కురిపించింది. కాగా ఈ ఘటనలో హైనా కాలు లోపలికి మొసలి పళ్లు దిగి గాయమైంది. దీంతో బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
చేపను మింగాడు.. అది ప్రాణం తీసింది!
మనీలా: ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఊహించడం చాలా కష్టం. ఫిలిప్పీన్స్ నదిలో చేపలు పడుతూ ఓ వ్యక్తి అనుకోని ప్రమాదంలో మరణించాడు. 50 సంవత్సరాల ఆ వ్యక్తికి చేపలు పట్టడమే జీవనాధారం. చేపల వేటలో భాగంగా చేపను పట్టిన వెంటనే తన దంతాలతో నొక్కి పట్టుకోవడం అలవాటు. ఆ అలవాటే అతని ప్రాణాన్ని తీసింది. దంతాల మధ్య ఉంచుకున్న టిలాపియా రకం చేపను ప్రమాదవశాత్తు మింగడంతో శ్వాసరంధ్రాలు మూసుకుపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితున్ని స్థానికులు గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. స్థానికుల వివరాల ప్రకారం బాధితుడు రోజర్ మార్సెలినోగా గుర్తించారు. గత నెల 29న సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని పురాతన ప్రావిన్స్ బుంగాసోంగ్ పట్టణంలో టాగుటుడ్ గ్రామం వద్ద నదిలో చేపలు పట్టడానికి వెళ్లినట్లు అతని కొడుకు తెలియజేశాడు. తన తండ్రికి చేపను పట్టిన వెంటనే దంతాల మధ్య ఉంచకోవడం అలవాటని, అయితే ఈసారి పొరపాటుగా చేపను మింగడంతో మరణించినట్లు తెలిపాడు. -
చర్చి లక్ష్యంగా పేలుళ్లు
మనీలా: బాంబు పేలుళ్లతో ఫిలిప్పీన్స్ దేశం దద్దరిల్లింది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని కేథలిక్ చర్చ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆప్రాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 15 మంది పౌరులు, ఐదుగురు భద్రతాసిబ్బంది ఉన్నారు. సైనిక బలగాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఆదివారం చర్చి ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. తొలిబాంబు పేలుడుతో చర్చి ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. నిమిషం వ్యవధిలో మరో బాంబుపేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండో బాంబును చర్చివద్ద నిలిపివున్న బైక్‌కు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం ముందు జాగ్రత్తగా అధికారులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఆపివేశారు. ‘ఇది దేశ విద్రోహుల చర్య, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు. ముష్కరులకు తగిన బుద్ధి చెబుతాం’అని దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుతెరో ప్రకటించారు. అబూ సయ్యఫ్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొద్దికాలంగా బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నారు. అమెరికాలో ఐదుగుర్ని చంపిన ఉన్మాది న్యూఆర్లిన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో డకోటా థిరియట్(21) అనే ఉన్మాది రెచ్చిపోయాడు. సొంత తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిని కూడా హ్యాండ్‌గన్‌తో కాల్చిచంపాడు. అనంతరం ఓ కారులో పరారయ్యాడు. లూసియానాలోని అస్కెన్షన్ ప్రాంతానికి చెందిన థిరియట్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం(స్థానిక కాలమానం) ప్రియురాలు సమ్మర్ ఎర్నస్ట్(20) ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమెతో పాటు యువతి తండ్రి బిల్లీ(43), తమ్ముడు టానర్(17)ను చంపేశాడు. అనంతరం అక్కడే ఉన్న కారులో లివింగ్‌స్టన్‌లో ఉంటున్న తల్లిదండ్రులు కీత్(50), ఎలిజబెత్(50) వద్దకు చేరుకుని వారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న డకోటా థిరియట్ కోసం గాలింపును ప్రారంభించారు. ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. -
ఆసియాన్‌లో ఉల్లాసంగా !
మనీలా: మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ‘ఆసియాన్–భారత్’, ‘తూర్పు ఆసియా’ సదస్సుల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా చేరుకున్నారు.అనంతరం ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఇచ్చిన ఈ విందులో మోదీ అందరితో మాట్లాడుతూ ఉల్లాసంగా కనిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్స్ జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్ టాగలాంగ్’ను ధరించి విందులో పాల్గొన్నారు. పలువురు నేతలతో ముచ్చటిస్తున్న ఫొటోల్ని ప్రధాని మోదీ ట్వీటర్లో పోస్టు చేశారు. నేడు అమెరికా అధ్యక్షుడితో చర్చలు ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల వేదికగా జరిగే ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు దేశాధ్యక్షులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్, రష్యా ప్రధాని మెద్వెదెవ్‌తో ఆయన చర్చలు జరుపుతారు. సోమవారం ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితితో పాటు పరస్పర ప్రయోజన అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ చెప్పేందుకు భారత్ ముఖ్య పాత్ర పోషించాలని అమెరికా కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ద్యుతెర్తెతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారు. పలు అంశాలను ప్రస్తావించనున్న మోదీ మంగళవారం ఆసియాన్–భారత్, తూర్పు ఆసియా సదస్సుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు, తిరుగుబాటు ధోరణిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ విధాన రూపకల్పనపై ఒత్తిడి తీసుకురావడం, ప్రాంతీయ వాణిజ్య ప్రోత్సాహంపై ఈ సదస్సుల్లో మోదీ ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఆసియాన్ సదస్సులో వాణిజ్యం, పెట్టుబడుల అంశాలతో పాటు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి, ఉత్తర కొరియా అణు క్షిపణి పరీక్షల అంశాల్ని.. తూర్పు ఆసియా సదస్సులో మ్యారీటైం భద్రత, ఉగ్రవాదం, అణు నిరాయుధీకరణ, వలసలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆసియాన్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో పాల్గొనడంతో పాటు ‘రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్’(ఆర్సీఈపీ)లో సభ్య దేశాల నేతలతో కూడా సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా ఫిలిప్పీన్స్‌లో భారతీయ సమాజం ఇచ్చే విందుకు ఆయన హాజరవుతారు. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్‌ను మోదీ సందర్శిస్తారు. ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి జైదీప్ మజుందార్ మాట్లాడుతూ.. ‘ఇండో–ఫసిపిక్‌లో భారత్ మరింత కీలకంగా వ్యవహరించాలని ఆసియాన్‌లోని ప్రతీ దేశం కోరుతుంది’ అని పేర్కొన్నారు. తూర్పు ఆసియా సదస్సులో ‘ఆసియాన్’ సభ్య దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా పాల్గొంటున్నాయి. చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యం! వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు చెక్ పెట్టేలా భద్రతా సహకారంపై చర్చించేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆ స్ట్రేలియా అధికారులు తొలిసారి మనీలాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా మార్చే అంశంపై ఈ నాలుగు దేశాలు చర్చించాయి. పరస్పర ప్రయోజనమున్న అంశాలపై కూడా చర్చలు కొనసాగాయి. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తూ‘ ఇండో–పసిఫిక్‌పై మరిన్ని చర్చలు కొనసాగించాలని, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు అమలయ్యేలా సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించాం’ అని పేర్కొన్నాయి. కలిసికట్టుగా పనిచేసేలా, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సామరస్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా చర్చలు సాగాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉమ్మడి సవాలుగా మారిన ఉగ్రవాదం, ఉగ్రవ్యాప్తిపై కూడా సమావేశంలో చర్చించారని తెలిపింది. -
పీఓకేలో కూలిన పాక్ సైనిక హెలికాప్టర్
ఇద్దరు విదేశీ రాయబారులు సహా ఏడుగురి మృతి ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం పాక్ సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఫిలిప్పీన్స్ రాయబారి లీఫ్ లార్సన్, నార్వే రాయబారి డొమింగో లూసెనారియో, మలేసియా, ఇండోనేసియా రాయబారుల భార్యలు, ఇద్దరు ఆర్మీ పెలైట్లు, సిబ్బంది ఒకరు ఉన్నారు. మలేసియా, పోలండ్, డచ్ రాయబారులు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తానీలు, 11 మంది విదేశీయులతో వెళ్తున్న ఈ హెలికాప్టర్ నల్తార్ లోయ ప్రాంతంలో అత్యవసరంగా దిగుతూ కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. హెలికాప్టర్ ఖాళీగా ఉన్న స్కూలుపై కూలడంతో ఆ భవనానికీ మంటలు అంటుకున్నాయి. హెలికాప్టర్‌ను క్షిపణితో తామే కూల్చామని, తమ లక్ష్యం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అతని సహచరులు అని పాక్ తాలిబాన్ ఉగ్రవాదులు ప్రకటించారు. షరీఫ్ వేరే హెలికాప్టర్లో ఉండడంతో బతికి బయటపడ్డాడని పేర్కొన్నారు. అయితే పాక్ ఆర్మీ దీన్ని తోసిపుచ్చింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ సాంకేతిక లోపంతోనే కూలిపోయిందని పేర్కొంది. నల్తార్కు వెళ్తున్న షరీఫ్ విమానాన్ని ఈ ఘటన నేపథ్యంలో దారి మళ్లించి ఇస్లామాబాద్‌కు తీసుకొచ్చామని పేర్కొంది. నల్తార్లో షరీఫ్ పాల్గొనాల్సిన కార్యక్రమం కోసం 37 దేశాలకు చెందిన దౌత్యవేత్తలను 3 హెలికాప్టర్లలో తీసుకెళ్తుండగా ఒకటి కూలిపోయిందని తెలిపింది. హెలికాప్టర్ 25 అడుగుల ఎత్తు నుంచి కూలిం దని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ చెప్పారు.