
మనీలా : ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆయా దేశాలు తమ పౌరులను పశ్చిమాసియా దేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.మంగళవారం రాత్రి ఇరాక్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆయా దేశాలు తమ పౌరులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తమ పౌరులను వెనక్కి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఎడ్వర్డో మెనెజ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. 'ఇరాక్‌లో మా దేశానికి చెందిన 1600 మంది పౌరులు పనిచేస్తున్నారు. అలాగే ఇరాక్‌కు వలస వెళ్లిన వారిని కూడా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్లిపోవాలని తెలిపాం. మా పౌరులను స్వదేశానికి రప్పించేందుకు మూడు కార్గో విమానాలు, ఓడలను పంపాము. ముందుగా మా పౌరులను ఇరాక్ నుంచి ఖతార్, లొరెంజానాకు తరలిస్తాం. అక్కడి నుంచి కార్గో విమానాలు, ఓడల ద్వారా వారిని స్వదేశానికి తీసుకొస్తామని' ఎడ్వర్డో మెనెజ్ ఆ ప్రకటనలో తెలిపారు.
(ఈ దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటివి)
Comments
Please login to add a commentAdd a comment