citizens
-
బంగ్లాదేశ్ పౌరుల చొరబాట్లను తిప్పికొడుతున్న బీఎస్ఎఫ్
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అశాంతి కారణంగా అక్కడి ప్రజలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) నిరంతరం ప్రయత్నిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 140 మంది బంగ్లాదేశ్ పౌరులను భారత బలగాలు అడ్డుకున్నాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.ఆ దేశంలో నెలకొన్న అశాంతికి భయపడి అక్కడి జనం సరిహద్దుల్లో గుమిగూడుతున్నారని, అయితే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వారి భద్రతకు హామీ ఇచ్చిందని బీఎస్ఎఫ్ పేర్కొంది. అయినప్పటికీ అక్కడి పౌరులు కొందరు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీఎస్ఎఫ్తో పాటు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ భారత్‌లో చొరబాటుకు యత్నించింన 35 మంది బంగ్లాదేశ్ పౌరులను వారి ఇళ్లకు తిరిగి పంపించింది. -
లెబనాన్‌లో యుద్ధమేఘాలు.. పౌరులకు భారత్ అడ్వైజరీ
న్యూఢిల్లీ: గాజాకు పరిమితమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తాజాగా లెబనాన్‌కూ పాకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్‌పై లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా దాడి చేయడమే ఇందుకు కారణం. హెజ్బొల్లా దాడికి ప్రతిగా లెబనాన్‌పై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్‌లోని బీరుట్ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో లెబనాన్‌లోని భారత రాయబారకార్యాలయం అప్రమత్తమైంది. లెబనాన్‌లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని బీరుట్‌లోని తమ కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తాజా అడ్వైజరీ జారీ చేసింది. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వాతావరణం ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లోని మజదల్ షమ్స్‌పై హెజ్బొల్లా దాడి చేసింది. ఈ దాడిలో ఓ 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణమైంది. ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై సోమవారం(జులై 29) డ్రోన్లతో దాడి మొదలుపెట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. -
ఎన్నికల తంతు ముగియగానే పాక్‌లో ధరల మోత!
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే ద్రవ్యోల్బణం దడ పుట్టించడం మొదలుపెట్టింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌తో పాటు దేశీయ వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచింది. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల వెన్ను విరిగింది. పాక్‌లో ధరల పెరుగుదల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఆదివారం కరాచీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ పలువురు ఆందోళన చేపట్టారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తమను అప్పులపాలు చేస్తున్నదని ఆందోళనకారులు వాపోయారు. ధరల పెరుగుదల పలు ఇబ్బందులను సృష్టిస్తున్నదని కరాచీలో దాబా నిర్వహిస్తున్న ఇర్ఫాన్ వాపోయారు. రాబోయే ప్రభుత్వం కూడా విఫలమవుతున్నట్లు కనిపిస్తోందని, గ్యాస్ బిల్లులు కట్టలేకపోతున్నామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు తగ్గించారని, ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 12,500 (పీకేఆర్)కు చేరడంతో ఈ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తున్నామని తెలిపారు. రోజుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రోజువారీ కూలీగా పనిచేస్తున్న అబిద్ మాట్లాడుతూ ‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పాలు, చక్కెర, గోధుమలు, బియ్యం లాంటివి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి అద్దె కూడా కట్టలేక పోతున్నాం. రోజంతా కష్టపడితే కేవలం 900 పాకిస్తాన్ రూపాయలు సంపాదిస్తాను. దీంతో ఇంటి అద్దె నెలకు రూ. 7,500(పీకేఆర్) ఎలా చెల్లించాలని’ అబిద్ ప్రశ్నించారు. ఇంటి యజమానులు వంట కోసం కలపను వినియోగించడానికి అనుమతించకపోవడంతో, ఇప్పటికి కనీసం మూడు ఇళ్లు మార్చానని, వంట గ్యాస్ కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నానని అబిద్ వాపోయారు. -
‘అక్కడి నుంచి బయటపడండి’ మయన్మార్‌లోని భారతీయులకు హెచ్చరిక!
మయన్మార్‌లోని రఖైన్ ప్రావిన్స్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడున్న భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుండి బయటపడాలని భారత్ కోరింది. రఖైన్ ప్రావిన్స్ సురక్షితంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, ల్యాండ్లైన్లతో సహా టెలికమ్యూనికేషన్‌కు అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత తదితర కారణాల దృష్ట్యా భారతీయ పౌరులెవరూ రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. 2021, ఫిబ్రవరి ఒకటి నుంచి మయన్మార్‌లో అస్థిరత నెలకొంది. సైనిక తిరుగుబాటులో దేశ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పలు హింసాత్మక నిరసనలు జరిగాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో నెలకొన్న అస్థిరత మన దేశంపై ప్రభావం చూపబోతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మయన్మార్ మన పొరుగు దేశం కావడంతో అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు మయన్మార్‌తో అనుసంధానమై ఉన్నాయి. భారతదేశం, మయన్మార్లు దాదాపు 1,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. -
Advisory: భారత్‌లో ఉన్న ఇజ్రాయెల్ పౌరులకు అలర్ట్
జెరూసలెం: భారత్‌లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. పబ్లిక్ ప్లేసులకు, జనాలు ఎక్కువగా పాల్గొనే ఈవెంట్లకు వెళ్లొద్దని సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం హిబ్రూ భాషలో ఒక అడ్వైజరీ జారీ చేసింది. ‘ఢిల్లీలోని దేశ ఎంబసీ ఆఫీసు వద్ద బాంబు పేలుడు సంభవించింది. భారత్‌లో ఉన్న పౌరులు ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మాల్‌లు,మార్కెట్లు లాంటి జనం ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్రదేశాలకు వెళ్లొద్దు’ అని ఆ దేశ పౌరులకు ఇజ్రాయెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఢిల్లీ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు బహుశా దాడి అయి ఉండొచ్చని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అయితే పేలుడులో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. పేలుడుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంబసీ ఆఫీసు వెనకాల ఉన్న పృథ్వీరాజ్ రోడ్డులో మంగళవారం అత్యంత శబ్ద తీవ్రత కలిగిన బాణాసంచా పేలిందని అందుకే శబ్దం వచ్చిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాలు తమకు తెలుసని పేలుడు ప్రాంతంలో ఒక లేఖ దొరికినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..తీరానికి కొట్టుకొచ్చిన వింత మెటల్ షీట్లు -
'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు'
ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధుల కోసం ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని తెలిపింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం (అక్టోబర్ 31న) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి కేంద్రం తన వాదనను సమర్పించింది. "ఎలక్టోరల్ బాండ్ల విధానంలో విరాళాలు సమర్ఫించే దాతల గోప్యతను కాపాడాల్సి ఉంటుంది. ఈ పథకం స్వచ్ఛమైన డబ్బును రాజకీయ పార్టీలకు అందిస్తుంది. ఈ విరాళాలు పన్ను బాధ్యతలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. అందువల్ల ఇది ఏ హక్కుకు కూడా భంగం కలిగించదు" అని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్ డొమైన్లలో ఉండబోదని అటార్ని జనరల్ తెలిపారు. అభ్యర్థుల వివరాలకు సంబంధించి ప్రతిదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని వెల్లడించారు. రాజకీయ నిధులలో పారదర్శకతను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు జనవరి 2, 2018న ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ ఎన్నికల బాండ్లు ఓ ప్రామిసరీ నోట్ లాంటిది. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఈ బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకుని ప్రచారాల కోసం వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు -
ఇజ్రాయెల్‌లో 9 మంది అమెరికన్లు మృతి
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో కనీసం 9 మంది అమెరికా పౌరులు మరణించారు. మరెందరో ఆచూకీ తెలియకుండా పోయారని అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లో జాడ తెలియకుండా పోయిన 8 మంది ఫ్రాన్స్ దేశస్తులు కూడా హమాస్ మిలిటెంట్లకు చిక్కడమో, వారి చేతిలో మరణించడమో జరిగి ఉంటుందని చెబుతున్నారు. 10 మంది బ్రిటిష్ పౌరులు కూడా హమాస్ దాడుల్లో మరణించడమో, జాడ తెలియకుండా పోవడమో జరిగిందని చెబుతున్నారు. -
ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా-కెనడా మధ్య ఆంక్షల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కెనడా మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. కెనడా పౌరులకు ప్రయాణ హెచ్చరికలను పునరుద్ధరించింది. ఇండియాలో ఉన్న కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పట్ల భారత సోషల్ మీడియా వెబ్సైట్లలో నిరసన వైఖరికి సంబంధించిన పోస్టులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ.. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ హిందువులకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తిరిగి వెళ్లాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారత ఎంబసీ ముందు సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ నిరసనలు కూడా చేపట్టింది. ఈ పరిణామాలు వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధంగా ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడా, యూకే, అమెరికా సహా తదితర దేశాల్లో నివాసం ఉంటున్న దాదాపు 19 మంది ఖలిస్థానీ మద్దతుదారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం కూడా చేసుకుంది. ఇదీ చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
parliament session: డేటా దుర్వినియోగం చేస్తే రూ.250 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: పౌరుల డిజిటల్ హక్కులు, వ్యక్తిగత సమాచార భద్రతకు ఉద్దేశించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని ద్రవ్య బిల్లుగా తీసుకువచ్చారన్న ఆరోపణల్ని మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. ఇది సాధారణ బిల్లేనని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత గోప్యతతో ప్రమేయమున్న ఈ బిల్లును హడావుడి ఆమోదించవద్దని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి అన్నారు. గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉంచిన ముసాయిదా బిల్లుపై వచి్చన సలహాలు సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వినియోగదారుల డిజిటల్ డేటాని దుర్వినియోగం చేసేవారిపై కేంద్రం కొరడా ఝళిపించింది. అలాంటి సంస్థలపై రూ.50 నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనుంది. అంతేకాకుండా ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా డేటా ప్రొటక్షన్ బోర్డుని ఏర్పాటు చేయనున్నట్టుగా బిల్లులో పేర్కొంది. -
మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ?
మనమున్న సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా చాలు మన వ్యక్తిగత సమాచారం బజార్లో పడినట్టే. మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఈ– కామర్స్ సైట్లు పౌరుల వ్యక్తిగత డేటాతో ఆటాడుకుంటున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేయడానికే ఇప్పుడీ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు–2022’’ను (డీపీడీపీ) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఆరేళ్లుగా మేధోమథనం సాగించిన కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు ముసాయిదా బిల్లును రూపొందించింది. గతేడాది నవంబర్‌లో ప్రజలు, సామాజిక సంస్థల అభిప్రాయం కోసం వెలువరించిన ముసాయిదా బిల్లులో అంశాలే ఇంచుమించుగా ఇందులో ఉన్నాయి. అయితే విదేశీ సంస్థలు సమాచార సేకరణలో కొన్ని ఆంక్షల్ని విధించారు. బిల్లులో ఏముందంటే ? డీపీడీపీ బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దీని వివరాలను కేంద్రం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని వివాదాస్పద అంశాలు అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలకు విస్తృతమైన మినహాయింపులు ఇవ్వడం, డేటా ప్రొటక్షన్ బోర్డు పాత్రను గణనీయంగా తగ్గించడం వంటివి ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రభుత్వాధికారులు, ఇతర నాయకులకు సంబంధించిన డేటా కూడా ఈ చట్టం కింద గోప్యంగా ఉంచడం వల్ల సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందనే ఆందోళనలున్నాయి. ఇంకా బిల్లులో ఉన్న అంశాలివే.. ► ఆన్లైన్ లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా వారి సమ్మతితో సేకరించాలి. దానిని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆ సంస్థలదే. తమ పని పూర్తి కాగానే ఆ సమాచారాన్ని తొలగించాలి. ► మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటాను సేకరించి ప్రాసెస్ చేయవచ్చు. అదే విదేశాల్లో వస్తు, సేవల వినియోగంలో మాత్రం డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. ► వివిధ సామాజిక మాధ్యమాలు, ఈ కామర్స్ సంస్థలు, మొబైల్ యాప్స్ జవాబుదారీ తనం పెరిగేలా సేకరించిన సమాచారాన్ని ఎలా భద్రపరుస్తున్నారు, ఏ రకంగా సేకరిస్తున్నారు ? పౌరుల సమాచారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు ? వంటి ప్రశ్నలకు ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ► ఏదైనా సమాచారం చుట్టూ వివాదం చెలరేగితే కేంద్రం ఏర్పాటు చేయనున్న డేటా ప్రొటక్షన్ బోర్డు ఆఫ్ ఇండియా వాటిని పరిష్కరి స్తుంది. ఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను కేంద్రమే నియమిస్తుంది. ► పౌరుల వ్యక్తిగత సమాచారం ఉల్లంఘన జరిగితే సదరు కంపెనీలకు అత్యధికంగా రూ.250 కోట్ల జరిమానా విధించవచ్చు. ► ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వేర్వేరు విధివిధానాలున్నాయి. జాతి భద్రతకు సంబంధించిన అంశాల్లో సమాచార సేకరణపై మినహాయింపులున్నాయి. ► పౌరులు తమ డేటాను వాడుకున్నారని భావిస్తే నష్టపరిహారం కోసం కోర్టుకి ఎక్కొచ్చు. చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించాల్సి వచ్చిన ప్పుడు వారి లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ► ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో వాణిజ్య లావాదేవీల్లో అత్యంత కీలకం కానుంది. గతంలో ఏం జరిగింది? వ్యక్తిగత డేటా పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిబంధనల్నీ విధిస్తూ ఉంటే మన ప్రభుత్వం 2018 నుంచి ఈ చట్టంపై కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కోసం ఉద్దేశించిన శ్రీకృష్ణ కమిటీ 2018లో ఒక ముసాయిదా బిల్లు కేంద్రానికి సమర్పించింది. కానీ కేంద్రానికి, దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలకి మధ్య ఒక అంగీకారం రాలేదు. చివరికి 2019లో ఒక ముసాయిదా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో సమగ్రత లోపించిందని స్వయంగా జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొనడం కలకలం రేపింది. డేటా పరిరక్షణ బిల్లు నిబంధనల్ని అతిక్రమించే వారి జాబితా నుంచి ప్రభుత్వం తనని తాను మినహాయించుకోవడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ బిల్లులో 81 సవరణలు చేయాలంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించడంతో గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది. విదేశాల్లో వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ప్రపంచంలోని 71% దేశాల్లో వ్యక్తిగత సమాచారం భద్రతపై కఠినమైన చట్టాలే ఉన్నాయి. వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సులో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా 194 దేశాల్లోని 137 దేశాలు డేటా పరిరక్షణ కోసం చట్టాలు రూపొందించాయి. ► ఆఫ్రికా దేశాల్లో 54గాను 33 దేశాల్లో (61%) డేటా చట్టాలు అమల్లో ఉన్నాయి. ► ఆసియా దేశాల్లో ఇది ఇంకా తక్కువగా 57% మాత్రమే ఉంది. ► 60 దేశాలకు గాను 34 దేశాలు చట్టాలను రూపొందించాయి. ఇక వెనుకబడిన దేశాలు 46కి గాను 22 దేశాల్లో మాత్రమే చట్టాలున్నాయి. అంతర్జాతీయంగా ఈయూ మోడల్, యూఎస్ మోడల్ చట్టాలే అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఈయూ మోడల్లో వ్యక్తిగత సమాచార సేకరణ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. పౌరుల డేటా బయటకు వచ్చిందంటే ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తాయి. అత్యధిక దేశాలు ఈ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. ఇక అమెరికా మోడల్లో డేటా భద్రతని వ్యక్తుల స్వేచ్ఛ పరిరక్షణగా చూస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యక్తుల పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లవు. వ్యక్తుల డేటా అవసరమైన ప్రతీ సారి వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!
కల్లోలిత సూడాన్ నుంచి పౌరులను తరలించేందుకు భారత్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తోంది. ఏప్రిల్ 15న సూడాన్ రాజధాని ఖర్టూమ్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య జరుగుతున్న హోరాహోరి పోరు హింత్మకంగా మారింది. దీంతో సూడాన్ దారుణంగా దెబ్బతింది. ఈ అత్యర్యుద్ధంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఈపాటికే భారత్ కూడా వారిని అప్రమత్తం చేసి, సూచనలందించింది. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయం కూడా అన్ని రకాలుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ యుద్ధంలో విమానాశ్రయలే దారుణంగా దెబ్బతినడంతో తరలింపు కష్టతరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించిన భారత్ వారిని సురక్షితమైన భూమార్గం గుండా తరలించాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఐతే రాయబార కార్యాలయ సిబ్బంది తరలింపు ఆపరేషన్‌లో సహయం చేయడం కోసం ప్రస్తుతానికి అక్కడే ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, యూఎస్ ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయాన్ని తన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ని ఉపయోగించి తాత్కాలికంగా నిలిపేసి, సిబ్బంది ఖాళీ చేయించింది. ఈమేరకు మేజేమెంట్ అండ్ సెక్రటరీ అంబాసీడర్ మాట్లాడుతూ..రాపీడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ మాతో సమన్వయమై యూఎస్ ఆపరేషన్‌కు మద్దతిచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారు సహకరించిన మేరకు సహకరించారు. ఆపరేషన్ సమయంలో మా సభ్యులపై కూడా కాల్పులు జరిపారు. ఐతే వారి స్వప్రయోజనాల కోసం చేశారని భావిస్తున్నాం అని అన్నారు. కాగా, వివిధ దేశాల నుంచి 150 మందికి పైగా ప్రజలు ఒక రోజు ముందుగానే సౌదీ అరేబియా చేరుకున్నారు. ఐతే సౌదీలు కాకుండా భారతదేశంతో సహా 12 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నట్లు సమాచారం. అదీగాక తమ పౌరులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నమని విదేశీ దేశాలు తెలిపాయి. అందులో భాగంగా దక్షిణ కొరియ, జపాన్ తమ సమీపంలో ఉన్న దేశాల నుంచి బలగాలను మోహరించి పౌరులను తరలించే యత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక యూరోపియన్ యూనియన్ కూడా ఇదే తరహాలో తరలించే యత్నం చేస్తోంది. ఐతే ఇప్పటి వరకు సూడాన్‌లో జరిగిన పోరాటంలో దాదాపు 420 మందికి పైగా మరణించారని, మూడు వేలమందికి పైగా గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది కూడా. (చదవండి: విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..) -
బీమా సంస్థలు పెరగాలి..అప్పుడే అందరికీ బీమా సాకారం!
ముంబై: దేశంలో 2047 నాటికి అందరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యం సాకారానికి మరిన్ని బీమా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అభిప్రాయపడ్డారు. విస్తృతమైన, వైవిధ్యమైన బీమా ఉత్పత్తులు, మరిన్ని పంపిణీ భాగస్వాములు కూడా కావాలన్నారు. ప్రైవేటు ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ పరిశ్రమ అసోసియేషన్ వార్షిక సదస్సును ఉద్దేశించి పాండా మాట్లాడారు. ‘‘బీమా పరిశ్రమలో ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరిచి రెండు దశాబ్దాలకు పైనే గడిచింది. బీమా మార్కెట్ ఎంతో వృద్ధి చెందింది. గడిచిన ఐదేళ్లలో బీమా రంగం ఏటా 10 శాతం వృద్ధిని చూసింది. అయినప్పటికీ 2021నాటికి బీమా విస్తరణ 4.2 శాతంగానే ఉంది. మరింత మందికి చేరువ కావాల్సి ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న వైవిధ్యభరిత దేశం. అందరికీ ఒక్కటే విధానం సరిపోదు. అధిక ధనవంతులు, పేద ప్రజల కోసం విభిన్నమైన బీమా పరిష్కారాలు అవసరం. అలాంటి వినూత్నమైన ఉత్పత్తులను నేడు ఉన్న 70 కంపెనీల నుంచి సాధ్యం కాదు. కనుక మరిన్ని కంపెనీలు రావాలి. విస్తృతమైన బీమా ఉత్పత్తులు, పంపిణీదారులు కూడా అవసరం. అప్పుడే 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించగలం’’అని దేవాశిష్ పాండా వివరించారు. -
రష్యా నుంచి తక్షణమే వచ్చేయండి
వాషింగ్టన్: రష్యాలో ఉంటున్న, అక్కడికి ప్రయాణం చేస్తున్న తమ పౌరులు తక్షణమే వెనక్కి వచ్చేయాలని అమెరికా కోరింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అకారణంగా అమెరికా పౌరులను అరెస్ట్ చేసి వేధించే ప్రమాదముందని హెచ్చరించింది. ‘రష్యా భద్రతా సంస్థలు అమెరికా పౌరులపై నిరాధార ఆరోపణలు చేసి, నిర్బంధంలో ఉంచుతున్నాయి. వారికి న్యాయసాయం, అవసరమైన వైద్య చికిత్సలను సైతం అందకుండా చేస్తున్నాయి. రహస్య విచారణలు జరుపుతూ, ఎటువంటి రుజువులు లేకుండా దోషులుగా ప్రకటిస్తున్నాయి. మత ప్రచారకులైన అమెరికా పౌరులపై సైతం గూఢచర్యం కేసులను మోపి, విచారణల పేరుతో వేధిస్తున్నాయి’అని అందులో పేర్కొంది. సైన్యంలోకి రిక్రూట్మెంట్లను ప్రారంభించాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వుల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా తమ పౌరులకు ఇదే విధమైన హెచ్చరికలు చేసింది. -
మీరెవరో.. ట్రూకాలర్ ఇట్టే చేప్పేస్తుంది!
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరో అదిరిపోయే ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో తాము గవర్నమెంట్ అధికారులమని, లేదంటే మంత్రి, ఎమ్మెల్యేలం’ అంటూ డబ్బులు వసూలు చేసే కేటుగాళ్ల ఆటకట్టిస్తున్నట్లు తెలిపింది. తాము తెచ్చిన ఈ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్‌తో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను ఈజీగా గుర్తించవచ్చని ట్రూకాలర్ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు బాధితులు సమస్యల్ని నేరుగా అధికారులు, సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించవచ్చని, ఇందుకోసం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెబుతోంది. తాము ప్రభుత్వ పెద్దలమని సామాన్యుల్ని మోసం చేసే వారిని గుర్తించే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా మోసాల్ని అరికట్టవచ్చని ట్రూకాలర్ తెలిపింది. ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఆ సమాచారం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీలో సంబంధిత ఫోన్ వినియోగదారులకు సమాచారం వెళ్తుందని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఫోన్లలో ట్రూకాలర్ యాప్‌ను అప్డేట్ చేసి ఈ ఫీచర్‌ను పొందవచ్చు. -
వీసా లేకుండా విదేశాలకు వెళ్లొచ్చు..!
-
ఉక్రెయిన్‌ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్
US Embassy in Kyiv, warning: రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు మరిన్ని దాడులకు తెగబడనున్నట్లు సమాచారం. దీంతో యూఎస్ ఎంబసీ మరోసారి తమ దేశ పౌరులకు హెచరికలు జారీ చేసింది. ఆగస్టు 24 బుధవారం ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రష్యా మరిన్ని దాడులకు దిగనున్నట్లు ప్రాథమిక సమాచారం. అంతేగాదు మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్ పౌర మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సౌకర్యాలకు వ్యతిరేకంగా రష్యా దాడులను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తోందని విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే అమెరికా రాయబార కార్యాలయం పౌరులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు సురక్షితమైన అందుబాటులో ఉన్న ప్రైవేట్ భూ రవాణా సౌకర్యాలను ఉపయోగించి ఉక్రెయిన్ నుంచి బయలుదేరమని యూఎస్ పౌరులని కోరుతోంది. అదీగాక బుధవారం సోవియట్ పాలన నుంచి ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందిన రోజు కూడా కావడంతో రాజధాని కీవ్ బహిరంగ వేడుకలను నిషేధించింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌కి ముప్పు మరింత తీవ్ర స్థాయిలో ఉందని అధ్యక్షడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా ప్రకటించారు. (చదవండి: మృతి చెందిన పుతిన్ సన్నిహితుడి కుమార్తెకు ప్రతిష్టాత్మక అవార్డు) -
చైనా పౌరుల ప్రతి కదలికపై గట్టి నిఘా! ఎక్కడికి వెళ్లినా..చెప్పాల్సిందే!
increasing attacks targeting Chinese citizens in Pakistan: పాకిస్తాన్‌లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్ పోలీసులకు తెలియజేయలాని కోరినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విదేశీయుల భద్రత కోసం ఇస్లామాబాద్ పోలీసుల ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ ఫారిన్ సెక్యూరిటీ సెల్ పనితీరును సమీక్షించేందుకే నిర్ణయించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో సుమారు వెయ్యి మంది చైనా పౌరులు ఉన్నారు. అంతేకాదు వీళ్లంతా వివిధ కంపెనీలు, వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 36 ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని సర్వే తెలిపింది. బహుళ మిలియన్ డాలర్ల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టులకు సంబంధించిన చైనీయులకు పారామెలటరీ దళాలు, భద్రతా దళాలు రక్షణ కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు. పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సెక్యూరిటీ డివిజన్ లేదా పెట్రోలింగ్ యూనిట్ సుమారు వెయ్యి మందికి పైగా చైనా పౌరుల కదలిక సమయంలో భద్రత కల్పించాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. వారి కదలికల వివరాలను సేకరించే బాధ్యత కూడా ఎస్హెచ్ఓలకు అప్పగించామని అధికారులు తెలిపారు. చైనా పౌరుల నివాసాలతో పాటు వారి ఇళ్లకు వెళ్లే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సేఫ్ సిటీ పోలీస్ ఫెసిలిటేషన్లో ఒక డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అధికారులు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదీగాక ఈ ఏడాది ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ షటిల్ వ్యాన్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కి చెందిన మహిళ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. పైగా వేర్పాటువాద పాకిస్తాన్‌లోని బులిచిస్తాన్ ప్రావిన్స్‌లో స్థానికులు చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ) -
సహకరిస్తే భారీగా నగదు ఇస్తాం.. ప్రజలకు చైనా బంపరాఫర్
National Security' Tip-Offs: చైనా సంచలన ప్రకటన చేసింది. తన పౌరులను జాతీయ భద్రతకు సహకరించాల్సిందిగా అభ్యర్థించింది. ఇలా చేస్తే పౌరులకు సుమారు రూ. 11 లక్షల రివార్డును, సర్టిఫికేట్లను అందజేస్తానని చెప్పింది. జాతీయ భద్రతకు మద్దతిచ్చేలా.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడే వారి గురించి సమాచారం ఇస్తే పౌరులకు మంచి రివార్డులు అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు నేరాలను నివారించడం లేదా ఏదైనా కేసు పరిష్కరించడంలో సహకరించి మంచి తెగువ చూపించనవారికి పెద్ద మొత్తంలో నగదు, సర్టిఫికేట్లు ఇస్తామని తెలిపింది. ఇది ఒక రకంగా జాతీయ భద్రతకు సహకరించేలా పౌరుల్లోని ధ్యైర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని సమీకరించే చర్యగా పేర్కొనవచ్చు. చైనా గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా ఉల్లంఘనల గురించి సమాచారం అందించినవారికి మంచి నగదు బహుమతులను అందిస్తోంది. అయితే.. ఇప్పుడు చైనా భద్రతా మంత్రిత్వ శాఖ పౌరులందరూ ఆచరించేలా జాతీయ భద్రతకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ భద్రతా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండమని బీజింగ్ తమ దేశా ప్రజలకు సూచించింది. చైనా మీడియా సంస్థలు కూడా ప్రజలను మన మధ్య ఉండే గూఢచారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. మన మధ్యే గూఢచారులుగా తిరిగే వాళ్లు ఎలా ఉంటారో కూడా సూచనలిచ్చింది. ఈ మేరకు చైనా ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీ జాతీయ భద్రతా ఉల్లంఘనల అనుమానంతో 2020లో నిర్బంధించింది ఐతే ఆమెను నిర్బంధించిన సమయంలో వచ్చిన ఆరోపణల గురించి స్పష్టత లేకపోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రేరేపించబడిందా లేక ప్రతికారం తీర్చుకుంటుందా అనే ఊహాగానాలకు తెరలేపింది. అలాగే ఆస్ట్రేలియాలో జన్మించిన చైనీస్ రచయిత యాంగ్ జున్ గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు. హాంకాంగ్ నగరంలో చెలరేగిన హిసాత్మక ప్రజాస్వామ్య అనుకూల నిరసనల అసమ్మతిని తొలగించడానికి చైనా 2020లో విధించిన జాతీయ భద్రతా చట్టం ఉపయోగపడింది. అప్పటి నుంచి చైనా జాతీయ భద్రతను మరింత పటిష్టంగా ఉంచుకునే దిశగా గట్టి చర్యలు తీసుకుంటోంది. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు
Sri Lanka Crisis: గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంకోభాలతో కొట్టుమిట్టాడుతూ.. తీవ్ర ఉద్రిక్తలతో మగ్గిపోయింది. ఇప్పడిప్పుడే కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం కొత్త ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. ఆ దేశా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రధాని రణిల్ విక్రమసింఘే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తమ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంధనానికి సంబంధించి రాబోయే మూడు వారాలు మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందువల్ల మనం ఇప్పటి నుంచే ఇంధనం, గ్యాస్‌లను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అనవసరమైన ప్రయాణాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. సంక్షోభాన్ని అధిగమించడానికి దేశం ఇంధనం కోసం నెలకు సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది" అని చెప్పారు. అదీగాక అంతర్జాతీయ పరంగా మనం అనుసరిస్తున్న నాసిరకం విధానాల వల్లే దేశం మరింతగా అణగారిపోతుందని విక్రమసింఘే అన్నారు. అందువల్ల ప్రస్తుతం దేశం తన విదేశీ సంబంధాలపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!) -
ఉక్రెయిన్ వీడి భారత్‌కు రండి.. ఎంబసీ కీలక ప్రకటన
All Indian students, are advised to leave Ukraine temporarily: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని భారత రాయభార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులతో సహా తమ పౌరులను తూర్పు ఐరోపా దేశంలో ఉండడం అవసరమని భావించకపోతే తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. అంతేకాదు భారతీయ పౌరులు, విద్యార్థులను ఉక్రెయిన్ను తాత్కాలికంగా విడిచిపెట్టిరావాలని సూచించింది. అలాగే భారతీయ విద్యార్థులు చార్టర్ విమానాల గురించి అప్డేట్ల కోసం సంబంధిత స్టూడెంట్ కాంట్రాక్టర్లను కూడా సంప్రదించాలని, అలాగే ఎంబసీ ఫేస్బుక్, వెబ్సైట్, ట్విట్టర్లను అనుసరించాలని సూచించింది. సమాచారం, సహాయం అవసరమైన ఉక్రెయిన్‌లోని భారతీయులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్ని సంప్రదించాలని తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరోదించే విషయమై ఈరోజు చివరి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లో పరిస్థితి గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య టెలిఫోన్ సంభాషణ ప్రారంభమైందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నాటోలో ఉక్రెయిన్ ఎప్పటికీ చేరనన్న రాతపూర్వక హామీపై బలగాలు వెనక్కు తగ్గతాయంటూ పునరుద్ఘాటించటం గమనార్హం. ADVISORY FOR INDIAN NATIONALS IN UKRAINE.@MEAIndia @DrSJaishankar @PIBHindi @DDNewslive @DDNewsHindi @IndianDiplomacy @PTI_News @IndiainUkraine pic.twitter.com/i3mZxNa0BZ — India in Ukraine (@IndiainUkraine) February 20, 2022 (చదవండి: యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు) -
పర్సనల్ డేటా ప్రొటెక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2019 (పీడీపీ)’ ముసాయిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభల ముందుకు రానుంది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆనాడు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదించారు. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు తమ అసమ్మతి తెలుపుతూ జేపీసీ చైర్మన్ చౌదరికి లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, వివేక్ టాంకా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా, బిజూ జనతాదళ్ ఎంపీ అమర్ పట్నాయక్ జేపీసీ నిర్ణయంతో విభేదించారు. వేర్వేరుగా తమ అసమ్మతి నోట్లను ప్యానెల్ ఛైర్మన్‌కు పంపారు. ఏదైనా నేరం జరిగే ఆస్కారం ఉందని భావించినా దాన్ని నిరోధించడానికి, ఆ విషయంలో తదుపరి దర్యాప్తు చేయడానికి, సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి వ్యక్తిగత డాటాను విశ్లేషించే అధికారాన్ని ఈ చట్టంలో దర్యాప్తు సంస్థలకు వీలు కల్పించారు. ఈడీ, సీబీఐలతో సహా తమ దర్యాప్తు సంస్థలకు వ్యక్తిగత గోప్యత రక్షణ హక్కు చట్టం నుంచి మినహాయించే అపరిమిత అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడాన్ని విపక్షాలు తీవ్రం ఆక్షేపించాయి. ఇలా మినహాయింపు ఇవ్వడానికి పార్లమెంటు ఆమోదం తీసుకోవాలని, అప్పుడే సిసలైన జవాబుదారీతనం ఉంటుందని విపక్షాలు కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. చట్టం స్ఫూర్తికే దెబ్బ.. కమిటీ సిఫార్సుల్లో రెండు మినహా మిగతా అంశాలపై అభ్యంతరం లేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు, శాంతిభద్రతలకు సంబంధించి కేంద్రం, ప్రభుత్వ ఏజెన్సీలు తమని తాము మినహాయించుకోవడానికి అనుమతించే బిల్లులోని క్లాజ్ 35ను పలువురు విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ చట్టబద్ధ సంస్థలకు(పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మినహాయింపు లభించనుంది. ట్విట్టర్, ఫేసుబుక్ వంటి వాటిని సామాజిక ప్రసార మాధ్యమ వేదికలుగానే పరిగణించాలని తేల్చిచెప్పింది. వాటికి మధ్యవర్తిత్వ హోదా (ఇంటర్మీడియటరీ హోదా... ఎవరైనా వినియోగదారుడు సదరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకమైన అంశాలను పోస్టు చేసే వాటికి ఈ సోషల్ మీడియా సంస్థ బాధ్యత ఉండదు) తొలగించి వాటిని సైతం ఈ చట్టం కిందికి తీసుకురావాలని సూచించింది. బిల్లులోని క్లాజ్ 35 ప్రకారం.. పౌరుల అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత డేటాను ప్రభుత్వం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విశ్లేషించవచ్చు. ఐటీ శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా మినహాయింపు ఇవ్వాలని జేపీసీ పేర్కొంది. -
Uganda: ఆత్మాహుతి బాంబు దాడులు.. ముగ్గురు మృతి
కంపాలా: ఉగాండలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. రాజధాని నగరం కంపాలాలో ఆత్మాహుతి బాంబు దాడులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, మరో 33 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. -
తాలిబన్ల నుంచి పొంచి ఉన్న మరో పెనుముప్పు..! అదే జరిగితే..అంతే సంగతులు..!
కాబూల్: అఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి జనాభాలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణభయంతో అఫ్ఘన్ విడిచివెళ్లేందుకు అనేక ప్రయత్నాలను చేస్తున్నారు. తాలిబన్ల రాకతో అఫ్ఘన్ పౌరుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. తాలిబన్ల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరో పెనుముప్పు అఫ్ఘన్ పౌరులను వెంటాడనుంది. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) అఫ్ఘన్ పౌరుల డేటా ప్రమాదంలో.. అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటా భారీ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటాను తాలిబన్లు యాక్సెస్ చేసే అవకాశం ఉన్నట్లు హ్యూమన్ రైట్స్ ఫస్ట్ సంస్థ ట్విటర్లో వెల్టడించింది. అంతేకాకుండా బయోమెట్రిక్ డేటా పరికరాలను కూడా తాలిబన్లు వశపరుచుకునే ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది. గతంలో అఫ్ఘన్ ప్రభుత్వం తమ దేశ పౌరుల డేటాను డిజిటలైజ్ చేసింది. అంతేకాకుండా అఫ్ఘన్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అప్పటి ప్రభుత్వం డిజిటల్ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది. దీంతో అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటాలను తాలిబన్లు సేకరించే అవకాశం ఉంది. పలు అఫ్ఘన్ వ్యక్తులను టార్గెట్ చేయడానికి బయోమెట్రిక్ డేటా తాలిబన్లు వాడే అవకాశం ఉన్నట్లు హ్యూమన్ రైట్స్ ఫస్ట్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హ్యూమన్ రైట్స్ ఫస్ట్ గ్రూప్ ట్విటర్లో.. అఫ్ఘన్ పౌరుల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లతో డేటాబేస్ యాక్సెస్‌ను తాలిబన్లు కలిగి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఒక సంస్థను ఉపయోగించి అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటాతో వారి ఇంటర్నెట్ హిస్టరీలను చూసేందుకు అనేక ప్రయత్నాలను జరిపింది. తాలిబన్లకు విరుద్ధంగా చేసిన చర్యలను గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. వారిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులు కూడా జరిపారు. దేశం వీడినా వేటాడుతారు...! ప్రస్తుతం అఫ్ఘన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టివెళ్లిన వారు ఇతర దేశాల్లో శరణార్థులుగా వారి ఊరు, పేర్లను మార్చుకొని తిరిగినా వారిని తాలిబన్లు వెంటాడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటా తాలిబన్ల చేతికి వస్తే ఇది సాధ్యంకానుంది. బయోమెట్రిక్ డేటా అనేది మారడం అసలు జరగదు. తాలిబన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి బయోమెట్రిక్ డేటాలు అత్యంత ప్రమాదంలో ఉన్నట్లు హ్యూమన్ రైట్స్ ఫస్ట్ చీఫ్ టెక్నాలజీ వెల్టన్ చాంగ్ వెల్లడించారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) “The Taliban is now likely to have access to various biometric databases and equipment in Afghanistan,” Human Rights First group wrote on Twitter Monday. That's why we've put out a guide to evading the misuse of biometric data: https://t.co/CO9vsPPtC4 https://t.co/7COzBzzA6s — Human Rights First (@humanrights1st) August 17, 2021 -
కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సంబంధిత సమాచారాన్న సోషల్ మీడియాలో షేర్ చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రుల్ల పడకలు, లేదా ఆక్సిజన్ కొరత లాంటి సమాచారంపై ఎలాంటి అదుపు ఉండకూదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరా, మందులు, వ్యాక్సిన్ విధానానికి సంబంధించిన సమస్యలపై సుమోటో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జాతీయ సంక్షోభంలో ఉన్నామని వ్యాఖ్యానించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఎల్ నాగేశ్వరరావు, రవీంద్ర భట్‌తో కూడిన ధధర్మాసనం ఈ సంక్షోభ కాలంలో బాధను పంచుకుంటున్న ప్రజలను అడ్డుకోవడం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. అసలు నేషనల్ వ్యాక్సినేషన్ విధానాన్ని ఎందుకు అనుసరించడం లేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్లో తెలియజేస్తే, అది తప్పు సమాచారమని చెప్పలేమని సుప్రీం వ్యాఖ్యానించింది. అలాగే అలాంటి సమాచారాన్ని షేర్ చేసిన వారిని వేధింపులకు గురిచేస్తే దానికి కోర్టు ధిక్కరణ కిందే పరిగణిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందేశం అన్ని రాష్ట్రాలు, డీజీపీలకు చేరాలని తేల్చి చెప్పింది. కరోనాకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని రాష్ట్రాలు కప్పిపుచ్చరాదని చంద్రచూడ్ అన్నారు. కోవిడ్ -19 సంక్షోభాన్ని నిర్వహించడానికి కేంద్రం తీసుకున్న చర్యలకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తిన ధర్మాసనం, కేంద్రం , రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరాపై కచ్చితమైన సమాచారాన్నందించే యంత్రాంగాన్ని ఒకదాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా మే 1 నుంచి మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. అంతేకాదు ఒక వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని ప్రశ్నించింది.మొత్తం వ్యాక్సిన్లు అన్నింటినీ కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదనీ, కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు ధరలు ఎందుకని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. 18-44 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వమే వ్యాక్సినేట్ చేయడం చాలా ముఖ్యమని పేర్కొంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న జాతీయ టీకాకరణ నమూనానే అనుసరణీయమని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరక్షరాస్యుల వ్యాక్సిన్ నమోదును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్ధారిస్తాయని కూడా నిలదీసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హాస్టళ్లు, దేవాలయాలు, చర్చిలు, ఇతర ప్రదేశాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని ఈసందర్భంగా కోరింది. అలాగే, ఆరోగ్య సంరక్షణ రంగం సంక్షోభంలో పడిన ప్రస్తుత తరుణంలో రిటైర్డ్ వైద్యులు,ఇతర అధికారులను తిరిగి నియమించాలని ధర్మాసనం సూచించింది. -
వీలైనంత త్వరగా మన దేశం వచ్చేయండి: యూఎస్
వాషింగ్టన్: కోవిడ్ ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ భారతదేశంపై తన ప్రతాపాన్ని అధికంగా చూపిస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా వైరస్ గురించి పెద్దగా తెలియకపోయినా అందుబాటులో ఉన్న సమాచారంతోనే భారత్ ప్రభుత్వం కరోనాను ఎదుర్కుంది. అయితే ప్రస్తుతం సెకండ వేవ్‌ను మాత్రం అడ్డుకోలేకపోతోంది. ఈ సమయంలో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న కేసుల విపరీతంగా పెరుగుతుండడంతో పరిస్థితి నానాటికీ చేజారిపోతోంది. ప్రతిరోజు మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ ప్రభుత్వం భారత్‌లో ఉన్న అమెరికన్లను హెచ్చరించింది. భారత్ నుంచి త్వరగా వచ్చేయండి అగ్రరాజ్యం అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఉండటం మంచిదికాదని.. ఇప్పటికే ఇండియాలో ఉన్నవారు వీలైనంత తొందరగా అక్కడి నుంచి బయటపడాలని కోరింది. అలాగే భారత్‌కు వెళ్లకూడదని అమెరికన్ ప్రజలకు సూచించింది. అమెరికాకు ప్రతిరోజు భారత్ నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని, యూరప్ మీదుగా అమెరికాకు ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వాటి ద్వారా దేశానికి వెంటనే చేరుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లెవల్ 4 ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) లెవల్ 4 ట్రావెల్ హెల్త్ నోటీసును జారీ చేసింది. అమెరికన్ పౌరులు కొన్ని రోజుల వరకు భారత్‌కు వెళ్లకపోవడం మంచిదని సలహా ఇచ్చింది. #India: Access to medical care is severely limited due to COVID-19 cases. U.S. citizens wishing to depart should use available commercial options now. Daily direct flights to the US and flights via Paris and Frankfurt are available. https://t.co/p5a3v5ws9y pic.twitter.com/LqHhCiZVEg — Travel - State Dept (@TravelGov) April 28, 2021 చదవండి: కోవిడ్‌పై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు -
పన్నుభారం తగ్గించుకోండిలా!
పన్ను చెల్లించే ప్రతి వ్యక్తి పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం సహజం. పన్ను భారం తగ్గించు కోవడం చట్ట రీత్యా నేరం కాదు. ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలు చూసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. ప్లానింగ్‌లో ఒక అవకాశం కుటుంబ సభ్యుల దగ్గర ఉంది. అనురాగం మాటున పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. ఆర్థిక కూడా ఆదా అవుతుంది. చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లొచ్చు. తల్లిదండ్రులకు అద్దె ఇవ్వండి! అవును... మీది ఉమ్మడి కుటుంబం అనుకోండి.. కలిసి ఉంటున్నారు.. ఇల్లు మీ నాన్నగారి పేరు మీదో, మీ అమ్మగారి పేరుమీదో ఉందనుకోండి.. మీరు ప్రతి నెల అద్దె వారికే ఇవ్వండి.. ఆ మేరకు ఖర్చు చూపించండి. బ్యాంకు ద్వారా రెంటు డిపాజిట్ చేయండి. మీ స్వంత ఆదాయం లెక్కించేటప్పుడు ఇంటి అద్దెని క్లెయిం చేయండి. ఆ మేరకు ఆదాయం తగ్గడం వలన మీకు పన్ను భారం తగ్గుతుంది. మీ కుటుంబ ఆదాయంలో కానీ ఖర్చుల్లో కానీ ఏ మార్పు ఉండదు. అటుపక్క వారికి వారి ఆదాయంలో ఈ అద్దెను ఆదాయంగా చూపించండి. అద్దెలోంచి మున్సిపల్ పన్నులు.. 30శాతం మరమ్మతులు కింద తగ్గుతాయి. ఇంటి మీద లోన్ ఉంటే వడ్డీ కూడా తగ్గించుకోవచ్చు. ఎలాగూ అమ్మ నాన్న సీనియర్ సిటిజన్లు కాబట్టి వారికి బేసిక్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. ఆ మేరకు ఆదాయం పన్నుకి గురి కాదు. ఈ విధంగా మీకు ప్రయోజనం కలుగుతుంది. అవసరమయితే ఈ మేరకు అగ్రిమెంటు రాసుకోండి. మీ యజమానికి మీ తల్లి దండ్రుల పాన్ కార్డు జిరాక్స్ ఇవ్వండి. పన్ను భారం కుటుంబం మీద పడదు. ఎవరి ఆదాయం వారిదే, ఎవరి పన్ను భారం వారిదే. మీ తల్లిదండ్రులు మీ మీద ఆధార పడ్డ వారయితే వారి బాగోగులు మీరు చూసుకోవాలి. ఈ రోజుల్లో ఆరోగ్యం విషయం ఇంకా జాగ్రత్త వహించాలి. సెక్షన్ 80ఈ కింద మెడి క్లెయిమ్ చెల్లించితే పూర్తి మినహాయింపు ఆదాయం లోంచి వస్తుంది. తల్లి దండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే రూ.75,000 వరకు ఆదాయంలోంచి తగ్గిస్తారు. దీని వలన 30శాతం రేటులో ఉన్నవారికి రూ.23,400 పన్ను భారం తగ్గుతుంది. మెడిక్లెయిమ్ ద్వారా అవసరం వస్తే మెడికల్ ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చు. పెద్దల బాగోగులు చూసి, వారి ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మీకు పన్ను భారం తగ్గుతుంది. ఇక తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎన్నో లక్షలు వెచ్చించి పిల్లల్ని చదివిస్తున్నారు. పెద్దలు చదువు కొంటున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు అప్పలు చేసి మరీ చదివిస్తున్నారు. అప్పులు చేసినందుకు అసలు తీర్చక తప్పదు. వడ్డీ కట్టక తప్పదు. అలాంటి వడ్డీకి సెక్షన్ 80యు కింద ఆదాయం లోంచి మినహాయింపు ఇస్తారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ మినహాయింపు ఇస్తారు. పన్ను భారం తగ్గుతుంది. - ట్యాక్సేషన్ నిపుణుల సూచనలు చదవండి: రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట -
దిమాఖ్ ఖరాబ్
సాక్షి, హైదరాబాద్: దేశ పౌరుల జీవనశైలి, అలవాట్లు, ఆహార పద్ధతులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో భారతీయులు గతంలో ఎన్నడూ లేనివి ధంగా ఒత్తిళ్లు, కుంగుబాటు వంటి వాటిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు ఉంటాయా లేదా అన్న ఆందోళనలు, లే ఆఫ్‌లు, ఆరోగ్యంతో ముడిపడిన భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఫలితంగా చాలా మందిలో మానసిక సమస్యలు బయటపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు కరోనా వైరస్ వ్యాప్తితో తలెత్తిన కొత్త, అనూహ్య పరిస్థితులను ఏ మేరకు అర్థం చేసుకున్నారు? వాటికి ఏ మేరకు అలవాటు పడ్డారు? అనే అంశంపై ‘జీవోక్యూఐఐ’–స్మార్ట్‌టెక్ ఆధారిత హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం సంస్థ దేశవ్యాప్తంగా 10 వేల మందినిపైగా సర్వే చేసినప్పుడు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది మానసిక కుంగుబాట్లతో బాధపడుతున్నట్లు, 59 శాతం మందిలో పనులపట్ల ఆసక్తి తగ్గిపోయినట్లు, 57 శాతం మంది అలసిపోయినట్లు పేర్కొన్నారని సర్వే సంస్థ వివరించింది. ఐదు నెలల్లో ఎంతో తేడా... దేశంలో మొదటి వైరస్ కేసు నమోదయ్యాక గత ఐదు నెలల్లో పెద్ద సంఖ్యలోనే ప్రజల మానసిక స్థితి ఒడిదొడుకులకు గురైనట్లు జీవోక్యూఐఐ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. మారిన పరిస్థితుల్లో జీవనశైలి, వ్యాయామం, పనులు, పోషకాహారం, నిద్ర, ఒత్తిళ్లు, కుంగుబాటు, కొనుగోలు అలవాట్లలో మార్పు, మానసిక ఒత్తిళ్లు పెరిగి బయటి తిండి ఎక్కువ తినడం వంటివి తీవ్రంగా ప్రభావితమైనట్లు తేలింది. రోజువారీ కార్యకలాపాలు, తిండిపై ఆసక్తి, తినగలిగే స్థాయి, నిద్రపోతున్న తీరు, ఏ విషయంపైనైనా మనసు లగ్నం చేయగలిగే లక్షణం, ఏదైనా పని చేసేందుకు శక్తియుక్తుల స్థాయి వంటి అం«శాలపై ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. సర్వేలోని కీలకాంశాలు... ► వివిధ స్థాయిల్లో కుంగుబాటు, మానసిక ఒత్తిళ్లకు గురైన వారు 43 శాతం మంది ► చేసే పనుల్లో ఎలాంటి ఉత్సాహం ఉండట్లేదన్న వారు 59 శాతం మంది ► అలసట, శక్తి తగ్గిపోయినట్లు భావిస్తున్న వారు 57 శాతం మంది ► నిరాశ, నిస్పృహలతో ఉన్నవారు 44 శాతం మంది ► నిద్రపోవడంలో ఇబ్బందులు లేదా అతినిద్ర సమస్య ఎదుర్కొంటున్న వారు 49 శాతం మంది పెరుగుతున్న అనిశ్చితితో ఒత్తిళ్లు కరోనా వైరస్ వ్యాప్తి, సుదీర్ఘ లాక్డౌన్ విధింపు ప్రభావం ప్రజల్లో ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమైంది. దీనివల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. అంతటా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఒత్తిళ్ల స్థాయి పెరుగుతోంది. జీవనశైలిని మార్చుకోవడంతోపాటు సమతుల ఆహారం, సరైన నిద్ర అలవాట్లను పాటిస్తే ఈ సమస్యను అధిగమించొచ్చు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే దాని ప్రభావం వ్యక్తి పూర్తి ఆరోగ్యంపై పడుతుంది. అందువల్ల జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా ఈ సమస్యలన్నింటినీ అధిగమించొచ్చు. – జీవోక్యూఐఐ ఫౌండర్, సీఈవో విశాల్ గోండల్ -
గృహమే కదా ‘స్విగ్గి’సీమ!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఏదైనా తినాలనిపిస్తే అలా ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఇలా ఆర్డర్ చేసేవాళ్లం. సంప్రదాయ వంటలు, స్వీట్లు, బిర్యానీలు ఇలా.. ఏం తినాలనిపించినా వెంటనే తెప్పించుకోవడం.. జిహ్వ చాపల్యం తీర్చుకోవడం జరిగేది. అయితే ఇప్పుడు అలా అవకాశం లేదు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో బయటినుంచి ఫుడ్ తెప్పించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అవకాశం ఉన్నా ఎలాంటి ఆహారం వస్తుందోనని, తెచ్చే వ్యక్తి ఎలాంటి వారోనని భయం. మరి రోజూ రకరకాల రుచులు చూసిన నాలుక ఊరుకుంటుం దా? నచ్చిన తిండి కోసం మనసు ఊగిసలాడుతోంది. అందుకే ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసి కొత్త కొత్త వంటకాల కోసం యూట్యూబ్‌లోకి వెళ్లి నచ్చిన.. మెచ్చిన వంటలను తయారు చేసుకుంటున్నారు ప్రజలు. దీంతో లాక్డౌన్ సమయంలో రోజు గడిచిపోవడమే కాకుండా.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. వేడి వేడి వంట మన ఇంట్లోనే.. నచ్చిన ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాం ఎప్పుడూ రకరకాల ఫుడ్‌ను ఆర్డర్ చేసేవాళ్లం. లాక్డౌన్ నేపథ్యంలో యూట్యూబ్‌లో చూసి నచ్చిన ఫుడ్‌ను స్వయంగా తయారు చేసుకుంటున్నాం. పాలక్ పన్నీర్, బిర్యానీ, ఎగ్ఫ్రై ఇలా రకరకాల వంటకాలు స్వయంగా చేసుకుంటున్నాం. –స్వప్న, హిమాయత్‌నగర్ బర్త్‌డే కేక్ తయారు చేశా.. ప్రతీ ఏడాది మా అబ్బాయి బర్త్‌డేకు కేక్ ఆర్డర్ చేసేవాళ్లం. అయితే ఇప్పుడు బయట షాపులు లేకపోవడంతో ఇంట్లోనే యూట్యూబ్‌లో చూసి కేక్ తయారు చేశా. అదే విధంగా వెజ్ బిర్యానీ సైతం స్వయంగా తయారు చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. మనసుకు నచ్చిన ఆహారం మనమే తయారు చేసుకోవడం ఆనందంగా ఉంది. – వినిత, తిలక్‌నగర్ ఇంట్లోనే వంట చేసుకుంటున్నాం నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, గచ్చిబౌలిలో ఉద్యోగం. గతంలో డ్యూటీ అవగానే క్యాబ్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేసేవాన్ని. ఇంటికి చేరుకునేలోగా ఫుడ్ వచ్చేది. ఇప్పుడు వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. దీంతో ఇంట్లోనే నచ్చిన వంటను చేస్తున్నా. రుచితో పాటు వేడివేడిగా తింటున్నాం. టైం గడిచిపోవడంతోపాటు వంట చేసే అనుభవం కూడా వస్తోంది. – భరత్‌కుమార్ -
న్యూస్ కంటెంట్ ఇస్తే..నగదు
సాక్షి, న్యూఢిల్లీ: వీడియో, ఫోటో, టెక్ట్స్ రూపంలో వార్తలు అందించేవారికి నగదు చెల్లించేలా క్రియేటివ్ క్రూసేడర్ ప్రయివేట్ లిమిటెడ్ ఇన్‌స్టాఫీడ్’ పేరుతో న్యూస్ యాప్‌ను ఆవిష్కరించింది. సంస్థ ఛైర్మన్ రాజ్భాటియా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఈ యాప్ ఫేక్ న్యూస్‌ను కూడా నియంత్రిస్తుందని ఆయన వివరించారు. కంటెంట్ అందించడం ద్వారా జర్నలిస్టులు, పౌరులు నగదు పొందవచ్చని వివరించారు. -
ఇరాక్‌ను విడిచిపెట్టి వచ్చేయండి
మనీలా : ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆయా దేశాలు తమ పౌరులను పశ్చిమాసియా దేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.మంగళవారం రాత్రి ఇరాక్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆయా దేశాలు తమ పౌరులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తమ పౌరులను వెనక్కి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఎడ్వర్డో మెనెజ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. 'ఇరాక్‌లో మా దేశానికి చెందిన 1600 మంది పౌరులు పనిచేస్తున్నారు. అలాగే ఇరాక్‌కు వలస వెళ్లిన వారిని కూడా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్లిపోవాలని తెలిపాం. మా పౌరులను స్వదేశానికి రప్పించేందుకు మూడు కార్గో విమానాలు, ఓడలను పంపాము. ముందుగా మా పౌరులను ఇరాక్ నుంచి ఖతార్, లొరెంజానాకు తరలిస్తాం. అక్కడి నుంచి కార్గో విమానాలు, ఓడల ద్వారా వారిని స్వదేశానికి తీసుకొస్తామని' ఎడ్వర్డో మెనెజ్ ఆ ప్రకటనలో తెలిపారు. (ఈ దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటివి) -
2019లో ప్రపంచవ్యాప్తంగా పౌరుల ఆగ్రహం
-
నిజాయతీ ఇంకొంచెం పెరగాలోయ్!
సాక్షి, హైదరాబాద్ : ‘విక్రమ్ తన ఇంటి సమీపంలో ఉన్న పార్క్‌లో వాకింగ్ చేస్తున్నారు. అక్కడ తనకు ఓ పర్సు కనిపించింది. అందులో డబ్బులు.. క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. అక్కడ వాకర్స్‌ను వాకబు చేసినా తమది కాదని చెప్పేశారు. ఆ పర్సును తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పి తన నిజాయతీని చాటు కున్నాడు’ఈ విషయంలో మన హైదరాబాద్ కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఎందు కంటే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో పౌర నిజాయతీపై ఓ అంతర్జాతీయ సంస్థ జరి పిన అధ్యయనంలో హైదరాబాద్ చివరి స్థానం(7)లో ఉంది. పార్కులు, బహి రంగ ప్రదేశాలు, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బ్యాం కులు, ప్రజోపయోగ ప్రభుత్వ, ప్రైవేటు కార్యా లయాల వద్ద దొరికిన వస్తువులను కంటికి రెప్పలా కాపాడి.. అపరిచితులకు చెందిన వస్తువులు దొరికితే నిజాయతీగా పోలీసులకు అప్పజెబుతున్న వారిపై ‘గ్లోబల్ రీసెర్చ్ ఇనిషి యేటివ్’అనే సంస్థ తాజాగా ఓ అధ్యయనం నిర్వహించింది. విశ్వవ్యాప్తంగా 30 దేశాల్లోని 355 నగరాలపై ఈ సంస్థ పరిశోధక బృందం సభ్యులు అధ్యయనం చేశారు. ఈ విషయంలో డెన్మార్క్ దేశం 82% పౌర నిజాయతీతో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో ఏడు ప్రధాన నగరాలపై ఈ అధ్యయనం జరపగా.. బెంగళూరు 66.7% స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కోయంబత్తూర్ (57.1%), మూడో స్థానంలో కోల్‌కతా (46.7%), నాలుగో స్థానంలో ఢిల్లీ (43.8%) ఐదోస్థానంలో అహ్మదాబాద్ (40%) ఉన్నాయి. ఇక రాజస్తాన్ రాజధాని జైపూర్ 38.5 శాతంతో ఆరోస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో హైదరాబాద్ (28.6 శాతం) ఉంది. మన సిటీలో ఈ విషయం మరింత పురోగతి సాధించాల్సిన అవసరముందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, పార్కుల్లో విలువైన వస్తువులను పలువురు ఆటోడ్రైవర్లు, నగర పౌరులు తమకు జాగ్రత్తగా అప్పజెబుతూ నిజాయితీ చాటుకుంటున్నారని సిటీ పోలీసులు చెబుతున్నారు. మహిళల్లోనే నిజాయితీ అత్యధికం.. పౌరనిజాయితీ విషయంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో పరిస్థితిని గమనిస్తే పురుషుల కంటే మహిళలే అత్యంత నిజాయితీగా ఉన్నారట. 56.4 శాతం మంది మహిళలు నిజాయితీపరులు ఉండగా.. పురుషుల్లో 40.6 శాతం మాత్రమే నిజాయితీ పరులున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అన్ని అంశాలు కాకపోయినా.. కనీసం బహిరంగ ప్రదేశాల్లో తమ కంటపడిన విలువైన వస్తువులను జాగ్రత్తగా పోలీసులకు అప్పజెబుతున్న వారి శాతం ఇటీవల పెరుగుతుండటంపై సామాజిక శాస్త్రవేత్తలు, పోలీసులు గొప్ప విషయంగా అభివర్ణిస్తుండడం విశేషం. నగదుకు ఆశపడని నిజాయితీ పరులు.. మెట్రో నగరాల్లో క్షణం తీరకలేకుండా బిజీగా గడిపే సిటీజన్లు తరచూ.. తమ ల్యాప్‌టాప్‌లు, పర్సులు, బంగారు ఆభరణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇందులో అత్యధికంగా పర్సులే ఉంటున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఇక పౌరనిజాయితీ విషయానికి వస్తే పర్సుల్లో వేల రూపాయలు.. క్రెడిట్, డెబిట్ కార్డులున్నప్పటికీ నిజాయితీపరులు వాటివైపు కన్నెత్తిచూడకుండా యథావిధిగా ఆయా పర్సులను పోలీసులకు అప్పజెబుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. పౌరనిజాయితీలో దేశంలోని నగరాల పరిస్థితి.. నగరం స్థానం పౌరనిజాయితీ శాతంలో బెంగళూరు 1 66.7 కోయంబత్తూర్ 2 57.1 కోల్‌కతా 3 46.7 ఢిల్లీ 4 43.8 అహ్మదాబాద్ 5 40 జైపూర్ 6 38.5 హైదరాబాద్ 7 28.6 పౌరనిజాయితీలో టాప్ 5 దేశాలు.. దేశం నిజాయితీ శాతం డెన్మార్క్ 82 స్వీడన్ 81.5 న్యూజిల్యాండ్ 80 స్విట్జర్లాండ్ 79 నార్వే 78.7 -
గ్రీన్కార్డ్ల పరిమితి ఎత్తివేత!
వాషింగ్టన్: ఒక్కో దేశానికి ఏటా గరిష్టంగా ఏడు శాతం గ్రీన్‌కార్డులను ఇచ్చేలా ప్రస్తుతం ఉన్న పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను చట్టసభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ, అక్కడే ఉద్యోగం చేసుకునేందుకు అనుమతించేవే ఈ గ్రీన్‌కార్డులు. భారత్, చైనా తదితర దేశాల పౌరులు లక్షల మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్నారు. 7 శాతం పరిమితి కారణంగా వీరందరికీ గ్రీన్‌కార్డులు రావడానికి దశాబ్దాల సమయం పడుతోంది. అదే సమయంలో కొన్ని చిన్న దేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న వారికి గ్రీన్‌కార్డులు సులభంగా లభిస్తున్నాయి. ఇందుకు కారణం ఆయా దేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న పౌరులు తక్కువగా ఉండటమే. ఈ అసమానత తగ్గించి, ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బిల్లులను తీసుకొచ్చారు. రిపబ్లికన్ మైక్ లీ, డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ బుధవారం సెనెట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇలాంటిదే మరో బిల్లును ప్రతినిధుల సభలో చట్ట సభ్యులు జో లోఫ్గ్రెన్, కెన్ బక్‌లు ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు వీటికి మద్దతు తెలుపుతున్నారు. -
బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్?
బాల్యానికి గంతలు కట్టేస్తున్నారు.అలాగే అనిపిస్తోంది. అందరూ చెప్పేవాళ్లే కానీ.. జీవితాన్ని చూపించేవాళ్లు తక్కువైపోయారు. చూపులేని వాళ్లను నడిపించినట్లు నడిపిస్తున్నారే కానీ.. రెక్కలు కట్టి ఎగరమని చెప్పడం లేదు. నిజానికి.. బాల్యం చెక్కినట్లు జీవితాన్ని మరేదీ చెక్కలేదు. బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్? రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే! నేటి మన సంతోషానికి, నిన్నటి మన జ్ఞాపకాల చిరునవ్వులకు, రోజూ ఉదయాన్నే జీవితంపై ఆశతో మనం నిద్రలేవడానికి ఒక అర్థవంతమైన కారణం పిల్లలు. లోకం తీస్తున్న పరుగులన్నీ పిల్లల కోసమే. లోకం నిండా ప్రేమ ఉన్నది పిల్లలకు పంచడానికే. అక్షరాలున్నది పిల్లలకు నేర్పించడానికే. మేడలు నిర్మిస్తున్నది పిల్లల సౌఖ్యానికే. పిల్లలు.. కుటుంబానికే కాదు, లోకం మొత్తానికే వెలుగు. వాళ్లొక్క నవ్వు నవ్వితే ప్రకృతి పరవళ్లు తొక్కుతుంది. వాళ్లొక్కమారు ఆడుకుంటూ గిర్రున తిరిగితే విశ్వాంతరాళమే వారి చుట్టూ పరిభ్రమిస్తుంది. వాళ్ల కళ్లలోని కాంతులను చూస్తే చుక్కలు చెలిమికొస్తాయి. చెయ్యిచాచి వాళ్లడిగితే చందమామయ్య అమ్మచేతి అద్దంలోకి వచ్చేస్తాడు. ఇల వాళ్లదే, కల వాళ్లదే. భువి వాళ్లదే. దివి వాళ్లదే. రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే. పెద్దల్ని వాచ్ చేసేవాళ్లు, పెద్దలకు టీచ్ చేసేవాళ్లు కూడా. ఎన్ని తెలిసిన జ్ఞానికైనా, ఒకటేదో మిగిలే ఉంటుంది పిల్లల్నుంచి చేర్చుకోడానికి! ఏమీ తెలియనివారిక్కూడా.. ధైర్యమూ, దారీ ఇచ్చే సంకేతమేదో పిల్లల మాటల్లో దొరుకుతుంది. ‘ఔట్ డేటెడ్’లను నడిపిస్తారు. ‘అప్డేట్’లను కూడా అప్‌గ్రేడ్ చేస్తారు! జవహర్లాల్ నెహ్రూ అనే ఓ పిల్లాడుండేవాడు. పెద్దయ్యాక దేశ ప్రధాని అయ్యాడు. ప్రధాని అయ్యాక కూడా పిల్లల్తో ఆడాడు. పాడాడు. చాక్లెట్లిచ్చాడు. ఆయనకీ తెలీదు తన పుట్టినరోజు ఏదో ఒక నాటికి ‘పిల్లల రోజు’ అవుతుందని. అయింది. పిల్లలే ఆయనకిచ్చిన కానుక ‘చిల్డ్రన్స్ డే’. పిల్లలు ఏదీ ఉంచుకోరు. వెంటనే పంచుకుంటారు! కానీ మనం చేస్తున్నదేమిటి? పిల్లల కోసం బాల్యాన్ని కొద్దిగానైనా మిగల్చడం లేదు. చేస్తున్నదంతా వాళ్ల మంచి కోసమే. వాళ్ల ఫ్యూచర్‌ని చక్కగా ప్లాన్ చేస్తాం. కానీ వాళ్ల ప్రెజర్‌ని పట్టించుకోం. విజ్ఞానవంతుల్ని చేయాలని చూస్తాం. వికాసం కోసం చూడం. ఎదుగుతున్నారనే అనుకుంటాం.. లోలోపల గుదులుకుంటున్నారేమోనని చూడం. మన కలల్ని వాళ్లు నెరవేర్చాలని కోరుకుంటాం. వాళ్లకొచ్చే పీడకలల్ని అర్థం చేసుకోం. అన్నీ ఇస్తాం. అనుబంధాలను ఇవ్వం.ఆడుకోమంటాం.ప్లేగ్రౌండ్ ఇవ్వం. ఇంత హింసేమిటి? బట్టీల్లో, కర్మాగారాల్లో కనిపించే బాలల వెట్టిచాకిరీ మాత్రమే మనకు హింసగా కనిపిస్తుంది. ఇంట్లో, స్కూల్లో పెట్టే హింస కనిపించదు. చైల్డ్ లేబర్ని, చైల్డ్ ట్రాఫికింగ్‌ని, చైల్డ్ హెరాస్మెంట్ని, చైల్డ్ అబ్యూజ్‌ని అరికట్టే చట్టాలు ఉన్నాయి. ప్రయోజకుల్ని చేసే లక్ష్యంతో.. ఎదుగుతున్న మొగ్గల్ని చిదిమేసే హింసను అరికట్టేందుకు ఏ చట్టం ఉంది? పిల్లలకు ఎంతో ఎక్కువ చేస్తున్నాం అనుకుంటున్న మనం.. తక్కువ చేస్తున్నదేమిటో కూడా ఈ బాలల దినోత్సవం రోజు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. డిజి బిజి ఓ ముప్పయ్ ఏళ్ల కిందట... పిల్లలు గ్రౌండ్లో ఆటల్లో మునిగిపోతే, సాయంత్రం దాటి చీకట్లు ముసురుకుంటున్నా ఇల్లు గుర్తుకు వచ్చేది కాదు. ‘ఇక ఆడుకున్నది చాలు. ఇళ్లకు వెళ్లండి’ అని ఆ దారిన వెళ్లే పెద్దవాళ్లు ఎవరో కోప్పడే వరకు ఆటలు ఆగవు. మరీ గడుగ్గాయిలైతే... వాళ్లను వెతుక్కుంటూ తల్లులు రావాలి, చెవులు మెలేసి ఇంటికి లాక్కెళ్లాల్సిందే. సంతోషాలు రాశిపోసిన బాల్యం అది. ఆనందం చిందిన బాల్యం అది. ఆరోగ్యం నిండిన బాల్యం అది. గడిచిన తరాలు అనుభవించిన సృజనాత్మకమైన బాల్యం అది. ఈ తరానికి తెలిసిన బాల్యం ఎలక్ట్రానిక్ బాల్యం. ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే రోజు గడిచిపోయే కాలమిది. అమ్మానాన్నలు ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు, ఎవరి స్మార్ట్‌ఫోన్‌లో వాళ్లు మునిగిపోతున్నారు. పిల్లలు కంప్యూటర్లో హారర్ షోలతో ఉత్కంఠకు గురవుతుంటారు. టామ్ అండ్ జెర్రీ చూస్తూ కసిగా నవ్వుకుంటుంటారు. ఏడిపించి నవ్వడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. ఈ తరానికి గేమ్స్ అంటే వీడియో గేమ్సే, కదలకుండా కూర్చుని మెడ వంచేసి, వత్తులేసుకున్నట్లు కళ్లు తెరుచుకుని గంటల కొద్దీ గడపడమే వాళ్లకు తెలిసిన ఆటలు. బాల గేయాలంటే సీడీలు ప్లే చేసి ‘చిట్టి చిలకమ్మ’ను చూడడమే తప్ప నోరు తెరిచి ఆలపించాలనే ఆలోచనే ఉండడం లేదు. ల్యాప్‌టాప్, యూ ట్యూబ్, స్మార్ట్ ఫోన్, వీడియోగేమ్స్‌లో కుదురుకుపోతున్నారు తప్ప ఒళ్లు కదిలించే ఆటల వైపే చూడడం లేదు. గది నిండా ఎలక్ట్రానికి డివైజ్‌లు. వాటిని ప్లే చేసే ఓ ప్రాణమున్న డివైజ్. ఇదే ఈ తరం ఎంజాయ్ చేస్తున్న ‘ఈ– బాల్యం’. అంతంత సేపు స్క్రీన్ చూస్తే చూపు పోతుందని కోప్పడితే, రిమోట్‌తో డ్రోన్‌ను ఎగిరిస్తారు. బయటకు వెళ్లి ఆడుకోమంటే... జేబు నిండా డబ్బులేసుకుని ప్లే స్టేషన్‌కెళ్లి బంపింగ్కార్స్తో ఢీ కొట్టుకోవడమే నేటి తరం ఆనందిస్తున్న ఆట. ఈ మోడరన్ టెక్ లైఫ్‌లో ‘నో ఫుడ్ డే’ ఉంటుందేమో కానీ ‘నో టెక్ డివైజ్ డే’ ఉండదు. డే మొత్తం కాదు ఓ గంట కూడా స్క్రీన్కు దూరంగా... తనకు తానుగా మెదడు పెట్టి, మనసుతో గడపలేకపోతోంది ఈ హైటెక్ జనరేషన్. సాంకేతికాభివృద్ధి మనిషి జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉపయోగపడాలి.మనిషిని మరబొమ్మలా చేయకూడదు. నిజానికి అన్నింటికీ నెపాన్ని పిల్లల మీద తోసేస్తారు, కానీ వాళ్లు ఇలా మారడానికి మూలం ఏమై ఉండాలి?‘జో అచ్యుతానంద జోజో ముకుందా...’ అమ్మ ఒడిలో పడుకుని పాట వింటూ నిద్రలోకి జారిపోతుంది ఏడాది పాపాయి. ఆ పాటను అమ్మ పాడడం లేదు. పక్కనే స్మార్ట్‌ఫోన్‌లో పాట పెట్టేసి పాపాయిని ఒడిలోకి తీసుకుని జో కొడుతుందంతే. అమ్మ గొంతు వినడమే బిడ్డకు భరోసా అని, అమ్మ శ్రావ్యంగా పాడకపోయినా... పాట బాగాలేదని పాపాయి ముఖం చిట్లించదని ఆ అమ్మకు తెలియాలి. తాను జోల పాడి నిద్ర పుచ్చితే, తాను ‘చిట్టి చిలకమ్మ’ అని పలుకుతూ పాపాయికి నేర్పిస్తే... పాపాయి కూడా తన ఆట తాను ఆడుకుంటుంది. తన పాట తాను పాడుకుంటుంది. అది లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ప్లే చేయడం మాత్రమే నేర్చుకుంటుంది. తనలో క్రియేటివిటీ ఉందన్న సంగతి కూడా తెలియకుండానే పెద్దదయిపోతుంది. అందుకే... అమ్మలూ! జోల పాడండి, పాపాయికి తాను పాట వినడమే కాదు, పాడాలి కూడా అని తెలిసేలా పెంచండి. సృజనాత్మకతతో వికసించాల్సిన రేపటి తరాన్ని టెక్ సీలో ముంచవద్దు. అమ్మ, నాన్న, ఓ బిడ్డ, నాలుగు స్మార్ట్ఫోన్లు, ఓ టాబ్లెట్, ల్యాప్‌టాప్... ఇదీ ఇప్పటి కుటుంబ ముఖచిత్రం. బాల్య సంబంధాలు నాన్న కోప్పడితే వెళ్లి బాబాయి వీపు వెనుక దాక్కోవడానికి లేదు. లేదా నాన్న భయం లేదని తెలిస్తే బాబాయ్‌తో చెప్తానుండు అని అనడానికీ లేదు. తాతయ్య బజారు నుంచి వస్తూ వస్తూ చేసంచిలో కారాబూందీ పొట్లం కట్టించుకొని వచ్చి, మంచం మీద కూచుంటూ పిలిచి, బుగ్గలు పుణికి దానిని చేతిలో పెడితే, తీసుకుని తింటున్నప్పుడు తాతయ్య నవ్వే నవ్వు చూడ్డానికి లేదు. విసుక్కునే అమ్మను మందలించి దగ్గరకు తీసుకునే నానమ్మ ఒడి లేదు. ‘జామకాయలు కోద్దాం రా’ అని ఉప్పు మూట ఎక్కించుకుని పెరట్లో ఆటలాడే పిన్ని వాత్సల్యం లేదు. ఉన్న అనుబంధాలు పరిమితమైపోయాయి. ప్రతి ఇంట్లో అమ్మా నాన్న అన్న లేదా చెల్లి. నలుగురు మనుషుల కుటుంబంలో అనుబంధపు తీపి తెలుస్తున్నదా నేటి బాల్యానికి. నిన్న మొన్నటి వరకూ కనీసం సెలవుల్లో పెదనాన్న ఇంటికి వెళతాము, మేనమామ ఇంటికి వెళతాము అని అనేవారు. వెళ్లేవారు. ఇప్పుడు వెళ్లినా భరించే స్థితిలో బంధువులు ఉండటం లేదు. రోజులకు రోజులు అట్టి పెట్టుకునే ఓపిక ఉండటం లేదు. వీలు ఉండటం లేదు. బతుకులు బాదరబందీలో చెదిరిన బంధాలలో బాల్యం చాలా విలువైన అనుబంధాలను మిస్ అవుతూ ఉంది. ‘మనవాళ్లు’ అనే భావన ఎప్పుడూ పిల్లలకు భద్రతను ఇస్తుంది. నన్ను ప్రేమించే నా వాళ్లు ఉన్నారని రక్త సంబంధీకులను చూసి పిల్లలు సంబర పడతారు. ఉత్సాహ పడతారు. పిల్లలకు కజిన్స్ మొదటి స్నేహితులవుతారు. వారి రహస్యాలు పంచుకునే నేస్తులవుతారు. అలకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, పిల్లలు మాత్రమే ఆశించే కోరికలు ఇవన్నీ ఒట్టి అమ్మానాన్నల వల్ల తీరిపోవు. వారి ఒక్కరి సమక్షం చాలదు. బంధువులు కావాలి. రక్తసంబంధీకులు కావాలి. బాల్యం డొల్ల కాకుండా తన వారితో కూడిన జ్ఞాపకాలను వారిలో కూరాలి. వేరుగా ఉండొచ్చు కాని వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. ఇరుగు పొరుగు మీద హక్కు ఉండదు.స్నేహితుల మీద డిమాండ్ ఉండదు. కాని రక్త సంబంధీకులను నిలదీయవచ్చు. మంచిలో చెడులో భాగానికి పిలుపియ్యవచ్చు. అవి లేని ఒంటరివాళ్లుగా పిల్లలను మారుస్తున్నామేమో ఆలోచించాలి. పిల్లలు అడిగితే బర్గర్ చేతిలో పెడుతున్న తల్లిదండ్రులు ఒక బంధాన్ని చేతికి దారంలా చుడుతున్నారా? ఆలోచిద్దామా? వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. కలలు కూడా దోచుకునే... సినిమాకు వెళ్లాలంటే పెద్ద పథకం. నాన్న పర్మిషన్ అడగాలి. అమ్మకు వీలు కుదరాలి. పోపులడబ్బాలో డబ్బులు ఉండాలి. ఇంటర్వెల్లో గోల్డ్‌స్పాట్ తాగడం కోసం వారం రోజులుగా పోగేసిన చిల్లర జేబుల్లో ఉంటుంది. మసాలా వడలు, పునుగులు న్యూస్ పేపర్ కాగితంలో పట్టుకుని తింటూ సినిమా చూస్తుంటే మజా వస్తుంది. మరుసటి రోజు స్కూల్లో స్నేహితులకు ‘నేను నిన్న సినిమా చూశాను తెలుసా’ అని చెప్తే గొప్ప వస్తుంది. పిల్లలకు అతి చవకైన వినోదం సినిమా. తల్లిదండ్రులు కూడా సినిమా బడ్జెట్‌ను పెద్ద బడ్జెట్‌గా చూసేవారు కాదు. రోజువారి బాదరబందీలో పిల్లలతో సినిమాకు వెళ్లడం వారికీ ఓ ఆటవిడుపు. కాని ఇవాళ సినిమా వ్యవహారం మారిపోయింది. సింగిల్ స్క్రీన్స్ పోయాయి. మల్టీప్లెక్సులు వచ్చాయి. రేట్లు ఖరీదయ్యాయి. పాప్‌కార్న్ ప్యాకెట్, కూల్‌డ్రింక్ ధర టికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది.ఒక కుటుంబం ఒకసారి సినిమాకు వెళ్లాలంటే పెద్ద ఖర్చు అవుతుంది. దాని వల్ల తల్లిదండ్రులు సినిమాకు వెళ్లడాన్ని నిరుత్సాహపరుస్తున్నారు.పిల్లలు ఒక ముఖ్యమైన ఆనందాన్ని మిస్ అవుతున్నారు.‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని ఒక సినిమాలో కవి అన్నాడు. పిల్లలకు రంగుల కలలు ఇచ్చే సినిమాను కూడా దూరం చేసే దొంగలు ఎవరో మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? వాల్‌పోస్టర్లు చూసి ఇమాజినేషన్లోకి వెళ్లగలిగిన క్రియేటివిటీని చిదిమేస్తున్నాం. ప్రభుత్వాలు పార్కులు కట్టడం లేదు. స్కూళ్లలో ప్లేగ్రౌండ్లు ఉండటం లేదు. వీధుల్లో ట్రాఫిక్. ఆటలు దూరమైన పిల్లలు కోరే కనీస వినోదం, బయటకు వెళ్లే వీలు సినిమా. అది కూడా తప్పించి టీవీ లేదా ఫోన్లో వారికి దొరికింది చూసే వీలు కల్పిస్తూ కంటి జబ్బులకు కారణం అవుతున్నాం. సినిమా బాల్యంలో ఒక ముఖ్య జ్ఞాపకం. ఇవాళ ఎంతమంది పిల్లలకు ఆ జ్ఞాపకం ఉంటోంది? కత్తి యుద్ధాలు చేసే హీరోను చూసి ఇంటికొచ్చి చీపురుపుల్లలు పట్టుకునేవారు. టేప్ రికార్డుల్లో పాట వస్తుంటే డాన్స్ చేసేవారు అటకెక్కిన ఆటలు చింటూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఆ రోజు చింటూకి చాలా సంతోషంగా ఉంది. అమ్మనాన్నలతో కలిసి సినిమాకు వెళ్లాడు. బయట ఐస్‌క్రీమ్ ఇప్పించాడు నాన్న. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో క్రికెట్ బ్యాట్, బాల్ కొనిచ్చాడు. బ్యాట్ పట్టుకోగానే చింటూ ముఖం మతాబులా వెలిగిపోయింది. బ్యాట్‌ని ఎడమచేత్తో ఛాతీమీదుగా గట్టిగా పట్టుకున్నాడు. బాల్ని షర్ట్ జేబులో కుక్కుతుంటే ‘జేబు చిరుగుతుందిరా! నే పట్టుకుంటా’ అని తల్లి అంటే ‘ఊహూ..’ అని తల అడ్డంగా ఊపి, ఆ రెంటినీ తనే గట్టిగా పట్టుకున్నాడు. అమ్మనాన్నలతో ఉన్నా చింటూ ధ్యాసంతా ఇంటి దగ్గర బంటి, చిన్ను, మున్నాలతో కలిసి ఎప్పుడెప్పుడు క్రికెట్ ఆడుకుంటానా ఉంది. ఇంటికి చేరుకునే సరికి చీకటి పడింది. తల్లిదండ్రి వారిస్తున్నా తన స్నేహితుల ఇళ్లవైపు పరిగెత్తాడు. ‘ఇప్పుడెక్కడ ఆడుకుంటారు.. రేప్పొద్దున రా!’ అనడంతో గ్రౌండ్లో ఔట్ అయిన బ్యాట్స్‌మెన్‌లో బ్యాట్‌ను చంకలో పెట్టుకొని దిగాలుగా ఇంటి ముఖం పట్టాడు. ‘రేపు సండే స్కూల్ లేదుగా ఎంచక్కా ఆడుకోవచ్చు’ అని తల్లి చెప్పడంతో మురిపెంగా ఆ రాత్రి బ్యాట్‌ని పక్కనే పెట్టుకొని పడుకున్నాడు రేపటి ఆటను కలగంటూ! తెల్లారి చింటు.. మున్నా, బంటి బ్యాట్‌కి పనిచెబుతూ కేరింతలు కొడుతున్నారు. ‘ఏంటా అల్లరి..? కాస్త పక్కకెళ్లి ఆడుకోండి..’ గద్దించాడు ఎదురింటి పెద్దమనిషి. రెండు బాల్స్ వేశారో లేదో ‘ఏం ఆటల్రా.. కాళ్లకు అడ్డంపడుతూ మమ్మల్ని పడేసేట్టున్నారు అరిచేసింది పక్కింటి ఆంటీ. ఇంతలో చిన్ను బ్యాట్‌తో బాల్ని కొడితే అది కాస్తా ఎదురింటి కిటికీకి తగిలి అద్దం పగిలింది.అంతే, ఆ ఇంటి వాళ్లతో పెద్ద గొడవ అవడంతో కోపం వచ్చి చింటూను నాలుగు బాదింది తల్లి. ‘పోయిన వారం ఇలాగే వాలీబాల్ అంటూ తీసుకొచ్చారు. ఆ బాల్‌తో ఆడుకుంటూ ఎదురుగా వచ్చే వెహికిల్‌ను చూసుకోలేదు. కాస్తయితే, ఆ వెహికిల్ కింద పడేవాడే. ఇప్పుడు చూడండి..’ అంటూ భర్తను కోప్పడి చింటూని ఇంట్లోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది. ఏడుస్తూ ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు చింటూ. మరుసటి రోజు ఇంట్లో ఆడుకుంటే బాల్ వెళ్లి సామాన్లకు తగిలి, అవి పగిలిపోతున్నాయని కొట్టింది. చింటు సైకిల్ కూడా బయట తొక్కడానికి లేదు. ఎటు నుంచి ఏ వెహికిల్ వస్తుందో అని అమ్మ భయపడుతుంది. ఇంట్లో తొక్కే స్థలం ఉండదు. అప్పుడప్పుడు ఆ సైకిల్ మీద కాసేపు కూర్చుంటాడు అంతే! చుట్టూ అపార్ట్మెంట్లు. ఇరుకిరుకుగా ఉండే ఇళ్లు. గజం స్థలం దొరికినా డజన్ ఇండ్లు కట్టేస్తున్న రోజులివి. తల్లి ఈ మధ్య ఓ కొత్త ఉపాయం కనిపెట్టింది. చింటూ ఉదయం ఏడున్నరకు స్కూల్‌కి వెళితే ఇంటికి వచ్చేసరికి నాలుగు దాటిపోతుంది. రాగానే బట్టలు మార్చి పాలు, స్నాక్స్ ఇస్తుంది. ఐదు నుంచి ఏడు గంటల వరకు ట్యూషన్లో చేర్చితే సరి. చింటూ ఆటలకు, అల్లరికి ట్యూషన్ చెక్ పెట్టేసింది. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ టీవీ చూస్తూ ఉంటుంది. అమ్మ స్మార్ట్ ఫోన్లో చింటు గేమ్స్ ఆడుకుంటూ ఆమె పక్కనే కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మకు నిశ్చింతగా ఉంది. పిల్లవాడు ఎటూ పోవడం లేదు. స్కూల్, ఇల్లు. ఇప్పుడు ఎవరితోనూ గొడవలు లేవు. ఉదయాన్నే బద్దకంగా లేచిన చింటూ టైమ్ అయిపోతుందనే హడావుడిలో రెడీ అవుతుంటాడు. పుస్తకాల సంచి భుజాలకు తగిలించుకొని, పాలిష్ చేసిన షూస్ వేసుకొని, వాటర్ బాటిల్‌ని మెడకు వేసుకొని.. స్కూల్ బస్సు ఎక్కేస్తాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. అటు నుంచి ట్యూషన్‌కి, ఆ తర్వాత ఇంటికి. సైకిల్ తొక్కడం లేదని కాళ్లకు అడ్డుగా ఉందని అమ్మ దాన్ని అటకమీదకు చేర్చింది. దాని పక్కనే ఇప్పుడు బ్యాట్ కూడా చేరిపోయింది. ఆ పక్కనే దుమ్ము కొట్టుకుపోయిన రెండు బాల్స్.. చింటూవైపు దిగాలుగా చూస్తూ ఉన్నాయి ఎప్పుడు చింటూ చేతిలో తమకు ఊపిరి ఆడుతుందో అని. చింటూ ఒక్కడే కాదు బంటి, మున్నా, చిన్ను.. ఇప్పుడు ఎంతో మంది పిల్లల జీవిత పుస్తకంలో బాల్యం పేజీ ఆటల్లేక రెపరెపలాడుతోంది పిల్లలకు కావల్సిన ఆటవస్తువులు అయితే కొనగలుగుతున్నారు. కానీ, వాటితో ఆ పిల్లలను ఫ్రీగా ఆడుకోవాల్సినంత మైదానాన్ని ఎలా ఇవ్వగలరు. గుడి బడి గుర్తుందా? చిన్నప్పుడు శ్రీరామ నవమికి పందిళ్లలో స్నేహితులతో తాగిన తియ్యటి పానకం గుర్తుందా? నానమ్మలు, అమ్మమ్మలు చెప్పిన దేవతలు, రాక్షసుల కథలు గుర్తున్నాయా? పరీక్షలప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి ఫస్టు మార్కు రావాలని మొక్కుకోవడం జ్ఞాపకమేనా? టీవీలో చూసిన రామాయణం, మహాభారతం, బడిలో వ్యాస రచనకో, వక్తృత్వానికో బహుమతిగా ఇచ్చిన బొమ్మల భాగవతం, ధృవచరిత్ర, భక్త మార్కండేయ పుస్తకాల జ్ఞాపకాల పుటలు ఇప్పటికీ తెరుచుకునే ఉన్నాయా? సంపూర్ణ రామాయణం సినిమాలో సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తికెళ్లిపోయే సీను చూసి ఏడ్చిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే అనిపిస్తోంది కదా! దేవుళ్లకీ కష్టాలు తప్పవనీ, అయితే అవి ఎంతోకాలం ఉండవనీ, రాక్షసులు, దుర్మార్గులు చివరికి చావక తప్పదనీ పుస్తకాలలో చదివిన, సినిమాలలో చూసిన ఘట్టాలు గుర్తుండే ఉంటాయి కదా! కృష్ణాష్టమి వేడుకలలో ఉట్టి కొట్టడం, హనుమజ్జయంతికి ఉపవాసాలుండి కొబ్బరి కాయలు కొట్టి, బోలెడంత బలం వస్తుందని గట్టిగా నమ్మడం, ఆంజనేయస్వామి అంత మహాసముద్రం మీదుగా ఎగురుకుంటూ లంకకు చేరడం, తోకతో నిప్పంటించటం... ఇవన్నీ మన బాల్యజ్ఞాపకాలు కదా... అవి ఎంత బలాన్నిచ్చేవి. మానసికంగా ఎంత ధైర్యాన్ని నూరిపోసేవి! జబ్బు చేస్తే తగ్గిపోవాలని మొక్కుకోవడం, ఆ తర్వాత కుటుంబమంతా కలసి తిరుపతి కొండకో, అన్నవరానికో వెళ్లి మొక్కు తీర్చుకుని రావడం ఎంత చేదు, తీపి కలగలసిన జ్ఞాపకం? ఇప్పుడవన్నీ ఏవి? ప్రసాదం కోసం గుడికెళ్లడం, ప్రసాదంతోనే పొట్ట నింపుకోవడం, గణపతి నవరాత్రుళ్లలో భజన బృందాలతో గొంతు కలపడం, గుళ్లో పాడటం కోసం పొద్దున్నే లేచి త్యాగరాజు, అన్నమయ్య కృతులు సాధన చేయడం తలచుకుంటుంటే ఇప్పటికీ గొంతులోనుంచి తొంగి చూసే ఆ గమకాలను ఆపగలమా? మైకులో భగవద్గీత శ్లోకాలు పాడటం, పీర్ల పండుగప్పుడు స్నానాలు చేసి పీర్లు పట్టుకుని భక్తితో ఊగిపోతూ గుండాలు తొక్కుతుంటే కళ్లు ఇంతింత చేసుకుని చూడటం, రంజానుకు స్నేహితులు తెచ్చిన ఖీర్ తాగిన తియ్యటి జ్ఞాపకం, క్రిస్టమస్ పండక్కి భక్తిగీతాలు పాడటం, క్రిస్టమస్ ట్రీ తయారు చేయడం... ఇవన్నీ ఇప్పుడేమైనాయి? జ్వరం వచ్చినప్పుడు గుళ్లో పూజారిగారు నీకేం కాదురా, రేప్పొద్దుటికల్లా తగ్గిపోతుంది పో అంటూ విభూతి పెడితే తెల్లారేసరికి జ్వరం జారిపోవడం ఎంత నమ్మకం కలిగించేది? ఆధ్యాత్మికతలు ఎప్పుడూ మంచి భావనలనే పాదుకొల్పుతాయి. మన ప్రయత్నం మనం చేద్దాం.. ఆ తర్వాత అన్నిటినీ ఆ పై వాడున్నాడనే ధైర్యం ఓ టానిక్కు. చెయ్యరాని పనులు చేస్తే కళ్లు పోతాయి అనే భయం ఉంటే చెడ్డపనుల జోలికి పోతారా ఎవరైనా? బాల్యం నుంచి భక్తిగా, ఆధ్యాత్మిక వాతావరణంలో పదిమందితో కలిసి మెలిసి తిరిగితే అదెంత బలం? ఎంత ధైర్యం? బిట్టర్ చాక్లెట్ ‘‘ఎందుకలా ఉన్నావ్?’’ పన్నెండేళ్ల భూదేవి అడిగింది బాల సదన్ చూరు కింద అరుగు మీద దిగాలుగా కూర్చున్న ఆకాశ్‌తో. వాడికీ పదకొండు, పన్నెండేళ్లుంటాయేమో!‘‘ప్చ్.. ’’అన్నాడు నిర్లిప్తంగా చేతిలో ఉన్న రేపర్తియ్యని చాక్లెట్‌ను అటూఇటూ తిప్పుతూ.‘‘ప్చ్.. అంటే’’ అంది ఆకాశ్ పక్కనే కూర్చుంటూ. ‘‘ఏం లేదు’’అని తన పక్కనే కూర్చున్న ఆమెను అయోమయంగా చూస్తూ అన్నాడు.‘‘ఆ చాక్లెట్ ఎవరు ఇచ్చారు?’’ మళ్లీ ప్రశ్న భూదేవి నుంచి.‘‘కావాలా.. తీసుకో’’ అంటూ ఇవ్వబోతుంటే ‘‘నా దగ్గరా ఉంది..’’కుర్తీ జేబులోంచి తీస్తూ చూపించింది. ‘‘కొత్తగా జాయినయ్యావా? ఎవరు తీసుకొచ్చారు?’’ అడిగాడు ఆసక్తిగా.ఈసారి ఆ అమ్మాయి జవాబు చెప్పకుండా దిక్కులు చూసింది. ‘‘ఇప్పుడే కనిపిసున్నావైతే అడిగా.. ’’ ఆకాశ్. అయినా ఆమె నుంచి సమాధానం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆచాక్లెట్ను కుడిచేయి బొటనవేలు, నాలుగు వేళ్ల మధ్య ఉంచి ఆడిస్తోంది. ‘‘గర్ల్స్ అటువైపే ఉండాలి. సాయంత్రం ఆరు దాటితే ఇటు రాకూడదు’’చెప్పాడు ఆకాశ్.‘‘ఊ... తెలుసు. ఇందాక ఇటువైపు వస్తుంటే చెప్పారు.ఏడవుతోంది బాయ్స్ వైపు వెళ్లొద్దు అని’’అంది. ‘‘ఎందుకలా ఉన్నావ్?’’ మళ్లీ మొదటి ప్రశ్న భూదేవి నుంచి. ‘‘అమ్మ గుర్తొస్తోంది’’ గద్గదిక స్వరంతో ఆకాశ్. కాస్త చేరువగా జరిగి.. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. ఆ స్పర్శ.. ఆలంబనకు ఆకాశ్ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. మొహం అటువైపు తిప్పి ఆ వైపు భుజంతో కళ్లు తుడుచుకున్నాడు. వాడి పరిస్థితి అర్థమైంది అమ్మాయికి. ‘‘అమ్మ, నాన్న.. ’’ అంటూ ఆగింది. ‘‘అమ్మ చచ్చిపోయింది. నాన్నే చంపేశాడు. నాన్న జైల్లో ఉన్నాడు’’ దూరంగా ఆగిపోయిన నిర్మాణం ముందున్న ఇసుక కుప్పల వైపు చూస్తూ చెప్పాడు ఏ భావం లేకుండా!‘‘ఎప్పుడు?’’ అడిగింది వాడికి కొంచెం ఎడంగా జరుగుతూ. ఏంటీ ఎప్పుడు? అన్నట్టుగా చూశాడు. గ్రహించిన ఆమె ‘‘అమ్మ ఎప్పుడు చనిపోయింది అని’’ వివరంగా అడిగింది. ‘‘త్రీ ఇయర్స్ అవుతోంది’’ చెప్పాడు. ‘‘అప్పటి నుంచీ ఇక్కడే ఉన్నావా?’’ ఆ అమ్మాయి.మళ్లీ ‘‘ప్చ్’’ అంటూ అడ్డంగా తలూపాడు. ‘‘మరి’’ అన్నట్టు చూసింది. ఆరు చేతివేళ్లు చూపిస్తూ ‘‘సిక్స్ మంత్స్ అవుతోందంతే ఇక్కడికి వచ్చి. అంతకుముందు బాబాయ్ వాళ్లింట్లోనే ఉన్నాను. బాబాయే ఇక్కడ దింపి వెళ్లాడు’’చెప్పాడు. ‘‘కానీ.. కానీ’’ ఆగాడు. ‘‘ఏమైంది’’ అంటూ మళ్లా ఓరగా జరిగి ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది. ‘‘నాకు ఇక్కడ నచ్చట్లేదు. పారిపోవాలనిపిస్తోంది’’ ఈసారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘‘ఒరేయ్ .. ఏడ్వకురా.. పర్లేదు. సర్దుకుంటుంది’’ అంటూ వాడి చేతిలోని చాక్లెట్ తీసుకుని రేపర్ విప్పి వాడికివ్వబోయింది. ‘‘ఛీ ..’’అంటూ విసిరికొట్టి అక్కడి నుంచి ముందుకు పరిగెత్తి బాదాం చెట్టు కింద ఆగాడు. హతాశురాలైంది భూదేవి. తనూ వాడి దగ్గరకు పరిగెత్తి.. ‘‘ఏమైందిరా’’ కంగారుగా అడిగింది. ‘‘అది వాడిచ్చిన చాక్లెట్. చేదు.. వాక్’’అన్నాడు వస్తున్న ఏడుపును ఆపుకొనే ప్రయత్నం చేస్తూ. ‘‘వాడెవడు?’’అడిగింది. ‘‘బాలసదన్ ప్రిన్సిపాల్ తమ్ముడు. నేనొచ్చినప్పటి నుంచీ... నన్ను.. ఆ ఇసుక తెన్నెల వైపు తీసుకెళ్లి.. నా బట్టలు.... ’’ చెప్పలేక ఆగిపోయాడు. ఏడుస్తూ నేల మీద పడిపోయాడు. ‘‘నాకు అమ్మ కావాలి అక్కా.. అమ్మ కావాలి. నేను నాన్న దగ్గరుండాలి’’ అంటూ.భూదేవి కళ్లల్లోనూ నీళ్లే. తన దగ్గరున్న చాక్లెట్ వంక చూసుకుంది. అలాంటి చాక్లెట్ ఇచ్చే.. ఆర్నెల్ల కిందట ఓ అంకుల్ తనను తీసుకెళ్లిపోయాడు. పుణే అట.. అక్కడ ఎవరో ఆంటీకి అమ్మేశాడు. ఈ ఆర్నెల్లు ఎందరో అంకుల్స్.. చాక్లెట్స్ ఇచ్చి.. నా బట్టలు కూడా.. ’’ భూదేవి మెదడు గతాన్ని గుర్తుచేస్తుంటే.. కళ్లు నీళ్లను కుమ్మరిస్తున్నాయి.. అసంకల్పితంగానే ఆ అమ్మాయీ ఆ చాక్లెట్‌ను విసిరి కొట్టింది. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. చిట్టీ... కొట్టేది బట్టీ ‘‘మా బుజ్జిగాడు రోబోలోని చిట్టీ రా. ఎంత షార్ప్ గ్రాస్పింగ్ పవర్ తెల్సా? అలా చూస్తే ఇలా పట్టేస్తాడు. ఎప్పుడూ చదువే. ఆ చదువు తప్ప మరో లోకం తెలియదు’’ ఫ్రెండ్స్ ఇండ్లకు వెళ్లినప్పుడు వినిపించే మురిపెపు మాటలివి. అవి విన్నవాడికి తన కొడుకు గుర్తొస్తాడు. ఆ రోబోగాడెవడో కనీసం కళ్లతో స్కాన్ చేశాడు. కానీ నా కొడుక్కు ఇలా పుస్తకాన్ని టచ్ చేస్తే... అలా మెదడులోకి మెటీరియల్ పంపే ట్యుటోరియల్ ఏదైనా దొరికితే బాగుండని ఆశ.పే‘రెంట్స్’ అనే పేరున్నందువల్ల అవసరాలకనీ రెంట్స్ పే చేస్తూ చదువులకు బిల్స్ పే చేస్తున్నందున పే చేసేదానికి ఫలితం తప్పక రావాలన్నదే ఇప్పటి తల్లిదండ్రుల ఆశ. అందుకే వాళ్లు కార్పొరేట్స్కూళ్లూ, కాలేజీలలో బందీలయ్యారు. ఇంకా విపరిణామం ఏమిటంటే... నెక్ట్స్ ఇయర్ ఇంటర్లోకి వస్తున్న పేరెంట్స్ ఫోన్ నంబర్లు సంపాదించి, వాడి క్వార్టర్లీ ఎగ్జామ్స్ కంటే అర్లీగానే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు చిన్ననాటి ఆటలు చదువులకు సాయం చేస్తున్నాయా లేదా చూద్దాం. గోడకేసి బంతి కొడుతూ ఆటాడినవాడికి న్యూటన్స్ థర్డ్‌లా చిన్నప్పుడే వచ్చేసి ఉంటుంది. గోలీలాడుతున్నప్పుడు గీసిన బాక్స్‌లో మనం గురి చూసిన గోలీని కొడితే... అసలది బయటకు వచ్చిన మన కొట్టుడుగోలీ అక్కడే కూర్చుండిపోయి మనం ఔటయ్యిన్నాడు ఉక్రోశం మాత్రమే ఉంటుందేమోగానీ... ఇంటర్‌కొచ్చాక మొమెంటమ్, ఫోర్సూ, డైరెక్షన్ అనే వెక్టార్స్ గురించి తెలిసిన నాడు అలనాటి ఉక్రోశం గుర్తొచ్చి ఉల్లాసం మిగులుతోంది. ఎప్పుడూ పదేళ్ల నాడు కాలేజీలో చదవబోయే అడ్వాన్స్డ్ చదువులన్నింటికీ అడ్వాన్స్‌గా గల్లీల్లో మనం ఆల్రెడీ ప్రాక్టికల్స్ చేసే ఉన్నామని తెలిసిపోతుంది. దాంతో చదువు గోలీలాటంత ఈజీ అవుతుంది. కాన్సెప్ట్ బుర్రలోకి గిల్లీదాండంత సిల్లీగా ఎక్కిపోయి సింపులవుతుంది. ఈలోపు మావాడు రోబో అంటూ స్వయానా ఆ తండ్రే చెబుతున్న మాటలు వింటుంటే... అదీ నిజమే కదా అని జాలేస్తుంది. సంస్కారం అడ్డొచ్చిగానీ... లేకపోతేనా ‘‘ఒరే పేరెంట్స్లారా... వాడు ఒక రకంగా నిజంగానే రోబో అవునో కాదో తెలియదు గానీ... వాడు మాత్రం కచ్చితంగా ఒరిజినల్లంత విలువ లేని కాపీలను సృష్టించే జిరాక్స్ మెషీన్ రా’’ అని అరవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంటర్లోకి వస్తున్న పేరెంట్స్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు చేస్తున్నారు. -
ఎట్టకేలకు డేటా పరిరక్షణ!
దేశంలో ఆధార్ పథకం అమల్లోకొచ్చి ఎనిమిదేళ్లు కావస్తుండగా ఎట్టకేలకు పౌరుల వ్యక్తిగత సమా చార భద్రతకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు రూపొందింది. నిజానికి ఈ చట్టం చేశాకే ఆధార్ వంటి పథకం అమలు కావాలి. కానీ బండిని ముందూ, గుర్రాన్ని వెనకా కట్టినట్టు తొలుత ఆధార్‌ను తీసు కొచ్చి ఆ తర్వాత తీరిగ్గా వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు కసరత్తు మొదలుపెట్టారు. ఫలితంగా ఇన్నే ళ్లుగా పౌరుల వ్యక్తిగత వివరాల భద్రతకు పటిష్టమైన చట్టాలు లేకుండాపోయాయి. అసలు లేకపో వడం కంటే ఆలస్యంగానైనా ఈ దిశగా ప్రయత్నం జరగడం హర్షించదగిందే. ఆధార్, ఈ–మెయిల్‌తో ప్రారంభించి ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్ వంటి సమస్త వెబ్సైట్లకూ వర్తించే వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లును జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ రూపొందించింది. ఇందుకోసం ఆ కమిటీ దాదాపు ఏడాదికాలంగా సంబంధిత వ్యక్తులతో, సంస్థలతో సంప్రదింపులు జరిపింది. వేరే దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలను అధ్యయనం చేసింది. మన దేశంలో డిజిటల్ యుగం నడుస్తోంది. ఎలాంటివారైనా దీన్ని ఉపేక్షించటం అసాధ్యమవు తోంది. ప్రభుత్వాలు మొదలుకొని ప్రైవేటు సంస్థల వరకూ పౌరుల నుంచి రకరకాల అవసరాల కోసం విస్తృతంగా డేటా సేకరిస్తున్నాయి. అయితే అలా సేకరించడానికి కారణాలేమిటో, దేనికి విని యోగిస్తారో పౌరులకు తెలియడం లేదు. పౌరుల ఈ–మెయిళ్లకూ, వివిధ సామాజిక మాధ్యమాల్లోని వారి ఖాతాలకూ గుర్తు తెలియని వ్యక్తులనుంచీ, సంస్థలనుంచీ సందేశాలు వచ్చిపడుతున్నాయి. లక్ష లమంది వీటి మాయలో పడి మోసపోతున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాలు పౌరుల డేటాను అమ్ముకుంటున్నాయి. వాటి ఆధారంగా ఏ వయసువారు దేనికి మొగ్గుచూపుతున్నారో, ఎలాంటి అల వాట్లు ప్రాచుర్యంలో ఉన్నాయో, ఏ వర్గంవారికి ఎలాంటి ఆశలుంటాయో గణాంకాలు రూపొందిస్తు న్నారు. ఆమధ్య కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) అనే సంస్థకు ఫేస్బుక్ తన ఖాతాదార్ల వివరాలు అంద జేసిందని వెల్లడైంది. ఆ సంస్థతో మన దేశంలోని కొన్ని రాజకీయపక్షాలు ఒప్పందాలు కుదుర్చుకుని ఓటర్ల నాడి పట్టేందుకూ, వారి ఇష్టాలకు అనుగుణంగా వ్యూహాలకు పదును పెట్టేందుకూ ప్రయత్ని స్తున్నాయని తేలింది. ఇలాంటి విపరీత పోకడలకు ఎవరు బాధ్యతవహించాలో తెలియడం లేదు. కనుకనే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ‘కనిష్ట స్థాయిలో... అంటే అవసరమైన మేరకు మాత్రమే డేటా సేకరిం చటం, ఆ డేటా సేకరించటం వెనకున్న ఉద్దేశం తెలపడం అనే రెండు కీలకాంశాలను గుర్తించింది. డేటా సేకరించే ముందు ఏ సంస్థ అయినా దాని ఉద్దేశాలను పౌరులకు స్పష్టంగా, నిర్దిష్టంగా వివరిం చాల్సి ఉంటుందని బిల్లు చెబుతోంది. పౌరుల అంగీకారం స్వచ్ఛందంగా ఉండాలని, అవసరమైతే దాన్ని ఉపసంహరించుకునే హక్కుండాలని వివరిస్తోంది. సంస్థలు తాము అందించదల్చుకున్న సర్వీ సులకు అవసరమైనవి మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. పౌరుల హక్కుల పరిరక్షణను పర్యవేక్షిం చేందుకు డేటా పరిరక్షణ ప్రాధికార సంస్థ(డీపీఏ)ను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ప్రభుత్వాలైనా, ప్రైవేటు సంస్థలైనా తాము సేకరించిన పౌరుల డేటా లీకయినప్పుడు దాని విస్తృతి ఎంతో, దాని ప్రభావం ఎంతమందిపై ఉంటుందో, ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశ ముందో, లీకేజీని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలేమిటో డీపీఏకు తెలియజేయాల్సి ఉంటుంది. తమకు ఇచ్చిన హామీకి భిన్నంగా సంస్థ ప్రవర్తించిందని ఎవరైనా ఫిర్యాదు చేసినా... డేటా ప్రక్రియలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలినా డీపీఏ జరిమానా విధించవచ్చు. ఈ జరిమానా రూ. 5 కోట్ల వరకూ లేదా నిందపడిన సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టర్నోవర్‌లో 2 శాతం వరకూ... ఏది ఎక్కువైతే అది ఉంటుంది. పౌరులకు ఈ బిల్లు ప్రతిపాదిస్తున్న హక్కుల్లో నాలుగు ముఖ్యమైనవి. తమకు సంబంధించిన డేటాను ఏఏ ప్రక్రియలకు ఉపయోగించారో సంస్థలను అడిగే హక్కు పౌరులకుంటుంది. ఆ వివరాలివ్వమని కూడా వారు అడగొచ్చు. సంస్థ దగ్గర తమకు సంబం ధించి ఉన్న డేటాలో తప్పిదాలున్నా...పక్కదోవ పట్టించేదిగా ఉన్నా... అసంపూర్తిగా ఉన్నా వాటిని సరిచేయమని కోరవచ్చు. ఫలానా సర్వీసు వినియోగిస్తుండగా రూపొందిన డేటా ఏమిటో తెలుసు కునే హక్కు పౌరులకుంటుంది. అలాగే అంతక్రితం అందించిన వివరాల్లో ఫలానా అంశాన్ని వినియో గించరాదని వారు కోరవచ్చు. అయితే పాస్వర్డ్లు, ఆర్థిక స్థోమత వివరాలు, బయోమెట్రిక్ డేటా, జన్యు సమాచారం, పౌరుల ప్రైవేటు జీవితం, కులం, తెగ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అందజేయకూడదు. వీటిని అత్యంత సున్నితమైనవాటిగా బిల్లు వర్గీకరించింది. అయితే ఈ బిల్లుతో కొన్ని పేచీలున్నాయి. పౌరుల వ్యక్తిగత డేటాను నిక్షిప్తం చేసే సర్వర్ లేదా డేటా కేంద్రం భారత్‌లోనే ఉండాలని, కనీసం ఆ డేటా కాపీ ఉన్న సర్వర్ ఈ గడ్డపై ఉండితీరాలని బిల్లు నిర్దేశిస్తోంది. అదేమీ అంత సులభం కాదు. ఉదాహరణకు ఫేస్బుక్, ట్వీటర్ వంటివి లక్షలా దిమంది ఖాతాదార్ల సమాచారాన్ని ఎక్కడెక్కడో సర్వర్లలో ఉంచాయి. వాటిని ఇక్కడికి తరలించా లన్నా, స్థానికంగా మరొక సర్వరు ఉంచాలన్నా తడిసి మోపెడవుతుంది. కొత్తగా నెలకొల్పే సంస్థలకైతే అది అసాధ్యం. అలాగే వేరే దేశాలు కూడా భారత్ సంస్థలపై ఇలాంటి ఆంక్షలకే దిగుతాయి. అసలు డేటా పరిరక్షణ ప్రయోజనాన్ని ఈ నిబంధన ఎలా నెరవేర్చగలదు? దీనికి బదులు సంస్థలన్నీ ఈ దేశంలో తమ ప్రతినిధులను తప్పనిసరిగా నియమించుకోవాలన్న నిబంధన పెడితే ప్రయోజనం ఉంటుంది. యూరప్ యూనియన్(ఈయూ) దీన్ని అనుసరిస్తోంది. డీపీఏలో చైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారని బిల్లు చెబుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆదేశాలీయవచ్చునని, డీపీఏ వాటిని పాటించాలని బిల్లు నిర్దేశిస్తోంది. అటువంటప్పుడు ఈ ప్రాధికార సంస్థ స్వతంత్ర ప్రతి పత్తితో మనుగడ సాగించగలదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలివ్వగలదా? ఇలాంటి లోటు పాట్లన్నీ సవరించి బిల్లును పకడ్బందీగా రూపొందిస్తారని ఆశిద్దాం. -
ఆక్సిజన్ సిలండర్లు ఉంటేనే.. బతుకుతాం!
ఢిల్లీలో ఇక తిరగాలంటే ఆక్సిజన్ సిలండర్లు ఉండాల్సిందేనా? ప్రతి వ్యక్తి రోజూ 5 సిలండర్లు దగ్గర పెట్టుకోవాల్సిందేనా? అంటే అవునని నిపుణులు చెబుతున్నారు. ఆ రోజులు ఉంతో దూరంలో లేవని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు అత్యంత తీవ్ర స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. చర్యలు తీసుకున్న సమయంలో కాలుష్యం తగ్గినట్లు కనిపించినా.. వెంటనే మళ్లీ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే.. ఆక్సిజన్ సిలండర్లు.. వెంట పెట్టుకోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయో రోజుల్లో ప్రతి వ్యక్తి కనీసం రోజుకు 5 సిలండర్లు వెంట పెట్టుకోవాల్సిందేనని నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం అనేక రోగాలకు కారణంగా మారుతోంది. ప్రధానంగా.. నెలల నిండకుండానే పిల్లలు పుట్టడం, హృదయ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అలర్జీలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు కారణమవుతోంది. ఢిల్లీ ఎయిర్ డాట్ ఓఆర్జీ వెబ్ సైట్ ప్రకారం.. ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యం భీకరంగా జరుగుతోంది. మానవ కార్యకలాపాలు, వాహనాలు వెదజల్లే కార్బన్డయాక్సైడ్, నిర్మాణ పనులు, పరిశ్రమలు, గృహ అవసరాల కోసం ఇంధన ఉపయోగం వంటికి ఇందుకు ప్రధాన కారణాలు. ఢిల్లీ మున్సిపాలిటీ ప్రతిరోజూ 10 వేల టన్నుల చెత్తను సేకరిస్తోంది. కాలుష్యానికి ఇదీ ఒక కారణమే. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ ఆధారిత రవాణ వ్యవస్థను (ఎలక్ట్రిక్ బస్ తరహావంటివి) అభివృద్ధి చేయాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమిత రాయ్ చౌదరి సూచించారు. అంతేకాక 2018లోపు భద్రాపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలని ఆయన చెప్పారు. -
‘లూజ్’ దందా..!
♦ బీజీæ3 విత్తనాల విక్రయాలతో రూ.కోట్ల వ్యాపారం ♦ ఉమ్మడి జిల్లాలో 50 శాతానికి పైగా లూజు విత్తనాల సాగు ♦ అధిక దిగుబడి, గడ్డి సమస్య ఉండదని నమ్ముతున్న రైతులు ♦ గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల ద్వారా దందా ♦ ఇప్పటికే 10కి పైగా కేసులు.. అయినా ఆగని అమ్మకాలు ♦ చోద్యం చూస్తున్న వ్యవసాయ అధికారులు ఉమ్మడి జిల్లాలో బీజీ3 పత్తి విత్తనాల పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం సాగినట్లు వ్యవసాయ అధికారులే ఒప్పుకుంటున్నారు. మండల, జిల్లా వ్యవసాయ అధికారులెవరూ ఈ విత్తన వ్యాపారుల జోలికి వెళ్లిన దాఖలాలు తక్కువ.ఏప్రిల్ 17న మందమర్రి మండలం గద్దెరాగిడిలో సుమారు రూ.90లక్షల విలువ చేసే అక్రమ విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. బుధవారం నెన్నెలలో ఇద్దరు రైతుల నుంచి 25 కిలోల అక్రమ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.కుమురం భీం జిల్లాలో నాలుగు నకిలీ విత్తనాల కేసులు నమోదు చేయగా, రూ.5లక్షల విలువైన పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా మూడు కేసులు నమోదయ్యాయి. వ్యవసాయ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి విత్తనాలను సీజ్ చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నా అవన్నీ నామమాత్రమే. దీంతో నకిలీ బీజీ3 విత్తనాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి జిల్లాలో ఈ ఖరీఫ్‌లో పత్తి సాగు ఇలా (హెక్టార్లలో) జిల్లా మొత్తం సాగు విస్తీర్ణం పత్తి సాగు అంచనా ఆదిలాబాద్ 2,00,000 1,28,698 నిర్మల్ 1,67,573 73,420 కుమురం భీం 1,20,000 74,513 మంచిర్యాల 91,860 48,444 సాక్షి, మంచిర్యాల: అక్రమ పత్తి విత్తనాల వ్యాపారుల చేతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు చిక్కుకున్నారు. మన దేశంలో అనుమతి లేని బీజీ3 విత్తనాల మాయలో పడ్డ రైతులు ఊళ్లల్లోకి వచ్చిన విత్తనాలను ఎగబడి కొంటున్నారు. ఈ విత్తనాలతో అధిక దిగుబడి రావడమే గాక గడ్డి సమస్య ఉండదని దళారులు చెప్పే మాటలను నమ్మి ఊరు పేరు లేని పత్తి విత్తనాలను వేలంవెర్రిగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 60 శాతం రైతులు పత్తి సాగుచేస్తే అందులో బీజీ3గా చెపుతున్న ‘లూజు’ విత్తనాలను నాటిన రైతులే ఎక్కువ. బీజీ3 విత్తనాల వల్ల భూసారం తగ్గుతుందని భయపడి సొంత భూముల్లో వ్యవసాయం చేసే రైతులు మాత్రమే బ్రాండెడ్ కంపెనీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తుండగా, 80 శాతం కౌలు రైతులు మాత్రం అధిక దిగుబడి కోసం వరకు బీజీ విత్తనాల మాయలో పడిపోయారు. అధిక దిగుబడి పేరుతో దందా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పత్తి సాగుబడి ఎక్కువ. సుమారు 6లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉన్న ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం 3.20 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం చెప్పిన మాటలు విని పత్తి స్థానంలో సోయా సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో పత్తికి గిట్టుబాటు ధర పెరగడంతో ఈసారి రైతులు పత్తి సాగుపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీన్ని అక్రమ వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన వ్యాపారులు ఏకంగా మండల కేంద్రాల్లోనే దందాకు తెరలేపారు. రైతులనే ఏజెంట్లుగా పెట్టుకొని గత రెండు నెలలుగా బీజీ3 పేరుతో వ్యాపారం ప్రారంభించారు. వర్షాలు పడడంతో పత్తి సాగుకు రైతులు సిద్ధం కాగానే దళారులు వారిని ఆశ్రయించి తక్కువ ధరకు పత్తి విత్తనాలు అంటగట్టారు. మార్కెట్లో పేరున్న కంపెనీలకు చెందిన 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ రూ.900 వరకు ఉండగా, అరకిలో లూజు (పాకెట్ లేకుండా) పత్తి విత్తనాలను రూ.500 లోపు విక్రయించడం ప్రారంభించారు. డిమాండ్ పెరగడంతో రైతులనే ఏజెంట్లుగా నియమించుకొని భారీగా వ్యాపారం సాగించారు. ఇప్పటికే సుమారు 2లక్షల హెక్టార్లలో పత్తి సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెపుతుండగా, అందులో 60 శాతం ఈ బీజీ3 విత్తనాలనే నాటినట్లు తెలుస్తోంది. లూజు విత్తనాలుగానే... బీజీ3 విత్తనాలుగా చెపుతున్న పత్తి సీడ్‌కు సంబంధించి వ్యాపారుల వద్ద ఎలాంటి ఆధారం ఉండదు. కేవలం నమ్మకం పైనే కోట్ల రూపాయల దందా సాగుతోంది. సంచుల్లో విత్తనాలను తీసుకొచ్చి ఏజెంట్లుగా నియమించుకున్న రైతుల ఇళ్లల్లోకి చేరవేస్తున్నారు. అరకిలో విత్తనాలకు రూ.500 లోపు ధరతో కిలో, అరకిలో చొప్పున సదరు రైతులు విక్రయాలు సాగిస్తున్నారు. లూజుగా విక్రయించిన ఏజెంటుకు ఒక్కో కిలోకు రూ.100కు పైగానే లాభం ఉంటుంది. విత్తనాలు కొనుగోలు చేయడానికి రశీదులను ఇవ్వరు. విత్తనాల ప్యాకెట్లు బ్యాచ్ నెంబర్లు ఉండవు. వివిధ ధరలలో సంచుల్లో విక్రయిస్తారు. అందుకే వాటిని ‘లూజు విత్తనాలు’గా పేర్కొంటున్నారు. ఆంధ్రా నుంచే అధికం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, నెల్లూరు, కర్నూలు వంటి జిల్లాలకు చెందిన వారు కార్లల్లో వచ్చి ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలల క్రితం మొదలైన దందా నిర్మల్, కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో వేళ్లూనుకుపోయింది. బహిరంగ మార్కెట్లో పత్తి బీజీ2 విత్తనాలను కొనుగోలు చేసే నాథుడు కనిపించని పరిస్థితి నెలకొంది. అయితే వ్యవసాయ అధికారులకు ఈ తతంగం మొత్తం తెలుసని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలతోనే ఈ వ్యాపారం సాగుతోందని సమాచారం. మహారాష్ట్ర నుంచి కూడా ఆసిఫాబాద్ మీదుగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం సాగుతోంది. కంపెనీ ఏం చెబుతోందంటే... మోన్శాంటో కంపెనీ బోల్‌గార్డ్3 పేరుతో విడుదల చేసిన విత్తనాలు ఆస్ట్రేలియా దేశపు వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినట్లు కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. అంటే ఆస్ట్రేలియా వాతావరణ పరిస్థితుల్లో అక్కడి చీడపీడల నివారణకు వాడే పురుగు మందుల వాడకాన్ని ఈ విత్తనాలు తగ్గిస్తాయని చెపుతోంది. క్రై 1ఏసీ, క్రై 2ఏబీ, విప్ 3ఏ అనే మూడు మార్గాల ద్వారా లార్వాల ను చంపుతాయి. నీరు తక్కువగా ఉన్నా ఈ విత్తనాలు ఏపుగా పెరుగుతాయని, అధిక దిగుబడి ని ఇస్తాయని చెపుతోంది. కానీ వ్యాపారులు మా త్రం ఈ విత్తనాలు నాటితే పెరిగిన గడ్డిని తొలగించేందుకు మందులు వాడినా, పురుగు మం దులు వాడినా పత్తి చేనుకు ఎలాంటి నష్టముం డదని చెపుతున్నారు. గత సంవత్సరం కూడా ఇవే విత్తనాలు వాడి అధిక దిగుబడి సాధించినట్లు చెపుతున్న మాటలను నమ్మి 60 శాతానికి పైగా రైతులు బీజీ3ని నాటారు. బీజీ3 విత్తనాల వల్ల భూసారం దెబ్బతింటుందనే భారత ప్రభుత్వం వాటికి దేశంలోకి అనుమతివ్వలేదని వ్యవసాయఅధికారి ఒకరు తెలిపారు. -
ఆదాయ పన్ను రద్దు..
దోహా: తమ పౌరులు ఇక నుంచి ఆదాయపు పన్ను కట్టనవసరం లేదని సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి సోమవారం తెలిపారు. కంపెనీలు కూడా తమ లాభాల్లో పన్నులు చెల్లించనవసరం లేదని చెప్పారు. దీంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల చేపట్టిన ఆర్థిక సంస్కరణల సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి సౌదీలో ఆయిల్ ధరలు పతనమవడంతో అక్కడి ప్రభుత్వం పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. వాటిలో భాగంగా కంపెనీలకు వచ్చిన లాభాలపై ఇక నుంచి పన్నులు విధించరు. కొత్త రకమైన పన్నులను, ప్రైవేటీకరణలో విన్నూత్న ఆలోచనలను సౌదీ ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. ప్రభుత్వ పథకాలపై ఖర్చు చేసే మొత్తంలో కూడా భారీగా మార్పులు, చేర్పులు ఉన్నాయి. సౌదీ ప్రధాన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్. కొద్ది సంవత్సరాలుగా ఆయిల్ పరమైన ఆదాయం ఏటా తగ్గిపోతూ వస్తుండటంతో ప్రత్యామ్నాయా ఆదాయ వనరులను సౌదీ ప్రభుత్వం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆయిలేతర ఆదాయ వనరులపై వచ్చే ఏడాది నుంచి 5 శాతం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను వసూలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. -
ఏమేం పన్నులు కడుతున్నాం?
నిజానికి.. దేశంలో పౌరులందరూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో నిరంతరం పన్ను కడుతుంటారు. ఆదాయం తక్కువున్న వారు, అసలే ఆదాయం లేని వారు ప్రత్యక్షంగా ఆదాయ పన్ను కట్టకపోవచ్చు. కానీ.. వారు దుకాణంలో కొనే వస్తువుల నుంచి రెస్టారెంట్లో భోజనం చేయడం వరకూ అత్యధిక పర్యాయాలు పరోక్ష పన్నులు కడుతుంటారు. ఆధునిక ప్రభుత్వాలు చాలా వరకూ పన్నుల ద్వారానే నడుస్తుంటాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంటాయి. అవి ఆదాయపన్ను వంటి ప్రత్యక్ష పన్నులు కావచ్చు. అమ్మకం పన్ను, సేవా పన్ను వంటి పరోక్ష పన్నులు కావచ్చు. స్థానిక ప్రభుత్వాలైన నగర పాలక సంస్థ, పురపాలక సంస్థ, పంచాయతీలు కూడా కొన్ని పన్నులు వసూలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ పన్నులు: ఆదాయ పన్ను, కస్టమ్స్ సుంకం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను రాష్ట్ర ప్రభుత్వ పన్నులు: వ్యాట్, స్టాంప్ డ్యూటీ, భూమి శిస్తు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం స్థానిక సంస్థలు: నీటి పన్ను, ఆస్తి పన్ను, దుకాణం పన్ను వగైరా ప్రత్యక్ష పన్నులు ఇవీ... ఆదాయ పన్ను: నిర్దిష్ట పరిమితిని మించి ఆదాయం ఆర్జించే ప్రతి ఒక్కరూ కట్టే పన్ను ఇది. కేంద్ర ప్రభుత్వం ఈ పన్నును వసూలు చేస్తుంది. ఈ పన్నును కేంద్రం తరచుగా సవరిస్తుంటుంది. అలాగే.. ఈ పన్ను విషయంలో కొన్ని రాయితీలు, మినహాయింపులు కూడా ప్రకటిస్తుంటుంది. పెట్టుబడి రాబడుల పన్ను: ఆస్తులు, షేర్లు, బాండ్లు, విలువైన వస్తువులను ముందుగా నిర్ణయించిన కాలపరిమితి లోపల అమ్మి లాభం గడిస్తే.. ఆ లాభంపై చెల్లించే పన్ను. ఆయా పెట్టుబడుల రకాన్ని బట్టి ఈ పన్ను శాతం మారుతుంది. ప్రస్తుతం షేర్లపై స్వల్ప కాలిక (ఏడాది లోపు) పెట్టుబడి రాబడి పన్ను 10 శాతం, దాని మీద విద్యా సెస్సు వసూలు చేస్తోంది. దీర్ఘకాలిక (ఏడాది కన్నా ఎక్కువ కాలం) పెట్టుబడి రాబడిపై పన్ను లేదు. ఆస్తుల క్రయవిక్రయాల విషయంలో స్వల్పకాలిక పెట్టుబడి రాబడి పన్ను కాలపరిమితి మూడేళ్లు. ఆ కాలం దాటితే పన్ను ఉండదు. కానుక పన్ను: ఒక వ్యక్తి అందుకునే కానుకల పైనా పన్ను చెల్లించాలి. దానిని ఆదాయం కింద గణిస్తారు. కానుక విలువ ఒక ఏడాదిలో రూ. 50,000 కన్నా మించితే ఈ పన్ను వర్తిస్తుంది. సంపద పన్ను: ఒక వ్యక్తి మొత్తం సంపద మీద వసూలు చేసే పన్ను. అన్ని ఆస్తుల మొత్తం నుంచి.. ఆ ఆస్తులను పొందడానికి చేసిన రుణాలను తీసివేసి సంపదను విలువకడతారు. విలువకట్టే తేదీ నాటికి సంపద విలువను లెక్కించి ఈ పన్ను విధిస్తారు. సంపద విలువ రూ. 30 లక్షలు దాటితే ఒక శాతం సంపద పన్ను చెల్లించాలి. అయితే.. 2015 బడ్జెట్లో సంపద పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఏటా రూ. 1 కోటి, అంతకు మించి ఆదాయార్జన గల వారిపై 12 శాతం సర్ ఛార్జి వసూలు చేస్తోంది. సెక్యూరిటీ (షేర్ల) లావాదేవీల పన్ను: స్టాక్ఎక్సేంజీలో జరిపే ప్రతి లావాదేవీ పైనా ఈ పన్ను విధిస్తారు. ప్రిరిక్విసిట్ పన్ను: ఒక సంస్థ తన ఉద్యోగులకు ఇచ్చే నగదేతర ప్రయోజనాలు- డ్రైవర్‌తో సహా కారు సదుపాయం, క్లబ్ సభ్యత్వం, సంస్థ షేర్లలో వాటా తదితరాలపై పన్ను వసూలు చేస్తారు. టోల్ పన్ను: ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి కొన్ని ప్రదేశాలలో టోల్ పన్ను కట్టాల్సి ఉంటుంది. కార్పొరేట్ పన్ను: భారతదేశంలో పనిచేసే ఏదైనా కార్పొరేట్ సంస్థ తన ఆదాయంపై చెల్లించే వార్షిక పన్ను. పన్నుల విధింపు కోసం దేశంలోని కంపెనీలను దేశీయ, విదేశీ సంస్థలుగా వర్గీకరించారు. ప్రస్తుతం కార్పొరేట్ పన్ను 30 శాతంగా ఉంది. దాని మీద 3 శాతం సెస్సు కూడా ఉంది. అంటే మొత్తం పన్ను 30.9 శాతం. ఇక ఆదాయం రూ. 1 కోటి కన్నా మించితే ప్రాథమిక పన్ను మీద అదనంగా 12 శాతం సర్ చార్జి వసూలు చేస్తారు. పరోక్ష పన్నులు ఇవీ... కేంద్ర అమ్మకం పన్ను: దేశంలో వస్తు ఉత్పత్తుల విక్రయాలపై విధించే పన్ను ఇది. అంతర్రాష్ట్ర వస్తు విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. రాష్ట్రంలో అంతర్గత అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను వసూలు చేస్తాయి. కేంద్రం వసూలు చేసే పన్నును కేంద్ర అమ్మకం పన్ను అంటారు. ప్రస్తుతం కేంద్రం 2 శాతం సీఎస్టీ వసూలు చేస్తోంది. విలువ ఆధారిత పన్ను: రాష్ట్రాలు వసూలు చేసే అమ్మకం పన్నును వ్యాట్(విలువ ఆధారిత పన్ను) అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకే తరహా వ్యాట్ అమలులో ఉంది. బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లు వంటి ఖరీదైన వస్తువుల మీద 1 శాతం వ్యాట్ ఉంది. ఆటోమేటిక్ వ్యవసాయ పనిముట్లు, పురుగు మందులు, సిమ్ కార్డుల, మైక్రోఫోన్లు, కాఫీ, ఐస్, పేటెంట్లు వంటి వాటిపై 4 శాతం వ్యాట్ ఉంది. ఈ జాబితాలో సుమారు 125 వస్తువులున్నాయి. ఇక నాలుగో షెడ్యూలులోని వస్తువుల మీద వ్యాట్ 22.5 శాతం నుండి 70 శాతం వరకూ ఉంటుంది. మద్యం మీద అత్యధికంగా 70 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ మీద 33 శాతం, డీజిల్ మీద 22.5 శాతం, పొగాకు మీద 25 శాతం వ్యాట్ ఉంది. ప్రజల, పర్యావరణ ఆరోగ్యం, బాగోగులను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా వస్తువుల మీద వ్యాట్ అధికంగా వసూలు చేస్తున్నారు. పై మూడు రకాలు కాకుండా ఐదో షెడ్యులులో ఉన్న మిగతా వస్తువులన్నింటి మీదా 12.5 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. సేవా పన్ను: డబ్బు చెల్లించి పొందే సేవల్లో చాలా సేవలకు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువులు, ఏసీ రైల్వే టికెట్లు, కార్లు, ఇళ్లు, సినిమా టికెట్లు, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, హోటళ్ల బిల్లులు, వైద్య సేవలు తదితరాలు. ప్రస్తుతం 14 శాతం సేవా పన్ను వసూలు చేస్తున్నారు. స్వచ్ఛభారత్ సెస్సు, కృషి కళ్యాణ్ సెస్సులను కలుపుకుని సేవలపై మొత్తం 15 శాతం పన్ను విధిస్తున్నారు. స్వచ్ఛ భారత్ సెస్సు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన సెస్సు ఇది. పన్ను విధించగల సేవలు అన్నిటిపైనా 2015 నవంబర్ 15 నుంచి స్వచ్ఛ భారత్ సెస్సును వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెస్సు 0.5 శాతంగా ఉంది. కృషి కళ్యాణ్ సెస్సు: రైతుల సంక్షేమాన్ని విస్తరించడం కోసం 2016 బడ్జెట్లో ప్రవేశపెట్టిన సెస్సు ఇది. పన్ను విధించగల సేవలు అన్నిటిపైనా 2016 జూన్ 1 నుంచి స్వచ్ఛ భారత్ సెస్సు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెస్సు రేటు 0.5 శాతం. కస్టమ్స్ సుంకం: విదేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పరోక్ష పన్ను ఇది. ఈ పన్నును ప్రధానంగా సదరు వస్తువులను దేశంలోకి దిగుమతి చేసుకునే కేంద్రంలో చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకునే వస్తువుల స్వభావాన్ని బట్టి ఈ పన్నులో తేడాలుంటాయి. ఎక్సైజ్ సుంకం: దేశంలోనే ఉత్పత్తి అయిన వస్తువులపై విధించే మరొక పన్ను. వస్తువులు తయారు చేసేవారు, వస్తువులు తయారు చేయడానికి కార్మికులను నియమించుకునే వారు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యాంటీ డంపింగ్ సుంకం: ఏదైనా విదేశం ఏవైనా వస్తువులను వాటి సాధారణ విలువ కన్నా తక్కువ ధరకు మన దేశంలోకి భారీగా దిగుమతి చేయడాన్ని నిరోధించడానికి ఈ పన్నును అమలు చేస్తున్నారు. ఇతర పన్నులు... వృత్తి పన్ను: ఆదాయాన్ని ఆర్జించే వృత్తి నిపుణుడు ఈ పన్ను చెల్లించాలి. దీనిని సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు విధిస్తాయి. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఈ పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగీ ఈ పన్ను చెల్లించాలి. సదరు ఉద్యోగికి సంబంధించిన సంస్థ స్వయంగా ప్రతి నెలా ఈ పన్నును మినహాయించుకుని మున్సిపల్ కార్పొరేషన్లకు జమచేస్తుంది. డివిడెండ్ పంపిణీ పన్ను: కంపెనీలు తమ పెట్టుబడిదారులకు చెల్లించే డివిడెండ్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను. ఏదైనా కంపెనీ డివిడెండును ప్రకటిస్తే.. అలా ప్రకటించిన డివిడెండ్లపై 16.995 శాతం పన్ను కట్టాలి. ఇది కార్పొరేట్ పన్ను 30.9 శాతానికి అదనం. డివిడెండ్ పన్ను: 2016 బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను ఇది. రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం అదనపు పన్ను విధించారు. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది వర్తిస్తుంది. మున్సిపల్ పన్ను: ప్రతి నగరంలోనూ నగరపాలక సంఘం ఆస్తి పన్ను వసూలు చేస్తుంది. ప్రతి ఆస్తి యజమానీ ఈ పన్ను చెల్లించాలి. ఈ పన్ను రేటును ఆయా నగర పాలక సంస్థలు నిర్ణయిస్తాయి. హైదరాబాద్‌లో నివాస గృహం చదరపు అడుగుకు నెల వారీ అద్దె విలువ ఆధారంగా.. ఆ విలువలో 17 శాతం నుంచి 30 శాతం వరకూ ఆస్తి పన్ను కట్టాలి. అందులో సాధారణ పన్ను, కన్జర్వెన్సీ పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ పన్ను కలిసి ఉంటాయి. అదనంగా లైబ్రరీ సెస్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. చదరపు అడుగుకు నెల వారీ అద్దె విలువ రూ. 50 కన్నా తక్కువగా ఉంటే ఈ పన్ను వర్తించదు. వినోద పన్ను: వినోదానికీ పన్ను వర్తిస్తుంది. సినిమా టికెట్లు, వాణిజ్య ప్రదర్శనలు, ప్రసార సేవలు, డీటీహెచ్ సేవలు, కేబుల్ సేవలు వంటి వినోదాల ఆర్థిక లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్ను విధిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో వినోద పన్ను టికెట్ విలువ మీద 20 శాతంగా ఉంది. అదే తెలుగు సినిమాలకైతే కాస్త తక్కువగా 15 శాతం పన్ను ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ పన్ను: ఒక స్థిరాస్తి కొన్నపుడు విక్రేతకు చెల్లించే మొత్తానికి అదనంగా.. స్టాంపు సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ పన్నులు చెల్లించాలి. ఆస్తుల పత్రాలు రూపొందించడానికి ఇవన్నీ అవసరం. సులుభంగా చెప్పాలంటే ఒక ఆస్తి యాజమాన్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మార్చడానికి ఈ పన్నులు వసూలు చేస్తారు. ఈ పన్నులు ఆస్తి రకాన్ని బట్టి, దాని విలువను బట్టి ఉంటుంది. విద్యా సెస్సు, సర్ చార్జి: దేశంలో పేద ప్రజల విద్య కోసం విద్యా సెస్సును వసూలు చేస్తున్నారు. దేశంలో ప్రధానంగా ఆదాయ పన్ను, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల మీద విద్యా సెస్సును వసూలు చేస్తున్నారు. అది మొత్తం చెల్లించే పన్ను మీద 3 శాతం ఉంటుంది. సర్ చార్జి అంటే.. అప్పటికే ఉన్న పన్ను రేటుకు అదనంగా కలిపే పన్ను. మౌలిక సదుపాయాల సెస్సు: కార్లు, యుటిలిటీ వాహనాలపై 2016 బడ్జెట్లో ఈ పన్నును ప్రవేశపెట్టారు. నాలుగు మీటర్ల లోపు నిడివి, 1200 సీసీ లోపు సామర్థ్యం గల ఇంజన్లు గల పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్‌జీలతో నడిచే వాహనాలపై 1 శాతం మౌలికసదుపాయాల సెస్సు వసూలు చేస్తున్నారు. 4 మీటర్లకు పైబడిన, 1500 సీసీ లోపు సామర్థ్యం గల వాహనాలపై ఈ సెస్సు 2.5 శాతంగా ఉంది. ఇక పెద్ద కార్లు, ఎస్‌యూవీల మీద 4 శాతం సెస్సు వసూలు చేస్తున్నారు. ప్రవేశ పన్ను: గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రవేశ పన్నును వసూలు చేస్తున్నాయి. ఈ-కామర్స్ మార్గంలో ఆయా రాష్ట్రాలలోకి ప్రవేశించే అన్ని వస్తువుల మీదా 5.5 శాతం నుండి 10 శాతం వరకూ ప్రవేశ పన్ను వసూలు చేస్తున్నాయి. కొసమెరుపు: ఇన్ని రకాలుగా ఉన్న పన్నులకు, వాటిలో గందరగోళానికి త్వరలో ఒక రూపం రానుంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో దేశ వ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానం అమలులోకి రానుంది. తప్పక చదవండి: ఈ ఆదాయాలకు పన్ను లేదు... మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం! -
విద్యార్థుల్లో పిరికితనం నూరిపోయకండి
కలెక్టర్ భాస్కర్ ఏలూరు సిటీ: ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాణించేలా భావిభారత పౌరులను తీర్చిదిద్దాలే తప్ప వారిలో పిరికితనం, కష్టపడకుండా జీవించే మనస్తత్వాన్ని ప్రొత్సహించవద్దని కలెక్టరు కాటంనేని భాస్కర్ కళాశాల అధినేతలకు హితవు పలికారు. కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జంబ్లింగ్ సౌకర్యం వద్దని దానివల్ల విద్యార్ధులు ఎంతో కష్టపడాల్సి వస్తుందని, పలు కళాశాలల అధిపతులు విద్యార్ధులకు కలెక్టరకు అందచేసిన వినతిపత్రంపై కలెక్టరు స్పందించారు. పారదర్శకంగా జంబ్లింగ్ విధానాన్ని నిర్వహిస్తుంటే అభ్యంతరం ఏమిటని కలెక్టరు ప్రశ్నించారు. ఇదేనా మన పిల్లలకు పిరికితనం నూరిపోయడం ? కష్టపడవద్దని చెప్పడం మంచిది కాదని ఒక కళాశాలలో చదువుతూ మరొక కళాశాలకు వెళ్ళి పరీక్ష వ్రాయమంటే బాధపడిపోతే ఎలా ? ఉన్నత చదువులు కోసం ఉద్యోగాలు కోసం భవిష్యత్తు కోసం ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి రాణించే స్దాయిలో మన యువతను తీర్చిదిద్దాలే తప్ప ప్రతిదానికి కుంఠిసాకులు చెప్పి యువతలో ఒక విధమైన నైరాస్యతకు చొప్పించడం మంచిది కాదన్నారు. తాను కూడా అనేక పరీక్షలు వ్రాశానని ఆనాడు కష్టపడి చదవబట్టే ఈ రోజు కలెక్టరు హోదాలో ఇక్కడ పనిచేస్తున్నానని చదివేటప్పుడు మరింత కష్టపడి చదివేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రొత్సాహించాలే తప్ప నిరాశ, నిస్పృహలను కల్పించవద్దన్నారు. -
ఇక్కడే పుట్టాం.. ఎక్కడికీ వెళ్లం
- అభివృద్ధి పేరుతో గృహాల తరలింపు అన్యాయం - న్యాయం కోసం మంత్రులను కలుస్తాం - శ్రీశైలం నివాసితులు శ్రీశైలం: ‘మేమంతా ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. ఇక్కడే ఉంటాం.. ఎక్కడికీ వెళ్లే ప్రసక్తి లేదు’ అంటూ శ్రీశైలం నివాసితులు గళమెత్తారు. శ్రీశైల దేవస్థానం పరిధిలోని వివిధ కాలనీ వాసులు శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశమై సున్నిపెంటకు గృహాల తరలింపు విషయంపై చర్చించారు. పార్టీలకతీతంగా జరిగిన ఈ సమావేశానికి భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. స్థానిక టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలం అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్న నివాసితులందరినీ సున్నిపెంటకు మార్చడం సరి కాదన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైల నుంచి సున్నిపెంటకు తరలింపును ఎలాగైనా అడ్డుకుంటామన్నారు. గతంలో మిద్దెల గుడి వద్ద రెండు, మూడు దఫాలుగా చదును చేసి అక్కడ ఇళ్లను కట్టించి ఇస్తామని చెప్పిన దేవస్థానం అధికారులు ఇప్పుడు సున్నిపెంటకు తరలించాలని చూస్తే సహించేది లేదన్నారు. స్థానిక గిరిజన గూడెం నుంచి వచ్చిన చెంచులు సైతం అధికారుల తీరును తప్పుబట్టారు. అభివృద్ధి పేరుతో క్షేత్ర విశిష్టతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తమ తాతల కాలం నుంచి క్షేత్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు గృహాల తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేక కమిటీని (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు చేయాలని శనివారం జరిగిన సమావేశంలో స్థానికులు తీర్మానించారు. అన్ని పార్టీల నాయకులతో కలసి ఆదివారం సమావేశంపై కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కొక్క కాలనీ నుంచి ఒక్కొక్కరి చొప్పున తీసుకుని, స్థానిక అధికార నాయకుల నేతృత్వంలో పోరాడాలనే నిర్ణయం తీసుకున్నారు. గృహాల తరలింపు విషయాన్ని జిల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
ఆస్పత్రిలో అమ్మ: కరువైన పోలీసు సేవలు
చెన్నై : అపోలో ఆస్పత్రిలో అమ్మ.. పోలీస్‌స్టేషన్‌లో పోలీసులెక్కడా..అందరూ బందోబస్తు డ్యూటీగా అపోలో ఆస్పత్రి ఆవరణలోనే. ప్రజా ఫిర్యాదులను సేకరించడానికి కాని, విచారించడానికి కాని కనీసం పోలీసులే లేరు. ప్రజలు వెళ్లి పోలీస్స్టేషన్లలో తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నా అసలు పట్టించుకునే దిక్కులేదు. అందరూ ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిలోనే బందోబస్తు డ్యూటీలో ఉన్నట్టు, విచారించడానికి ఎవరూ లేరంటూ సమాధానాలు వస్తున్నాయి. ఇదీ ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో నెలకొన్న పరిస్థితి. టీనగర్‌కు చెందిన మహావీర్చంద్ ధోకా అనే వ్యక్తి చీటింగ్ జరిగిందంటూ సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, కనీసం అతని సమస్యను పట్టించుకునే వారే లేదు. సిటీ పోలీసు కమిషనర్ ఆఫీసుకు వెళ్లి అతను తన ఫిర్యాదు దాఖలు చేసుకున్నాడు. అన్నా నగర్‌కు చెందిన 80 ఏళ్ల జయంతి హార్వేది ఇదే పరిస్థితి. ఇంట్లో దోపిడి జరిగిందంటూ కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లిన ఆమెకూ అన్నానగర్ పోలీసు స్టేషన్లో నిరాశే ఎదురైంది. అనుమానితుల పేర్లు, వివరాలు తన దగ్గర ఉన్నప్పటికీ కనీసం సీనియర్ పోలీసు ఆఫీసర్లను కలువలేకపోయాయని, వారందరూ అపోలో ఆస్పత్రిలో బిజీగా ఉన్నారని పేర్కొంది. ఇలా సిటీ పరిధిలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులను సేకరించడానికి ఎవరూ ఆఫీసర్లు ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. చాలామంది సీనియర్ ఆఫీసర్లు అపోలో ఆస్పత్రి దగ్గర డ్యూటీలో ఉన్నట్టు పేర్కొంటున్నారు. పోలీసు డిప్యూటీ ఆఫీసర్లందరూ ఆస్పత్రి ఆవరణలోని వాన్టేజ్ పాయింట్స్ వద్ద డ్యూటీలోఉండాలని ఆదేశాలు వెళ్లాయి. సెప్టెంబర్ 22న జయలలిత అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎయిమ్స్ ముగ్గురు సభ్యుల డాక్టర్ల బృందమే కాక, లండన్ వైద్య నిపుణులు ఆమెకు వైద్యసేవలందిస్తున్నారు. జయలలిత లేకుండా ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలో మొదటి కేబినెట్ భేటీ నిన్న బుధవారమే జరిగింది. అమ్మ ఆస్పత్రి పాలవ్వడంతో, ప్రజలకు కనీస పోలీసు సేవలు అందడం లేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. -
'నా దేశ ప్రజలారా.. భయపడకండి'
న్యూయార్క్: తమ దేశ పౌరులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ధైర్యం నూరి పోశాడు. ఈ వారాంతంలో జరిగిన దాడులు చూసి అమెరికన్లు ఎవరూ భయపడవొద్దని ధైర్యం చెప్పారు. అలా చేస్తే అమెరికా పౌరులను బలహీన పరచాలనుకున్న సంఘ వ్యతిరేక శక్తుల, ఉగ్రవాదులు దుష్ట లక్ష్యం నెరవేర్చినట్లు అవుతుందని చెప్పారు. గడివారం రోజుల్లో న్యూయార్క్, న్యూ జెర్సీలో పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రజలంతా భయాందోళలనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన ఆయన అక్కడే ఓ హోటల్ లో మీడియా సమావేశం పెట్టారు. 'ముఖ్యంగా ఇలాంటి సందర్బాల్లో అమెరికా పౌరులకు నేనొకటి చెప్పదలుచుకున్నాను. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా. ఉగ్రవాదులు, చొరబాటుదారులు చేసే ప్రతి పనిని ప్రజలంతా చాలా జాగ్రత్తగా గమనించాలి. వారంతా అమాయకులైన ప్రజలను చంపేస్తున్నారు. అదే సమయంలో మనందరిలో భయాన్ని పురికొల్పాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే ఏ ఒక్కరం భయం గుప్పిట్లోకి జారుకోకుండా అత్యుత్తమ పౌరుడి పాత్రను పోషించాల్సి ఉంది. ఉగ్రవాదులు ఎప్పటికీ వారి లక్ష్యాన్ని చేరుకోలేరు' అని ఒబామా చెప్పారు. -
ఎంపీలు సూపర్ పౌరులు కాదుః అశోక్ గజపతి రాజు
న్యూఢిల్లీః పాలనలో పారదర్శకత చూపించే నాయకుల్లో అశోక్ గజపతిరాజు ముందుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఆ విషయం రూఢి చేశారు. బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో కూడ అదే రీతిలో స్పందించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డంలో ఏమాత్రం జంకని ఆయన... ఎయిర్ పోర్టుల్లో తమకు కొంత ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్న బిజెపి మెంబర్ల డిమాండ్ కు.. దీటుగా సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ మెంబర్లంటే సూపర్ పౌరులు కాదని, వారు కూడ సాధారణ ప్రజలేనని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు... తేల్చి చెప్పారు. విమానాశ్రయాల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంపీలు సూపర్ పౌరులు కాదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు లోక్ సభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో తనకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ... పార్లమెంట్ మెంబర్లు వారి వారి మంత్రి పదవులతో కొంత ప్రత్యేక గౌరవాన్ని పొందుతారని, అదే నేపథ్యంలో వారి విమాన ప్రయాణంలోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ శాఖ అన్ని సౌకర్యాలను అందిస్తుందని తెలిపారు. అయితే ఎంపీలు సూపర్ పౌరులు కాదని, విమానాశ్రయాలవద్ద తమకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్న బిజెపి సభ్యుల డిమాండ్ ను తిరస్కరించారు. అయితే తమ ఐడీ కార్డులను చూపించినప్పటికీ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో సిబ్బంది గుర్తు కూడ పట్టడం లేదని కొందరు సభ్యులు వాపోవడంతో... చాలా విమానాశ్రయాల్లో ఎంపీలు కమిటీ సభ్యులు అయి ఉంటారని, కాబట్టి విమానాశ్రయాల్లో వారిని గుర్తించరన్న విషయం వాస్తవం కాదని కేంద్ర మంత్రి తెలిపారు. ఎంపీలు ఐడీ కార్డులు చూపినప్పుడు అవకాశాన్ని బట్టి వారి సీట్లు హయ్యర్ క్లాస్ కు అప్ గ్రేడ్ చేయాలన్న టీఆర్ ఎస్ సభ్యుడు జితేందర్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన అశోక్ గజపతి రాజు.. టిక్కెట్ల వాణిజ్య తరగతులను బట్టి అప్ గ్రేడేషన్ జరుగుతుందని, అందులో ముందుగా అధికారులకు అవకాశం ఇస్తారు తప్పించి, ఎంపీలకు కాదన్నారు. అంతేకాక వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజన్లు, ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రజలకు సీట్లు మంజూరు చేసే విషయంలోకూడ కొంత మానవతా కోణంలో చూడాల్సి వస్తుందని, అందులో కూడ వాణిజ్య కోణం ఉంటుందని అన్నారు. ఎయిర్ ఇండియా తోపాటు ఇతర ఎయిర్ లైన్స్ కూడ వాణిజ్య పరిగణల ఆధారంగానే అప్ గ్రేడ్ చేసేందుకు వీలౌతుందని అశోక్ గజపతి రాజు తేల్చి చెప్పారు. -
'నా దేశ పౌరులారా..! జర జాగ్రత్త'
వాషింగ్టన్: ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అమెరికా తన దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ పర్యటనలకు వెళ్లే అమెరికా పౌరులారా తస్మాత్ జాగ్రత్త అంటూ అప్రమత్తతను(ట్రావెల్ అలర్ట్) గుర్తు చేసింది. ఇటీవల పారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేసిన నేపథ్యంలో ప్రపంచమంతటా ఒక్కసారిగా ఉలిక్కి పడిన విషయం తెలిసిందే. అగ్ర రాజ్యాలన్నీ కూడా వణికిపోయాయి. ఈ దాడుల అనంతరం అమెరికాపై దాడులు చేస్తామని ప్రపంచమంతటా ఏదో ఒక దేశంపై ఊహించని సమయాల్లో దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. 'ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఇస్లామిక్ స్టేట్, అల్ ఖాయిదా, బోకోహారమ్, ఇతర ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోని పలు దేశాల్లో దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి' అని అమెరికా ప్రభుత్వం తన వెబ్ సైట్ లో పౌరులకు తెలియజేసింది. దాడులు ఆయుధాలతోని ఉండవచ్చని, భౌతిక అభౌతిక రూపంలో దాడులు ఉండొచ్చని హెచ్చరించింది. అందుకే ఎటైనా వెళ్లే ముందు దేశ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు దృష్టిలో పెట్టుకోవాలని, చుట్టుపక్కల గమనిస్తూ ఉండాలని, ముఖ్యంగా సెలవుల సమయాల్లో, సమూహాల మధ్యన ఉన్నప్పుడు అప్రమత్తతో ఉండాలని హెచ్చరించింది. ఇస్లామిక స్టేట్ అమెరికాలోని వౌట్ హౌస్ పై కూడా దాడి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా విడుదల చేసిన ఈ ట్రావెలర్ అలర్ట్ వచ్చే ఫిబ్రవరి 24న ముగియనుంది. -
కొసరి కొసరి నేర్పించండి
కేరెంటింగ్ నేటి బాలలే రేపటి పౌరులు. అయితే, నేటి బాలలను ఉత్త పౌరులుగా కాకుండా, ఉత్తమ పౌరులుగా తయారు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉంది. అందుకు ఏం చేయాలంటే... పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలా తయారవుతారు. అందుకే ముందు మనం హుందాగా, నీతి నిజాయితీలతో నడుచుకుంటూ ఉంటే వారు మన నుంచి ఆ మంచిని అలవర్చుకుంటారు.పెద్దలను గౌరవించడం, చిన్నవారితో ప్రేమగా నడుచుకోవడం, తోటివారితో స్నేహంగా మసలుకోవడం ముందు మన నుంచే మొదలు కావాలి.బాల్యం నుంచీ చిన్నారులకు నీతికథలు, రామాయణ, భారత, భాగవతాలు, దేశభక్తి కథలు, ఈసప్ టేల్స్ వంటివి చెప్పడం వల్ల వారికి నైతికత అలవడుతుంది. సృజనాత్మకంగా తయారవుతారు. ఇంటినీ, ఒంటినీ, పరిసరాలనూ ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో... వీధులను, రోడ్లను కూడా అదేవిధంగా శుభ్రంగా ఉంచడం అవసరమనే విషయాన్ని వారికి తెలియజెప్పండి. వీధి దీపాలు, వీధి పంపులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి వాటిని దుర్వినియోగం చేయకుండా, వాటిని కాపాడటాన్ని బాధ్యతగా గ్రహించేలా చేయాలి. విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, ఇంటిపన్ను, ఆస్తి పన్ను వంటి వాటిని సకాలంలో చెల్లించటం ఎంత అవసరమో చెబుతూ, మంచి పౌరునికి ఉండవలసిన లక్షణాలేమిటో వారంతట వారే తెలుసుకునేలా చేయండి.హింస, అశ్లీలత ఉండే సినిమాలు, టీవీ సీరియల్స్ వంటివి చూడకుండా జాగ్రత్త పడండి.ఆపదలో ఉన్నవారికి సాయం చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్న వారికి సాయపడటంలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించేలా చేయండి. -
ఏటీఎమ్‌లే ఇక కంప్లైంట్ స్టేషన్లు!
-
స్థూల‘గాయం’
సాక్షి, కర్నూలు : ప్రతి 300 మంది పౌరులకు ఒక పోలీసు కానిస్టేబుల్ ఉండాలి. ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక పోలీసు స్టేషన్ ఉండాలి. ఈ లెక్కన 40 లక్షలకు పైచిలుకు జనాభా ఉన్న మన జిల్లాలో 11 వేల మంది పోలీసులు ఉండాలి. కాని ప్రస్తుతం పనిచేస్తున్నది కేవలం 2,600 మంది సివిల్ పోలీసులు. అంటే సగటున జిల్లా జనాభాకు రక్షణ కల్పిస్తున్నది పావలా వంతు పోలీసులే. దీంతో ఒక్కో పోలీసుపై పనిభారం నానాటికీ రెట్టింపవుతోంది. ఈ పని ఒత్తిడితో పోలీసులు వ్యాయామానికి దూరమవుతున్నారు. వ్యాధులకు దగ్గరవుతున్నారు. పొట్ట పెరిగి స్థూలకాయులుగా మారుతున్నారు. నియామక సమయంలో సన్నగా కనిపించే పోలీసులు విధుల్లో చేరాక వారి శరీర ఆకృతిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా ప్రతి ఉద్యోగి రోజుకు 8 గంటలు పని చేస్తారు. కానీ పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడే వారికిచ్చే మాన్యువల్‌లో అవసరమైతే 24 గంటలూ పనిచేయడానికి సిద్ధంగా ఉండాలనే నిబంధన ఉంటుంది. అలాంటి పరిస్థితులు అప్పుడప్పుడుంటే ఫర్వాలేదు. నిత్యం అలాగే విధులు నిర్వహించాలంటే కష్టమే. జిల్లాలో పోలీసుల పని గంటలు మిగతా వారితో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం జిల్లా జనాభాలోని ప్రతి 1,538 మందికి ఒక్క పోలీసు చొప్పున పనిచేస్తున్నారు. పనిభారం పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని పోలీసులు వాపోతున్నారు. సర్వసాధారణం.. బీపీ.. షుగర్.. జిల్లాలో మొత్తం 2,600 మంది సివిల్ పోలీసులు పనిచేస్తుండగా.. వారిలో ఎక్కువ మంది రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్) వ్యాధులతో బాధపడుతున్నారు. సమయానికి భోజనం లేకపోవడం.. నిద్రలేమి.. పని ఒత్తిడి ఉండడంతో అధికశాతం పోలీసులు ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. సెక్యూరిటీ విభాగంలో పనిచేసే మరికొందరు మూత్రపిండాలు, కండరాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఆహార పద్ధతులు పాటిస్తూ సరైన వ్యాయామం, క్రమం తప్పకుండా పరేడ్‌లో పాల్గొంటే శారీరక ధారుడ్యం పెరుగుతుంది. వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చు. అయితే పోలీసుశాఖలో పరేడ్లు నామ్‌కే వాస్తేగానే మారాయి. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన రోజుల్లో వారాంతపు సెలవులు పెట్టుకోవచ్చనే నిబంధన ఉన్నా.. అది ఎక్కడా అమలు కావడం లేదు. గతంలో ఈ అంశాన్ని నాటి డీజీపీ ప్రసాదరావు ప్రస్తావించినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వారాంతపు సెలవులు అమల్లోకి తెచ్చింది. మన జిల్లాలో కూడా గతంలో ఎస్పీగా పనిచేసిన రఘురామిరెడ్డి వారాంతపు సెలవుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఎన్ని వినతులు అందజేస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. వారాంతపు సెలవుల గురించి గతంలోనే మాజీ డీజీపీ ప్రసాదరావు ప్రకటించారు. రాష్ట్ర విభజనతో అది అమలుకు నోచుకోలేదు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాంతపు సెలవు కర్నూలు జిల్లాలో ఇచ్చేలా నిర్ణయం జరిగింది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికతో కొంత ఆలస్యమైంది. కోడ్ ముగియగానే వారాంతపు సెలవులు అమలవుతాయి. - నారాయణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వారానికోసారి పరేడ్.. పోలీసు సిబ్బంది శారీరకంగా దృఢంగా ఉండేందుకు వారానికి ఒకసారి పరేడ్ నిర్వహిస్తున్నాం. దీనికి క్రమం తప్పకుండా సిబ్బంది మొత్తం హాజరుకావాల్సిందే. దీంతోపాటు యోగా, క్రీడా పోటీలు నిర్వహించే ఆలోచనలో ఉన్నాం. సిబ్బంది దేహాధారుడ్యంపై దృష్టి సారించి.. వారు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు ఉన్నాయి. అధికారులకు ఇవ్వమని చెబుతున్నాం. అయితే కొన్ని చోట్ల సిబ్బంది సరిపడకపోవడం.. శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం వంటి కారణాలతో కొంత మందికి సెలవులు దొరకని పరిస్థితి ఉంటుంది. కర్నూలు నగరంలోనూ షిఫ్ట్ డ్యూటీ అమలవుతోంది. పోలీసు సిబ్బందికి సరిపడా విశ్రాంతి ఇస్తున్నాం. - ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ -
పార్క్ అవర్
ఫిట్నెస్ కోసం కోడి కూయక ముందే నిద్ర లేచి భారంగా జాగింగ్ వెళ్తుంటాం. దృఢమైన శరీరం కోసం చెమటలు కక్కుతూ గంటలకు గంటలు జిమ్‌లో గడుపుతాం. సరదాగా కాసేపు గంతులేస్తే చాలు మీ ఒళ్లు ఫిట్ చేస్తానంటోంది ‘పార్కోవర్’. మిలటరీ ట్రైనింగ్ తరహాలో కనిపించే ఈ గేమ్ శారీరకంగానే కాదు మానసికంగా కూడా మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతోంది. ఫ్రాన్స్‌లో పుట్టిన ఈ ఈవెంట్ ఇప్పుడు హైదరాబాద్ పార్కుల్లో ఎందరికో ఆరోగ్యాన్ని పంచుతోంది. ఇంతకీ ఈ ‘పార్కోవర్’ కథాకమామిషు ఏమిటో చూద్దాం. ఫ్రాన్స్ ఆర్ట్‌గా పేరొందిన పార్కోవర్ ఎల్లలు దాటి మన సిటీకి వచ్చేసింది. ఈ స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ను ఒంటరిగానే కాదు బృందంగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. కావాల్సినంత స్థలం ఉన్న ప్రాంతాలను ఇందుకోసం ఎంచుకుంటారు. మన సిటీజనులు పార్కోవర్ ఫీట్ల కోసం పార్కులను ఎంచుకుంటున్నారు. సువిశాలమైన స్థలంతో పాటు కోర్స్ ట్రైనింగ్‌కు అనువుగా ఉండటంతో అందరూ పార్క్‌లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. జంప్ అండ్ జాయ్.. సరదాగా సాగే పార్కోవర్ గేమ్స్‌లో వినోదంతో పాటు కావాల్సినంత ఫిట్నెస్ దొరుకుతుంది. పార్క్‌లో రెండు గమ్యాలు నిర్దేశించుకుని ఒక దాని నుంచి మరొకదానికి చేరుకోవడమే ఇందులో థీమ్. ఈ జర్నీలో డిఫరెంట్ అబ్స్టాకిల్స్ ఉంటాయి. రన్నింగ్, క్లైంబింగ్, జంపింగ్, రోలింగ్, వాల్టింగ్, మంకీ వాల్ట్, లేజీ వాల్ట్, కాశ్ వాల్ట్, డాష్ వాల్ట్, కోంగ్ వాల్ట్, డబుల్ కోంగ్ వాల్ట్, సైడ్ వాల్ట్, స్పీడ్ వాల్ట్ తదితర గేమ్‌లు మనసును ఉత్తేజపరుస్తూ శరీరక బలాన్ని అందిస్తాయి. పరుగున వచ్చి ఎదురుగా ఎత్తులో ఉన్న పైపు మీదుగా దూకడం, ఒకవైపు దూకడం, కాళ్లను ఆనించి ఎగిరి దూకడం, గోడలు ఎక్కడం.. ఇలా డిఫరెంట్ గేమ్స్‌లో ట్రైనింగ్ ఇస్తారు. మొదటి రెండు నెలలు బేసిక్స్ నేర్పిస్తారు. తర్వాత పార్కోవర్ శిక్షణ ఇస్తారు. ఫుల్ రెస్పాన్స్.. సిటీలో పార్కోవర్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందంటున్నారు ట్రైనర్ అభినవ్. ‘చిన్నప్పటి నుంచే లాంగ్ జంప్, హై జంప్ చేయడమంటే ఇష్టం. పాఠశాల, కళాశాల స్థాయిలో జరిగిన ఈవెంట్లలో టాప్ పొజిషన్లో నిలిచాను. నాలుగేళ్ల కిందట పార్కోవర్ గురించి తెలిసింది. అప్పటి నుంచి యూ ట్యూబ్ సహకారంతో ఆ గేమ్‌ల గురించి తెలుసుకున్నా. ప్రాక్టీస్ చేశాను. ఫేస్బుక్ సహాయంతో ఫ్రెండ్స్ అయిన ఫ్రాన్స్ మిత్రులు రెండేళ్ల కిందట నగరానికి వచ్చి పార్కోవర్పై నాకు పూర్తి పట్టు వచ్చేలా ట్రైన్ చేశారు. ఇదే టైంలో చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన అఖిలేష్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్, పార్కోవర్ ఫ్రీ రన్నింగ్‌పై మంచి పట్టున్న అఖిలేష్ నాతో కలిశాడు. మేమిద్దరం కలసి లైవ్‌వైర్ డ్యాన్స్/ పార్కోవర్ కంపెనీని స్థాపించాం. రోజురోజుకి ఈ ట్రైనింగ్‌కు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంద’ని అభినవ్ తె లిపారు. దీనికితోడు భారత్‌లోనే పార్కోవర్ తొలి మహిళ ఇన్స్ట్రక్టర్ జ్యోతి మాతో పనిచేస్తోందని చెప్పారు. ట్రైనింగ్... ఆది, మంగళ, గురు, శని వారాల్లో నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఈ ట్రైనింగ్ ఉంటుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో బొటానికల్ గార్డెన్‌లోనూ ఇదే టైంలో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఫేస్బుక్లో Livewire dance/parkour company లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చంటున్నారు నిర్వాహకులు. - వాంకె శ్రీనివాస్ -
బురదలో సరదగా..
చదునైన రహదారిపై పరుగు కాదిది. దారి పొడవునా ఎగుడు దిగుళ్లే! ఏ దారి అయితేనేం? పరుగే కదా అని పొడి పొడిగా పెదవి విరిచేయడానికి కాదు. పరుగు తీయాల్సింది బురదమయమైన దారిలో. అడుగు తీసి అడుగేస్తే చాలు, అంతా తడి తడి చిత్తడి. అయినా సరే, బురదలో పరుగు తీయడంలోనే సరదా ఉందంటున్నారు ఔత్సాహిక సిటీజనులు. అలాంటి వారి కోసమే గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచరీ క్లబ్ (జీహెచ్ఏసీ) ‘హైదరాబాద్ మడ్న్’్ర మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేవారు బురదతో నిండిన ట్రాక్‌పై రెండు కిలోమీటర్ల దూరం పరుగు తీయాల్సి ఉంటుంది. ఈ పరుగులో నీటిగుంతలు, సొరంగాలు, గోడలు, వంతెనలు, టార్జాన్ స్వింగ్, బెల్లీ క్రాల్, టైర్ ఫీల్డ్ వంటి పాతిక అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. సమయంతో నిమిత్తం లేకుండా, విజయవంతంగా రెండు కిలోమీటర్ల పరుగు పూర్తి చేసుకున్న వారందరూ పతకాలు, ప్రశంసా పత్రాలు పొందవచ్చు. నడవొచ్చు.. పాకొచ్చు.. ఎగిరెగిరి దూకొచ్చు.. బురద పరుగులో (మడ్ రన్) కొన్నిచోట్ల ఆచితూచి నడుచుకుంటూ వెళ్లొచ్చు. మరికొన్ని చోట్ల సొరంగాల గుండా బురదగుంతల్లో పాకొచ్చు. ఇంకొన్ని చోట్ల ఎగిరెగిరి దూకొచ్చు. మొత్తానికి పడుతూ, లేస్తూ... అడ్డంకులను దాటుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లక్ష్యాన్ని చేరుకునేలోగా ఒళ్లంతా బురదమయంగా మారుతుంది. ఇదో సరదా. లక్ష్యాన్ని చేరుకున్నా, చేరుకోలేకున్నా... మొత్తానికి మడ్ రన్ భలే ఫన్ అంటున్నారు సిటీజనులు. వాక్బ్రిడ్జ్: రెండు చెట్ల మధ్య కట్టెలతో ఏర్పాటు చేసిన ఈ రోప్‌బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రెండున్నర అడుగుల ఎత్తునున్న ఈ బ్రిడ్జి పైనుంచి జారిపడినా, కిందనున్న బురద కారణంగా గాయాలు తగలవు. 14న పరుగెడదాం.. రండి గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మడ్న్ ్రనిర్వహిస్తున్నారు. ఇందులో ఎనిమిదేళ్లు పైబడిన వారు పాల్గొనవచ్చు. పదమూడేళ్ల లోపు పిల్లలు తమ పేరెంట్స్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి రావడం వల్ల మడ్న్న్రు ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1250. hyderabadmudrun.com లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 9849011006, 040-68888197 నంబర్లలో సంప్రదించవచ్చు. పటాన్చెరు-శంకరపల్లి రోడ్డులోని లహరి రిసార్ట్స్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ మెగా ఈవెంట్ ప్రారంభమై, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. టార్జన్ స్వింగ్: చెట్టుకు కట్టిన లావాటి తాడు కిందనున్న బురదగుంతలో వేలాడుతూ ఉంటుంది. ఆ తాడును పట్టుకుని, బురదగుంతను దాటి ముందుకు దూకాల్సి ఉంటుంది. తాడుకు, గుంతకు మధ్య మూడడుగుల దూరమే ఉండటంతో కిందపడితే ఒళ్లంతా బురదమయమవుతుంది. కమాండో నెట్: లావాటి తాడుతో వలలా తయారు చేసి, ‘ఏ’ ఆకారంలో ఉంచుతారు. దీని నుంచి రన్నర్స్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. అప్పటికే బురదమయంగా మారిన రన్నర్స్ ఈ ప్రక్రియలో పట్టుజారి కింద పడుతుంటారు. ఇది పోటీ క్రీడ కాకపోవడంతో అందరూ పడుతూ లేస్తూ ఎంజాయ్ చేస్తారు. టైర్ ఫీల్డ్: భూమి మీద అరడుగు మందాన బురద ఉంటుంది. అక్కడక్కడా టైర్లు వేసి ఉంచుతారు. రన్నర్స్ ఈ టైర్ల మధ్యలో కాలు పెట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అటు బురద, ఇటు టైర్ మధ్యలో నుంచి వెళ్లటం భలే తమాషాగా ఉంటుంది. ఇక జారుడుబండ మీద నుంచి జారి కింద బురదలో పడటం వెరైటీ థ్రిల్ కలిగిస్తుంది. మడ్ రన్ అంటే సిటీ గుర్తొచ్చేలా.. మడ్ రన్లో సుమారు వెయ్యి మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. 2012లో తొలిసారి మెదక్‌లోని సంగారెడ్డిలో, 2013లో లహరి రిసార్ట్స్‌లో నిర్వహించాం. వచ్చే మూడేళ్లలో దీనిని నేషనల్ ఈవెంట్‌గా మారుద్దామనుకుంటున్నాం. ప్రస్తుతం పుణే, హైదరాబాద్‌లలో మాత్రమే నిర్వహిస్తున్నాం. మడ్ రన్ అంటే సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌గా అందరికీ తెలిసేలా కృషి చేస్తున్నాం. - సురేశ్, కో-ఆర్గనైజర్, గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ రోప్ ట్రవర్స్: భూమికి రెండడుగుల పైన ఒక తాడు.. ఆ తాడుకు మరో రెండడుగులపైన ఇంకో తాడు. మొదటి తాడుపై కాలుపెట్టి, రెండో తాడును చేతపట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పట్టుతప్పి జారిపోతే, కింద ఏర్పాటు చేసిన చిన్నసైజు కాలువలో పడొచ్చు. అందులో మోకాలి లోతు నీళ్లు మాత్రమే ఉంటాయి. ఈత రాకున్నా, ఎలాంటి ప్రమాదం ఉండదు. భద్రత: ప్రతి అవరోధం వద్ద మెయిన్ మార్షల్స్, ముగ్గురు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఎవరికైనా కళ్లలో మట్టి పడినా, చిన్న గాయాలైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినందున పెద్ద గాయాలయ్యే అవకాశాల్లేవు. అయితే.. అంబులెన్స్ కూడా ఉంటుంది. - వాంకె శ్రీనివాస్ -
వేస్ట్ వారీయర్స్
ఆదివారం ఉదయం.. మారథాన్‌లో వేల మంది హైదరాబాదీలు పరుగులు తీస్తుంటే.. వారిని అనుసరిస్తూ మీడియా కెమెరాలు, ఉత్సాహపరుస్తూ రోడ్డుకిరువైపులా సిటీజనులు.. అయితే ఈ సందడికి దూరంగా చేతిలో డిస్పోజబుల్ బ్యాగ్స్ పట్టుకుని కొందరు తమ పని చేసుకుపోయారు. 20 చెక్పాయింట్ల దగ్గర నుంచుని వీరు చేసిన పని.. ఈ ఈవెంట్ పుట్టించిన కిలోల కొద్దీ వేస్ట్‌ని సేకరించడం, దానిని సమర్థంగా మేనేజ్ చేయడం.. ఇంతకూ వారెవరు? వేస్ట్ వారియర్స్! -ఎస్.సత్యబాబు ‘గచ్చిబౌలి స్టేడియం చాలా విశాలంగా, అందంగా ఉంది. కానీ ఇక్కడ సరైన వేస్ట్ డిస్పోజబుల్ సిస్టమ్ లేదు. ఈ ప్రాంతంలో కొంతకాలం క్రితం జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్తను తగలబెట్టడం చూసి షాక్ తిన్నాం. అలాంటి పనులు పర్యావరణానికి చేటు చేస్తాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు జోడి అండర్హిల్ అనే బ్రిటిష్ వనిత. ఈ వేస్ట్ వారియర్స్ వ్యవస్థాపకురాలు ఆ మహిళే. హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని వేస్ట్ పని పట్టిన వాలంటీర్లకు స్ఫూర్తి ఈమే. 2008 డిసెంబర్లో జోడి ఇండియా వచ్చారు. టూరిస్ట్‌గా దేశంలో పర్యటించే సమయంలోనే వేస్టేజ్ సమస్య గుర్తించారు. ఓ ఏడాది తర్వాత రంగంలోకి దిగారు. ధర్మశాలలోని దలైలామా ఇంటిని ఆమె తొలిసారి శుభ్రపరిచారు. ఈ పనిలో ఓ వందమంది ఆమెకు తోడయ్యారు. పరిశుభ్ర భారత్‌ను తానొక్కదాన్నే కాదు.. ఇంకెందరో కోరుకుంటున్నారని అప్పుడామెకు అర్థమైంది. వెంటనే సేవే లక్ష్యంగా మౌంటైన్ క్లీనర్స్ సంస్థ ప్రారంభించారు. మారుమూల కొండప్రాంతం ట్రిండ్లో పని మొదలు పెట్టారు. ప్రస్తుతం అత్యంత శుభ్రమైన పర్వత ప్రాంతంగా ట్రిండ్ మారిందంటే అది జోడి అండ్ కో పుణ్యమే. అలా చెత్త ఏరివేసే ఈ యాక్టివిటీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇండియాలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ క్లీన్ అండ్ నీట్‌గా మార్చాలన్న వారి సంకల్పంతో 2012లో వేస్ట్ వారియర్స్ అవతరించింది. సిటీకి పరిచితులే.. ఈ సంస్థకు సిటీలో శాశ్వత సభ్యులున్నారు. 200 మంది విద్యార్థులు మారథాన్ క్లీనింగ్‌లో పాల్గొన్నారు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌మేరీస్, సెయింట్ పీటర్స్, ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, రూట్స్ బిజినెస్ స్కూల్స్, ఐసీబీఎమ్, ఎన్ఐటీహెచ్ఎమ్, ఎమ్జే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. వంటి విద్యాసంస్థల విద్యార్థులు ఈ పనిలో పాల్గొన్నారు. ‘గతేడాది కూడా మా టీమ్ హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొంది. అప్పుడు సేకరించిన వేస్టేజ్‌లో 98 శాతం ఈ బృందం సమర్థవంతంగా రీసైకిల్ చేసింది. ఈసారి మారథాన్‌లో రన్నర్ల సంఖ్య బాగా పెరిగింది. వేస్టేజ్ కూడా రెట్టింపు పోగైంది. 3 డీసీఎంలు నిండాయ’ని జోడి చెప్పారు. 42 కిలోమీటర్ల మారథాన్ మార్గాన్ని శుభ్రపరచడం అంత సులభమైన విషయం కాదన ్న జోడి.. ఈ పనిలో సిటీ యూత్ సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఆ నమ్మకం ఉంది.. హైదరాబాద్‌లో వేస్ట్ డిస్పోజల్ అనే కాన్సెప్ట్ ఇంకా విస్తరించాల్సి ఉందంటారు బృంద సభ్యురాలు, సిటీవాసి శ్వేత దండపాణి. ‘చాలా మందికి వేస్ట్ డిస్పోజల్ అంటే చెత్త కుప్పలో వేయడం వరకు మాత్రమే తెలుసు. వేస్టేజ్ తగ్గించడం, రీసైకిల్‌పై అవగాహన కల్పిస్తున్నామ’ని తెలిపారు. క్రికెట్ మ్యాచ్‌లు, సన్‌బర్న్ వంటి ఈవెంట్లలో పని చేసిన అనుభవం వేస్ట్ వారియర్స్‌కు ఉంది. పరిశుభ్రమైన హైదరాబాద్‌ను చాలామంది కోరుకుంటున్నారని తెలిపిన జోడి.. వచ్చే ఏడాది మారథాన్ ఈవెంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ మరింత సక్సెస్ అవుతుందంటున్నారు. -
జీటీ టేస్టీ
యుూరోప్ కంట్రీస్ హోంస్టైల్లో రెసిపీలను రెడీ చేస్తూ సిటీజనులను ఆకట్టుకోవడానికి హైటెక్‌సిటీలో జీటీ బార్ అండ్ కిచెన్ ఆదివారం ప్రారంభమైంది. వెరైటీ వంటకాలతో జిహ్వకు జీవం పోస్తూ.. వహ్వా అనిపించడమే తవు ప్రత్యేకత అంటున్నారు ‘జీటీ’ యుజవూని సయ్యుద్ జురేర్ అబ్బాస్. కంఫర్ట్ ఫుడ్.. బేక్డ్ పోటాటో స్కిన్స్, చిమ్మిచంగస్, బీఫ్ షేక్, లాంబ్ షేక్, బిట్స్ ఆఫ్ హెవెన్... ఇలా డిఫరెంట్ వంటకాలు ఉంటార. యూరోపియన్‌కు చెందిన ఈ వంటకాల టేస్ట్ బాగుంటుంది. స్లోగా కుక్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆహారం తినేందుకు సౌకర్యంగా ఉంటుంది. దీన్ని కంఫర్ట్ ఫుడ్ అని కూడా అనొచ్చు. పీన్ అండ్ గోట్ చీసీ సలాడ్, స్మోక్డ్ చికెన్, సన్డ్రౌడ్ టమోటో సలాడ్ టేస్ట్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. బర్గర్స్ అండ్ స్టేక్స్, బనోఫీ పీ, బిట్స్ ఆఫ్ హెవెన్ స్పైస్ రుచి చూసేందుకు ఆహారప్రియులు ఎగబడుతుంటారు. వైట్ వైన్ తాగినప్పుడు సాసేజ్ అండ్ సిసనైజ్, స్టఫ్డ్ చికెన్ తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. రెడ్ వైన్ తాగినప్పుడు బీఫ్ స్టిక్, లాంబ్షేక్లు స్టఫ్‌గా తీసుకుంటే ఆహా అనాల్సిందే. - తాలీబ్ హుస్సేన్, ముంబై చెఫ్ -
తియ్యటి వేడుక
నగరం రక్షాబంధన్ కళతో వెలుగుతోంది. శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే ఈ వేడుకను ఘనంగా, సంబరంగా జరుపుకోవడానికి నగరవాసులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ వేడుకను తీపి చేసేందుకు రకరకాల స్వీట్లు, చాక్లెట్లు రారమ్మని పిలుస్తున్నాయి. ఇవి అందమైన బాక్స్‌లలో, గిఫ్ట్ ప్యాక్‌లలో ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల ఆత్మీయానుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను థీమ్ స్వీట్లతో జరుపుకునేందుకు ఆహ్వానిస్తున్నాయి. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పార్లర్లు ప్రత్యేకంగా రాఖీ థీమ్‌తో డిన్నర్స్ నిర్వహిస్తున్నాయి. నోరూరించే ప్రత్యేక, సంప్రదాయమైన ఐటమ్స్‌ను మెనూల్లో చేరుస్తున్నాయి. ఇందులో అగ్రస్థానం స్వీట్లకే ఇస్తున్నాయి. కంటికి ఇంపుగా నోట్లో కరిగిపోయేలా తయారవుతున్న ఈ స్వీట్లను చూసి నగరవాసులు మనసు పారేసుకుంటున్నారు. రాఖీ అనుబంధాన్ని తెలిపే థీమ్స్, అన్నా చెల్లెళ్ల భావోద్వేగాలనుప్రతిఫలించే కస్టమైజ్డ్ గిఫ్ట్‌లు కూడా మార్కెట్లో ఉన్నాయి. గ్రీటింగ్ కొటేషన్స్, ప్రత్యేకమైన బెడ్‌ల్యాంప్‌లు, ఫొటోథీమ్స్ స్పెషల్ అట్రాక్షన్. రాఖీ థాలీ: వెరైటీ లుక్‌లో ఉండే బాక్స్‌లో నాలుగైదు రకాల బెంగాలీ స్వీట్లు, రాఖీ, కుంకుమ ఉంటాయి. దీనికి ఎంతగా డిమాండ్ ఉందంటే రోజుకు 500-600 థాలీలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చాకో-రాఖీ బొకే: రకరకాల హ్యాండ్‌మేడ్ చాక్లెట్స్, రాఖీ, అక్షింతలు, వీటిమధ్య తీపిగుర్తుగా ఉండే ఫొటోగ్రాఫ్స్‌ను అందంగా అమర్చిందే చాకో-రాఖీ బొకే. కస్టమ్ మేడ్-థాలీ: దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. కస్టమర్ల టేస్ట్‌కు అనుగుణంగా దీన్ని రూపొందిస్తారు. వారు ఇష్టపడే 11 రకాల సంప్రదాయ మిఠాయిలను అందమైన డిజైనర్ సిల్వర్ ప్లేట్లో రాఖీని జతచేసి అందిస్తారు. ట్రెడిషనల్ ఫెస్టివ్ థాలీ: పేరుకు తగినట్లే ఇది సంప్రదాయాన్ని ఒలకబోస్తుంది. ఇందులో ఆర్గానిక్ స్వీట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ షేప్‌లో మిఠాయిలను చేయడం దీని ప్రత్యేకత. వీటితో పాటు డిజైనర్ రాఖీ, చాక్లెట్స్, పసుపు కుంకుమను ఈ థాలీలో అందిస్తారు. డెలిషియస్ నట్ థాలీ: చూడగానే ఎంతగానో ఆకట్టుకునే ప్రత్యేకమైన థాలీ. రకరకాల నట్స్‌తో ముస్తాబు చేసేదే డెలిషియస్ నట్ థాలీ. బాదం, కాజు, కిస్మిస్, ఆల్మండ్, వాల్‌నట్స్‌తో పాటు బుల్లిబుల్లి చాక్లెట్స్‌ను అందమైన రాఖీని, ముద్దొచ్చే టెడ్డీ డాల్‌ను జోడిస్తారు. - శిరీష చల్లపల్లి ఫొటోలు: రాజేష్ రెడ్డి -
లేడీస్.. స్పెషల్
లేటెస్ట్ ట్రెండ్స్‌తో నిర్వహించిన ‘ఫ్యాషన్ యూత్ర’ సిటీజనులకు వినూత్న వెరైటీలను పరిచయుం చేసింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో సోషలైట్ కామినీ షరాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఫ్యాషన్ లవర్స క్యూ కట్టారు. దుస్తులు, జ్యువెలరీ, ఫుట్‌వేర్, డెకార్స్, యాక్సెసరీస్ వంటి ఐటమ్స్‌తో స్టాల్స్ కొలువుదీరాయి. - ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారంతా మహిళలే. ఈసారి ఏర్పాటు చేసిన డిజైనర్ ఉత్పత్తుల ప్రదర్శనలో 67 స్టాల్స్ అన్నీ మహిళలవే. - ఫిలిప్పీన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఆల్చిప్పలతో రూపొందిన మ్యూజికల్ సెట్స్, గౌతమ్‌బుద్ధ వంటి అలంకరణ వస్తువులు ఆకట్టుకున్నాయి. ముంబై నుంచి వచ్చిన మరో వ్యాపారి.. సౌదీ అరేబియా నుంచి తెచ్చిన డ్రైఫ్రూట్స్‌తో చేసిన స్వీట్స్ టేస్టీగా ఉన్నారుు. తిబర్‌మాల్ జ్యువెలర్స్‌కు చెందిన పంకజ్గుప్తా డిజైన్ చేసిన ఆభరణాలతో మోడల్స్ వావ్ అనిపించారు. ఇంకా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కాని, ఇటలీకి చెందిన ఒక బ్రాండ్ కంపెనీ తొలిసారి తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. - పేజ్ త్రీ ప్రవుుఖులు వినీతాపిట్టి, నీరాశారెన్, పింకీరెడ్డి, హీరో వెంకటేష్ సతీవుణి నీరజ, నిర్మాత సురేష్‌బాబు సతీవుణి లక్ష్మి షాపింగ్ చేశారు. - ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేసే నాన్హి కలి, హెల్ప్, పీఎఫ్‌ఏలకు అందజేస్తారు. - ‘ఇది తొమ్మిదో ఏడాది. వచ్చే ఏడాది మరింత డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నా. సామాజిక ప్రయోజనం కోసం చేస్తున్న ఈ కార్యక్రవుం విజయువంతం కావడం సంతోషంగా ఉంది’ అని నిర్వాహకురాలు కామినీ షరాఫ్ చెప్పారు. - శిరీష చల్లపల్లి ఫొటోలు: సృజన్ పున్నా -
నేను మానేశా... మరి మీరు!
ధూమపానంపై అనురాగ్‌శర్మ సాక్షి, సిటీబ్యూరో: ‘ధూమపానాన్ని 23 ఏళ్ల క్రితమే మానేశా. ఈ అలవాటు ఉన్న వారందరూ మానుకోవాలి’ అంటూ పిలుపునిచ్చారు నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ. ‘వరల్డ్ నో టొబాకో డే’ను పురస్కరించుకుని సిటిజన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన శనివారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. పోలీసు విభాగంలోని తోటి అధికారులు కూడా ధూమపానం మానుకోవాలని కమిషనర్ కోరారు. సంస్థ నాయకులు రాజనారాయణ ము దిరాజ్, మీరా, అదనపు పోలీసు కమిషనర్లు జితేందర్, సందీప్ శాండిల్యా, జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. అలాగే... ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించిన 2కె రన్‌ను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రారంభించారు. కామినేని హాస్పిటల్స్ డెరైక్టర్ వసుంధర కామినేని, సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. టొబాకో కంట్రోల్ సెల్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పొగాకు మానాలని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అప్సా, జనచైతన్య వేదిక నిర్వహించిన కార్యక్రమంలో పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు సూచించారు. -
పింఛన్ దుడ్లు ఎప్పుడిస్తారో..!
మహానేత వైఎస్‌ను స్మరించుకున్న వృద్ధులు బేతంచెర్ల, న్యూస్‌లైన్: వయస్సు పైబడిన వృద్ధులు.. ఆసరా లేని వికలాంగులు.. తోడు దూరమైన వితంతువులు.. వీరందరికీ నెల నెలా వచ్చే పింఛన్ ఎంతో ఆసరానిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లా.. వీరికీ ఠంచన్‌గా పింఛన్ మొత్తం అందించి పెద్ద కొడుకుగా.. తోబుట్టువులా వారి హృదయాలను చూరగొన్నారు. ఆయన మరణానంతరం పింఛన్ ఎప్పుడొస్తుందో తెలియక.. రోజూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ నెలలో ఇప్పటికే 11 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ పింఛన్ ఇస్తారో లేదో తెలియక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అతి కష్టం మీద పొద్దున్నే కార్యాలయాలకు వస్తున్నారు. ఇంకా రాలేదని తెలిసి ఎండలో నిట్టూరుస్తూ ఇళ్లకు వె ళ్లిపోతున్నారు. దుడ్లు ఎప్పుడిస్తారోనని ఆశగా అడుగుతున్నారు. ఆ మహానేత జీవించి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చేవి కాదంటూ పలువురు పింఛన్‌దారులు ఈ సందర్భంగా వైఎస్ఆర్ను గుర్తు చేసుకోవడం కనిపించింది. ఆ వైఎస్ దేవుడు లేకపోయినా.. ఆయన కొడుకు జగన్ అయినా వస్తే సక్రమంగా పింఛన్ దుడ్లు వస్తాయని మరింత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
జలం..గరళం
వరంగల్, న్యూస్‌లైన్ :ఎనభై శాతం వ్యాధులకు కలుషిత నీరే కారణం. నీటిలో మూలకాలు మోతాదుకు మించి ఉంటే అనర్థమే. ఈ మేరకు పల్లె ప్రజ లకు సురక్షిత నీరు అందేలా ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి పంచాయతీలకు తాగునీటి పరీక్షల కిట్లను సరఫరా చేసింది. గ్రామాల్లోని బోర్లు, బావులు, నీటి పథకాల నుంచి దశలవారీగా న మూనాలు సేకరించి పీహెచ్ ఎంత ఉంది... క్లో రైడ్, ఫోరైడ్, నైట్రేట్, ఐరన్, సల్ఫేట్ వంటి మూలకాలు మోతాదుకు మించి ఉన్నాయూ... వంటి అంశాలను పరీక్షించి తెలుసుకునేందుకు 2012లో జిల్లాలోని 962 పంచాయతీలకు పం పిణీ చేసింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం అవసరాలకే కాకుండా... పౌరులు కోరితే నీటి ని పరీక్షించి ఇచ్చే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. కానీ.. సర్కారు ప్రయత్నం వృథా ప్రయూసే అయింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎ టువంటి ప్రయోజనం చేకూరలేదు. నీటి పరీ క్షలు చేశామని ఏ ఒక్క గ్రామం నుంచి ఆర్డబ్ల్యూఎస్ శాఖకు అందిన దాఖలాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనానికి ప్రజల్లో అవగాహన లేమి కొరవడడంతో ఈ పథకం లక్ష్యం నీరుగారుతోంది. కిట్లు పడేశారు.. ఎక్కడైనా నీటి పరీక్షల తర్వాత స్వల్పంగా మోతాదుకు మించి మూలకాలు ఉన్నట్లయితే... ఆ నీటిని ఐదంచెల పద్ధతిలో ఫిల్టర్ చేసి తాగడానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అధిక శాతంలో మోతాదుకు మించి ఉంటే ఆ నీటిని ప్రజలు తాగకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో గ్రామకార్యదర్శులు చర్యలు చేపట్టాలి. ఇది తమకు భారమనుకున్నారో.. ఏమో పలు పంచాయతీల్లో ఆ కిట్లను పడేశారు. మరికొన్ని పంచాయతీల్లో అవి మూలకుపడి ఉన్నాయి. దీంతో ఒక్కో కిట్‌కు రూ. 1200 చొప్పున జిల్లాలో వెచ్చించిన రూ. 11.54 లక్షలు వృథా అయ్యూయి. అక్కరకురాని శిక్షణ నీటి పరీక్షల కిట్లను వినియోగించే విధానంపై గత ఏడాది ఫిబ్రవరిలో మండల కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శి, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. ప్రతి వారం గ్రామంలోని బోర్లు, తాగునీటి పథకాల్లో వచ్చే నీటిని ఈ కిట్ల సాయంతో పరీక్షించాలని... మూడు నెలలకోసారి బాక్టీరియా, ఆరు నెలలకోసారి రసాయన పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో శిక్షణ పొందిన వారిలో ఎవరో ఒకరు ఈ పనిచేయాల్సి ఉంటుందని... పరీక్షల నివేదికను ఆర్డబ్యూఎస్ అధికారులకు సమర్పించాలని చెప్పారు. అయితే ఎక్కడా నీటిని పరీక్షించిన దాఖలాలు జిల్లాలో లేవు. స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో తేలిన అంశాలు... జనగామ డివిజన్ : చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, నర్మెట, జనగామ రూరల్ మండలాల్లోని 49 గ్రామాల పరిధిలోని నీటిలో ఫ్లోరైడ్ శాతం సగటున 1.4, నైట్రేట్ శాతం 47.9 ఉంది. ఫ్లోరైడ్ 1-1.5 శాతం ఉంటే ఎటువంటి అనర్థం లేదు. ఈ లెక్కన ఆయూ గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం మోతాదులోనే ఉంది. కానీ.. సగటున 0-45 శాతం ఉండాల్సిన నైట్రేట్ మోతాదును మించి ఉంది. నర్సంపేట డివిజన్ : దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం మండలాల్లోని 31 గ్రామాల్లోని నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ శాతం ఎక్కువే. ములుగుడివిజన్ : పరకాల,రేగొండ, ఏటూ రునాగారం, ములుగు, తాడ్వాయి, మంగపేట, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం, గోవిందరావుపేట, కొత్తగూడెం మం డలాల్లోని అన్ని తండాలతో కలిపి 210 గ్రామాల పరిధిలోని నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ శాతం మోతాదును మించి ఉంది. మహబూబాబాద్ డివిజన్ : మరిపెడ, కురవి, నర్సింహుల పేట, కేసముద్రం మండలాల్లోని 27 గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ. వరంగల్ డివిజన్ : రాయపర్తి, జఫర్గడ్, ధర్మసాగర్ మండలాల్లోని 15 గ్రామాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్ శాతం అధికం. -
పసిడి కొనుగోళ్లకు బ్యాంకులూ రెడీ
ముంబై: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు, పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో భాగంగా ముందు ప్రజల దగ్గర నిరుపయోగంగా ఉంటున్న పసిడిని బైటికి తీసుకురావడంపై దృష్టి సారించింది.. ఇలా వచ్చిన బంగారాన్ని దేశీ డిమాండ్‌కి తగ్గట్లుగా అందుబాటులోకి తేవడం, తద్వారా దిగుమతులు తగ్గించుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సాధారణ ప్రజానీకం నుంచి కూడా బంగారం కొనుగోలు చేసేలా బ్యాంకులను అనుమతించే అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. దేశీయంగా ప్రజానీకం వద్ద 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసేంతగా 31,000 టన్నుల బంగారం ఉందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 557.7 టన్నుల మేర పసిడి నిల్వలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు భారత్ ఏటా భారీ స్థాయిలో పసిడిని దిగుమతి చేసుకుంటోంది. గతేడాది సుమారు 860 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇలా పసిడి, చమురు దిగుమతులతో కరెంటు అకౌంటు లోటు (క్యాడ్- దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ నిధుల మధ్య వ్యత్యాసం) కొండంతగా పెరిగిపోతూ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. చెల్లింపుల కోసం డాలర్లు తరలిపోతుంటే .. రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతూ ఆందోళన కలిగిస్తోంది. చమురు దిగుమతులను ఎలాగూ ఆపే పరిస్థితి లేకపోవడంతో.. కనీసం పసిడి దిగుమతులనైనా నిలువరించి రూపాయి పతనానికి బ్రేక్ వేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కనీసం 500 టన్నుల బంగారాన్నైనా నగదు రూపంలోకి మార్చుకోగలిగితే క్యాడ్‌ని భర్తీ చేసుకోవచ్చని వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. అలాగని.. బంగారం అమ్మాలని గానీ, తాకట్టు పెట్టాలని గానీ తాను ఆర్బీఐకి చెబుతున్నట్లు భావించరాదంటూ ఆయన స్పష్టం చేసినప్పటికీ .. రిజర్వ్ బ్యాంక్ మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ప్రజల దగ్గర్నుంచి పసిడి కొనుగోలు చేసేలా బ్యాంకులను ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కొన్ని బ్యాంకులతో దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మంగా పరీక్షించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆభరణాలు, కడ్డీలు, నాణేలను కొనుగోలు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించనున్నట్లు వివరించాయి. ప్రస్తుతం దీనిపై బ్యాంకులతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే దీన్ని ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపాయి. అమ్మకందారులు ఇతరత్రా వ్యాపారస్తుల దగ్గరకి వెళ్లకుండా తమవైపు తిప్పుకోవాలంటే బ్యాంకులు అధిక రేటు ఇవ్వాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. -
కొనటం లేదు.. అమ్మేస్తున్నారు..!
పసిడి ధర పెరగటంతో కస్టమర్ల రివర్స్ గేర్ నగదు కావాలంటూ షాపులకు క్యూ దుకాణాల్లో పడిపోయిన నగల అమ్మకాలు బిజినెస్ లేక మూసేయటానికీ కొందరు రెడీ! హైదరాబాద్, బిజినెస్ బ్యూరోబంగారం ఇపుడు వర్తకులకే కాదు. సామాన్యులకూ వ్యాపార వస్తువైపోయింది. నిన్నమొన్నటి వరకూ మోజుపడి పసిడి కొనుగోలు చేసిన సగటు జీవి.. బంగారం ధర కనీవినీ ఎరుగనిరీతిలో కొండెక్కడంతో కొనటం కన్నా అమ్మటానికి ఆసక్తి చూపిస్తున్నాడు. దాచుకున్నది కూడా బయటకు తీస్తున్నాడు. ముడి బంగారం కొరతతో వర్తకులు కూడా పాత బంగారం కొనేందుకు సై అంటున్నారు. ఇంకేముంది దుకాణాల్లో పాత బంగారం, నగలు అమ్మేవారి సందడే ఎక్కువైంది. మరోవంక ఆభరణాల అమ్మకాలు చాలా దుకాణాల్లో పడిపోయాయి. ముడి బంగారం దొరక్క, ఆభరణాలు కొనేవారు లేక వర్తకులు బిక్కమొహం వేస్తున్నారు. బిజినెస్ మూసేస్తే బెటరని కొందరు అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమ్మేవారే ఎక్కువ.. పసిడి ధర పెరగడంతో చాలా ఆభరణాల అమ్మకాలు ఏ మాత్రం జరగటం లేదు. కొన్ని ప్రముఖ దుకాణాల్లో మాత్రం మునుపటితో పోలిస్తే 10 శాతం దాకా అమ్మకాలు జరుగుతున్నాయి. పాత బంగారం, నగలు అమ్మి నగదు తీసుకువెళ్లే కస్టమర్లే ఎక్కువయ్యారని వర్తకులు అంటున్నారు. ఒక కస్టమర్ 400 గ్రాముల బంగారాన్ని తమకు విక్రయించారని అమీర్‌పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ జ్యుయలరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. పాత బంగారం అమ్మడం సాధారణమేనని, అయితే ఈ సీజన్లో ఇంత మొత్తంలో లావాదేవీ జరగడం తమ షాపులో ఇదే ప్రథమమని చెప్పారు. బంగారం ధర పెరగటంతో 60 శాతం లావాదేవీలు ఇలాంటివే ఉంటున్నాయన్నారు. వాస్తవానికి పాత బంగారం 20 శాతం అవసరాలు మాత్రమే తీరుస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అప్పుడు కొని.. ఈ ఏడాది ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం ధర రిటైల్‌లో 10 గ్రాములు రూ.33 వేలకు అటూఇటుగా నమోదైంది. జూన్‌లో బాగా క్షీణించి రూ.25 వేల సమీపానికి వచ్చింది. దీంతో చాలామంది ఆ సమయంలో అప్పులు చేసి మరీ బంగారాన్ని కొన్నారు. ఒకదశలో దుకాణాల ముందు కస్టమర్లు క్యూలో నిల్చున్న సందర్భాలూ ఉన్నాయి. అప్పుడు తక్కువ ధరకు బంగారం కొన్నవారిలో అత్యధికులు ఇప్పుడు అమ్మేస్తున్నారని సీఎంఆర్ సిల్క్స్, జ్యువెల్స్ ఎండీ సత్తిబాబు చెప్పారు. జూన్‌లో రికార్డు స్థాయిలో ఆభరణాల అమ్మకాలు నమోదైతే, ఇప్పుడు అమ్మకాలు పూర్తిగా పడిపోవడమూ రికార్డేనని తెలియజేశారు. సాధారణ రోజుల్లో సీఎంఆర్ గ్రూప్‌కు చెందిన ఆరు ఔట్లెట్లలో రోజుకు సగటున రూ.1 కోటి వ్యాపారం జరిగేదని, ఇప్పుడు సగానికి పడిందని చెప్పారాయన. వజ్రాలు, విలువైన రత్నాలతో చేసిన నగలు మాత్రం అమ్ముడవుతున్నాయని చెప్పారు. కాగా, గురువారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.31,600, 22 క్యారెట్లు రూ.31,500 ఉంది. బుధవారం ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.33,430కి చేరి కొత్త రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 14 క్యారెట్ల నిబంధన రావాలి.. దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతం ఆభరణాల రూపంలో ఎగుమతి చేయాలన్న రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా మారింది. ‘దీనికితోడు 20 శాతం బంగారాన్ని కస్టమ్స్ అధికారుల వద్ద గ్యారంటీగా పెట్టాలని చెప్పారు. కానీ ఎక్కడ, ఎలా నిల్వ చేయాలో స్పష్టత లేదు. దీంతో గత నెల రోజులుగా దేశంలోకి ముడి బంగారం దిగుమతులు అసలే లేవు’ అని ఆంధ్రప్రదేశ్ బులియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.మహాబలేశ్వర రావు చెప్పారు. 14 క్యారెట్ల ఆభరణాలను మాత్రమే దేశంలో తయారు చేయాలన్న నిబంధన ఉండాలని, అలా చేస్తే బంగారం దిగుమతులు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. యూరప్, అమెరికా, జపాన్‌లో 14 క్యారెట్ల బంగారు ఆభరణాలు విరివిగా వినియోగిస్తారని తెలియజేశారు. ప్రస్తుతం దేశం నుంచి 8 శాతం లోపే ఆభరణాల ఎగుమతులు జరుగుతున్నాయి. వాటిని 20 శాతానికి చేర్చడం సాధ్యం కాదని జీజేఎఫ్ డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు సాగక దుకాణాలు మూసివేసేందుకు కొందరు సిద్ధపడుతున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.