న్యూఢిల్లీ: పౌరుల డిజిటల్ హక్కులు, వ్యక్తిగత సమాచార భద్రతకు ఉద్దేశించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని ద్రవ్య బిల్లుగా తీసుకువచ్చారన్న ఆరోపణల్ని మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు.
ఇది సాధారణ బిల్లేనని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత గోప్యతతో ప్రమేయమున్న ఈ బిల్లును హడావుడి ఆమోదించవద్దని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి అన్నారు. గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉంచిన ముసాయిదా బిల్లుపై వచి్చన సలహాలు సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వినియోగదారుల డిజిటల్ డేటాని దుర్వినియోగం చేసేవారిపై కేంద్రం కొరడా ఝళిపించింది. అలాంటి సంస్థలపై రూ.50 నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనుంది. అంతేకాకుండా ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా డేటా ప్రొటక్షన్ బోర్డుని ఏర్పాటు చేయనున్నట్టుగా బిల్లులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment