ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయభార కార్యాలయం
All Indian students, are advised to leave Ukraine temporarily: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని భారత రాయభార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులతో సహా తమ పౌరులను తూర్పు ఐరోపా దేశంలో ఉండడం అవసరమని భావించకపోతే తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. అంతేకాదు భారతీయ పౌరులు, విద్యార్థులను ఉక్రెయిన్‌ను తాత్కాలికంగా విడిచిపెట్టిరావాలని సూచించింది.
అలాగే భారతీయ విద్యార్థులు చార్టర్ విమానాల గురించి అప్‌డేట్ల కోసం సంబంధిత స్టూడెంట్ కాంట్రాక్టర్లను కూడా సంప్రదించాలని, అలాగే ఎంబసీ ఫేస్‌బుక్, వెబ్‌సైట్, ట్విట్టర్‌లను అనుసరించాలని సూచించింది. సమాచారం, సహాయం అవసరమైన ఉక్రెయిన్‌లోని భారతీయులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్‌ని సంప్రదించాలని తెలిపింది.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరోదించే విషయమై ఈరోజు చివరి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లో పరిస్థితి గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య టెలిఫోన్ సంభాషణ ప్రారంభమైందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నాటోలో ఉక్రెయిన్ ఎప్పటికీ చేరనన్న రాతపూర్వక హామీపై బలగాలు వెనక్కు తగ్గతాయంటూ పునరుద్ఘాటించటం గమనార్హం.
ADVISORY FOR INDIAN NATIONALS IN UKRAINE.@MEAIndia @DrSJaishankar @PIBHindi @DDNewslive @DDNewsHindi @IndianDiplomacy @PTI_News @IndiainUkraine pic.twitter.com/i3mZxNa0BZ
— India in Ukraine (@IndiainUkraine) February 20, 2022
(చదవండి: యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు)
Comments
Please login to add a commentAdd a comment