కల్లోలిత సూడాన్ నుంచి పౌరులను తరలించేందుకు భారత్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తోంది. ఏప్రిల్ 15న సూడాన్ రాజధాని ఖర్టూమ్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య జరుగుతున్న హోరాహోరి పోరు హింత్మకంగా మారింది. దీంతో సూడాన్ దారుణంగా దెబ్బతింది. ఈ అత్యర్యుద్ధంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది.
ఈపాటికే భారత్ కూడా వారిని అప్రమత్తం చేసి, సూచనలందించింది. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయం కూడా అన్ని రకాలుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ యుద్ధంలో విమానాశ్రయలే దారుణంగా దెబ్బతినడంతో తరలింపు కష్టతరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించిన భారత్ వారిని సురక్షితమైన భూమార్గం గుండా తరలించాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఐతే రాయబార కార్యాలయ సిబ్బంది తరలింపు ఆపరేషన్‌లో సహయం చేయడం కోసం ప్రస్తుతానికి అక్కడే ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, యూఎస్ ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయాన్ని తన డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ని ఉపయోగించి తాత్కాలికంగా నిలిపేసి, సిబ్బంది ఖాళీ చేయించింది. ఈమేరకు మేజేమెంట్ అండ్ సెక్రటరీ అంబాసీడర్ మాట్లాడుతూ..రాపీడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ మాతో సమన్వయమై యూఎస్ ఆపరేషన్‌కు మద్దతిచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారు సహకరించిన మేరకు సహకరించారు. ఆపరేషన్ సమయంలో మా సభ్యులపై కూడా కాల్పులు జరిపారు. ఐతే వారి స్వప్రయోజనాల కోసం చేశారని భావిస్తున్నాం అని అన్నారు.
కాగా, వివిధ దేశాల నుంచి 150 మందికి పైగా ప్రజలు ఒక రోజు ముందుగానే సౌదీ అరేబియా చేరుకున్నారు. ఐతే సౌదీలు కాకుండా భారతదేశంతో సహా 12 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నట్లు సమాచారం. అదీగాక తమ పౌరులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నమని విదేశీ దేశాలు తెలిపాయి. అందులో భాగంగా దక్షిణ కొరియ, జపాన్ తమ సమీపంలో ఉన్న దేశాల నుంచి బలగాలను మోహరించి పౌరులను తరలించే యత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక యూరోపియన్ యూనియన్ కూడా ఇదే తరహాలో తరలించే యత్నం చేస్తోంది. ఐతే ఇప్పటి వరకు సూడాన్‌లో జరిగిన పోరాటంలో దాదాపు 420 మందికి పైగా మరణించారని, మూడు వేలమందికి పైగా గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది కూడా.
(చదవండి: విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..)
Comments
Please login to add a commentAdd a comment