India vs China: టగ్‌ ఆఫ్ వార్‌లో భారత బలగాల గెలుపు | Indian troops Win Tug Of War Against Chinese Troops In Sudan | Sakshi
Sakshi News home page

India vs China: టగ్‌ ఆఫ్ వార్‌లో భారత బలగాల గెలుపు

Published Wed, May 29 2024 11:40 AM | Last Updated on Wed, May 29 2024 11:42 AM

Indian troops Win Tug Of War Against Chinese Troops In Sudan

ఖార్టూమ్: చైనా బలగాలపై భారత్‌ సైనికులు పైచేయి సాధించారు. ఇది యుద్ధంలో కాదు..! ఐక్యరాజ్యసమితి పీస్‌ కీపింగ్‌ మిషన్‌లో భాగంగా సుడాన్‌లో నిర్వహించిన ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ పోటీలో చైనాను భారత బలగాలు ఓడించాయి. ఈ విషయాన్ని ఇండియన్‌ ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

టాగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలో భారత్‌, చైనా బలగాలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో భారత్‌ బలగాలు టీం వర్క్‌, అద్భుతమైన పట్టుదలతో కూడిన సామర్థాన్ని ప్రదర్శించి చైనా బలగాలను ఓడించారు. స్నేహ పూర్వకంగా జరిగిన ఈ పోటీ.. అక్కడ ఉన్న మిగతా సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది.

యునైటెడ్‌ నేషన్స్‌ మిషన్‌ ఇన్ ద సూడాన్‌(UNMIS) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలతో 24 మార్చి, 2005 ఏర్పాటైంది. ఈ క్రమంలోనే సూడాన్ ప్రభుత్వం, సూడాన్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ మూవ్‌మెంట్ మధ్య 9 జనవరి, 2005లో శాంతి ఒప్పందం కుదిరింది. అ‍ప్పటి నుంచి సూడాన్‌ శాంతి ఒప్పందానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపడుతోంది. 

మానవతా సాయం, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికా యూనియన్‌ మిషన్‌కు మద్దతు పలకటం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా నిర్వహించినదే భారత్‌-చైనా మధ్య నిర్వహించిన టగ్‌ ఆఫ్‌ వార్‌ స్నేహపూర్వక పోటీ అని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement