tug of war
-
India vs China: టగ్ ఆఫ్ వార్‌లో భారత బలగాల గెలుపు
ఖార్టూమ్: చైనా బలగాలపై భారత్ సైనికులు పైచేయి సాధించారు. ఇది యుద్ధంలో కాదు..! ఐక్యరాజ్యసమితి పీస్ కీపింగ్ మిషన్‌లో భాగంగా సుడాన్లో నిర్వహించిన ‘టగ్ ఆఫ్ వార్’ పోటీలో చైనాను భారత బలగాలు ఓడించాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#WATCH | Indian troops won a Tug of War that took place between them and Chinese troops during deployment in Sudan, Africa under a UN Peacekeeping mission: Army officials (Viral video confirmed by Indian Army officials) pic.twitter.com/EpnGKURPa3— ANI (@ANI) May 28, 2024 టాగ్ ఆఫ్ వార్ పోటీలో భారత్, చైనా బలగాలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో భారత్ బలగాలు టీం వర్క్, అద్భుతమైన పట్టుదలతో కూడిన సామర్థాన్ని ప్రదర్శించి చైనా బలగాలను ఓడించారు. స్నేహ పూర్వకంగా జరిగిన ఈ పోటీ.. అక్కడ ఉన్న మిగతా సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది.యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్(UNMIS) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలతో 24 మార్చి, 2005 ఏర్పాటైంది. ఈ క్రమంలోనే సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ మధ్య 9 జనవరి, 2005లో శాంతి ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి సూడాన్ శాంతి ఒప్పందానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపడుతోంది. మానవతా సాయం, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికా యూనియన్ మిషన్‌కు మద్దతు పలకటం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా నిర్వహించినదే భారత్-చైనా మధ్య నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ స్నేహపూర్వక పోటీ అని అధికారులు తెలిపారు. -
'లైగర్'తో యువ్‌రాజ్ సింగ్ పోటీ.. గెలుపెవరిది..?
Yuvraj Singh Takes On A Liger In Tug Of War: టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్.. లైగర్‌తో పోటీ పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో యువీ, అతని స్నేహితులు కలిసి లైగర్‌తో టగ్ ఆఫ్ వార్ పోటీలో పాల్గొంటారు. దుబాయ్‌లోని ఫేమ్ పార్క్‌లో జరిగిన ఈ సరదా పోటీకి సంబంధించిన వీడియోను యువీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. Tiger vs Liger అనే క్యాప్షన్ జోడించి, తుది ఫలితం ఏంటో మీకు తెలిసే ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) 4 నిమిషాల 28 సెకెన్ల పాటు సాగే ఈ వీడియోలో.. యువీ, ఫేమ్ పార్క్‌లోని జంతువులతో సరదాగా గడుపుతూ కనిపించాడు. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకుని.. ఎలుగుబంటి, చింపాంజీలకు ఆహారాన్ని అందించాడు. ఫేమ్ పార్క్‌ను సందర్శించడం ద్వారా జంతువుల పట్ల తనకున్న భయాన్ని అధిగమించగలిగానని, మూగ జీవాలతో దగ్గరగా మెలగడం గొప్ప అనుభూతిని కలిగించిందని యూవీ తెలిపాడు. ఫేమ్ పార్క్ జంతువులకు సురక్షితమైన ప్రదేశమని, ఈ వీడియో తీసే సమయంలో ఏ జంతువుకూ హాని కలిగించలేదని ఆయన పేర్కొన్నాడు. చదవండి: ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 31 బంతుల్లోనే శతకం -
తెలంగాణ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ టగ్ ఆఫ్ వార్ మహిళల, బాలికల చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌బాబు, రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం ప్యాట్రన్ చల్లా భరత్ కుమార్ రెడ్డి పాల్గొని రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఆగ్రాలోని గోవర్ధన స్టేడియం రైల్వే గ్రౌండ్లో ఈనెల 27 నుంచి 30 వరకు జాతీయ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. జట్ల వివరాలు అండర్–13 బాలికలు: దుర్గా భవాని, ఎం. మల్లీశ్వరి, ఎస్. శ్రావ్య, పి. పూజ, విజయ, నవనీత, సాయి స్నేహా, అర్షిన్, శీర్షా, సీమ. అండర్–15 బాలికలు: గ్రీష్మ, కల్యాణి, శ్రావణి, త్రిషిక, శరణ్య, శిరీష, అఫ్రీన్, హారిక. అండర్–17 బాలికలు: బాలమణి, శీర్షా, భవాని, రేణుక, అంజుమ్, అంజలి, దివ్య, దీప్తి, సమీహ, ఫాతిమా, స్వాతి, భూమిక, తన్వీ. అండర్–19 బాలికలు: ప్రవళిక, భవాని శ్రీ, చందన, గాయత్రి, హారిక, స్వాతి, నవ్య, కె. అభినయ, బి. అభినయ, త్రిష, సానియా అంజుమ్. సీనియర్ బాలికలు: కావ్య, స్వాతి, అఖిల, సునీత, మనస్విని, ఎస్. అఖిల, త్రివేణి, శీర్షా, సంఘవి, రమ్య. -
తెలంగాణ జట్లకు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు ఆకట్టుకున్నాయి. పంజాబ్‌లో జరిగిన ఈ టోర్నీలో రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నాయి. మహిళల టీమ్, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో తెలంగాణ జట్లు మూడో స్థానంలో నిలిచి పతకాలను సాధించాయి. శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజి ప్రాంగణంలో గురువారం జరిగిన సీనియర్ మహిళల (480 కేజీలు) టీమ్ విభాగంలో తెలంగాణ మహిళల జట్టు 3–0తో బిహార్‌పై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు సెమీస్ మ్యాచ్‌ల్లో పంజాబ్ 3–0తో తెలంగాణపై, కేరళ 3–0తో బిహార్‌పై గెలుపొందాయి. సెమీస్‌లో ఓటమి పాలైన జట్లు కాంస్య పతకం కోసం తలపడ్డాయి. నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కూడిన మిక్స్డ్ టీమ్ (540 కేజీలు) విభాగంలో తెలంగాణ 3–0తో మణిపూర్‌ను ఓడించి కాంస్యాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 0–3తో ఛత్తీస్‌గఢ్‌పై, మణిపూర్ 0–3తో పంజాబ్ చేతిలో పరాజయం పొం దాయి. జాతీయ స్థాయిలో రాణించిన తెలంగాణ జట్లను తెలంగాణ టగ్ ఆఫ్ వార్ (టీఎస్‌టీడబ్ల్యూఏ) సంఘం అధికారులు, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు శుక్రవారం అభినందించారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడబ్ల్యూఏ ఎండీ చల్లా భరత్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎ. మహేశ్, కార్యదర్శి పి. ఎమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు కెప్టెన్‌గా ఎన్. రాఘవేంద్ర, మహిళల జట్టుకు కెప్టెన్‌గా ఎ. దివ్య చౌదరి వ్యవహరించనున్నారు. మిక్స్డ్ టీమ్‌కు వి. షన్మితా రెడ్డి సారథ్యం వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పురుషుల, మహిళల జట్లకు సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. పంజాబ్‌లో రేపటి నుంచి ఈనెల 18 వరకు జాతీయ సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్ జరుగనుంది. జట్ల వివరాలు పురుషులు: ఎన్. రాఘవేంద్ర (కెప్టెన్), ఎ. రాజశేఖర్ (వైస్ కెప్టెన్), ఎస్. భాస్కర్, టి. కార్తీక్, జి. మధు, బి. బాలు, ఆర్. గోవింద్, కె. మహేశ్, పి. రాకేశ్, టి. శ్రీనివాస్ (కోచ్), దేవీ వరప్రసాద్ (మేనేజర్). మహిళలు: ఎ. దివ్య చౌదరి (కెప్టెన్), వి. దివ్య (వైస్ కెప్టెన్), రసజ్ఞ, జి. అమరావతి, వి. కావ్య, ఎస్. శిరీష, కె. మమత, కె. సారిక, వై. శిరీష, కృష్ణారావు (కోచ్), సంయుక్త (మేనేజర్). మిక్స్డ్ టీమ్: వి. షన్మితా రెడ్డి (కెప్టెన్), కె. కావ్య (వైస్ కెప్టెన్), ఎస్కే హజ్రత్, ఎస్కే అస్మా, జె. కేదారేశ్వరి, బి. వెంకటేశ్, పి. మహేందర్, దినకర్, ఆర్. శ్రీను, పి. మహేందర్, సాగర్ (కోచ్), బి. సత్య నారాయణ (మేనేజర్). -
తమిళనాడులో అంచనా తప్పింది
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్లు ఉత్కంఠ రేపాయి. తొలుత డీఎంకే కూటమి ముందంజలో ఉన్నట్లు కనిపించినా, మళ్లీ అమ్మ పుంజుకుంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో కడపటి వార్తలు అందేసరికి అన్నా డీఎంకే 141 స్థానాల్లోను, డీఎంకే 86 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నాయి. జాతీయ మీడియా మొత్తం డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పగా, అంచనా తప్పింది. స్థానికంగా ఉన్న తమిళ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అమ్మకే ఆధిక్యం వస్తోంది. గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. కరుణ కుమార్తె కనిమొళి, కొడుకు స్టాలిన్, ఇంకా ముఖ్యమైన నేతలంతా అక్కడే ఉండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. తుది ఫలితాలు వెలువడే సమయానికి వాళ్లంతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జయ నివాసం పోయస్ గార్డెన్స్ వద్ద సందడి నెలకొంది. -
బిహార్ పోరు హోరా హోరీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కానీ ఇది ఓ మహా యజ్ఞం లాంటిది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం 243 అసెంబ్లీ నియోజవర్గాల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైంది. రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. నువ్వా.. నేనా అన్నట్లుగా ఆధిక్యాలు మారుతున్నాయి. లెక్కింపు మొదలైన తొలి గంటలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉండగా.. తర్వాత మళ్లీ మహాకూటమి కొన్నిచోట్ల పుంజుకుంది. తాజాగా అందిన వివరాల ప్రకారం ఎన్డీయే కూటమి 91 చోట్ల, మహాకూటమి 99 చోట్ల, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 62,780 ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. 14,580 మంది అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. పట్నాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 3,450 మంది అభ్యర్థులు పోటీపడిన ఈ ఎన్నికల్లో మొత్తం 272 మంది మహిళలు కూడా పోటీలో ఉన్నారు. వీళ్లలో ఎంతమంది అసెంబ్లీకి వెళ్తారో.. ఎందరు ఇళ్లకు పరిమితం అవుతారో మధ్యాహ్నానికల్లా తేలిపోతుంది. అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ఐదు దశల ఎన్నికలు... నవంబర్ ఐదో తేదీతో ముగిశాయి.