'లైగర్‌'తో యువ్‌రాజ్‌ సింగ్‌ పోటీ.. గెలుపెవరిది..? | Viral Video: Yuvraj Singh Takes On A Liger In Tug Of War | Sakshi
Sakshi News home page

Tiger Vs Liger: టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలో ఎవరిది విజయం..?

Published Sun, Oct 3 2021 3:58 PM | Last Updated on Sun, Oct 3 2021 4:17 PM

Viral Video: Yuvraj Singh Takes On A Liger In Tug Of War - Sakshi

Yuvraj Singh Takes On A Liger In Tug Of War: టీమిండియా మాజీ క్రికెట‌ర్, సిక్సర్ల వీరుడు యువ‌రాజ్ సింగ్‌.. లైగర్‌తో పోటీ పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో యువీ, అతని స్నేహితులు కలిసి లైగర్‌తో టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలో పాల్గొంటారు. దుబాయ్‌లోని ఫేమ్ పార్క్‌లో జరిగిన ఈ సరదా పోటీకి సంబంధించిన వీడియోను యువీ త‌న ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. Tiger vs Liger అనే క్యాప్షన్‌ జోడించి, తుది ఫ‌లితం ఏంటో మీకు తెలిసే ఉంటుంది అంటూ కామెంట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌లవుతోంది. 

4 నిమిషాల 28 సెకెన్ల పాటు సాగే ఈ వీడియోలో.. యువీ, ఫేమ్ పార్క్‌లోని జంతువుల‌తో సరదాగా గడుపుతూ కనిపించాడు. ఓ భారీ కొండ‌చిలువ‌ను మెడ‌లో వేసుకుని.. ఎలుగుబంటి, చింపాంజీలకు ఆహారాన్ని అందించాడు. ఫేమ్ పార్క్‌ను సందర్శించడం ద్వారా జంతువుల పట్ల తనకున్న భయాన్ని అధిగమించగలిగానని, మూగ జీవాలతో దగ్గరగా మెలగడం గొప్ప అనుభూతిని కలిగించిందని యూవీ తెలిపాడు. ఫేమ్ పార్క్‌ జంతువుల‌కు సుర‌క్షితమైన ప్ర‌దేశ‌మ‌ని, ఈ వీడియో తీసే స‌మ‌యంలో ఏ జంతువుకూ హాని క‌లిగించ‌లేద‌ని ఆయన పేర్కొన్నాడు.
చదవండి: ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఊచకోత.. 31 బంతుల్లోనే శతకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement