Yuvraj Singh Posts Funny Comment On Sachin Tendulkar Traditional Wear - Sakshi
Sakshi News home page

Sachin-Yuvraj: కొత్త వేషంలో టీమిండియా దిగ్గజం.. టీజ్‌ చేసిన యువీ

Aug 10 2022 5:52 PM | Updated on Aug 10 2022 6:19 PM

Yuvraj Singh Teases Sachin Tendulkar Traditional Wear At Wedding - Sakshi

టీమిండియా దిగ్గజం.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొత్త అవతారంలో కనిపించాడు. తన సోదరుడు నితిన్‌ టెండూల్కర్‌ కూతురు పెళ్లి సందర్భంగా సచిన్‌ సంప్రదాయ దుస్తులో మెరిశాడు. గోదుమ కలర్‌ షేర్వాణీ ధరించిన సచిన్‌.. ఎర్ర తలపాగాతో(ఫేటా) రాజవంశీయుడిగా కనిపించాడు. ఇదే విషయాన్ని సచిన్‌ స్వయంగా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. వెడ్డింగ్‌.. షాదీ సెలబ్రేషన్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశాడు. నా అన్న నితిన్‌ కూతురు పెళ్లి.. అందుకే ఈ సంప్రదాయ డ్రెస్సుతో పాటు ఫేటాను ధరించాను. అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్బంగా ఫేటాను పెట్టుకుంటున్న వీడియోనూ షేర్‌ చేశాడు.

ఇక సచిన్‌ పెట్టిన పోస్ట్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సరదాగా స్పందించాడు. సచిన్‌ను టీజ్‌ చేస్తూ.. ''ఓయ్‌ సచిన్‌ కుమార్‌.. హే'' అంటూ పేర్కొన్నాడు. ఇక సచిన్‌ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని యువీ చాలాసార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌కు టైటిల్‌ అందించిన యువరాజ్‌ తన గెలుపును సచిన్‌కు అంకితమిచ్చి.. ''ఇదంతా సచిన్‌ కోసమే'' అంటూ పేర్కొనడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇక మంగళవారం కన్నుమూసిన దిగ్గజ అంపైర్‌ రూడీ కోర్ట్జెన్‌ను సంతాపం తెలిపిన వీరిద్దరు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

చదవండి: Meg Lanning: ఆస్ట్రేలియా కెప్టెన్‌ అనూహ్య నిర్ణయం.. గౌరవించిన సీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement