Liger
-
‘లైగర్’ పెట్టుబడులపై ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: లైగర్ చిత్రానికి పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్‌తోపాటు చార్మీని, ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి విదితమే. కాగా, శుక్రవారం సినీ ఫైనాన్షియర్ శోభన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు?.. పెట్టుబడిగా పెట్టారా?.. లేక ఫైనాన్స్ చేశారా?.. చేస్తే ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేశారు?.. దానికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సినిమా పెట్టుబడులపై ఇదివరకు పూరీ జగన్నాథ్, చార్మి, విజయ్ను ప్రశ్నించినప్పుడు, శోభన్‌ను ప్రశ్నించినప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: విజయ్‌కి ‘లైగర్’ సెగ! -
లైగర్ సినిమా పెట్టుబడులపై కొనసాగుతున్న ఈడీ విచారణ
-
విజయ్ దేవరకొండ కు లైగర్ ఎఫెక్ట్
-
స్టేడియంలో సందడి చేసిన ‘లైగర్’
దుబాయ్: ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇటీవలే పాన్ ఇండియా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ స్టేడియంలో మెరిశారు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు టీవీ స్క్రీన్ పై సందడి చేశారు. పాకిస్తాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్, భారత మాజీ సీమర్ ఇర్ఫాన్ పఠాన్లతో కలిసి మ్యాచ్‌కు ముందు టీవీ వ్యాఖ్యాతతో తన క్రికెట్ సరదా పంచుకున్నారు. ఓ విధంగా బ్యాటింగ్ మెరుపులకు ముందే సినీ తారా మెరుపు సందడి మొదలైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. కాగా, విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘లైగర్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. #Liger star @TheDeverakonda Live from Dubai at the #INDvPAK match pre-show while promoting #Liger!#VijayDevarakonda #Dubai #India #IndiaVsPakistan #Pakistan #Cricket pic.twitter.com/UGqm7cavUf — Elfa World (@ElfaWorld) August 28, 2022 -
‘లైగర్’కు సెన్సార్ బోర్డ్ షాక్.. ఆ సీన్స్‌ని తొలగించాల్సిందేనట!
‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. దేశమంతా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ.. చిత్ర యూనిట్‌కి భారీ షాక్ ఇచ్చారు. (చదవండి: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..? ) ఈ సినిమాలో కొన్ని అసభ్యకరమైన సీన్స్ ఉన్నాయని, వాటిని మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశించారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చెప్పే బోల్డ్ డైలాగ్స్‌కి సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంతో చేతులతో సంజ్ఞ చేసే సీన్‌ని పూర్తిగా తొలగించమని చెప్పింది. మొత్తంగా ఏడు సన్నివేశాలను మార్పులు చేయాల్సిందిగా బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆయా సీన్స్‌ను తొలగించి లైగర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల్లో సాధారణంగా బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉంటాయి. ఇక పూరీ లాంటి ఊరమాస్ డైరక్టర్ తోడైతే ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయో ఊహించొచ్చు. మరి ఆ ఏడు సీన్ల తొలగింపు ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో చూడాలి. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. -
విజయ్ దేవరకొండతో సమంత రొమాంటిక్ మూవీ!
విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయారు. ‘లైగర్’ సినిమా కోసం లాంగ్ హెయిర్‌తో ఉన్న విజయ్ ఇప్పుడు మిలటరీ హెయిర్ కట్ చేయించు కున్నారు. ఈ లుక్ తన తర్వాతి సినిమా కోసమేనట. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ఆరంభం కానుందని, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఇది కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ అని, విజయ్ దేవరకొండ ఇందులో మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారని భోగట్టా. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ‘లైగర్’ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. కాగా.. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ‘లైగర్’ తర్వాత ‘జనగణ మన’ అనే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. -
'లైగర్' మూవీ ఫొటోలు షేర్.. పూరీపై ఆర్జీవి కామెంట్స్
Rgv Reaction On Liger Team With Mike Tyson Photos: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబొలో వస్తున్న క్రేజీ మూవీ 'లైగర్'. ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సరికొత్త షెడ్యూల్ మంగళవారం లాస్ వెగాస్‌లో ప్రారంభమైంది. విజయ్-మైక్టైసన్లపై కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం కొన్ని ఫొటోలతో షేర్ చేసుకుంది. మైక్ టైసన్‌తో షూట్ ఎంతో సరదాగా ఉందని టీమ్ తెలిపింది. The LIGER family with the ONE and ONLY @MikeTyson pic.twitter.com/dXZEOOzFyw — Ram Gopal Varma (@RGVzoomin) November 17, 2021 లైగర్ చిత్రం బృందం షేర్ చేసిన ఫొటోలపై కాంట్రవర్సీల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ అచ్చం మైక్టైసన్ల కఠినంగా ఉన్నాడని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. 'వన్ అండ్ ఓన్లీ మైక్ టైసన్‌తో లైగర్ ఫ్యామిలీ' అని క్యాప్షన్ ఇచ్చారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా లైగర్ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా విభిన్నమైన లుక్‌లో పొడవాటి జుత్తుతో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ నటి అనన్యా పాండే అలరించనున్నారు. పాన్ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి చార్మితోపాటు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Sir @purijagan u almost look as tough as @MikeTyson 🙏🙏🙏 pic.twitter.com/UgzA7rgfeZ — Ram Gopal Varma (@RGVzoomin) November 17, 2021 -
'లైగర్'తో యువ్‌రాజ్ సింగ్ పోటీ.. గెలుపెవరిది..?
Yuvraj Singh Takes On A Liger In Tug Of War: టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్.. లైగర్‌తో పోటీ పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో యువీ, అతని స్నేహితులు కలిసి లైగర్‌తో టగ్ ఆఫ్ వార్ పోటీలో పాల్గొంటారు. దుబాయ్‌లోని ఫేమ్ పార్క్‌లో జరిగిన ఈ సరదా పోటీకి సంబంధించిన వీడియోను యువీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. Tiger vs Liger అనే క్యాప్షన్ జోడించి, తుది ఫలితం ఏంటో మీకు తెలిసే ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) 4 నిమిషాల 28 సెకెన్ల పాటు సాగే ఈ వీడియోలో.. యువీ, ఫేమ్ పార్క్‌లోని జంతువులతో సరదాగా గడుపుతూ కనిపించాడు. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకుని.. ఎలుగుబంటి, చింపాంజీలకు ఆహారాన్ని అందించాడు. ఫేమ్ పార్క్‌ను సందర్శించడం ద్వారా జంతువుల పట్ల తనకున్న భయాన్ని అధిగమించగలిగానని, మూగ జీవాలతో దగ్గరగా మెలగడం గొప్ప అనుభూతిని కలిగించిందని యూవీ తెలిపాడు. ఫేమ్ పార్క్ జంతువులకు సురక్షితమైన ప్రదేశమని, ఈ వీడియో తీసే సమయంలో ఏ జంతువుకూ హాని కలిగించలేదని ఆయన పేర్కొన్నాడు. చదవండి: ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 31 బంతుల్లోనే శతకం -
విజయ్ను కలిసి షణ్ముక ప్రియ, ‘లైగర్’ ఓ పాట పాడే అవకాశం
హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్ షణ్ముక ప్రియకు పాట పాడే అవకాశం కల్పించాడు. తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరిస్తూ..ఇండియన్ ఐడల్ సీజన్ 12లో మెరిసింది షణ్ముఖ ప్రియ. ఇటీవల షో నిర్వహకుల విజ్ఞప్తి మేరకు లైవ్‌లో జూమ్ ద్వారా షణ్ముకతో మాట్లాడిన విజయ్ గెలిచినా, ఓడినా అవకాశం ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయ్ తన హామీని నిలబెట్టుకున్నాడు. ఇండియన్ ఐడల్ 12 సీజన్లో షణ్ముక టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరుగా నిలిచి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ షణ్ముక ట్రోఫి మాత్రం గెలుచుకోలేకపోయింది. అయితే ఇటీవల ఈ షో ముగియడంతో తన స్వస్థలం విశాఖపట్నం చేరుకుంది. చదవండి: నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ ఇక ఇటీవల వైజాగ్ చేరుకున్న షణ్ముక సోమవారం విజయ్ను కలిసింది. తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో విజయ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో విజయ్ ఆమెతో తనిష్క్ బాఘ్చి మ్యూజిక్ కంపోజిషన్‌లో ప్రియ పాట పాడించాడు. అయితే తుది మిక్సింగ్ అయిపోయిన తర్వాత పాటను వినాలని షణ్ముఖకు చెప్పాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తల్లి షణ్ముకను శాలువతో సత్కరించి చీరలు, ఇతర బహుమతులు అందజేసింది. రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్ -
బాక్సింగ్ రింగ్‌లోకి..విజయ్ దేవరకొండ
గోవాలో బాక్సింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’లో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా బ్రేక్ పడిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆరంభం కానుంది. గోవాలో నెల రోజుల షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట. వచ్చే వారం చిత్రబృందం గోవా ప్రయాణం కానుందని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరి చయం కానున్నారు. ఈ ప్యాన్ ఇండియా మూవీని చార్మీ, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే ఈ చిత్రం ఈ నెల విడుదలయ్యుండేది. -
ఆటలతో ఆకట్టుకున్న హిట్ సినిమాలివే!
కోడి రామ్మూర్తి బయోపిక్ రానుంది. పి.వి.సింధు ఆటను బిగ్ స్క్రీన్ మీద చూస్తాం. పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో ఆయన్ను పోలిన నటుడు ఎవరో? ఆటను సినిమాగా చెప్పడం కూడా పెద్ద ఆట. బాల్ వెళ్లి సూటిగా తాకినట్టుగా ప్రేక్షకుడికి తాకితేనే హిట్టు. లేకుంటే అంతే. చాలాకాలం స్పోర్ట్స్‌ను పట్టించుకోని ఇండియన్ సినిమా నేడు వరుస పెట్టి స్పోర్ట్స్ మూవీలు తీస్తోంది. ఒలింపిక్స్ ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని తీయనుంది కూడా. అసలు ఇంతకు ముందు ఏం స్పోర్ట్స్ మూవీస్ వచ్చాయి.. ఇక మీదట ఏం రానున్నాయి మనకు తెలియాలి... ఎస్... తెలియాలి... జమీందారు కూతురైన హీరోయిన్– బంగ్లా లాన్లో బాడ్మింటన్ బ్యాట్ పట్టుకుని, ఫ్రెండ్స్‌తో రెండు బాల్స్ ఆడి, అప్పుడే కారులో వచ్చిన తండ్రి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘డాడీ’ అనడం వరకే మన సినిమాల్లో ఆటలు కనిపించేవి. సినిమాలో ఆట ఎప్పుడైనా ఒక భాగమే తప్ప ఆటే సినిమా కావడం ఏమిటి ఎవరు చూస్తారు అని మన వాళ్లు ఆ జానర్‌ని ఔట్ చేసి కోర్ట్ బయట ఎప్పుడో కూచోబెట్టారు. కాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆటే కథ. ఆటే క్లయిమాక్స్. ఆటే హీరో. ఆటగాడే హీరో. నీవు లేని నేను లేను శోభన్‌బాబు నటించిన ‘మంచి మనుషులు’లో స్కేటింగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘గంగ–మంగ’ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీ ‘గాలిలో పైరగాలిలో’ అని పాట స్కేటింగ్ చేస్తారు. ‘గండికోట రహస్యం’ సినిమాలో ఎన్.టి.ఆర్ కబడ్డీ ఆడటం, ‘యుగపురుషుడు’లో కరాటే చేయడం తప్ప ఆటల ప్రస్తావన మనకు లేదు. విలువిద్య ఉంది కాని సినిమా విలువిద్యలో ఒకరు ఆగ్నేయాస్త్రం వేస్తే ఒకరు వరుణాస్త్రం వేస్తారు. రెండు ఆకాశంలో గంటసేపు ప్రయాణించి ఢీకొంటాయి. ఇలాంటివి ఒలింపిక్స్ వారు ఒప్పుకోరు. కాలం మారి చిరంజీవి వచ్చి ‘ఇంటిగుట్టు’లో మిక్స్డ్ కబడ్డీ ఆడాడు నళినితో. ఆ తర్వాత ‘విజేత’లో ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా కనిపించాడు. మెల్లగా ఆటల బంతి దొర్లడం మొదలెట్టింది. ఆట మార్చిన అశ్వని 1991లో తెలుగులో ‘అశ్వని’ వచ్చింది. జాతీయ స్థాయిలో పరుగుల రాణిగా నిలిచిన అశ్వని నాచప్ప జీవితం స్ఫూర్తితో ఆమెనే హీరోయిన్గా పెట్టి ‘ఉషాకిరణ్ మూవీస్’ తీసిన ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి తెలుగులో. ఒక పేదింటి అమ్మాయి కూడా క్రీడాకారిణి కావచ్చు అని చెప్పిన కథ ఇది. ఆట నేపథ్యంలో పూర్తి సినిమా తీయవచ్చని నిరూపించింది. కాని ఆ స్థాయి కథ లేదా ఆ వాతావరణం ఏర్పడలేక పోయింది. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌ని నేపథ్యంగా తీసుకుంది. పూరి జగన్నాథ్ వచ్చి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో కూడా అదే కిక్ బాక్సింగ్‌ని తీసుకున్నాడు. హీరో పంచ్ విసిరే ఆటలే ఆటలుగా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈత కొట్టే హీరో కంటే పంచ్ కొట్టే హీరోకు హిట్ కొట్టే చాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’ 2003లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ కథకు ఆటను నేపథ్యంగా తీసుకోవచ్చని మరోసారి గట్టిగా ఇండస్ట్రీకి చెప్పింది. ఇందులో మహేశ్ బాబు కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. దీనికి కొద్దిగా ముందు వచ్చిన శ్రీహరి ‘భద్రాచలం’ తైక్వాన్డును కథగా తీసుకున్నప్పటికీ పూర్తి విజయం మాత్రం ‘ఒక్కడు’ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గానే స్పోర్ట్స్ కథలు కనిపిస్తూ వచ్చాయి. ‘బీమిలి కబడ్డీ జట్టు’ (కబడ్డీ), ‘గోల్కొండ్ హైస్కూల్’ (క్రికెట్), ప్రకాష్ రాజ్ ‘ధోని’ (క్రికెట్), ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ (అథ్లెట్), ‘సై’ (రగ్బీ)... ఇవన్నీ ఆటలను చూపినవే. హీరో నాని క్రికెట్ నేపథ్యంలో ‘జెర్సీ’ చేసి పెద్ద హిట్ అందుకుంటే నాగ చైతన్య కూడా అదే క్రికెట్ నేపథ్యంలో ‘మజిలీ’ చేసి విజయం సాధించాడు. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’లో క్రికెట్, సందీప్ కిషన్ ‘ఏ1ఎక్స్‌ప్రెస్’లో హాకీ ఆటలు ప్రేక్షకుల్ని గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లాయి. అన్నింటికి మించి మహిళా బాక్సింగ్‌ను తీసుకుని వెంకటేశ్ హీరోగా, రితికా మోహన్ సింగ్ హీరోయిన్గా వచ్చిన ‘గురు’, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా మహిళా క్రికెట్‌ను తీసుకుని వచ్చిన ‘కౌసల్యా క్రిష్ణమూర్తి’, మహిళా ఫుట్‌బాల్‌ను తీసుకుని విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్’ క్రీడల్లోనే కాదు సినిమాల్లో కూడా మహిళల విజయాన్ని చూపించాయి. వరుస కట్టిన సినిమాలు ఇక మీదట కూడ బోలెడు స్పోర్ట్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా ‘గుడ్‌లక్ సఖీ’ (షూటింగ్), నాగ శౌర్య హీరోగా ‘లక్ష్య’ (విలువిద్య) రానున్నాయి. ఇవి కాకుండా కోడి రామ్మూర్తి, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి, విశ్వనాథన్ ఆనంద్‌ల బయోపిక్‌లు వరుసలో ఉన్నాయి. ఇక తమిళం నుంచి డబ్ అయిన తాజా సినిమా ‘సార్పట్టా’ కాలం వెనక్కు వెళ్లి మన దేశీయులు ఆడిన బాక్సింగ్‌లో పల్లె పౌరుషాలు పట్టుదలలు ఏ విధంగా ఉంటుందో చూపింది. అసలు గతాన్ని తవ్వుకుంటూ వెళితే ఎన్ని స్పోర్ట్స్ డ్రామాలు దొరుకుతాయో కదా. ఓడటం తెలిసినవాడే గెలవడం నేరుస్తాడు. ఆటల్లో ఉంటేనే ఓడటం గెలవడం ఓడినా గెలిచినా సాధన కొనసాగించడం తెలుస్తాయి. మనిషిని మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దడంలో ఆటను మించింది లేదు. ఆటలో ఉండే ఉద్వేగం కూడా మనిషిని ఆకర్షిస్తుంది. సెల్‌ఫోన్‌ను అంటుకుపోతున్న నేటి తరాన్ని క్రీడామైదానం వైపు తరమాలంటే బయట, బడులలో, సినిమాల్లో ఎంత క్రీడా వాతావరణం కనిపిస్తే అంత మేలు. క్రీడలకు జయం. ఒలింపిక్స్‌లో ఉన్న భారతీయులకు జయం. ఈ ఒలింపిక్స్ జరిగినన్నాళ్లు అంతటా క్రీడా వాతావరణమే ఉంటుంది. ఒకవైపు ఆటలూ చూడొచ్చు. చూడని స్పోర్ట్స్ సినిమాలనూ చూడొచ్చు. నిజంగా ఇది క్రీడా వీక్షణ సమయమే. ‘లగాన్’ నుంచి సిక్సర్లే 2001లో ఏ ముహూర్తాన బాలీవుడ్లో ‘లగాన్’ వచ్చిందో అక్కడ స్పోర్ట్స్ సినిమాలు హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాయి. బ్రిటిష్ కాలమేంటి... అక్కడ పన్ను పెంచడమేంటి... దానిని ఎదుర్కొనడానికి పల్లెటూరివాళ్లు బ్రిటిష్ వారితో క్రికెట్ ఆడటం ఏంటి... అసలా కథను తీయడం ఎలా సాధ్యం. దర్శకుడు అశితోష్ గొవారికర్ తీశాడు. సినిమా దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించింది. మన తెలుగువాడు నగేశ్ కుకునూర్ మూగ, చెవిటి ఆటగాడి కథను తీసుకుని అద్భుతంగా తీసిన ‘ఇక్బాల్’ ఒక గ్రామీణ క్రికెట్ బౌలర్ కథను చెప్పింది. ఆ తర్వాత మహిళా హాకీని తీసుకు షారూక్ ఖాన్ ‘చక్‌దే ఇండియా’ తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. వయసు మీరిన కోచ్ పాత్రలో షారూక్ కనిపించడానికి సిద్ధమయ్యి మరీ హిట్ కొట్టాడు. పరుగుల నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘పాన్‌సింగ్ తోమార్’, మిల్కా సింగ్ ఆత్మ కథ ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీ కోమ్’, ‘ధోని’, ‘సైనా’, ‘సుల్తాన్’... ఇవన్నీ ఉద్వేగపూరిత క్రీడా అనుభవాన్ని ఇచ్చాయి. మహిళా కుస్తీ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ రికార్డుల చరిత్రను తిరగరాసింది. ఇక 1983 వరల్డ్ కప్ నేపథ్యలో ‘1983’ రానుంది. ఫర్హాన్ ఖాన్ బాక్సర్‌గా ‘తూఫాన్’ తాజాగా విడుదలైంది. మిథాలి రాజ్ బయోపిక్ ‘శభాష్ మితూ’ వరుసలో ఉంది. ‘మైదాన్’ (ఫుట్‌బాల్) కూడా. -
ఈ సీన్స్ కోసం వెయ్యిమంది సెట్లో ఉండాలి : విజయ్ దేవరకొండ
‘లైగర్’ సినిమా సెట్స్‌లోకి త్వరలోనే అడుగుపెట్టనున్నారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియన్ మూవీలో అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్రధారి. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ముంబయ్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ‘లైగర్’ సినిమా చిత్రీకరణ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మా సినిమా చిత్రీకరణ 65 శాతం పూర్తయింది. తల్లి, కొడుకులకు సంబంధించిన సెంటిమెంట్ సీన్స్‌ను కూడా దాదాపు పూర్తి చేశాం. కానీ క్లైమ్యాక్స్ సన్నివేశాల చిత్రీకరణకు దాదాపు వెయ్యిమంది సెట్స్‌లో ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో చిత్రీకరణ అంటే కొంత రిస్క్‌తో కూడుకున్న పని. ‘లైగర్’ లాంటి భారీ సినిమా చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సవాల్ అనే చెప్పాలి. అలాగే కరోనా థర్డ్ వేవ్ అవకాశాలను కూడా ఆలోచించి చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
లైగర్‌కు ఓటీటీ భారీ ఆఫర్: స్పందించిన విజయ్
విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం "లైగర్". 'సాలా క్రాస్‌బీడ్' అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్‌కు జోడీగా నటిస్తోంది. చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఫిల్మీదునియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. లైగర్ చిత్రాన్ని సొంతం చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ చర్చలు జరుపుతోందట. ఈ మేరకు రూ.200 కోట్లు ఇచ్చేందుకు సుముఖుంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ ఆఫర్ నచ్చడంతో నిర్మాతలు సదరు ఓటీటీకి రెండు వందల కోట్లకే డిజిటల్, శాటిలైట్ హక్కులను అమ్మేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై రౌడీ హీరో విజయ్ స్పందించాడు. ఇది చాలా చిన్న మొత్తమని పెదవి విరిచాడు. థియేటర్లలో దీని కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబడతానని చెప్పుకొచ్చాడు. మాస్ కమర్షియల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: అదీ విజయ్ క్రేజ్! ఆలిండియాలో సెకండ్ ప్లేస్ -
బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న హీరోలు
తెరపై విలన్ ముఖం మీద హీరో ఒక్క కిక్ ఇస్తే.. చూసే ఆడియన్స్‌కి ఓ కిక్. హీరో వరుసగా కిక్‌ల మీద కిక్‌లు కొడుతుంటే.. ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. కొందరు హీరోలు ఆ కిక్ ఇవ్వనున్నారు. బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న ఆ హీరోల గురించి తెలుసుకుందాం. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ కోసం బాక్సర్ అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు విజయ్. దీంతో ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ ఎపిసోడ్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ షూటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ఆరంభించనున్నారు. ఇక తొలి స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’ చేస్తున్నారు వరుణ్ తేజ్. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. లాక్డౌన్ సమయాల్లో తన సమయం అంతా బాక్సింగ్ ప్రాక్టీస్‌తోనే గడిచిపోయిందని వరుణ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి ‘గని’లో వరుణ్ నుంచి సాలిడ్ బాక్సింగ్ సీన్స్‌ను ఆశించవచ్చు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 2013లో హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అథ్లెట్‌గా కనిపించారు ఫర్హాన్. ఇప్పుడు ‘తుఫాన్’ కోసం వీరి కాంబినేషన్ రిపీటైంది. అయితే ‘తుఫాన్’లో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 16 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అటు తమిళ హీరో ఆర్యను బాక్సింగ్ రింగులో దింపారు ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘సారపటై్ట పరంపర’లో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్య శిక్షణ కూడా తీసుకున్నారు. 1980 కాలంలోని బాక్సింగ్ కల్చర్‌ను ఈ సినిమాలో చూపించనున్నారు రంజిత్. ‘బ్రూస్లీ, సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో ‘బాక్సర్’ తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్ ఓ హీరోయిన్. ‘గురు’లో బాక్సర్‌గా కనిపించిన రితికా ఈ సినిమాలోనూ ఆ పాత్ర చేశారు. ఆమె నిజంగా కూడా బాక్సర్ అనే విషయం తెలిసిందే. ఇటు సౌత్ అటు నార్త్‌లో ఈ బాక్సర్లు కొట్టే కిక్‌లకు వసూళ్ల కిక్ ఖాయం అనే అంచనాలున్నాయి. -
రికార్డులకెక్కిన విజయ్ ‘లైగర్’ ఫస్ట్ లుక్
విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’ ఫస్ట్ లుక్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అత్యధిక లైక్‌లు రాబట్టుకుని దక్షిణాది చిత్రాల్లో తొలి ఫస్ట్‌లుక్ పోస్టర్‌గా నిలిచింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 2 మిలియన్లకు పైగా లైక్స్‌ను సాధించి రికార్డు సృష్టించింది. కాగా ఇప్పటికే ఈ మూవీలో విజయ్ సరికొత్త లుక్కు సూపర్ రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ‘లైగర్’ కోసం విజయ్ పూర్తిగా తన లుక్‌ను మేకోవర్ చేసుకున్నాడు. మాస్ కమర్షియల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ‘లైగర్’ మూవీ సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో అనన్య టాలీవుడ్‌కు పరిచయం కానుంది. #LIGER 🥊 Is Now The Most Liked First Look Poster From SOUTH INDIA in Instagram @TheDeverakonda | #PuriJagannadh #LigerSouthMostLikedFLOnInsta@PuriConnects pic.twitter.com/ulZwDsXXA0 — BARaju's Team (@baraju_SuperHit) June 19, 2021 చదవండి: Liger Movie: ఆసక్తిరేపుతున్న క్లైమాక్స్ సీన్ అప్డేట్! -
Vijay Devarakonda: ‘రౌడీ’ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇప్పట్లో కష్టమే!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్యాన్స్‌కి తీవ్ర నిరాశ ఎదురైంది. విజయ్ దేవరకొండ బర్త్‌డే నేడు(మే 09). ఈ సందర్భంగా విజయ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ నుంచి టీజర్ వస్తుందని ‘రౌడీ’ ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. మే 9న లైగర్ పవర్ ప్యాక్ట్ టీజర్ రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కాని ఈ సంక్షోభ సమయంలో టీజర్ విడుదల చేయడం కన్నా, వాయిదా వేయడమే మంచిదనిపించింది. . త్వరలోనే మరో కొత్త తేదీతో మీ ముందుకు వస్తాం. మేము మీకు మాటిచ్చినట్లుగానే విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. ఆయన లుక్స్, డైలాగ్స్ పట్ల మీరు నిరాశ చెందే అవకాశం ఉండదు. దయచేసి ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి. శుభ్రత పాటించండి. మీ వాళ్లని ఆరోగ్యంగా చూసుకోండి. వ్యాక్సిన్ వేయించుకోండి. ధైర్యంగా ఉండండి’ అని చిత్ర యూనిట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక లైగర్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్నఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ సినిమాలో ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
విజయ్ను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్..రీజన్ అదే!
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. 'లైగర్’ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరీ జగన్నాద్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా పూర్తవగానే విజయ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించనున్నట్లు బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే కత్రినా తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో విజయ్‌ని ఫాలో అవుతుందని ప్రచారం సాగుతోంది. ఇటీవలె ఆమె న్యూ డే.. న్యూ హెయిర్ కట్.. న్యూ ఫిలిమ్’అంటూ పెట్టిన ఓ పోస్టు కూడా విజయ్ సినిమా గురించే అన్న సందేహామూ ఫ్యాన్స్‌లో కలుగుతోంది. ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్ 80 శాతం దాకా పూర్తయ్యింది. ముంబైలో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా కరోనా కారణంగా బ్రేక్ పడింది. మరోవైపు కత్రినా కూడా ‘ఫోన్ బూత్’ అనే సినిమాలో నటిస్తుంది. ఇద్దరూ వారి వారి షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ సినిమాలు పూర్తవగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంని సమాచారం. విజయ్-కత్రినాల సినిమాను కూడా కరణ్‌జోహార్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేస్తుంది.. -
బర్త్‌డేకి బహుమతి
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ నెల 9 ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు విజయ్ దేవరకొండ బర్త్‌డే. ఈ సందర్భంగా అభిమానులకు ఓ ప్రత్యేకమైన బహుమతిని సిద్ధం చేయిస్తున్నారట విజయ్. ఆ రోజున విజయ్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘లైగర్’కి చెందిన ఓ స్పెషల్ వీడియో విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వీడియో కుదరకపోతే ‘లైగర్’కి సంబంధించి ఏదొ ఒక అప్డేట్ అయినా వస్తుందనే ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చార్మి నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ చిత్రీకరణ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడే అవకాశం ఉంది. -
విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేస్తుంది..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ భామ అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. ఈ చిత్రాన్ని మాస్ దర్శకుడు పూరీ జగన్నాద్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం క్రితమే ఈ మూవీని అనౌన్స్ చేసినా కరోనా కారణంగా లైగర్ ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం షరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై వస్తోన్న అప్డేట్స్ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా విజయ్ ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ రానుంది. ఈనెల 9న విజయ్ బర్త్‌డే సందర్భంగా లైగర్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లుఘో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మూవీ టీం భావిస్తుంది. ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. చదవండి : రష్మికను డిన్నర్ డేట్‌కి తీసుకెళ్లిన విజయ్.. ఫోటోలు వైరల్ ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక -
విజయ్ దేవరకొండ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ భామ అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. ఈ చిత్రాన్ని మాస్ దర్శకుడు పూరీ జగన్నాద్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన కొన్ని అప్‌డేటస్ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన మరో అప్డేట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేగాక నిర్మాత కరణ్ జోహార్, చార్మీలు సైతం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. మంగళవారం కరణ్ జోహార్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్, ఆయన టీమ్‌ను ‘లైగర్’ సినిమా కోసం ఎంపిక చేశామని మీతో చెప్పడానికి చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాం. గతంలో జాకీ చాన్ లాంటి ప్రముఖ నటులకు ఆయన కొరియోగ్రఫి అందించారు. అలాంటి ఆయన మా సినిమాకు పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. అంతేగాక ఈ ట్వీట్‌కు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీల ఫొటోను జత చేశాడు. ఇక హాలీవుడ్లో టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అండీ లాంగ్ అసలు పేరు ఆండ్రియాస్ నుయెన్. జాకీ ఛాన్ నటించిన ‘ఆర్మూర్ ఆఫ్ గాడ్ 3’, ‘చైనీస్ జోడాయిక్’, ‘పోలీస్ స్టోరీ 2013’, ‘డ్రాగన్ బ్లేడ్’ చిత్రాలకు ఆయన పనిచేశారు. 2006లో ‘మ్యాగ్ ఫైటర్స్ అనే స్టంట్ టీమ్‌ను ప్రారంభించారు. కాగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతుంది. ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Thrilled to have the famous Hollywood stunt choreographer #AndyLong & team, who have previously choreographed the powerful moves for Jackie Chan and many other films, onboard for #LIGER! Some action packed moves are on the way!!@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh pic.twitter.com/3WhOARa4EI — Karan Johar (@karanjohar) April 6, 2021 -
బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీ మూడ్‌లో లైగర్: వైరల్ పిక్స్
సాక్షి, ముంబై: తన అప్‌కమింగ్ మూవీ ‘లైగర్’ తో షూటింగ్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ పార్టీ మూడ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో మకాం వేసిన లైగర్ టీం, అర్జున్‌రెడ్డి బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి లీజర్ టైంలో పార్టీ చేసుకుంటోంది. షూటింగ్ విరామంలో రౌడీతోపాటు, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, సారా అలీ ఖాన్‌తో సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న లైగర్ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మీ, పూరీలతో కలిసి నిర్మిస్తున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ తెరకెక్కించే లైగర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లైగర్ మూవీ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఫైల్ ఫోటో) -
ప్రముఖ క్యాలెండర్ షూట్లో విజయ్ దేవరకొండ
ముంబై : టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. 'లైగర్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న విజయ్..ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ షూట్లో తొలిసారిగా పాల్గొన్నాడు. ప్రతీ ఏడాది ప్రముఖ స్టార్ హీరో, హీరోయిన్లతో డబూ రత్నాని కాలెండర్ షూట్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐశ్వర్యరాయ్, కియారా అద్వానీ, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ , అభిషేక్ బచ్చన్ వంటి పాపులర్ స్టార్స్ డబూ రత్నాని ఫోటోలకు ఫోజులివ్వగా, ఈ ఏడాది 2021 కాలెండర్ షూట్లో విజయ్ హ్యాండ్సమ్గా కనిపించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ పూర్తి చేసినట్లు డబూ రత్నాని తెలిపారు. ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘లైగర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చార్మీ, కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో సెప్టెంబర్ 9న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వాల్లో విజయ్ దేవరకొండ నటించనున్నారు. చదవండి (ఫ్యాన్ మూమెంట్: విజయ్‌తో సారా సెల్పీ) (బాలీవుడ్ హీరోయిన్లతో విజయ్ దేవరకొండ పార్టీ!) #btswithdabboo 🖤❤️👌🏼✨ Phenomenal Debut Shot of @TheDeverakonda for #dabbooratnanicalendar 2021 ✨ @DabbooRatnani @ManishaDRatnani Makeup VeerababuChuman Hair NagireddyChinnapureddy Trainer KuldeepSethi Styling harmann Prop @indiatriumph Prod @Dabboo #VijayDevarakonda pic.twitter.com/lnwKaWlg6z — Dabboo Ratnani (@DabbooRatnani) February 23, 2021 -
విజయ్ దేవరకొండ సినిమా డేట్ ఫిక్స్
‘లైగర్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ బాక్సర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వా మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబయ్‌లో గురువారం మొదలైంది. ‘‘ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. విజయ్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలియజేసింది. -
రౌడీ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్..‘లైగర్’వచ్చేస్తున్నాడు
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అందించింది చార్మి. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న లైగర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళంభాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 'లైగర్' కొత్త పోస్టర్ షేర్ చేసిన చార్మీ.. 'సెప్టెంబర్ 9వ తేదీ నుంచి మీ దగ్గర్లోని థియేటర్స్‌లో పంచ్ ప్యాక్' అని పేర్కొన్నారు. ఇక తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో విజయ్ దేవరకొండ హై వోల్టేజ్ పంచ్ లుక్కుతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా, తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. చార్మీ, కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కి బాలీవుడ్ భామ అనన్య పాండే జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. Packing a punch in theatres near you on 9th September 2021 A worldwide theatrical release of #Liger in Hindi,Telugu,Tamil,Kannada & Malayalam.#Liger9thSept#PuriJagannadh @TheDeverakonda @ananyapandayy @karanjohar @apoorvamehta18 @DharmaMovies @PuriConnects ❤️ pic.twitter.com/6m2YxDma4b — Charmme Kaur (@Charmmeofficial) February 11, 2021 -
రెడీ టు యాక్షన్
ముంబయ్‌లో కొత్త షెడ్యూల్‌ను ఆరంభించే పనిలో బిజీగా ఉన్నారు ‘లైగర్’ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘లైగర్’. సాలా క్రాస్ బీడ్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు. ‘లైగర్’ సినిమా కొత్త షెడ్యూల్ ముంబయ్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజులు ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుందట. మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది టీమ్.