హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్ షణ్ముక ప్రియకు పాట పాడే అవకాశం కల్పించాడు. తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరిస్తూ..ఇండియన్ ఐడల్ సీజన్ 12లో మెరిసింది షణ్ముఖ ప్రియ. ఇటీవల షో నిర్వహకుల విజ్ఞప్తి మేరకు లైవ్‌లో జూమ్ ద్వారా షణ్ముకతో మాట్లాడిన విజయ్ గెలిచినా, ఓడినా అవకాశం ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయ్ తన హామీని నిలబెట్టుకున్నాడు. ఇండియన్ ఐడల్ 12 సీజన్‌లో షణ్ముక టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరుగా నిలిచి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ షణ్ముక ట్రోఫి మాత్రం గెలుచుకోలేకపోయింది. అయితే ఇటీవల ఈ షో ముగియడంతో తన స్వస్థలం విశాఖపట్నం చేరుకుంది.
చదవండి: నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ
ఇక ఇటీవల వైజాగ్ చేరుకున్న షణ్ముక సోమవారం విజయ్‌ను కలిసింది. తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో విజయ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో విజయ్ ఆమెతో తనిష్క్ బాఘ్చి మ్యూజిక్ కంపోజిషన్‌లో ప్రియ పాట పాడించాడు. అయితే తుది మిక్సింగ్ అయిపోయిన తర్వాత పాటను వినాలని షణ్ముఖకు చెప్పాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తల్లి షణ్ముకను శాలువతో సత్కరించి చీరలు, ఇతర బహుమతులు అందజేసింది. రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment