Vijay Deverakonda To Resumes Liger Shooting In Mumbai - Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌ రింగ్‌లోకి..విజయ్‌ దేవరకొండ

Published Sat, Sep 4 2021 5:26 AM | Last Updated on Sat, Sep 4 2021 10:38 AM

Vijay Deverakonda Resume The Shoot Of Liger - Sakshi

విజయ్‌ దేవరకొండ 

గోవాలో బాక్సింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్‌’లో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్‌ కారణంగా బ్రేక్‌ పడిన ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ఆరంభం కానుంది. గోవాలో నెల రోజుల షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారట. వచ్చే వారం చిత్రబృందం గోవా ప్రయాణం కానుందని సమాచారం. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరి చయం కానున్నారు. ఈ ప్యాన్‌ ఇండియా మూవీని చార్మీ, కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే ఈ చిత్రం ఈ నెల విడుదలయ్యుండేది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement