
సాక్షి, ముంబై: తన అప్‌కమింగ్ మూవీ ‘లైగర్’ తో షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ పార్టీ మూడ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో మకాం వేసిన లైగర్ టీం, అర్జున్‌రెడ్డి బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి లీజర్ టైంలో పార్టీ చేసుకుంటోంది. షూటింగ్ విరామంలో రౌడీతోపాటు, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, సారా అలీ ఖాన్‌తో సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న లైగర్ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మీ, పూరీలతో కలిసి నిర్మిస్తున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ తెరకెక్కించే లైగర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లైగర్ మూవీ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
(ఫైల్ ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment