KaranJohar
-
దివాళీ బాష్‌లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్
కుచ్ కుచ్ హోతా హై ఫేమ్ సనా సయీద్ న్యూయర్ వేళ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. లాస్ ఏంజిల్స్‌లో తన ప్రియుడు సబా వాగ్నర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది బాలీవుడ్ భామ. కరణ్ జోహార్ నిర్మించిన 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రంలో షారూఖ్, రాణి కుమార్తెగా అంజలి పాత్రలో సనా కనిపించింది. ఆమె తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ లవ్ సింబల్‌తో ఎంగేజ్మెంట్ గుర్తుగా రింగ్‌ను జతచేసింది. ఆమె పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే పలువురు ప్రముఖులు ఈ జంటను కంగ్రాట్స్ తెలిపారు. సనా కెరీర్..: కాగా.. కాజోల్, రాణి ముఖర్జీ కూడా నటించిన కరణ్ జోహార్ చిత్రంలో సనా షారూఖ్ కుమార్తెగా అంజలి పాత్రను పోషించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో తర్వాత రాణి ముఖర్జీతో కలిసి మరో చిత్రంలో నటించింది. ఆ తర్వాత కరణ్ జోహార్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లోనూ కనిపించింది. ఈ చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. 2012 చిత్రం తర్వాత, సనా అనేక టెలివిజన్, రియాల్టీ షోలలో కూడా కనిపించింది. సబా వాగ్నర్ ఎవరు?:సనా ప్రియుడు సబా వాగ్నర్ ఒక సౌండ్ డిజైనర్. అతను లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నాడు. అతను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో సనాతో ఉన్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటాడు. View this post on Instagram A post shared by Sana Saeed (@sanaofficial) -
బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీ మూడ్‌లో లైగర్: వైరల్ పిక్స్
సాక్షి, ముంబై: తన అప్‌కమింగ్ మూవీ ‘లైగర్’ తో షూటింగ్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ పార్టీ మూడ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో మకాం వేసిన లైగర్ టీం, అర్జున్‌రెడ్డి బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి లీజర్ టైంలో పార్టీ చేసుకుంటోంది. షూటింగ్ విరామంలో రౌడీతోపాటు, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, సారా అలీ ఖాన్‌తో సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న లైగర్ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మీ, పూరీలతో కలిసి నిర్మిస్తున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ తెరకెక్కించే లైగర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లైగర్ మూవీ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఫైల్ ఫోటో) -
మాధవన్ అవుట్.. సోనూసూద్ ఇన్
సాక్షి, ముంబై : రణవీర్‌సింగ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న టెంపర్ రీమేక్ ‘ సింబా’ కోసం మరో నటుడి ఎంపిక పూర్తయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన సోనూసూద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ‘ నేను సింబాలో పోషించబోయే పాత్ర గురించి చెప్పను. కానీ అదొ ఛాలెజింగ్ రోల్. నా గత చిత్రాల కంటే విభిన్నంగా ఆ పాత్ర ఉంటుంది. సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఆ పాత్ర గురించే మాట్లాడుకుంటారు’ అని సోనూసూద్ ప్రకటించారు. కాగా, మొదటగా ఈ పాత్ర కోసం తమిళ నటుడు మాధవన్‌ను ఎంపిక చేశారు. అయితే భుజానికి గాయం కావటంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా.. ఆ అవకాశం సోనూసూద్‌కు దక్కింది. రోహిత్ శెట్టి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సింబా ను కరణ్‌జోహార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రణ్వీర్ సరసన కథానాయికగా సైఫ్ అలీఖాన్ కూతురు సారా నటించనుంది. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మొదలుకానుంది. పద్మావత్ సక్సెస్‌తో జోరుమీదున్న రణ్‌వీర్‌సింగ్, మాస్ మసాలా చిత్రాలకు పెట్టింది పేరైన రోహిత్ శెట్టి, భారీ స్థాయి సినిమాలను నిర్మించే కరణ్ జోహర్.. ఈ ముగ్గురి కలయికలో వస్తున్న ‘ సింబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. Hey folks .. So I am a huge crazy fan of Rohit Shetty and his films. As is my son. It breaks both our hearts that I’m not able to be a part of this film because of my injury. I’m well on my way to recovery but this is a huge opportunity and excitement lost.🙈🙈 https://t.co/9YJBctaCJI — Ranganathan Madhavan (@ActorMadhavan) 25 March 2018 -
రెండు రాష్ట్రాల్లో శేష్
50 కోట్లతో తీసిన సినిమా 150 కోట్లు వసూలు చేస్తే తీసినవాళ్లకు, కొన్నవాళ్లకు పండగే పండగ. హిందీ చిత్రం ‘2 స్టేట్స్’ చిత్రనిర్మాత కరణ్ జోహార్‌కు, కొన్నవాళ్లకు అలాంటి బంపర్ ఆఫరే ఇచ్చింది. ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుందని, నాగచైతన్య–సమంత కలిసి నటించబోతున్నారని, టెస్ట్‌షూట్ జరిగిందని ఆ మధ్య ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకున్నారు. అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి అవి వదంతులేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో అడవి శేష్ నటించనున్నారట. ‘క్షణం’ ‘అమీ తుమీ‘ వంటి హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న శేష్ రీసెంట్గా ఈ రీమేక్‌కు సైన్ చేశారు. కొత్త దర్శకుడు వెంకట్ రెడ్డి తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ‘గూఢచారి’ సినిమా చేస్తున్నారు శేష్. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్‌కి రిలీజ్ కానుంది. ‘గూఢచారి’ పూర్తయ్యాక ఈ రీమేక్ మొదలవుతుందట. -
ఇట్టేఫాక్ ప్రచార కార్యక్రమంలో షారూఖ్
-
మిల్కీబ్యూటీ కల నెరవేరేనా?
తమిళసినిమా: నటి తమన్నా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఒక రౌండ్ చుట్టేశారు. ప్రస్తుతం ఈ మూడు భాషల్లోనూ నటిస్తూ బీజీగానే ఉన్నారు. అయితే తనకు తీరని కోరిక మిగిలే ఉందట. తమన్నా విక్రమ్‌తో కలిసి నటిస్తున్న స్కెచ్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా యువ నటుడు సందీప్‌కిషన్ సరసన ద్విభాషా చిత్రంలో, హిందీ చిత్రం తెలుగు రీమేక్‌లోనూ నటిస్తున్నారు. అదే విధంగా కామోష్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో నయనతార నటిస్తున్న కోలైయూధీర్ కాలం చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఇదే తమన్నా చిరకాల కలకు ఊపిరి పోసిందంటున్నారు ఈ బ్యూటీ. తమన్నా ఇంతకు ముందు తన మాతృభాష హిందీలో హిమ్మత్వాలా, ఎంటర్టెయిన్మెంట్ చిత్రాల్లో నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో మాతృభాషలో సక్సెస్ఫుల్ నాయకి అనిపించుకోలేకపోయ్యింది ఈ బ్యూటీ. అయితే ఇదికాదు తమన్నా చింత. దర్శకుడు కరణ్ జోహార్ చిత్రాలను చూస్తూ తాను ఎదిగానని, అయన దర్శకత్వంలో ఒక్క చిత్రంలోనైనా నటించాలన్నది తన డ్రీమ్ అని పేర్కొన్నారు. కొలైయుధీర్ కాలం చిత్రంతో కరణ్‌జోహార్ దర్శకత్వంలో నటించాలన్న కల నెరవేరుతుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నానని తమన్నా పేర్కొన్నారు. -
రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మరో అప్డేట్..!
బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి, తరువాత చేయబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరోసారి భారీగా మహాభారత గాథను తెరకెక్కిస్తాడన్న ప్రచారం జరిగినా.. రాజమౌళి, ఆ వార్తలను ఖండించాడు. ఆ తరువాత రాజమౌళి నెక్ట్స్ సినిమా హీరో.. అంటూ చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. ఈ లిస్ట్‌లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తారలు కూడా ఉన్నారు. ప్రముఖంగా ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా ఉంటుదన్న టాక్ బలంగా వినిపించింది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బాహుబలి సినిమాకు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న కరణ్ జోహర్ తొలి భాగం రిలీజ్ తరువాత ప్రభాస్‌ను ఓ బాలీవుడ్ సినిమా చేయమని అడిగాడట. ప్రభాస్ కూడా స్ట్రయిట్ హిందీ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుండటంతో ఆ సినిమాను రాజమౌళి దర్శకత్వంలోనే తెరకెక్కించేందుకు ట్రై చేస్తున్నాడు కరణ్. ప్రభాస్ ఇప్పటికే సుజిత్ సినిమాను స్టార్ చేసేశాడు. అంటే రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుంది. మరి అప్పటి వరకు రాజమౌళి వెయిట్ చేస్తాడా.. లేక మరో హీరోతో సినిమా చేసి ప్రభాస్ హిందీ ప్రాజెక్ట్‌ను తరువాత చేస్తాడా.? అన్న విషయం తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఆ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించం
-
ఆ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించం
ముంబై: బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, సహా కొందరు నిర్మాతలకు థియేటర్ యజమానులు షాకిచ్చారు. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించరాదని యజమానులు నిర్ణయించారు. విడుదలకు సిద్ధమైన కరణ్ జోహార్ తాజా చిత్రం ఏ దిల్ హై ముష్కిల్లో రణవీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు. ఈ సినిమాలో ఫవాద్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానులు నిర్ణయించడంతో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కష్టాల్లో పడింది. గుజరాత్, గోవా, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ సినిమాపై నిషేధం విధించారు. జమ్ము కశ్మీర్లో ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదదాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ దాడులు తర్వాత పాక్ నటీనటులపై భారతీయ నిర్మాతల మండలి నిషేధం విధించింది. అంతేగాక పాక్ నటులకు అవకాశం ఇవ్వరాదని, ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఎంఎన్ఎస్ హెచ్చరించింది. తాజాగా పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో కరణ్ జోహార్ సహా బాలీవుడ్ నిర్మాతలు కొందరు ఇరకాటంలో పడ్డారు. -
మాజీ ప్రియుడితో మళ్లీ?
గాసిప్ రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ అయ్యాక, సల్మాన్‌ఖాన్‌తో కత్రినా కైఫ్ మునుపటి స్నేహాన్ని మళ్లీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత బంధాన్ని మాత్రమే కాదు.. వృత్తిపరమైన బంధాన్ని కూడా ఆమె కొనసాగించాలనుకుంటున్నారట. మళ్లీ ఈ కండలవీరుడితో సినిమాలు చేయాలనుకుంటున్నారని సమాచారం. సల్మాన్ కూడా క్యాట్‌తో జతకట్టడానికి ఉత్సాహంగా ఉన్నారట. తన తదుపరి చిత్రాల్లో కత్రినా కైఫ్‌ను కథానాయికగా తీసుకోమని దర్శక-నిర్మాతలతో అంటున్నారట. అనడమే కాదు.. ఒత్తిడి చేస్తున్నారని కూడా వినికిడి. తాజాగా ఆయన దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌తో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో ఎలాగైనా కత్రినాను కథానాయికగా చేయించాలని సల్మాన్ అనుకున్నారట. కరణ్ జోహార్ కూడా అందుకు సిద్ధపడ్డారని భోగట్టా. చివరి నిముషంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. సడన్‌గా తెరపైకి జాక్వెలిన్ ఎందుకు వచ్చింది? అనే విషయం బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఆ పాత్రకు కత్రినా సూట్ కాదని సల్మాన్‌ని కరణ్ ఒప్పించి ఉంటారా? అనే దిశగా చర్చలు సాగుతున్నాయి. మరి.. కథానాయికగా ఎవరు నటిస్తారు? అనేది కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. -
మేకప్ ఖర్చు కోటి పైనే...
ఓ 60, 70 ఉంటుందనుకుంటున్నారా...అయితే ఈ ఫొటో చూడండి. బట్టతలతో, కళ్ల జోడుతో, ముడుతలు పడిన మొహంతో కనిపిస్తున్న రిషికపూర్‌ను లుక్ చూసే కాకుండా దాని కోసం అయిన ఖర్చు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. షకున్ బాత్రా దర్శకత్వంలో కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్థార్థ్ రాయ్ మల్హోత్రా, ఆలియాభట్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న రిషికపూర్ మేకప్ కోసమే దర్శకనిర్మాతలు రూ. 1.5 కోట్లు నుంచి 1.75 రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలు ‘ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బుట్టో’, ‘డ్రాకులా’ చిత్రాలకు మేకప్‌మ్యాన్‌గా పనిచేసిన గ్రెగ్ కానమ్ రిషికపూర్ కొత్త లుక్కు రూపం ఇచ్చారు. దీని గురించి రిషికపూర్ మాట్లాడుతూ- ‘‘ప్రతి రోజూ ఐదు గంటల పాటు ఈ మేకప్ కోసం కేటాయించాల్సి వచ్చేది. కరణ్, షకున్లు ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు కాస్త సందేహించాను. ఖర్చు కూడా ఎక్కువే. కానీ వాళ్లు మాత్రం వెనుకాడలేదు. నాకైతే మేకప్ కోసం అంత సేపు కష్టమనిపించింది. కానీ మేకప్ వేసుకున్నాక మాత్రం నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను’’ అని చెప్పారు. -
ట్వీట్స్
‘బాహుబలి’ని హిందీలో కరణ్ జోహార్ సమర్పిస్తూ, విడుదల చేస్తున్నారు. ఆయనతో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం ఆనందంగా సాగుతుందని ఆశిస్తున్నాను. - ఎస్.ఎస్. రాజమౌళి ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు -
కరణ్ జోహార్‌కు బెదిరింపులు
ముంబై: ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్‌కు, రవి పుజారీ ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ప్రముఖులను బెదిరిస్తూ ఈ ముఠా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. డబ్బులు ఇవ్వాల్సిందిగా కరణ్‌కు శనివారం ఉదయం కరణ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి సంక్షిప్త సందేశం వచ్చింది. అయితే ఎంత ఇవ్వాల్సిందిగా బెదిరించారనే విషయాన్ని పోలీసులు వెల్లడించడంలేదు. పంపిన వ్యక్తి మాత్రం రవి పుజారీ ముఠాకు చెందినవాడని మాత్రమే చెప్పారు. అంతర్జాలం నుంచి సందేశం పంపడంతో ఆగంతకుడిని గుర్తించడం కష్టంగా మారిందన్నారు. దీంతో కరణ్ ఇంటివద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇటీవలే నిర్మాత బోనీకపూర్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇలా సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడంతో పరిశ్రమలో నటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా కొనసాగుతున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.