
50 కోట్లతో తీసిన సినిమా 150 కోట్లు వసూలు చేస్తే తీసినవాళ్లకు, కొన్నవాళ్లకు పండగే పండగ. హిందీ చిత్రం ‘2 స్టేట్స్’ చిత్రనిర్మాత కరణ్ జోహార్‌కు, కొన్నవాళ్లకు అలాంటి బంపర్ ఆఫరే ఇచ్చింది. ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుందని, నాగచైతన్య–సమంత కలిసి నటించబోతున్నారని, టెస్ట్‌షూట్ జరిగిందని ఆ మధ్య ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకున్నారు.
అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి అవి వదంతులేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో అడవి శేష్ నటించనున్నారట. ‘క్షణం’ ‘అమీ తుమీ‘ వంటి హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న శేష్ రీసెంట్‌గా ఈ రీమేక్‌కు సైన్ చేశారు. కొత్త దర్శకుడు వెంకట్ రెడ్డి తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ‘గూఢచారి’ సినిమా చేస్తున్నారు శేష్. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్‌కి రిలీజ్ కానుంది. ‘గూఢచారి’ పూర్తయ్యాక ఈ రీమేక్ మొదలవుతుందట.
Comments
Please login to add a commentAdd a comment