Adivi Sesh Reacts To Netizen Tweet On Samantha In HIT 3, See Her Response - Sakshi
Sakshi News home page

HIT 2 Movie: హిట్‌ 3లో సమంత? ఐడియా అదిరిందన్న అడివి శేష్‌

Published Fri, Dec 2 2022 9:39 PM | Last Updated on Sat, Dec 3 2022 9:27 AM

Is Samantha To Join HIT Universe, Tweet Goes Viral - Sakshi

అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్‌ 2. నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీకి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 2న) థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

ఇకపోతే హిట్‌ సిరీస్‌ను మొత్తం ఎనిమిది భాగాలుగా తీసుకురావాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. హిట్‌ 2లోనే మూడో పార్ట్‌ గురించి చెప్పేశారు. మూడో భాగంలో నాని హీరోగా అడివి శేష్‌ కీలక పాత్రలో నటిస్తాడని వెల్లడించారు. ఇకపోతే హిట్‌ సిరీస్‌లో సమంతను మెయిన్‌ లీడ్‌గా తీసుకుంటే ఎలా ఉంటుంది? అని ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నించాడు. దీనికి అడివి శేష్‌ స్పందిస్తూ.. ఐడియా అదిరిపోయింది, మరి ఏమంటావ్‌ సామ్‌ అంటూ సమంతను ట్యాగ్‌ చేశాడు. దీనికి సామ్‌ స్పందిస్తూ.. ఓ రౌడీ పోలీస్‌.. ఆలోచన బాగుంది. ముందుగా సూపర్‌ హిట్‌ అందుకున్నందుకు అడివి శేష్‌కు శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆలోచన బాగుందన్న సామ్‌ మరి హిట్‌ యూనివర్స్‌లో భాగమవుతుందా? లేదా? చూడాలి!

చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాలు?
టికెట్‌ టు ఫినాలే విజేత అతడే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement