నేను నటిస్తున్నానంటే.. | Samantha Remake Movie 96 Shooting Completed | Sakshi
Sakshi News home page

నేను నటిస్తున్నానంటే..

Published Tue, Nov 5 2019 8:58 AM | Last Updated on Tue, Nov 5 2019 8:58 AM

Samantha Remake  Movie 96 Shooting Completed - Sakshi

సినిమా: నేను నటిస్తున్నానంటే.. అంటోంది నటి సమంత. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చెప్పాలనుకుందో అనేగా మీ ఆసక్తి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి. చాలా మందిలానే ఆదిలో అవకాశాల వేటలో అలసిన నటి సమంత. మాస్కోవిన్‌ కావేరి, బానాకాత్తాడి ఇలా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించిన ఈ చెన్నై చిన్నది దర్శకుడు గౌతమ్‌మీనన్‌ దష్టిలో పడడం, తమిళంలో విన్నైతాండి వరువాయా చిత్రంలో నటి త్రిష పోషించిన పాత్రను తెలుగులో సమంత చేయడం, ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడం చక చకా జరిగిపోయాయి. అంతే సమంత నట జీవితం ఒక్క సారిగా మారిపోయింది. ఆ తరువాత తెలుగులో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు వరుస కట్టాయి. దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇదిలా ఉండగా తన తొలి చిత్ర హీరో నాగచైతన్య ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. సమంత పెళ్లి చేసుకోవడంతో ఆమె కేరీర్‌కు డేమేజ్‌ అవుతుందనుకున్న వారూ లేకపోలేదు. అలాంటిది అలాంటి వారి ఊహలను పటాపంచల్‌ చేస్తూ వివాహానంతరం సమంత కేరీర్‌కు డోకా లేదు కదా, మరింత పెరిగిందనే చెప్పాలి. వరుస విజయాలతో దూకుడు మీదున్న సమంత ఇప్పుడు చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తోంది. తన పాత్రల ఎంపికలో మార్పు వచ్చింది. ప్రస్తుతం తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటిస్తోంది. కాగా ఇటీవల సమంత ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇంతకు ముందు ఎలాంటి పాత్రనైనా అంగీకరించానన్నారు.

అయితే వివాహానంతరం తన స్థాయి, తాను కోడలుగా వెళ్లిన కుటుంబ నేపథ్యం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారా? అన్న ప్రశ్న తరచూ తలెత్తుతోందన్నారు. అయితే అలాంటి పరిస్థితి తనకు లేదని, నటిగా పరిణితి చెందానని,  ఇంత కాలం సినిమాలో ఉంటే సినిమాల ఎంపికలో మార్పు రాకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. అలాగైతే తానింత కాలం సినిమా రంగంలో ఉండి ప్రయోజనం ఏముంటుందీ? అని అన్నారు. కాబట్టి తన అనుభవంతో చిత్ర కథలను ఎంపిక చేసుకుంటున్నానని చెప్పారు. ఇకపై కేవలం కమర్శియల్‌ చిత్రాలనే చేయరాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చిత్రంలో సమంత ఉందంటే అంది వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారని అన్నారు. తానూ విభిన్న కథా పాత్రలనే కోరుకుంటున్నానని, ఇకపై తాను నటించే చిత్రాలు కచ్చితంగా కొత్తగా ఉండేలా చూసుకుంటానని సమంత చెప్పింది. నిజంగానే ఈ బ్యూటీ  వచ్చిన అవకాశాలన్ని అంగీకరించడంలేదు. ప్రస్తుతం 96 చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోందని సమాచారం. తాజాగా ఒక వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో వెరైటీగా విలనీయం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement