
తమిళసినిమా: నటి తమన్నా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఒక రౌండ్ చుట్టేశారు. ప్రస్తుతం ఈ మూడు భాషల్లోనూ నటిస్తూ బీజీగానే ఉన్నారు. అయితే తనకు తీరని కోరిక మిగిలే ఉందట. తమన్నా విక్రమ్‌తో కలిసి నటిస్తున్న స్కెచ్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా యువ నటుడు సందీప్‌కిషన్ సరసన ద్విభాషా చిత్రంలో, హిందీ చిత్రం తెలుగు రీమేక్‌లోనూ నటిస్తున్నారు. అదే విధంగా కామోష్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు.
ఇది తమిళంలో నయనతార నటిస్తున్న కోలైయూధీర్ కాలం చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఇదే తమన్నా చిరకాల కలకు ఊపిరి పోసిందంటున్నారు ఈ బ్యూటీ. తమన్నా ఇంతకు ముందు తన మాతృభాష హిందీలో హిమ్మత్‌వాలా, ఎంటర్‌టెయిన్‌మెంట్ చిత్రాల్లో నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేదు.
దీంతో మాతృభాషలో సక్సెస్‌ఫుల్ నాయకి అనిపించుకోలేకపోయ్యింది ఈ బ్యూటీ. అయితే ఇదికాదు తమన్నా చింత. దర్శకుడు కరణ్ జోహార్ చిత్రాలను చూస్తూ తాను ఎదిగానని, అయన దర్శకత్వంలో ఒక్క చిత్రంలోనైనా నటించాలన్నది తన డ్రీమ్ అని పేర్కొన్నారు. కొలైయుధీర్ కాలం చిత్రంతో కరణ్‌జోహార్ దర్శకత్వంలో నటించాలన్న కల నెరవేరుతుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నానని తమన్నా పేర్కొన్నారు.