![Tamannaah expresses displeasure as fan asks about marriage - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/7/tamannah.jpg.webp?itok=Sv67aoHE)
‘మీ పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న లైఫ్‌లో ఒక దశలో దాదాపు అందరికీ ఎదురవుతుంటుంది. సెలబ్రిటీలను అయితే ప్రతి ఇంటర్వ్యూలో, బయటికి వెళ్లినప్పుడు.. ఇలా తరచూ ఈ ప్రశ్న వెంటాడుతుంటుంది. ఇటీవల తమన్నాని ఓ అభిమాని, ‘‘పెళ్లెప్పుడు చేసుకుంటారు? తమిళ అబ్బాయిలెవరైనా నచ్చారా?’’ అని అడిగితే.. ‘‘ఇప్పటివరకూ మా అమ్మానాన్న కూడా అడగలేదు’’ అంటూ ఈ బ్యూటీ కాస్త అసహనంగా సమాధానం ఇచ్చారు.
ఇక తమిళ అబ్బాయిలు ఎవరైనా నచ్చారా? అనే ప్రశ్నని ఉద్దేశించి ‘‘ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితం చాలా ఆనందంగా సాగుతోంది’’ అని పేర్కొన్నారామె. నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేస్తారు? అనే ప్రశ్నకు – ‘‘విమర్శలు, ప్రశంసలు.. రెండూ వస్తుంటాయి. విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు అలా అన్నారా? అని ఆలోచిస్తాను. అయితే విమర్శ, ప్రశంస.. ఏదైనా వారి వ్యక్తిగత అభి్ర΄ాయమే. అందుకని పెద్దగా పట్టించుకోను’’ అన్నారు తమన్నా.
Comments
Please login to add a commentAdd a comment