
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్ షో అలరిస్తోంది. ఈ షో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అయితే గతేడాది కంటే ఈసారి కాస్తా ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో తమిళంలోనూ ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైంది. తమిళ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హోస్ట్‌గా ఉండగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి ఆయన తప్పుకున్నారు.
ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళ ఆడియన్స్‌ను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్-8 వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచే విజయ్ టీవీ ప్రసారం కానుంది. విజయ్ టీవీలో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రసారం ఈ షో ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షోను చూడొచ్చు. కాగా.. ఇప్పటికే మేకర్స్ బిగ్‌బాస్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.
కంటెస్టెంట్స్ జాబితా వైరల్!
బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8లో కంటెస్టెంట్స్ గురించి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రముఖంగా నటుడు వీటీవీ గణేశ్ వినిపిస్తోంది. ఆయనతో పాటు సునీతా గొగోయ్, పాల్ డబ్బా అలియాస్ అనీష్, అన్షిత అక్బర్షా, కేఆర్ గోకుల్, ఐశ్వర్య, అరుణ్ ప్రసాద్, దార్శిక, సౌందర్య నంజుండన్, విజే విశాల్ పేర్లు టాప్-10లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం దాదాపు 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మరో ముగ్గురు-నాలుగు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు.
புது வீடு புது மனுசங்க, சண்ட போடுவாங்களா தெரியாது., ஆனா கண்டிப்பா சமாதானமா இருக்க மாட்டாங்க.. எதுவா இருந்தாலும் நான் Ready..🔥#GrandLaunch of Bigg Boss Tamil Season 8 - அக்டோபர் 6 முதல் மாலை 6 மணிக்கு நம்ம விஜய் டிவில.. 😎 #VJStheBBhost #Vijaysethupathi #BiggBossTamilSeason8 pic.twitter.com/gTjpbrL1x9
— Vijay Television (@vijaytelevision) October 1, 2024
Comments
Please login to add a commentAdd a comment