బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఆ స్టార్‌ హీరోనే.. ! | Vijay Sethupathi Likely To Host Bigg Boss Tamil Season 8 After Kamal Haasan, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ హోస్ట్‌గా విజయ్ సేతుపతి..!

Published Wed, Aug 14 2024 11:16 AM | Last Updated on Wed, Aug 14 2024 11:55 AM

Vijay Sethupathi likely to host Bigg Boss Tamil Season 8 After Kamal Haasan

బుల్లితెరపై అత్యంత ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షోలల్లో బిగ్‌బాస్‌ రేంజ్‌ వేరు. ఏ భాషలోనైనా బిగ్‌బాస్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షోపై అప్పుడే చర్చ మొదలైంది. అసలు ఈ సీజన్‌లో ఎవరు హోస్ట్‌గా ఉండబోతున్నారన్న విషయంపై కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా కమల్ ‍హాసన్ తప్పుకోవడంతో ఎవరు వస్తారన్న ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొంది.

ఈ నేపథ్యంలోనే మరో కోలీవుడ్ స్టార్‌ హీరో వినిపిస్తోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ లిస్ట్‌లో హీరో శింబు పేరు కూడా వినిపించింది. కానీ చివరికీ విజయ్ సేతుపతినే ఫైనల్‌ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

విజయ్ సేతుపతి ఎందుకంటే..

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-8కు విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో ఆయన సన్‌ టీవీ ప్రముఖ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. మాస్టర్‌ చెఫ్‌ షోతో పాటు మరో కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అందువల్ల రియాలిటీ షోకు హోస్ట్‌గా పనిచేయడం ఆయనకు కొత్తేమీ కాదు. అందుకే ఆ అనుభవం బిగ్‌బాస్‌కు పనికొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా.. బిగ్ బాస్ సీజన్- 8 అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. త్వరలో కొత్త హోస్ట్‌తో ప్రోమోను మేకర్స్ రిలీజ్‌ చేయనున్నారు. కాగా.. బిజీ షెడ్యూల్ కారణంగా కమల్ హాసన్‌ ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement