
పోలీస్ ఆఫీసర్లుగా కొందరు నాయికలు దోషులను పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా కేసు వివరాల కోసం లోతుగా విచారణ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి వెళ్లి΄ోయారు. ఈ తారల పరిశోధనల విశేషాల్లోకి వెళదాం.
ఆన్ ఇన్వెస్టిగేషన్ తొలి అడుగు
రెండు దశాబ్దాలుగా అగ్రకథానాయికగా త్రిష ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పుడు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ హవా కూడా నడుస్తున్న తరుణంలో ఈ ΄్లాట్‌ఫామ్‌లో ఆమె సైన్ చేసిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. ఇందులో త్రిషపోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. పూర్తి స్థాయిపోలీసాఫీసర్ పాత్రలో త్రిష నటిస్తుండటం కూడా ఇదే మొదటిసారి అనొచ్చు. క్రైమ్–ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సురేష్ వంగలా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ సిరీస్ ఇతర భాషల్లో అనువాదమై, త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
పవర్‌ఫుల్ సత్యభామ
హైదరాబాద్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్‌పోలీస్ సత్యభామగా చార్జ్ తీసుకున్నారు కాజల్ అగర్వాల్. ఆమె టైటిల్ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఏసీపీ సత్యభామ పాత్ర చేస్తున్నారు కాజల్. ఆల్రెడీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అఖిల్ డేగల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో కాజల్‌పోలీసాఫీసర్ పాత్రలో నటించినప్పటికీ ఓ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించడం ఇదే తొలిసారి.
ఆఖరి నిజం
ఢిల్లీలో 2018లో జరిగిన బురారి ఆత్మహత్యల ఘటన ఆధారంగా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లు రూపొందాయి. తాజాగా రూపొందిన మరో వెబ్‌సిరీస్ ‘ఆఖ్రీ సచ్’ (ఆఖరి నిజం). ఆత్మహత్యల మిస్టరీ చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆన్యగా తమన్నా నటించారు. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి అని ఇటీవల తమన్నా పేర్కొన్నారు. రాబీ గ్రేవాల్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా మరికొందరు తారలు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment