investigation officer
-
పోలీస్ ఆఫీసర్లుగా ఆన్ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు
పోలీస్ ఆఫీసర్లుగా కొందరు నాయికలు దోషులను పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా కేసు వివరాల కోసం లోతుగా విచారణ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి వెళ్లి΄ోయారు. ఈ తారల పరిశోధనల విశేషాల్లోకి వెళదాం. ఆన్ ఇన్వెస్టిగేషన్ తొలి అడుగు రెండు దశాబ్దాలుగా అగ్రకథానాయికగా త్రిష ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా కూడా నడుస్తున్న తరుణంలో ఈ ΄్లాట్‌ఫామ్‌లో ఆమె సైన్ చేసిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. ఇందులో త్రిషపోలీసాఫీసర్గా నటిస్తున్నారు. పూర్తి స్థాయిపోలీసాఫీసర్ పాత్రలో త్రిష నటిస్తుండటం కూడా ఇదే మొదటిసారి అనొచ్చు. క్రైమ్–ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సురేష్ వంగలా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ సిరీస్ ఇతర భాషల్లో అనువాదమై, త్వరలో స్ట్రీమింగ్ కానుంది. పవర్ఫుల్ సత్యభామ హైదరాబాద్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్‌పోలీస్ సత్యభామగా చార్జ్ తీసుకున్నారు కాజల్ అగర్వాల్. ఆమె టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఏసీపీ సత్యభామ పాత్ర చేస్తున్నారు కాజల్. ఆల్రెడీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అఖిల్ డేగల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో కాజల్పోలీసాఫీసర్ పాత్రలో నటించినప్పటికీ ఓ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించడం ఇదే తొలిసారి. ఆఖరి నిజం ఢిల్లీలో 2018లో జరిగిన బురారి ఆత్మహత్యల ఘటన ఆధారంగా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లు రూపొందాయి. తాజాగా రూపొందిన మరో వెబ్‌సిరీస్ ‘ఆఖ్రీ సచ్’ (ఆఖరి నిజం). ఆత్మహత్యల మిస్టరీ చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆన్యగా తమన్నా నటించారు. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి అని ఇటీవల తమన్నా పేర్కొన్నారు. రాబీ గ్రేవాల్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా మరికొందరు తారలు నటిస్తున్నారు. -
బాగుందయ్యో.. ఈ ‘జియో’ ప్రాజెక్టు: హ్యాట్సాఫ్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సవాల్ విసిరే ఎంతటి క్లిష్టమైన కేసులనైనా ప్రకాశం జిల్లా పోలీసులు ఇట్టే ఛేదిస్తున్నారు. చకచకా దర్యాప్తు పూర్తి చేస్తూ నేరస్తులను న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నారు. ‘పోలీస్ అంటే వీడేరా’ అనిపించుకుంటూ.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ దర్యాప్తు విషయంలో ఇతర జిల్లాల పోలీసులకు నమూనాగా నిలుస్తున్నారు. ఇందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అనుసరిస్తున్న ‘జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (జియో) ప్రాజెక్ట్’ బాగా ఉపయోగపడుతోంది. ఏమిటీ.. జియో ప్రాజెక్ట్! రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 2019 అక్టోబర్ 11న ప్రకాశం జిల్లాలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆలోచనల నుంచి జియో ప్రాజెక్ట్ (జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రాజెక్ట్) పురుడు పోసుకుంది. అంతకుముందు వరకు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ స్థాయి అధికారులు మాత్రమే కేసుల దర్యాప్తు చేపట్టేవారు. డీఎస్పీలు శాఖాపరమైన పాలనా వ్యవహారాలు, సీఐలు, ఎస్ఐలు రోజువారీ విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల కేసుల దర్యాప్తు నత్తనడకన సాగేది. జియో ప్రాజెక్ట్ కింద ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లకు కూడా కేసుల దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇచ్చారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తర్ఫీదునిచ్చారు. కేసుల దర్యాప్తు ఎలా చేయాలనే అంశంపై సీఐలు, డీఎస్పీలు, అనుభవజు్ఞలైన అధికారుల ద్వారా ఎన్నో మెళకువలు నేరి్పంచారు. దీంతో జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తులో వేగం పుంజుకున్నారు. వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి వారానికి కొన్ని కేసులు ఇచ్చి దర్యాప్తు చేయించటం, కేసు డైరీలు (సీడీలు) సిద్ధం చేయించటంలో మెళకువలు నేరి్పంచారు. వీరిని సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు (సియో) అయిన ఎస్సై, సీఐ, డీఎస్పీలకు సాయంగా ఉండేలా తీర్చిదిద్దారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానం కేసుల దర్యాప్తులో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను భాగస్వామ్యులను చేయడంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎన్నో కేసులకు పరిష్కారం లభించింది. అపరిష్కృతంగా ఉన్న అనేక కేసులను జియోలు దర్యాప్తు చేపట్టి నిందితులను కోర్టుల్లో హాజరుపరిచారు. తద్వారా కేసుల పరిష్కారంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) నివేదిక ప్రకారం ప్రకాశం జిల్లాలో 32,762 కేసులు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 81 శాతం దర్యాప్తు పూర్తయ్యాయి. ఇంకా 6,223 కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదే సందర్భంలో జిల్లాకు సంబంధించి వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 15,476 కాగా.. వాటిని కూడా పూర్తిగా పరిష్కరించారు. జియోలకు ప్రత్యేక గుర్తింపు.... జియోలకు ప్రత్యేక గుర్తింపు తేవటంతో పాటు ఎస్సైలు, సీఐలతో గ్రూప్ డిస్కషన్స్ (బృంద చర్చలు) ఏర్పాటు చేశారు. సందేహాలను నివృత్తి చేయటం, వృత్తిలో నైపుణ్యం పెంచటం లాంటి మెళకువలు నేరి్పంచారు. ప్రతి పోలీస్ స్టేషన్లో జియోలకు ప్రత్యేకంగా వర్క్ స్టేషన్ ఏర్పాటు చేశారు. జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనే నేమ్ ప్లేట్, ఒక టేబుల్, కుర్చీ కూడా ఏర్పాటు చేసి గౌరవప్రదమైన అవకాశం కలి్పంచారు. సాంకేతిక పరమైన అంశాల్లో అనుభవమున్న ఒక కానిస్టేబుల్‌ను టెక్నికల్ అసిస్టెంట్(టీఏ)ను సహాయంగా కేటాయించారు. జీఏలకు ట్రావెలింగ్ అలవెన్స్ (టీఏ) అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో 24 వేల వరకు ఫిర్యాదులు... జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏటా 24 వేల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిలో ఎఫ్ఐఆర్ నమోదు కానివి, నమోదుకు అర్హత లేని పిటిషన్లు కూడా ఉంటాయి. మొత్తం మీద 12 వేల వరకు ఎఫ్ఐఆర్లు అవుతుంటాయి. వాటిలో సుమారు 6 వేల కేసుల వరకు ఇన్వెస్టిగేషన్ పెండింగ్‌లో ఉంటాయి. గతంలో ఎస్సైలు 63.83 శాతం కేసులను మాత్రమే పర్యవేక్షించగలిగేవారు. జియో వ్యవస్థ రావడంతో అవి కాస్తా 11.46 శాతానికి పరిమితమయ్యాయి. చదవండి: తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు: మంత్రి అవంతి -
నమ్మకం ఉంది
ఏదైనా క్రైమ్ జరిగితే దోషులను పట్టుకోవడానికి డిఫరెంట్ టెక్నిక్స్‌ను ఫాలో అవుతారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు. ఇప్పుడు ఆ టెక్నిక్స్‌ని తెలుసుకునే పనిలోనే ఉన్నారు కథానాయిక రష్మికా మండన్నా. గౌతమ్ అయ్యర్ దర్శకత్వంలో రష్మిక లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘వృత్రా’. ఈ సినిమాలోనే ఆమె ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ‘‘నా పాత్రకు న్యాయం చేస్తాననే నమ్మకం ఉంది. ‘వృత్రా’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రష్మిక. మరోవైపు ఈ కన్నడ బ్యూటీ హీరోయిన్గా తెలుగులో ‘దేవదాస్, గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
షీనా బోరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం
హత్య జరిగిన తీరేకాదు.. దర్యాప్తు జరుగుతున్న తీరులోనూ సంచలనాలు సృష్టిస్తోన్న షీనా బోరా కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ప్రభుత్వం ఉన్నపళంగా పదోన్నతి కల్పించింది. మారియాను హోం గార్డ్స్ డీజీగా నియమిస్తూ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భారీ ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న నేపథ్యంలో మారియా బదిలీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని, సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబై పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయంపై మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షి మాట్లాడుతూ.. రాకేశ్ మారియా బదిలీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అహ్మద్ జావేద్‌ను ముంబై నగర నూతన కమిషనర్‌గా నియమించినట్లు, తక్షణమే ఈ నియమకాలు అమలులోకి రానున్నట్లు చెప్పారు. అయితే కొత్త కమిషనరే షీనా హత్య కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తారా? లేక ఏసీపీ స్థాయి అధికారులతోనే దర్యాప్తును ముగించేస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదులేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.