
రష్మికా మండన్నా
ఏదైనా క్రైమ్ జరిగితే దోషులను పట్టుకోవడానికి డిఫరెంట్ టెక్నిక్స్‌ను ఫాలో అవుతారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు. ఇప్పుడు ఆ టెక్నిక్స్‌ని తెలుసుకునే పనిలోనే ఉన్నారు కథానాయిక రష్మికా మండన్నా. గౌతమ్ అయ్యర్ దర్శకత్వంలో రష్మిక లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘వృత్రా’. ఈ సినిమాలోనే ఆమె ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ‘‘నా పాత్రకు న్యాయం చేస్తాననే నమ్మకం ఉంది. ‘వృత్రా’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రష్మిక. మరోవైపు ఈ కన్నడ బ్యూటీ హీరోయిన్‌గా తెలుగులో ‘దేవదాస్, గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment