
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా జంటగా ‘శ్రీరస్తు శుభమస్తు’ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గీత గోవిందం’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాల్లో మంచి యాక్టింగ్ స్కిల్స్‌తో విజయ్ స్టార్‌డమ్ సంపాదించారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా విజయ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. విజయ్, రష్మికల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. మా బ్యానర్‌లో రెండో చిత్రం చేస్తున్న పరశురాం కమిట్‌మెంట్ ఉన్న దర్శకుడు. గోపీసుందర్ సంగీతం బాగుంది. రిలీజ్ డేట్‌ని త్వరలోనే ‘బన్నీ’ వాసు ఎనౌన్స్ చేస్తారు’’ అన్నారు. ‘‘థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడు నిరుత్సాహపడకూడదనేలా మమ్మల్ని వర్క్ చేయమని ప్రోత్సహించే అల్లు అరవింద్‌గారు ఈ సినిమాకు సమర్పకులుగా ఉండటం హ్యాపీగా ఉంది.
విజయ్ క్రేజ్ ఉన్న హీరో. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరకెక్కించడం పరశురాంకు వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘అల్లు అరవింద్‌గారి ఆశీర్వాదం, ‘బన్నీ’ వాసు సపోర్ట్‌తో సినిమా బాగా వచ్చింది. విజయ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అతని పాత్రని డిజైన్ చేశా. రియల్ లైఫ్ రష్మికని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు దర్శకుడు. అన్నట్లు.. గీత గోవిందం అని టైటిల్ పెట్టారు కాబట్టి సినిమాలో నాయకా నాయకల పేర్లు ఇవే అయ్యుండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment