కెమెరామేన్ యస్. మణికందన్
‘‘గీత గోవిందం’ సినిమా పూజ రోజు అల్లు అరవింద్‌గారు నాతో ‘మా లక్ష్మీ (పారితోషికం)ని మీరు తీసుకొని మీ సరస్వతి (కెమెరా వర్క్)ని మాకు ఇవ్వండి’ అన్నారు. ఎందుకో ఆ మాట నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. టెక్నీషియన్స్‌కు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పది’’ అని కెమెరామేన్ యస్. మణికందన్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఈ నెల 15న రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తోందని చిత్రబృందం పేర్కొంది. మణికందన్ చెప్పిన విశేషాలు.
► కెరీర్ స్టార్టింగ్‌లో కెమెరామేన్ శరవణన్, మనోజ్ పరమహంసలగారి వద్ద వర్క్ చేశాను. ‘రేసు గుర్రం’ సినిమాలో రెండు పాటలకు లైటింగ్ చేయడానికి వస్తే ‘ముకుంద’ సినిమాకు అవకాశం వచ్చింది. తమిళంలో ‘కుట్రమ్ కడిదల్, మగళిర్ మట్టుమ్’ అనే సినిమాలు చేశాను.
► ‘గీత గోవిందం’ పాయింట్ బావుంది.. ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సినిమా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ అవుతుందనుకోలేదు. అరవింద్‌గారి అనుభవం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకు ఏం కావాలో మాత్రమే ఆలోచిస్తారు. వరుసగా రెండు సార్లు ఆయన బ్యానర్లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. పరశురామ్‌తో వర్క్ చేయడం బాగుంటుంది. ఫస్ట్ సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’ జర్నీ చాలా నచ్చడంతో సెకండ్ సినిమాకు కూడా అసోసియేట్ అయ్యాం.
► ‘బన్నీ’ వాసు గారు సినిమా స్టార్ట్ కాకముందు ఏం కావాలి? అని అడుగుతారు. అంత ఫ్రీడమ్ ఇస్తారు. విజయ్ దేవరకొండ సింప్లీ సూపర్. ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అయినా కూడా తను మాత్రం సింపుల్‌గానే ఉన్నాడు.
► నా నెక్ట్స్ మూవీ సెప్టెంబర్‌లో ఆరంభమవుతుంది. పూరీగారు కాల్ చేశారు. త్వరలో అనౌన్స్ చేస్తాను. తెలుగు ఆడియన్స్ అంటే ఇష్టం. వాళ్లు సినిమా మీద చూపించే అభిమానం ఆకట్టుకుంది. నా దృష్టిలో బెస్ట్ ఆడియన్స్ అంటాను.
‘‘చాలామంది నన్ను కెమెరామేన్ వి.మణికందన్ (ఓం శాంతి ఓం, రా.వన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫేమ్)తో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇదే విషయాన్ని ఓసారి ఆయనతో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు నా ‘ఓం శాంతి ఓం’ నువ్వే చేశా వని చెప్పేయ్’’ అని సరదాగా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment