Geetha Govindam
-
పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు
తెలుగు ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థగా గీతా ఆర్ట్స్‌కు మంచి పేరు ఉంది. ఈ బ్యానర్లో భాగమైన GA2 నుంచి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్లో 'గీత గోవిందం' చిత్రం వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్‌కు అనుగుణంగా వారి ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు బన్నీ వాస్. GA2 బ్యానర్లో ఆయన చాలా సినిమాలే తీశాడు. గీతగోవిందం సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురామ్‌తో జరిగిన వివాదం గురించి బన్నీ వాస్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. 'గీత గోవిందం తర్వాత నాతో పరశురామ్ ఒక కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథను విజయ్‌కు ఫోన్ చేసి చెప్పాను. సినిమా చేసేందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈలోపు దిల్ రాజుతో పరశురామ్ ఇదే కథ చెప్పినట్లు తెలిసింది. దిల్ రాజు బేనర్లో అది చేస్తానని అన్నాడు. ఈ విషయంలో నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయాన్ని మాతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు. ఇదే విషయం అతడి ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలవడంతో మేం బాగానే బాధపడ్డాం. ఆ సమయంలో మేమంతా కొంచెం కోపంగా ఉన్నాం. అందుకు తగినట్లే పరుశురామ్‌పై రియాక్టయ్యాం. ఆ తర్వాత పరశురామ్ ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు. సర్కారు వారి పాట సినిమా సమయంలో ఏదో ఫ్లోలో దిల్ రాజుకు కథ చెప్పాను ఆయన సినిమా ఓకే చేయడం. ఆ తర్వాత విజయ్‌కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇదే విషయం మీతో పొద్దున చెబుదామని అనుకున్నలోపే ఇలా జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు. ఆ వివాదం తర్వాత దిల్ రాజు గారు ఫోన్ చేసి.. ఇదే సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారు వద్దని చెప్పారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవ లేదు. త్వరలో విజయ్- పరశురామ్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తాం.' అని బన్నీ వాసు పేర్కొన్నాడు. గతంలో ఏం జరిగింది..? గీతగోవిందం చిత్రం హిట్ కొట్టడంతో డైరెక్టర్ పరుశురామ్ చాలా సినిమాలకు ఒకేసారి కమిట్మెంట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆయన వారి నుంచి కొంతమేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ముందుగా అనుకున్నట్లుగా గీతగోవిందం తర్వాత పరశురామ్ అల్లు అరవింద్‌కే సినిమా చేయాల్సి ఉంది. కానీ 14 రీల్స్ బ్యానర్లో నాగచైతన్య సినిమా తీసి వస్తానని అల్లు కాంపౌండ్ నుంచి ఆయన బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కూడా మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా ఛాన్స్ దక్కడంతో నాగచైతన్య సినిమాను పక్కనపెట్టి మహేశ్- మైత్రీ మేకర్స్ వైపు మొగ్గుచూపాడు. ఆ సమయంలో 14 రీల్స్‌తో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో సర్కారు వారి పాటలో 14 రీల్స్‌ను కూడా భాగం అయింది. సర్కారు వారి పాట చిత్రం తర్వాత కూడా దిల్ రాజు- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'ప్యామిలీ స్టార్' చిత్రాన్ని పరుశురామ్ ప్రకటించాడు. దీంతో అల్లు అరవింద్‌కు కోపం వచ్చిందని ఇండస్ట్రీలో వైరల్ అయింది. గీతగోవిందం తర్వాత తమతో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఉండగానే దిల్ రాజుతో పరశురామ్ సినిమా ఎనౌన్స్ చేయడం అరవింద్‌కు ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని తెలిసింది. -
Vijay Deverakonda & Rashmika Mandanna: గీత గోవిందం @5.. విజయ్-రష్మిక-పరశురాం ముచ్చట్ల (ఫొటోలు)
-
ఖుషి ట్రైలర్ లో గీత గోవిందం షేడ్స్..
-
బ్లాక్ బాస్టర్ సినిమాలను వదులుకున్న హీరోయిన్లు వీళ్లే!
ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. మూవీ ఆఫర్స్ టాలెంట్ తోనే కాదు...అదృష్టం వల్ల కూడా వరిస్తాయి. అలా అదృష్టం కారణాంగా గోల్డెన్ ఛాన్స్ అందుకుని సూపర్ హిట్స్ అందుకున్న హీరోయన్స్ చాలా మందే ఉన్నారు. అలాగే కాల్షీట్స్ సర్ధుబాటు చేయలేక గోల్డెన్ ఆఫర్స్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ కూడా పెద్దదే.. ఇండస్ట్రీ హిట్స్ సాధించిన సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ముందుగా మరోకరిని పలకరించింది. ఆ భామలు నో చెప్పటంతో...ఈ హీరోయిన్స్ కి ఆఫర్ కాదు..ఏకంగా బంపరాఫర్ తగిలింది. 2018 లో విడుదలై బాక్సాపీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సృష్టించిన సినిమా గీత గోవిందం..ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా నటించారు. రూ.5 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 130 కోట్లు వసూళ్లు చేసింది. ఇక గీత గోవిందం సక్సెస్ తో హీరోయిన్ గా రష్మిక ఇమేజ్ టోటల్ గా మారిపోయింది. ఈ ఒక సినిమాతో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. అసలు గీతగోవిందం సినిమాకి ముందుగా మూవీ మేకర్స్ రష్మిక మందన్న అనుకోలేదట. విజయ్ దేవర కొండకి జోడిగా రాశీ ఖన్నా అనుకున్నారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో రాశీ ఖన్నా గీత గోవిందం వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఆఫర్ రష్మిక మందన్న దగ్గరకి వెళ్లింది. రాశీఖన్నా గీత గోవిందం సినిమా ఒక్కటే కాదు...2019లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ఎఫ్2 లో హీరోయిన్ ఛాన్స్ కూడా వదులుకుంది. ఎఫ్2 సినిమాలో తమన్నా రోల్ కి ముందుగా రాశీ ఖన్నా అనుకున్నారు. అయితే ఆ రోల్ రాశీ ఖన్నా చేయటానికి ఇంట్రెస్ట్ చూపించక మిస్ చేసుకుంది. ఇక లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం..ఈ సినిమాలో సమంత కంటే ముందు అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. అనుపమ ఇంకా అమ్మ కూచి అని ఫీలైన సుకుమార్ సమంతను ఫైనల్ చేశాడు. అలా అనుపమ రంగస్థలం లో హీరోయిన్ ఛాన్స్ మిస్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ పల్లెటూరి అమ్మాయి అయినా కాస్త గ్లామర్ గా కనిపిస్తది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన జానపద చిత్రం బాహుబలి...ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కి ముందుగా సోనం కపూర్ అనుకున్నారట. సోనమ్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఆ ఛాన్స్ తమన్నా అందుకుంది. ఇలాగే హీరో నాని జెర్సీ, సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమాల్లో హీరోయిన్ ఆఫర్ శృతిహాసన్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మిస్ చేసుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్ర కోసం శాలిని పాండే కంటే ముందు మలయాళనటి పార్వతీ నాయర్ అనుకున్నారు. ఆ పాత్ర కాస్త బోల్డ్ ఉండటంతో ఆ బ్యూటీ వెనకడుగు వేసింది. అలాగే కుమారి 21ఎఫ్ మూవీ లో హీరోయిన్ గా హెబ్బా పటేల్ కంటే ముందు చాందిని చౌదరి అనుకున్నారు. ఆ బోల్డ్ క్యారెక్టర్ చేయటం ఇష్టం లేక చాందిని ఆ మూవీ ఆఫర్ వదలుకుంది. . కానీ కుమారి 21 ఎఫ్ తో హెబ్బా పటేల్ కు మంచి గుర్తింపు లభించింది., ఇక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక...క్యారెక్టర్స్ నచ్చక చాలా మంది హీరోయిన్స్ సూపర్ హిట్ మూవీస్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. -
గీత గోవిందం ఫేమ్ మౌర్యానీ బ్యూటిఫుల్ ఫొటోస్
-
భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా
దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్. తన దైన శైలీలో బాణీలను అందిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో టాలీవుడ్లో మ్యూజిక్ కంపోజర్‌గా అరంగేట్రం చేసిన గోపీ ‘గీతా గోవిందం’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారి మిగతా సంగీత దర్శకులకు తీవ్రమైన పోటీని ఇస్తున్నాడు. అయితే ఇప్పటివరకు గోపీ సుందర్ వృత్తిపరమైన జీవితం గురించే అందరికీ తెలుసు. కానీ తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్ చేసిని పోస్ట్‌తో అతడి వ్యక్తిగత జీవితం తెలసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిచూపిస్తున్నారు. 2001లో గోపీసుందర్‌కు ప్రియ అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మనస్పర్థలు తలెత్తడంతో గోపీసుందర్ తన భార్య నుంచి విడాకులు కావాలిన కోర్టును ఆశ్రయించాడు. అయితే విడాకులు ఇచ్చేందుకు ఆయన భార్య ప్రియ కూడా సమ్మతంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువ గాయని అభయ హిరణ్మయితో గోపీ సుందర్ ప్రేమలో పడ్డాడు. గోపీ- హిరణ్మయిలు తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వేర్వేరు సందర్భాల్లో వీరిద్దరూ అధికారికంగా తెలిపారు. ‘నా ఉనికికి నువ్వే కారణం’ అంటూ హిరన్మయితో కలిసి దిగన ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు గోపీ సుందర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక గోపీ సుందర్ స్వరపరిచిన అనేక పాటలను హిరణ్మయి ఆలపించిన విషయం తెలిసిందే. చదవండి: అప్పుడు దిమాక్ ఖరాబ్.. ఇప్పుడు డింఛక్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ View this post on Instagram You are the reason I exist ❤️ A post shared by Gopi Sundar Official (@gopisundar__official) on May 12, 2020 at 11:25pm PDT -
ఇక నుంచి కొచ్చి కాదు.. హైదరాబాద్‌లోనే
క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ హైదరాబాద్‌లో కొత్త మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటు చేశాడు. కేరళకు చెందిన గోపీ సుందర్ ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా మారాడు. సాంగ్ కంపోజ్ కోసం కొచ్చిలోని తన మ్యూజిక్ స్టూడియోకు వెళ్లాల్సి వస్తోంది. సమయం వృథాతో పాటు దర్శకనిర్మాతలతో మ్యూజిక్ సిట్టింగ్, పాటల రికార్డింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించిన గోపీ సుందర్ హైదరాబాద్‌లోనే స్టూడియే ఏర్పాటు చేశాడు. దీంతో ఇక నుంచి చేయబోయే కొత్త చిత్రాల సాంగ్స్‌ను ఇక్కడే కంపోజ్ చేయనున్నాడు. కాగా ప్రసుత్తం టాలీవుడ్లో అగ్ర సంగీత దర్శకులుగా మారినా దేవిశ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ థమన్‌లకు కూడా హైదరాబాద్‌లో మ్యూజిక్ స్టూడియోలు లేవు. వారు చెన్నైకి వెళ్లి సాంగ్ కంపోజ్ చేస్తుంటారు. అయితే గోపీ సుందర్ హైదరాబాద్‌లో స్టూడియో ఏర్పాటు చేయడం అతడి నిబద్దతకు అద్దం పడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు. గత కొద్ది కాలంగా సినీ సంగీత ప్రియుల్ని తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు గోపీ సుందర్. ముఖ్యంగా గీతాగోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..’ అంటూ సాగే సాంగ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు మజ్ను, భలేభలే మగోడివోయ్ చిత్రాలతో ఆకట్టుకున్న గోపీ సుందర్ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్, ఎంత మంచి వాడవురాతో పాటు అఖిల్ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. -
హిట్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్..!
అక్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన నటుడు అక్కినేని అఖిల్. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ తరువాత లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా అఖిల్ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట అఖిల్. గీత గోవిందం సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న పరశురామ్ తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నించాడు. దాదాపుగా ఓకే అను ప్రాజెక్ట్ ఆగిపోవటంతో ప్రస్తుతం అఖిల్ సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
మహేష్ ఆ దర్శకుడికి ఓకె చెప్పాడా?
ఇటీవల మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, వరుసగా యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మహర్షి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూపర్‌స్టార్ త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మహేష్ రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా మహేష్ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. గీత గోవిందం సినిమాతో ఘనవిజయం సాధించిన పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఓకె చెప్పాడట. పరశురామ్ చెప్పిన లైన్ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. అయితే ఈ వార్తలపై మహేష్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
హీరోయిన్ను నిజంగానే ఏడిపించారు!
ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సాండల్‌వుడ్ బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక గీత గోవిందం సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ రోజు రష్మిక సెట్‌కు ఆలస్యంగా వెళ్లిందట. ఆ సమయంలో సెట్ ఉన్న వాళ్లంతా సీరియస్‌గా ఎవరి పని వారు చేసుకుంటూ రష్మికను పలకరించలేదట. దీంతో తాను పొరపాటు చేశానని భావించిన రష్మిక కన్నీరు పెట్టుకున్నానని తెలిపింది. తరువాత కాసేపటికి రష్మిక దగ్గరకు వచ్చిన దర్శకుడు పరశురామ్, సీన్లో ఒరిజినల్ ఎమోషన్స్ ను క్యాప్చర్ చేయటం కోసమే తనను ఏడిపించామని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నానని వెల్లడించింది. అయితే ఏ సీన్ కోసం దర్శకుడు తనను ఏడిపించాడో మాత్రం రష్మిక వెల్లడించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో సారి ఇద్దరు జంటగా డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నారు. -
‘గీత గోవిందం’ బాలీవుడ్ రీమేక్‌లో హీరో ఎవరంటే..?
గతేడాది విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గీత గోవిందం. ఎలాంటి అంచనాలు లేకుండా వందకోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగేసింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ నటించిన పెళ్లి చూపులు (మిత్రోన్), అర్జున్ రెడ్డి(కబీర్ సింగ్) చిత్రాలు బాలీవుడ్‌కు వెళ్లగా.. గీత గోవిందం కూడా అక్కడ పట్టాలెక్కబోతోన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ధడక్ సినిమాతో తన టాలెంట్‌ను నిరూపించుకున్న ఇషాన్ ఖట్టర్.. ఈ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ బాలీవుడ్లో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
‘అందుకే నన్ను రిజెక్ట్ చేశారు’
గండర గండ సోగ్గాడివంట..కండలు తిరిగిన పోరగానివంట..‘బందిపోటు దొంగలు’ సినిమాలో పాట ఇది.విజయ్ దేవరకొండ ఏం తక్కువ బందిపోటు కాదు.బుట్టల కొద్దీ మనసులు దోచుకుంటున్నాడు..కట్టల కొద్దీ లవ్ లెటర్స్ దాచుకుంటున్నాడు.ఎవరికీ దొరకనంటాడు..‘సాక్షి’ రీడర్‌కి దొరికాడు. ‘2018 నాదే’ అని హ్యాపీగా చెప్పుకునేలా ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి రెండు హిట్స్ ఇచ్చారు. ఈ ఏడాది గురించి మీ ఒపీనియన్? విజయ్: ఈ సంవత్సరం చాలా పని చేశాను. అటే అంత పని చేశానని కంప్లైంట్లా చెప్పడంలేదు. నాలుగు రిలీజులు, వాటిలో రెండు లీకైన సినిమాలు, విజయాలు, అపజయాలు, ప్లేబ్యాక్ సింగింగ్, సమస్యలు, సమస్యలను అధిగమించడం, నా సొంత ‘క్లాతింగ్ లైన్’ని ఆరంభించడం, నిర్మాణ సంస్థను ప్రారంభించడం... వీటన్నిటితో బిజీ బిజీగా చాలా లైవ్లీగా 2018 గడిచింది. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలేమైనా? నేనెప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. అనిపించింది చెయ్యాలి... ఇష్టంగా చెయ్యాలి. పూర్తిగా బతకాలి. నేను ప్రతిరోజూ ట్రై చేసేది ఇదే. 100 కోట్ల క్లబ్ (‘గీత గోవిందం’)లో ఇంత త్వరగా చేరుకుంటానని అనుకున్నారా? మనందరం మన గురించి ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకుంటుంటాం. నేను ఏం చేసినా నచ్చి చేశాను కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ప్రతి రిజల్ట్ నాకేం చెప్పిందంటే ‘రేయ్.. ఇది జరుగుతుంది అని అనుకోకుండా నువ్వు ఇది చేసి ఉంటే.. నువ్వింకా పెద్దవి సాధించే సత్తా నీలో ఉంది’ అని. అందుకే నేనింకా పెద్ద కలలు కంటూ, నన్ను ఇంకా ముందుకు పుష్ చేసుకుంటున్నాను. మీరీ రేంజ్‌కి రావటం వెనక దాదాపు ఏడేళ్ల కష్టం, నిరీక్షణ ఉన్నాయి. ఆ టైమ్‌లో మానసికంగా మీరు డౌన్ అయిన సందర్భాలు ఏమైనా? ఉండేవి ఎలానూ ఉంటాయి. కానీ జీవితం అన్నాక మినిమమ్ ఆ మాత్రం డ్రామా ఉంటేనే మనకు రోజులు గడుస్తాయి. ఆ కష్టాలను, ఎత్తుపల్లాలను అధిగమించి సక్సెస్ అయినప్పుడే మనకి ఒక ఎత్తు, ఒక సంతృప్తి, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. మీ లుక్స్ బాగుంటాయి కాబట్టి ‘ఫేస్ అద్దంలో చూసుకున్నావా’ అని మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సే లేదు. మరి చాన్సుల కోసం వెళ్లినప్పుడు ఏ కారణంతో మిమ్మల్ని రిజెక్ట్ చేశారు? మనుషులెప్పుడూ వాళ్ల ఫేస్ వల్ల రిజెక్ట్ అవ్వరు. వాళ్లు ‘నో వన్’ (ఏమీ కారు) అనే కారణంతో తిరస్కరణకు గురవుతారు. అప్పుడు నేను ‘నో వన్’. అందుకే నన్ను రిజెక్ట్ చేశారు. కొందరు యూత్ వెంటనే సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. మీ లైఫ్ నుంచి వారికి ఇచ్చే సలహా? నేను సలహాలు ఇచ్చే బిజినెస్‌లో లేను (నవ్వేస్తూ). ఒకవేళ మీరు ఓవర్ నైట్ స్టార్ అయ్యుంటే ఇంత హ్యాపీనెస్ ఉండేదా? ఓపిక వహించి సక్సెస్ కొట్టడంలోనే ఎక్కువ మజా ఉందా? హ్యాపీనెస్ స్టార్ అవ్వడంలో లేదు. ఆనందం ఎందులో ఉంటుందంటే.. తినడానికి, ఖర్చులకు డబ్బులు ఉండటం, ఉండటానికి ఇల్లు, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు భయంతో కాకుండా నచ్చింది చేయడం, అమ్మానాన్న, నా ఫ్రెండ్స్ ఫేసెస్‌లో గర్వం, సంతోషం చూడటంలో ఉంటుంది. సో ఇవి ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చినా నాకు ఓకే. బ్యాగ్రౌండ్ ఉండటం చాలా మంచిదంటారు. కానీ బ్యాగ్రౌండ్ కన్నా టాలెంట్ పెద్దదైతే అప్పుడు ఏ బ్యాగ్రౌండ్ అక్కర్లేదనడానికి మీరో ఎగ్జాంపుల్. మీరేమంటారు? ప్రకృతి ఎప్పుడూ ‘డిమాండ్ అండ్ సప్లై’ మీద నడుస్తుంటుంది. ఉన్నవాళ్లకి డిమాండ్ ఉంటుంది. నేను నా అంతట నాకు డిమాండ్ క్రియేట్ చేసుకుని, సప్లై అయ్యాను. రౌడీ బాయ్స్ అండ్ గాళ్స్ అంటూ ఫ్యాన్స్‌ని సంబోధిస్తుంటారు. ఫ్యాన్స్‌ని ఇలా సంబోధించాలనే ఆలోచన ఎక్కడిది? ఫ్యాన్స్ అనే పదంతో నాక్కొంచెం ఇబ్బంది. ఆ పదానికి బదులు వేరే ఏదో ఉంటే బాగుంటుందనుకున్నా. అది బై చాన్స్ ‘రౌడీ’ అయ్యింది (నవ్వుతూ). ఒకరి ఫెయిల్యూర్ని ఇంకొకరు సెలబ్రేట్ చేసుకుంటూన్నారంటే.. ఫెయిల్యూర్ని ఎదుర్కొన్న వ్యక్తి టాప్‌లో ఉన్నట్టే. మరి మీ సినిమా ఫెయిల్యూర్‌కి పార్టీ చేసుకున్న వాళ్ల గురించి ఏమంటారు? హహ్హహ్హ... అసూయ, పోటీతత్వం అనేవి సహజమైన ఎమోషన్స్. ఆ ఫీలింగ్స్ నుంచే ఇంకా వర్క్ చేద్దాం, ఇంకా ఏదైనా ట్రై చేద్దాం, ఇంకా.. ఇంకా అనే బోలెడన్ని మంచి ఫీలింగ్స్ వస్తుంటాయి. అందుకని అలాంటివి జరగడం మంచిదే. కాంపిటీషన్‌ని డీల్ చేయడం, స్టార్‌డమ్‌ని హ్యాండిల్ చేయడంలో ఉన్న కష్టాల? సినిమా ప్రపంచం చాలా విచిత్రమైనది. ఓ యాక్టర్‌గా జీవితం చాలా అసహజంగా ఉంటుంది. అందుకే నాకు నేను ఎప్పటికప్పుడు ‘మనం ఇక్కడ ఉన్నది నటించడానికి మాత్రమే. పోటీని ఎదుర్కోడానికి, స్టార్‌డమ్‌ని హ్యాండిల్ చేయడానికి కాదు’ అని గుర్తు చేసుకుంటుంటాను. మన పని మనం చెయ్యాలంతే. మీ డ్రెస్ కోడ్ విచిత్రంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడంలో ఇది ఓ భాగమా? వేసుకునే బట్టల గురించి పెద్దగా డిస్కషన్ అవసరం లేదని నా ఫీలింగ్. ఎవరు ఏ బట్టలు వేసుకున్నా మనకెందుకు? వాళ్లు హ్యాపీగా ఉండి, ప్రెజెంటబుల్‌గా ఉంటే చాలనుకుంటాను. ఒక రెండేళ్ల క్రితం మీ బొమ్మ బయట ఏ గోడ మీదా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నేను ఈ రోడ్డు మీద ఉన్న బొమ్మ నుంచి ‘డిటాచ్’ అయిపోయా. ఆ గోడ మీద ఉన్న అతను నాకు కేవలం ఒక నటుడు మాత్రమే. అతను అతని పని చేసుకుంటున్నాడు అనుకుంటా. అతన్ని చూసినప్పుడు నాకెలాంటి ఫీలింగ్స్ ఉండవు. మీ కెరీర్ ఎదుగుదలలో ఎవరికైనా కృతజ్ఞతగా ఉండాలంటే.. చెప్పడానికి ఏమైనా పేర్లున్నాయా? కృతజ్ఞతలు తెలపడం మాత్రమే కాదు దాన్ని ‘రీపే’ చేసి తీరుస్తా. ఇవాళ నేను ఏంటి? నేను ఎక్కడున్నాను? అనే ఈ జర్నీలో తెలిసీ తెలియక చాలామంది వ్యక్తులు కీలకపాత్ర పోషించారు. నా శక్తి మేరకు వాళ్ల జీవితాలకు తిరిగి ఏదైనా చేయడానికి ట్రై చేస్తా. యూత్‌ఫుల్ హీరోని సీరియస్ క్వొశ్చన్స్ అడుగుతున్నాం. ఇప్పుడు మీ ఏజ్‌కి తగ్గట్టు పార్టీయింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ యు ఏ పార్టీ యానిమల్? నాకు ఫ్రెండ్స్‌తో ట్రావెల్ చేయడం ఇష్టం. అలాగే వాళ్లతో స్పోర్ట్స్ ఆడటం ఇష్టం. నా ఇంటి టెర్రస్ మీద రాత్రుళ్లు గంటల తరబడి మాట్లాడంలో ఓ మజా ఉంటుంది. పార్టీయింగ్ అనే కాన్సెప్ట్ నాకు లేదు. లవ్ ఫెయిల్యూర్ అయితే ‘అర్జున్ రెడ్డి’లో డ్రగ్స్ తీసుకున్నారు. మరి రియల్ లైఫ్‌లో ఎవరైనా అలా చేస్తే? అది సినిమాలో క్యారెక్టర్. అంతే.. బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ చేయరు. బుద్ధి ఉన్నోళ్లు వాటి వైపు వెళ్లరు కూడా. ఒకవేళ మీరు లవ్‌లో ఫెయిల్ అయితే దేవదాస్ అవుతారా? ఏమో.. ఫెయిల్ అయినప్పుడు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు అందుకున్న లవ్ లెటర్స్‌లో మిమ్మల్ని బాగా ఎగై్జట్ చేసిన లెటర్? నాకు రాసిన ప్రతి లెటర్ని చదివేటప్పుడు నేను ఎమోషనల్ అవుతా. అందుకే అన్ని లెటర్స్‌ని జాగ్రత్తగా దాచుకోవాలని డిసైడ్ అయ్యాను. ‘నా పంతం ఎంతా.. ఈ విశ్వమంతా..’ అని ‘అర్జున్‌రెడ్డి’లో పాడారు. అమ్మాయిల్లో మీ ఫాలోయింగ్ విశ్వమంత. మరి ‘నన్నే పెళ్లాడాలని’ ఎవరైనా పంతం పడితే? పెళ్లికి నేను రెడీగా లేను. సో.. ఇప్పుడు ఏమీ చేయలేను. కొడుకు సక్సెస్ తల్లికి బోలెడంత ఆనందాన్ని ఇస్తుంది. మీ అమ్మ గురించి చెప్పండి? పట్టలేనంత ఆనందం, సంతృప్తి అరుదుగా కలుగుతుంటాయి. అమ్మ కళ్లలో ఆనందం చూసినప్పుడు నేనలా ఫీలవుతాను. నా సినిమాలు హిట్టయినప్పుడు కూడా పెద్దగా ఏమీ అనిపించదు. మా అమ్మానాన్నకు పెద్ద పెద్ద కోరికలు ఏవీ లేవు. ఒక్క సొంత ఇల్లు తప్ప నన్ను ఏమీ అడగలేదు. నా సక్సెస్‌ని వాళ్లు బాగా ఎంజాయ్ చేయాలని, కొత్త కొత్తవి కొనుక్కోవాలని, ట్రావెల్ చేయాలనీ ఉంటుంది. కానీ వాళ్లు ఇవన్నీ కాకుండా జస్ట్ నా వర్క్, ప్రేక్షకుల నుంచి నాకు దక్కుతున్న ప్రేమను చూసి ఆనందపడుతున్నారు. ఆ మధ్య మీ అమ్మకు బాలేనప్పుడు దగ్గరుండలేకపోతున్నా. ఈ కెరీర్ ఎందుకు అనుకున్నారట? ఏమో.. అప్పుడున్న పరిస్థితిలో అలా అనిపించింది. అమ్మానాన్న నా ప్రపంచం. ఇంత చేసి వాళ్లతో ఉండలేకపోతే ఏం లాభం అని కోపం వచ్చింది. ఆ ఎమోషన్లో అలా అనుకున్నాను. ఒకవేళ హీరోగా సక్సెస్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు? మా నాన్నగారు ఊళ్లో వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు. ఇప్పుడు ఊళ్లో నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. సో.. అక్కడ ఏదైనా ప్లాన్ చేసుకునేవాడిని. హీరోగానేనా? వేరే లక్ష్యాలేమైనా? నా క్లాతింగ్ లైన్ ‘రౌడీ వియర్’ ఎదుగుతోంది. రానున్న రెండేళ్లలో అది 100 కోట్ల కంపెనీ అవుతుంది. ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను. త్వరలో ఈ సంస్థ నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ గురించి అందరూ వింటారు. 2018లో న్యూ టాలెంట్ వచ్చింది. 2019లోనూ జరుగుతుందా? కచ్చితంగా.. ఎప్పుడూ న్యూ టాలెంట్ వస్తూనే ఉంటుంది. అది ఇండస్ట్రీకి మంచిది. ఆరోగ్యకరమైన వాతావరణం కూడా. ఫైనల్లీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెబుతారా? ఈరోజు (శనివారం) వెళ్లిపోతున్నా. ఏ ప్రాంతానికి వెళుతున్నానో చెప్పను. ఫోన్ పని చేయని చోటు అది. ఓ దీవిలో బోటులో ఉంటాను. ఒక్క పది రోజులు ఎవరికీ అందకుండా కొత్త ప్రపంచాన్ని చూసి వస్తా. – డి.జి.భవాని పుస్తకాలు చదువుతారా? చదివితే.. ఎలాంటి పుస్తకాలు? చదువుతాను. అయితే ఇప్పుడు తక్కువైంది. కానీ పుస్తకాలు చదువుతున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను. లవ్‌స్టోరీలు తప్ప అన్ని రకాల పుస్తకాలు చదువుతాను. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఆలోచిస్తాను. ఏదైనా మన మనసుని బట్టే ఉంటుంది. -
వీరి గాత్రం.. వేసింది మంత్రం..
రంగమ్మ మంగమ్మ అంటూ మానసి.. శ్రోతలను ఫిదా చేశారు. దారి చూడు అంటూ పెంచల్ దాస్ దుమ్ము లేపారు. చూసి చూడంగానే నచ్చేశావే అని అనురాగ్ కులకర్ణి అంటే... వినీ వినంగానే ఎక్కేసిందే అంటూ శ్రోతలు వంతపాడారు. ఇంకేం ఇంకేం కావాలే అని సిద్‌శ్రీరామ్ అంటే.. ఇకపై ఈ పాటనే వింటామే అంటూ సంగీత ప్రియులు బదులిచ్చారు. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని మోహన భోగరాజు చెప్పగా.. అంతే శ్రద్దగా చెవులురిక్కించి విన్నారు ఆడియెన్స్. ఈ ఏడాది గాయనీగాయకులు తమ గాత్రాలతో చేసిన మ్యాజిక్‌ను ఓసారి చూద్దాం. రంగమ్మ మంగమ్మ.. అంటూ మానసి రంగస్థలం సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాష్టారే పరీక్ష రాస్తే నూటికి నూరు మార్కులు వచ్చినట్టు.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా.. మాస్ సూత్రాలను సరిగ్గా పాటిస్తూ.. సుకుమార్ తీసిన రంగస్థలం అంతా ఒక ఎత్తైతే.. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని ప్రతీపాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రంగమ్మ మంగమ్మ పాట గురించే. ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. ఈ పాటలో సమంత అభినయం, డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటపై సోషల్ మీడియాలో లెక్కలేని వీడియోలను రీక్రియేట్ చేసేశారు అభిమానులు. ఈ పాట జనాల్లోకి వెళ్లడానికి దేవీ అందించిన ట్యూన్ ఒక కారణమైతే.. మానసి గాత్రం మరో కారణం. ఈ పాటతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్‌ను సంపాదించేశారు గాయని మానసి. ఈ వీడియోసాంగ్‌ను ఇప్పటివరకు 129మిలియన్ల మంది వీక్షించారు. దారి చూపి దుమ్ము లేపిన దాస్.. ఈ ఏడాదిలో వచ్చిన పాటలన్నింటిలో మాస్‌ను ఊపేసిన పాట ఇది. నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా మిశ్రమ ఫలితాన్నిచ్చినా.. ఈ చిత్రంలోని ఈ పాట మాత్రం పాపులర్అయింది. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్స్ అయినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. చిందులు వేయాల్సిందే. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా.. రాయలసీమ రచయిత పెంచల్ దాస్ అందించిన గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ అయింది. ఆ గాత్రంలో ఉన్న మ్యాజిక్కే.. ఈ పాటను ఇంతలా వైరల్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో 38మిలియన్ల మంది వీక్షించారు. వినీ వినంగానే నచ్చేసిందే... ఈ ఏడాది యూత్‌ను ఊపేసిన పాటల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉండేది ఛలో సాంగ్. చూసి చూడంగానే అంటూ నాగశౌర్య రష్మిక మాయలో పడిపోతే.. ఈ పాటను వినీ వినంగానే నచ్చేసిందే అనేలా చేసేశారు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఎక్కడ చూసిన ఈ పాటే కాలర్‌ట్యూన్.. రింగ్‌టోన్‌గా మారిపోయింది. ఈ పాటను 94మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఏడాదిలో అనురాగ్ అందరికీ గుర్తుండియో పాటలు పాడి శ్రోతలకు మరింత దగ్గరయ్యారు. మహానటి టైటిల్ సాంగ్.. ఆర్ఎక్స్ 100 పిల్లా రా వంటి సాంగ్‌లను పాడి అనురాగ్ కులకర్ణి ఫుల్ ఫేమస్ అయ్యారు. వీటిలో పిల్లా రా సాంగ్‌ను యూత్‌ను కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను 140మిలియన్ల మంది చూశారు. ఇంకేం ఇంకేం కావాలే.. ఇంకేం ఇంకేం కావాలే.. అని సిద్ శ్రీరామ్ అంటే ఈ ఏడాదికి ఇదే చాలే అని ప్రేక్షకుల బదులిచ్చారు. గీతగోవిందంలోని ఈ పాటే సినిమాపై హైప్‌ను క్రియేట్ చేసింది. ఒక్కపాట సినిమాపై అంత ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ పాటే ఓ ఉదహరణ. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు బలాన్నిచ్చింది. గోపి సుందర్ అందించిన బాణీకి, సిద్‌శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోయగా.. సంగీత ప్రియులను ఈ పాట ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులకు అందరికీ ఈ పాట ఎక్కేసింది. రికార్డు వ్యూస్లతో యూట్యూబ్‌లో ఈ పాట దూసుకెళ్తోంది. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని గంభీరంగా చెప్పిన మోహన.. అరవింద సమేత.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో సంగీతం ప్రధాన ప్రాత పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెడ్డమ్మ సాంగ్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాట.. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని వివరించగా.. ఆ గాత్రంలోని తెలియని ఆకర్షణకు అందరూ ముగ్దులయ్యారు. మోహన భోగరాజు ఈ పాటతో అందరికీ సుపరిచితురాలయ్యారు. పెంచల్ దాస్ తన రాయలసీమ యాసలో అందించిన సాహిత్యం ఈ పాటపై మరింత ప్రభావాన్ని చూపింది. ఇలా ఈ ఏడాది తమ గాత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువతరంగాలు.. వచ్చే ఏడాది కూడా తమ హవాను కొనసాగించాలని మరిన్ని మంచి పాటలను ఆలపించాలని ఆశిద్దాం. -
ఎంత వెతికితే అంతే టాప్!
నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఒకే ఇంట్లో నాలుగైదు స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. రోజులో కొంత సయమాన్ని ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియాకి యువత టైమ్ కేటాయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. మరి.. ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు వెతికిన సౌత్ ఇండియా టాప్ ట్రెండింగ్ స్టార్‌గా చిరంజీవి నిలిచారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇంకా ఈ ‘టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ మూవీ స్టార్స్ 2018’ విభాగంలో నాని ద్వితీయ స్థానం సంపాదించారు. ఇంకా మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు, జగపతిబాబు, నాగశౌర్య నిలిచారని సదరు పత్రిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో కథానాయికల్లో ఐదో స్థానంలో రష్మికా మండన్నా, యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఆరో స్థానం కైవశం చేసుకోవడం విశేషం. ఈ సంగతి అలా ఉంచి... టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ మూవీస్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వం వహించిన ‘గీత గోవిందం’ సినిమా టాప్‌లో నిలిచిందట. తమిళ హీరో విజయ్–దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘సర్కార్’ చిత్రం సెకండ్ ప్లేస్‌ను దక్కించుకుంది. రామ్‌చరణ్ ‘రంగస్థలం’, మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’, రజనీకాంత్ చిత్రాలు ‘కాలా, 2.ఓ’, కీర్తీసురేశ్ నటించిన ‘మహానటి’, వరుసగా 3,4,5,6,7 స్థానాల్లో నిలిచిన చిత్రాలు. అలాగే టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ సాంగ్స్ కేటగిరీని పరిశీలిస్తే... నాగార్జున, నాని మల్టీస్టారర్ మూవీ ‘దేవదాసు’ చిత్రంలోని ‘వారు వీరు..’ అనే సాంగ్ టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. ‘టాక్సీవాలా’లోని ‘మాటే వినదుగా...’, హలో గురు ప్రేమకోసమే..’ సినిమాలో ‘మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్’, ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ సాంగ్స్ వరసగా 2,3,4 స్థానాల్లో నిలిచాయట. అలాగే ఈ ఏడాది ఐఎమ్‌డిబి (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) విడుదల చేసిన టాప్ టెన్ బెస్ట్ ఇండియన్ మూవీస్ జాబితాలో ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలు వరుసగా 4,7 స్థానాల్లో నిలిచాయి. ఇక బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తమిళ హీరో విష్ణువిశాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ రెండో స్థానంలో నిలవగా విజయ్ సేతుపతి, త్రిష నటించిన ‘96’ చిత్రం మూడో ప్లేస్‌లో నిలిచింది. ‘బధాయి హో (5), ప్యాడ్ మ్యాన్ (6), స్త్ర్రీ (8), రాజీ (9), సంజు (10) ఈ లిస్ట్‌లో చోటు సంపాదించిన మిగతా హిందీ చిత్రాలు. బాలీవుడ్లో అంతమంది స్టార్లు ఉన్నప్పటికీ యువనటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాధూన్, బధాయి హో’ చిత్రాలు టాప్ టెన్‌లో ఉండటం చెప్పుకోవాల్సిన విషయం. ప్రభాస్ 13 సెక్సీయస్ట్ ఆసియన్మెన్ 2018 జాబితా కూడా విడుదలైంది. సౌత్ కొరియాకు చెందిన బీటీఎస్ అనే మ్యూజిక్ బ్యాండ్ బృందం టాప్‌ప్లేస్‌ను దక్కించుకుంది. ఈ బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న షాహిద్ కపూర్ సెక్సీయస్ట్ బాలీవుడ్ యాక్టర్‌గా నిలిచారు. ఇక రణ్వీర్ సింగ్, ప్రభాస్, సల్మాన్‌ఖాన్, వరుణ్ ధావన్, షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ వరుసగా 11,13,14,18,25,29 స్థానాల్లో నిలిచారు. కన్నుకొట్టి అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న మలయాళ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇండియా గూగుల్ సెర్చ్‌లో మోస్ట్ సెర్డ్చ్ పర్సనాలిటీ–2018గా తొలి స్థానం సంపాదించుకున్నారు. డ్యాన్సింగ్ పర్సనాలిటీ స్పనా చౌదరి రెండో స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ భర్త ఆనంద్ ఆహూజా ఈ జాబితాలో ఐదోస్థానంలో నిలిచారు. -
గీత.. గోవింద్
గీత గోవిందం ఫేం హీరో హీరోయిన్లు విజయ్‌దేవరకొండ, రష్మికలు చందానగర్‌లో సందడి చేశారు. మంగళవారం వీరు ఇక్కడ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్‌ను ప్రారంభించారు. మియాపూర్: ‘గీత గోవిందం’ సినిమా హీరోవిజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మండన్న మంగళవారం చందానగర్‌లో సందడి చేశారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కేఎల్ఎం ఫ్యాషన్ మాల్‌ను వారు ప్రారంభించారు. విజయ్ను చూసేందుకు అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. అబ్బుపరిచే అంతర్జాతీయ ఫ్యాషన్ దుస్తులు కేఎల్ఎం మాల్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో నిర్వాహకులు కళ్యాణ్ పాల్గొన్నారు. -
షార్ట్ ఫిలింలో లక్కీ హీరోయిన్
టాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఛలో, గీత గోవిందం సినిమాలతో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇటీవల దేవదాస్‌తో మరో సక్సెస్‌ను అందుకుంది. దీంతో రష్మికను లక్కీ హీరోయిన్గా భావిస్తున్నారు తెలుగు స్టార్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న రష్మిక ఓ షార్ట్ ఫిలింలో సందడి చేసింది. ‘ఎవ్రీ నాన్ తెలుగు ఫ్రెండ్ ఎవర్’ పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం రష్మిక తెలుగు రాని కన్నడ అమ్మాయిగా కనిపించింది. తనకు తెలుగు రాకపోవటంతో ఎవరైన తెలుగులో మాట్లాడిన విషయాలను తెలుసుకునేందుకు తన ఫ్రెండ్ సాయం తీసుకోవటం, సినిమాలకు తన ద్వారా డబ్బింగ్ చెప్పించుకోవటం లాంటి సీన్స్‌ను ఫన్సీగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ దమ్ము సినిమా చూసి రష్మిక ఇచ్చిన రియాక్షన్స్ సూపర్బ్. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. -
బాలీవుడ్‌కు విజయ్ దేవరకొండ..!
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. గీత గోవిందంతో మరోసారి సత్తా చాటాడు. ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో దర్శక నిర్మాత విజయ్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న నోటా తో పాటు టాక్సీవాలా సినిమాల్లో నటిస్తున్న విజయ్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడట. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, కృష్ణ డికెలు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్లో షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గోన్ సినిమాలతో ఆకట్టుకున్న ఈ దర్శకద్వయం తాజా స్త్రీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. తెలుగులో ఢీ ఫర్ దోపిడి సినిమాకు దర్శకత్వం వహించారు. -
‘రౌడీ’లకు విజయ్ దేవరకొండ చాలెంజ్
గతంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫిట్నెస్ చాలెంజ్ తరహాలో ప్రస్తుతం గ్రీన్ చాలెంజ్ ట్రెండ్ అవుతోంది. పలువురు సినీ రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమ సన్నిహితులకు గ్రీన్ చాలెంజ్‌ను విసురుతున్నారు. పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు. తనకు కిడాంబి శ్రీకాంత్, బొంతు రామ్మోహన్‌లు విసిరిన హరితహారం సవాల్‌ను స్వీకరించిన విజయ్, కాకినాడ యువకులతో కలిసి మొక్కలు నాటారు. తరువాత వారితో కలిసి భోజనం చేస్తూ సరదాగా గడిపారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో ఘనవిజయం సాధించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్సీవాలా, నోటా సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. #HarithaHaram #GreenChallenge accepted :) Planting trees and lunching with my Kakinada Boys :)) I now challenge my rowdies @Sheetal_Chowhan @samhitha17 @ChaltanyaReddy @akshitha9198 @karanam_pooja @xziamstheticx @keerthanaGMalar pic.twitter.com/gB4iyjBvtD — Vijay Deverakonda (@TheDeverakonda) 31 August 2018 -
‘గీత గోవిందం’ నా సినిమాకు కాపీ..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గీత గోవిందం. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖలు ఈ చిత్రాన్ని అభినందించారు. ప్రస్తుతం వీరి కోవలోకి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా చేరారు. ఒక అవార్డుల కార్యక్రమానికి హజరైన రాఘవేంద్ర రావు ‘గీత గోవిందం’ సినిమాను అభినందిస్తూ.. ఈ సినిమాను చూస్తే 20 ఏళ్ల క్రితం నేను శ్రీకాంత్‌తో తీసిన ‘పెళ్లి సందడి’ చిత్రం గుర్తుకు వచ్చింది అని తెలిపారు. దర్శకుడు పరుశురాం ‘పెళ్లి సందడి’ సినిమాను కాపీ కొట్టాడేమో అనిపించిందన్నారు. అసభ్యతకు తావు లేకుండా చాలా చక్కగా గీత గోవిందం చిత్రాన్ని తెరకెక్కించాడని అభినందించారు. చిన్న సినిమాగా విడుదలైన గీత గోవిందం ఇంత భారీ విజయాన్ని సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో దర్శకుడు పరుశురామ్ని మెచ్చుకోవాలి అని తెలిపారు. 20 ఏళ్ల క్రితం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అల్లు అరవింద్, అశ్విని దత్‌లు నిర్మాతలుగా ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మూడు నంది అవార్డులను అందుకుంది. -
నాకు పునర్జన్మను ప్రసాదించింది
‘‘ఈ పదేళ్లలో నేను ఆరు (యువత, సోలో, ఆంజనేయులు, సారొచ్చారు, శ్రీరస్తు–శుభమస్తు, గీత గోవిందం) సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు ఆడలేదు. రైటర్‌గా, డైరెక్టర్‌గా ‘గీత గోవిందం’ సినిమా నాకు పునర్జన్మను ప్రసాదించింది’’ అన్నారు పరశురామ్. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. పరశురామ్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి, ‘బన్నీ’ వాసుకి, విజయ్ దేవరకొండకి థ్యాంక్స్. ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా కథను బన్నీ (అల్లు అర్జున్)కి రాంగ్ టైమ్‌లో చెప్పాను. అయితే కథను మాత్రం వదలొద్దు అన్నారు. నెక్ట్స్ ఇదే బ్యానర్లో మరో సినిమా, మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా ఉండొచ్చు. మంచు విష్ణుతో ఓ సినిమా ఉంటుంది. ఫ్యూచర్లో పూరి జగన్నా«థ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఓ మూవీ ఉండొచ్చు. నాకు ప్రొడక్షన్ వైపు కూడా ఆసక్తి ఉంది’’ అన్నారు. -
స్క్రీన్ ప్లే 27th August 2018
-
సొంత గొంతుతో హిట్ హీరోయిన్
ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక, ప్రస్తుతం ఓ క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రష్మిక సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గీత గోవిందంకే డబ్బింగ్ చెప్పుకోవాలని భావించినా డేట్స్ అడ్జస్ట్ కాక చెప్పలేకపోయారు. అందుకే ఈ సారి ఎలాగైన దేవదాస్‌లో సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారు రష్మిక. -
‘ముగ్ధ’మనోహరం
-
నాకేం ‘సైట్’ లేదు..
‘గీత గోవిందం సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈసారి దేవదాస్‌తో కలిసి కనిపిస్తాను’ అని చెప్పింది రష్మిక. నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ముగ్ధ షోరూమ్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా రష్మిక ‘సాక్షి’తో ముచ్చటించింది. సాక్షి, హైదరాబాద్ : ‘నాకు కంచిపట్టు చాలా నచ్చుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగల సమయంలో పట్టు చీరలు ధరించడం బాగా అనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వరుసగా సినిమాలు చేస్తున్నాను. నేను నటించిన దేవదాస్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. నిజానికి నాకు ఖాళీ సమయం తక్కువే’ అంటూ చెప్పిందీ బ్యూటీ. గీతగా అద్భుతమైన హావభావాలు పలికించిందని పేరు తెచ్చుకున్న రష్మిక... ‘నా కళ్లు బాగా ఎక్స్‌ప్రెసివ్ అని మా డైరెక్టర్ గారు చెప్పారు. ఓసారి నేను డైలాగ్స్ లేకుండా డెఫ్ అండ్ డంబ్ పాత్ర చేశాను. అందుకే బాగా అలవాటై ఉంటుంది’ అంటూ నవ్వేసింది. నాకేం ‘సైట్’ లేదు.. ‘నా పాత్ర ద్వారా హీరో విజయ్ దేవరకొండని డామినేట్ చేశాననడం అస్సలు నమ్మను. నేను అలా అనుకోవడం లేదు. సినిమాలో నా పాత్రను తమకు తెలిసిన అమ్మాయిలా ప్రేక్షకులు ఫీలైతే... అది నాకు మంచి కాంప్లిమెంట్ అనిపిస్తుంది. కథ విన్నప్పుడు క్యారెక్టర్ విభిన్నంగా అనిపిస్తే తప్పకుండా.. ఆ సినిమాకు ఓకే చెబుతాను. ఆరేడు నెలల్లోనే తెలుగు బాగానే నేర్చుకోగలిగాను..’ అంటూ ఆనందం వ్యక్తం చేసిందీ అమ్మడు. ‘ఛలో సినిమా చేసిన తర్వాత నన్ను కేవలం కళ్లద్దాలు ఉంటేనే గుర్తు పట్టేవారు. ఇప్పుడు అవి లేకుండా కూడా గుర్తు పడుతున్నారు’ అంటూ నవ్వేసిన రష్మిక... తనకు కళ్లజోడు పెట్టుకోవాల్సిన పని లేదని, దృష్టి లోపం ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘అప్పుడప్పుడు టఫ్‌గా ఉంటాను. నేను నిజ జీవితంలో టామ్‌బాయ్ టైప్ కాద’ని సెలవిచ్చింది. -
‘గోవిందుడు’ మాములోడు కాదు!
విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసేశాడు. ఈ చిత్రం విజయ్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ మూవీలో విజయ్ కల్ట్ అండ్ అగ్రెసివ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా విజయ్ తన ‘గీత గోవిందం’ సినిమాతో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. విజయ్ నటనలో అర్జున్ రెడ్డి చాయలను కనిపించకుండా ఈ చిత్రంలో ఒదిగిన తీరుకు విమర్శకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. సింపుల్ కథతో తెరకెక్కినా.. కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ పరుశురామ్ విజయం సాధించాడు. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న నటన మేజర్ ప్లస్. గోపి సుందర్ అందించిన సంగీతం చిత్రం విజయంలో పాలు పంచుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హీరోలకు కష్టమయ్యే ఫీట్‌ను అవలీలగా కొట్టేశాడు. యాభై కోట్ల క్లబ్లో చేరడానికి ఎంతో కష్టపడుతున్న హీరోలను వెనక్కినెట్టి ఈజీగా 75కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసేశాడు విజయ్. ఫుల్ రన్లో మరి ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. -
‘గోవిందుడు’ని మెచ్చుకున్న ఎంపీ కవిత
విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’తో ఎంత సందడి చేశాడో అందరికీ తెలిసిందే. విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ టాలీవుడ్లో దూసుకెళ్తోంది. వసూళ్లలో ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే దాదాపు 40కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. చూస్తుంటే ఈ మూవీ హవా ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ మూవీని వీక్షించిన సినీ ప్రముఖుల రాజమౌళి, చిరంజీవి, మహేష్ బాబు, రామ్‌చరణ్ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కవిత ఈ చిత్రం బృందాన్ని అభినందించారు. మంచి కుటుంబ కథాచిత్రాన్ని అందించినందుకు దర్శకుడు పరశురామ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఓవర్సీస్లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. అర్జున్ రెడ్డి వసూళ్లను అధిగమించి.. రెండు మిలియన్ డాలర్లకు పరిగెడుతోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ రన్‌తో ఈ సినిమా నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జోడిగా నటించిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందించగా.. పరశురామ్ దర్శకత్వం వహించారు. -
నేను యస్.. ఆయన వి...
‘‘గీత గోవిందం’ సినిమా పూజ రోజు అల్లు అరవింద్‌గారు నాతో ‘మా లక్ష్మీ (పారితోషికం)ని మీరు తీసుకొని మీ సరస్వతి (కెమెరా వర్క్)ని మాకు ఇవ్వండి’ అన్నారు. ఎందుకో ఆ మాట నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. టెక్నీషియన్స్‌కు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పది’’ అని కెమెరామేన్ యస్. మణికందన్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఈ నెల 15న రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తోందని చిత్రబృందం పేర్కొంది. మణికందన్ చెప్పిన విశేషాలు. ► కెరీర్ స్టార్టింగ్‌లో కెమెరామేన్ శరవణన్, మనోజ్ పరమహంసలగారి వద్ద వర్క్ చేశాను. ‘రేసు గుర్రం’ సినిమాలో రెండు పాటలకు లైటింగ్ చేయడానికి వస్తే ‘ముకుంద’ సినిమాకు అవకాశం వచ్చింది. తమిళంలో ‘కుట్రమ్ కడిదల్, మగళిర్ మట్టుమ్’ అనే సినిమాలు చేశాను. ► ‘గీత గోవిందం’ పాయింట్ బావుంది.. ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సినిమా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ అవుతుందనుకోలేదు. అరవింద్‌గారి అనుభవం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకు ఏం కావాలో మాత్రమే ఆలోచిస్తారు. వరుసగా రెండు సార్లు ఆయన బ్యానర్లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. పరశురామ్‌తో వర్క్ చేయడం బాగుంటుంది. ఫస్ట్ సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’ జర్నీ చాలా నచ్చడంతో సెకండ్ సినిమాకు కూడా అసోసియేట్ అయ్యాం. ► ‘బన్నీ’ వాసు గారు సినిమా స్టార్ట్ కాకముందు ఏం కావాలి? అని అడుగుతారు. అంత ఫ్రీడమ్ ఇస్తారు. విజయ్ దేవరకొండ సింప్లీ సూపర్. ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అయినా కూడా తను మాత్రం సింపుల్‌గానే ఉన్నాడు. ► నా నెక్ట్స్ మూవీ సెప్టెంబర్‌లో ఆరంభమవుతుంది. పూరీగారు కాల్ చేశారు. త్వరలో అనౌన్స్ చేస్తాను. తెలుగు ఆడియన్స్ అంటే ఇష్టం. వాళ్లు సినిమా మీద చూపించే అభిమానం ఆకట్టుకుంది. నా దృష్టిలో బెస్ట్ ఆడియన్స్ అంటాను. ‘‘చాలామంది నన్ను కెమెరామేన్ వి.మణికందన్ (ఓం శాంతి ఓం, రా.వన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫేమ్)తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇదే విషయాన్ని ఓసారి ఆయనతో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు నా ‘ఓం శాంతి ఓం’ నువ్వే చేశా వని చెప్పేయ్’’ అని సరదాగా అన్నారు. -
బాలీవుడ్ సినిమాలపై ‘గోవిందుడి’ దెబ్బ
విజయ్ దేవరకొండ వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం విజయ్ స్టార్‌డమ్‌ను పెంచేసింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్.. గోవిందుడిగానూ ప్రేక్షకులను మెప్పించేశాడు. వసూళ్లలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘గీత గోవిందం’కు ఎదురులేకుండా పోయింది. కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇక్కడే కాక ఓవర్సీస్లో కూడా దూసుకెళ్తోంది. అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఇక ఆస్ట్రేలియాలో పరిస్థితిని చూస్తే మాత్రం బాలీవుడ్‌కు నిద్ర పట్టేలా కనిపించడం లేదనిపిస్తోంది. అక్కడ గత వారం విడుదలైన గోల్డ్, సత్యమేవ జయతే సినిమాలు ‘గీత గోవిందం’ ధాటికి నిలబడలేకపోతున్నాయట. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్’, జాన్ అబ్రహం హీరోగా వచ్చిన ‘సత్యమేవ జయతే’ సినిమాలు ఆస్ట్రేలియాలో ‘గీత గోవిందం’ జోరు చూసి ఖంగుతిన్నాయట. ఈ రెండు కలిసి 1.92లక్షల డాలర్లు వసూళ్లు చేయగా.. గీత గోవిందం మాత్రం 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు చేసిందని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు విజయ్ దేవరకొండ హవా ఏ రేంజ్లో ఉందో. పరుశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్గా నటించింది. Guess which Indian film has proven a tough opponent to #Gold and #SatyamevaJayate in Australia? Telugu film #GeethaGovindam, starring Vijay Deverakonda... The *combined* weekend biz of the two Hindi films [A$ 192,306] is less than that of #GeethaGovindam [A$ 202,266]. @comScore — taran adarsh (@taran_adarsh) August 20, 2018 -
ఓవర్సీస్లోనూ దుమ్ము దులుపుతున్నాడు!
‘గీత గోవిందం’ సినిమాతో మళ్లీ తన మేనియాను సృష్టించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ స్టార్ హీరో స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం సినిమా హిట్ అవడమే కాదు.. తన నటనకు సినీ విశ్లేషకులు, సెలబ్రెటీల నుంచి మెప్పును పొందుతున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటినుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రికార్డు కలెక్షన్లు కలెక్ట్ చేస్తోన్న‘గీత గోవిందం’ సినిమాతో.. తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్లో కలెక్షన్స్ పరంగా దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్‌ను కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్లకు పరుగెడుతోంది. రష్మిక మందాన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. #GeethaGovindam grossed $1.5+ million at US Box-office #GeethaGovindamRampage pic.twitter.com/H5zQnNlLjV — BARaju (@baraju_SuperHit) August 20, 2018 -
‘గీత గోవిందం’ సక్సెస్ సెలబ్రేషన్స్
-
మేకింగ్ ఆఫ్ మూవీ - గోత గోవిందం
-
ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కర్ని హెచ్చరిస్తున్నా: చిరంజీవి
‘‘ఈ ఫంక్షన్లో పాలు పంచుకోవడం నా బాధ్యత. ఆ సంతృప్తి కోసమే ‘గీత గోవిందం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌కి వచ్చా. ఓ సినిమా బాగుందంటే అది చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెట్ సినిమానా అని ఆలోచించరు. కంటెంట్ బాగుంటే మీ (ప్రేక్షకులు) దృష్టిలో అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే’’ అని చిరంజీవి అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘రెండేళ్లుగా చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషం, ఉత్సాహం, ప్రోత్సాహంతో ముందుకెళుతోందన్నది వాస్తవం. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, అభిమానానికి మేం ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. ఏం సినిమా తీస్తున్నారని అరవింద్‌గారిని నేను అడిగినప్పుడు ‘గీత గోవిందం’ చేస్తున్నాను. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్ అగ్రెసివ్ పాత్ర చేశాడు.. ‘గీత గోవిందం’ సినిమాలో చాలా సాఫ్ట్. ఈ పాత్రని ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న డౌట్ వచ్చినప్పుడు ‘విజేత’ గుర్తొచ్చింది. ‘ఖైదీ, అడవిదొంగ, చట్టంతో పోరాటం, చట్టానికి కళ్లు లేవు’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా నేను దూసుకెళుతున్న టైమ్‌లో.. ‘విజేత’ ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఈ పాత్రలో నన్ను ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న మీమాంస నాకు, అరవింద్‌గారికి ఉండేది. ఆ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసి, ఆల్ క్లాస్ హీరో అనిపించింది. ‘గీత గోవిందం’ సినిమా కూడా విజయ్‌ని ఆల్ క్లాస్ హీరో అనిపించింది. విజయ్‌కి ఇది ల్యాండ్ మార్క్ ఫిల్మ్. నీకు చాలా భవిష్యత్ ఉంది. ఈ సినిమాతో నీకు స్టార్ స్టేటస్ వచ్చింది. 1978 నుంచి నేను 30 సినిమాలు చేసినా సరే ‘ఖైదీ’ సినిమా నాకు స్టార్ హీరో స్టేటస్ ఇచ్చింది. ఇండస్ట్రీలోని టాప్‌స్టార్స్‌లో విజయ్ ఒక్కడు అయినందుకు స్వాగతిస్తున్నా. మన ఇండస్ట్రీకి దక్కిన మరో అరుదైన స్టార్ విజయ్ దేవరకొండ’’ అన్నారు. ఇదేం న్యాయం పైరసీ గురించి చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గీత గోవిందం’ సినిమా కంటెంట్ దాదాపు గంటన్నర్ర లీకైపోయింది.. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు అరవింద్. ఆయనకు ఊరట కలిగించేందుకు నేను ఓ మాట చెప్పా. పవన్ కల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ కంటెంట్ లీకైనా సక్సెస్‌కి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. ‘గీత గోవిందం’ సినిమా కూడా ‘అత్తారింటికి దారేది’ అంత హిట్ అవుతుందని సెంటిమెంట్‌గా అనుకోమని చెప్పా. ఇన్ని కోట్లు వెచ్చించి ఓ సినిమా తీసిన తర్వాత ఆ కంటెంట్‌ని కుర్రతనంగానో, వేరే దురుద్దేశాలు ఉండో దాన్ని చోరీ చేసి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం ఏం న్యాయం? సినిమా పరిశ్రమ కొన్ని వేలమందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న మాతృసంస్థ.. తల్లిలాంటిది. ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్ దాన్ని దొంగలించి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడమంటే ఎంత ద్రోహం చేస్తున్నారంటే.. తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని తెలుసుకోవాలి. ఈరోజు వారంతా జైలులో ఊసలు లెక్కపెడుతున్నారు. ఈ దుస్థితి కావాలా మీకు? మీ తల్లితండ్రులకు బాధ కలిగించాలా? ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కర్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. కింది స్థాయి టెక్నీషియన్స్ ఎవరైనా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే అది మీ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని గుర్తుంచుకోండి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ లాస్ట్ రీల్ రీ–రికార్డింగ్ టైమ్‌లో కంటెంట్ లీకు అయిందని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇంతటి విజయ పతాకం ఎగురవేస్తుంటే మేం చూసి ఆనందిస్తున్నాం. పరశురామ్ గ్రేట్ రైటర్. చిరుకి, విజయ్‌కి కొన్ని కామన్ పోలికలు ఉన్నాయి. విజయ్.. ఈ సినిమాతో నువ్వు స్టార్ అయ్యావు’’ అన్నారు. చిత్ర నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం బన్నీనే (అల్లు అర్జున్). అరవింద్ గారికి రెండు సక్సెస్ సీక్రెట్స్ ఉన్నాయి. సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా బాగా రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?.. ఇదే ఆయన మొదటి సక్సెస్ ఫార్ములా. రెండో సక్సెస్ ఫార్ములా ఏంటంటే.. డైరెక్టర్ అనుకున్నట్లు సినిమా వచ్చేవరకూ, ఆయనకు సంతృప్తి ఇచ్చే వరకూ తీయిస్తూనే ఉంటారు’’ అన్నారు. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి, నాకు పునర్జన్మను ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చిరంజీవి సార్.. మీరు మా సినిమా చూసి నాతో మాట్లాడిన మాటలు నాకు భగవద్గీత లాంటివి. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లేని విజయ్ హీరోగా ఎదుగుతూ పైకొస్తుంటే ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి హ్యాట్సాఫ్’’ అన్నారు. ‘‘ఇక్కడ మనం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. కేరళ పరిస్థితి బాగోలేదని మొన్నే చిరంజీవిగారు, చరణ్, బన్నీ చేయూతనిచ్చారు. అరవింద్‌గారి అనుమతితో మా బ్యానర్ నుంచి ఓ పది లక్షలు ఇవ్వనున్నామని ఇక్కడ ప్రకటిస్తున్నా. ‘అర్జున్‌రెడ్డి’తో కాదు ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరో స్థాయికి వెళ్లాడు విజయ్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్ వెనకాల అరవింద్‌గారు, పరశురామ్‌గారు, ‘బన్నీ’వాసుగారు ఉన్నారు. జస్ట్ నేను యాక్టర్లా నా జాబ్ చేశానంతే’’ అన్నారు విజయ్ దేవరకొండ. సీనియర్ నటి అన్నపూర్ణ, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, శానం నాగఅశోక్‌కుమార్, డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, కెమెరామేన్ మణికందన్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బిగ్‌బాస్‌లో ‘అర్జున్ రెడ్డి’
బిగ్‌బాస్‌లో సెలబ్రెటీలు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్మేట్స్, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ‘వైఫ్ ఆఫ్ రామ్’ ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మి హౌస్‌లోకి ఎంట్రీ చేసిన సందడిని చూశాం. లోక నాయకుడు కమల్ హాసన్ బిగ్‌బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యపరిచాడు. ఈ యూనివర్సల్ హీరోతో కలిసి ఇంటి సభ్యులు చేసిన హంగామాను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. ‘గీత గోవిందం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్‌తో కలిసి బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి వేదిక దొరికినా తన మాటలతో మాయ చేసే అర్జున్ రెడ్డి.. ఇక ఇంటి సభ్యులతో ఎంత హంగామా చేశాడో తెలియాలంటే.. ఆదివారం షో చూడాల్సిందే. విజయ్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. -
నా లైఫ్‌లో అది బెస్ట్ కాఫీ
‘‘సినిమా జెన్యూన్ హిట్ సాధించినప్పుడు పెద్ద హీరోలు ఆ సినిమా సక్సెస్ గురించి సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. ఎప్పటికైనా నేను తీసిన సినిమాకు కూడా అలా జరగాలి అనే ఆకాంక్ష ఉండేది. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాను ఎడిట్ రూమ్‌లో చూసిన బన్నీ (అల్లు అర్జున్)గారు ఆత్మీయంగా హత్తుకున్నారు. అలాగే మూవీ రిలీజ్ తర్వాత మహేశ్‌బాబు, రామ్‌చరణ్ స్పందించడం మర్చిపోలేను’’ అన్నారు ‘బన్నీ’ వాసు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. ఈ చిత్రం హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘బన్నీ’ వాసు పంచుకున్న విశేషాలు... ► సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాం. కానీ ఈ రేంజ్ సక్సెస్‌ను ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ఇండస్ట్రీలో మూవీ రిలీజైన రెండో రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీ ‘గీత గోవిందం’. తమిళనాడులో కూడా ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ రోజే దాదాపు 1.18 కోట్ల గ్రాస్ వచ్చింది. షాకయ్యాం. కేరళలో అంత వర్షం కురుస్తున్నప్పటికీ ఫస్ట్ రోజే దాదాపు 14లక్షల గ్రాస్ వచ్చింది. నెక్ట్స్ డే 6 లక్షల గ్రాస్ వచ్చింది. అందుకే కొంత కలెక్షన్‌ను విరాళంగా ఇద్దాం అనుకున్నాం. ► నిర్మాతగా నాకు ప్రత్యేకమైన సక్సెస్ ఫార్ములా ఏమీ లేదు. సెట్లో నేనొక బ్రదర్‌లా డైరెక్టర్‌తో కలిసిపోతా. డైరెక్టర్ని బాగా అర్థం చేసుకుని ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. ప్రాజెక్ట్స్ విషయంలో నాది జడ్డిమెంట్ కాదు.. నమ్మకం. ఈ సినిమాలో పరశురామ్ కూడా ఒక పార్ట్నర్. హీరో విజయ్ దేవరకొండకి పరశురామ్ కథ చెప్పాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా. ఈ కథ వర్కౌట్ అవుతుందా? అని విజయ్ ఆలోచించాడు. అప్పుడు ఏ క్లాస్.. బీ క్లాస్ అని కాదు ఈ సినిమా యూనివర్శల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందని చెప్పాను. నా సలహాను విజయ్ బాగా రీసివ్ చేసుకున్నాడు. విజయ్ నిజాయితీ, నిరాడంబరత చాలా బాగుంటాయి. ► ‘అర్జున్‌రెడ్డి’ రిలీజ్ తర్వాత మా సినిమా గురించి రెండు నెలలు టెన్షన్ పడ్డా. కానీ పరశురామ్ కథను మార్చలేదు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేసిన విజయ్ ‘గీత గోవిందం’లో మేడమ్ మేడమ్ అంటూ హీరోయిన్ వెంటపడటం వర్కౌట్ అవుతుందా? అనిపించింది. అసలు సినిమాలో ఇదే కొత్తగా ఉంటుందని విజయ్, పరశురామ్ అన్నారు. వాళ్ల నమ్మకం నిజం అయ్యింది. ఈ సినిమా టైటిల్ క్రెడిట్ పరశురామ్‌దే. తనతో చేయబోయే మరో సినిమాలో హీరో గాడ్‌తో ట్రావెల్ అవుతుంటాడు. ► ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారు కరెక్ట్ స్క్రిప్ట్‌ను ఎంచుకోకపోతే కష్టం. అది స్టార్స్ వారసులైనా సరే. విజయ్ కరెక్ట్‌గా స్క్రిప్ట్‌ను ఎంచుకుంటాడు. ఇటీవల రిలీజైన ‘గూఢచారి’ స్క్రిప్ట్ ను అడివి శేష్ బాగా రాసుకున్నారు. ► ‘గీత గోవిందం’ సినిమా లీకేజ్ విషయం బాగా బాధించింది. హర్డ్‌డిస్క్‌లో డిలిటైన ఫైల్‌ను రిట్రీవ్ చేశారనిపిస్తోంది. హైప్ కోసం మేమే ఫుటేజ్‌ని లీక్ చేశామనే వార్తల్లో నిజం లేదు. కోట్లు పెట్టి సినిమా తీసి అలా ఏ నిర్మాతా చేయడు. ఒకవేళ పోలీస్ పరిశోధనలో మా వైపు తప్పు ఉంటే పోలీస్ వ్యవస్థ ఊరుకోదు కదా. మేమే లీక్ చేశామనే థాట్ ఉన్నవాళ్ల సినిమా రిలీజ్ ముందే ఆన్లైన్లో వస్తే అప్పుడు మా బాధ అర్థం అవుతుందేమో. ► ఇంతవరకు చిరంజీవిగారితో 5 నిమిషాలు గడిపింది లేదు. కానీ ఈ సినిమా డిస్కషన్లో భాగంగా ఆయనతో దాదాపు గంటసేపు మాట్లాడే అవకాశం దక్కింది. అప్పుడు ఆయనతో నేను తాగిన కాఫీ నా లైఫ్‌లో బెస్ట్ కాఫీ. ► బన్నీ మూవీ గురించి త్వరలో అనౌన్స్ చేస్తాం. -
హిట్ హీరోయిన్ మేకప్ లేకుండా..!
ఛలో, గీత గోవిందం సినిమాలతో వరుస విజయాలు సాధించిన హీరోయిన్ రష్మిక మందన్న. ఈ రెండు సినిమాల్లో గ్లామర్ పరంగానే నటిగానూ రష్మికకు మంచి మార్కులు పడ్డాయి. గీత గోవిందం ఘనవిజయం సాధించటంతో టాలీవుడ్ లో రష్మికకు మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ భామ విజయ్ దేవరకొండతో మరోసారి జోడి కడుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మేకప్ లేకుండా నటిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమాతో పాటు నాగార్జున, నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ దేవ్దాస్లోనూ నానికి జోడిగా నటిస్తున్నారు రష్మిక. -
‘గీత గోవిందం’ తరువాత అదే బ్యానర్లో..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గీత గోవిందం. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన సినిమాకు పరశురామ్ దర్శకుడు. గతంలో ఇదే బ్యానర్లో శ్రీరస్తు శుభమస్తు లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే చేయనున్నారట. మరోసారి మెగా హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు పరశురామ్. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ కోసం పరశురామ్ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
‘గీత గోవిందం’ సక్సెస్మీట్కు మెగాస్టార్
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఫేమస్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డిగా విజయ్ నటనకు సినీ ప్రముఖులే కాక విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. అయితే అర్జున్ రెడ్డి పాత్రల్లోంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ‘గీత గోవిందం’ సినిమాతో మళ్లీ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు విజయ్. ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ.. సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాపై రాజమౌళి, మహేష్ బాబు, రామ్‌చరణ్ లాంటి సెలబ్రెటీలు స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చూసి చిత్రబృందాన్ని చూసి అభినందించారు. ‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి వస్తారని ప్రచారం జరిగింది. అయితే సైరా షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయితే ఆదివారం జరుగనున్న సక్సెస్ మీట్‌కు చిరు ముఖ్య అతిథిగా రానున్నారని చిత్రబృందం ప్రకటించింది. గోపి సుందర్ సంగీత అందించిన ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించారు. #MegaStarChiranjeevi is the chief guest for #GeethaGovindam #Blockbustercelebrations on this Sunday (19th August ) At Kotla Vijaya Bhaskar Reddy Stadium Yousufguda , pic.twitter.com/XsUxmHK6nB — Suresh Kondi (@V6_Suresh) August 17, 2018 -
‘అర్జున్ రెడ్డి’ మారిపోయాడు : రామ్‌చరణ్
విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్‌ను చేసేసింది ‘అర్జున్ రెడ్డి’. ఆ పాత్రల్లోంచి విజయ్ బయటకు రావడానికి చాలా కాలమే పడుతుందని అంతా అనుకున్నారు. కానీ గీత గోవిందం సినిమాలోని తన నటనలో వైవిధ్యాన్ని చూపాడు. ఎక్కడా అర్జున్ రెడ్డి చాయలను కనిపించకుండా నటించేసి.. అందరిని మెప్పును పొందుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో విజయ్ నటనకు రాజమౌళి, చిరంజీవి, మహేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ స్పందించాడు.‘ అర్జున్ రెడ్డి తరువాత విజయ్ పర్ఫెక్ట్గా మారిపోయాడు. విజయ్, రష్మికల సహజ నటన ట్రీట్‌లా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. కథా, కథనాలు బాగున్నాయి. పరుశురామ్‌కు కంగ్రాట్స్. చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు కంగ్రాట్స్’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. -
సమంతతో కలిసి విజయ్ సెలబ్రేషన్స్!
విజయ్‌దేవరకొండ ప్రస్తుతం సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నాడు. గీత గోవిందం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తూ.. రికార్డు కలెక్షన్లను కలెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ నటనను పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్ సాధించినందకు విజయ్ సెలబ్రెషన్స్ చేసుకుంటూ.. ‘నా ఫేవరేట్ సమంతతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నా’ అని... సమంత ఫోటో ఉన్న క్రాకర్స్‌ను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌కు సమంత రిప్లై ఇస్తూ.. ‘నాకు నీ సెలబ్రెషన్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేసింది. రష్మిక మందాన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించారు. 😂😂😂😂 I am glad I am part of the celebrations https://t.co/oz8hl3987b — Samantha Akkineni (@Samanthaprabhu2) August 16, 2018 -
నా పెళ్లి ఆగిందని విని నవ్వుకున్నా
‘‘నాకు బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, త్రో బాల్ అంటే ఇష్టమే. కానీ, ఎందుకో క్రికెట్ అంటే ఇష్టం ఉండదు. అసలు ఆ ఆట నాకు అర్థం కాదు. అయితే ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో క్రికెటర్‌గానే నటించాల్సి వచ్చింది. అందుకే క్రికెట్ నేర్చుకుంటుంటే దానిపై ఫోకస్ పెరిగినట్టు అనిపించింది’’ అని రష్మికా మండన్న అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలైంది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి రష్మికా మండన్న గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘గీత గోవిందం’ సినిమాకి నాకంటే ముందు వేరే హీరోయిన్లను సంప్రదించారు. వాళ్లు ఎందుకు కాదన్నారో తెలీదు. నేను మాత్రం డేట్లు టైట్‌గా ఉన్నా అడ్జస్ట్ చేసుకుని చేశా. ఇప్పుడు సూపర్ హ్యాపీగా ఉన్నా. నాకొచ్చే ప్రతి సినిమా గురించి మా ఇంట్లో, నా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తా. రియల్‌గా నేను చాలా సరదాగా ఉంటాను. ఎంత కోపం ఉన్నా లోపల దాచుకోవడానికే ప్రయత్నిస్తా. ‘గీత గోవిందం’ కోసం ఏడు నెలలు కోపంగానే నటించా. సినిమా చివరి 15 రోజులు సరదాగా ఉన్నా. సెట్లో విజయ్ దేవరకొండ ‘మేడమ్ మేడమ్’ అంటుంటే నవ్వు వచ్చేది. మానిటర్లో సినిమా చూసుకునే అలవాటు నాకు లేదు. ప్రేక్షకులతో కలిసే చూస్తా. ‘గీత గోవిందం’ అలాగే చూశా. స్క్రీన్ మీద నేను ఉన్నాననే ధ్యాసే లేదు. అంత బాగా ఎంజాయ్ చేశా. అనవసరంగా చేసే విమర్శల గురించి స్పందిస్తూ నా సమయాన్ని వృథా చేసుకోను. నాకు, రక్షిత్‌కి పెళ్లి జరగదనే వార్తలు విని నవ్వుకున్నా. ఎందుకంటే మేమేంటో మాకు బాగా తెలుసు. నిశ్చితార్థం జరిగినప్పుడు రెండున్నరేళ్లలో చేసుకుందామనుకున్నాం. ఇప్పుడు ఇద్దరం వృత్తిపరంగా బిజీగా ఉన్నాం. అందుకే ఇంకా తేదీలు అనుకోలేదు. నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది కన్నడ ప్రజలే. అందుకే అక్కడ సినిమాలు తగ్గించాలనుకోవడం లేదు. ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నా, మరో రెండు సంతకాలు జరుగుతున్నాయి. కథ నాకు నచ్చితే ఏ భాషలో సినిమా చేయడానికైనా రెడీ. అసలు గ్లామర్ అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాల్లో నేను ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగులో ‘డియర్ కామ్రేడ్, ‘దేవదాస్’ చిత్రాల్లో నటిస్తున్నా. నన్ను దృష్టిలో పెట్టుకుని ఓ నెగటివ్ పాత్ర రాయమని దర్శకుడు పరశురామ్‌కి చెప్పా. పీరియాడికల్ సినిమాల్లోనూ నటించాలని ఉంది. -
‘గీత గోవిందం’ను చూస్తూ ఎంజాయ్ చేశాను : సూపర్‌స్టార్
విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తరువాత చాలా గ్యాప్‌తో వచ్చిన సినిమా గీత గోవిందం. విజయ్ను ఇప్పటివరకు అర్జున్‌రెడ్డి గానే చూసిన ప్రేక్షకులు.. గీతగోవిందం సినిమాలోని విజయ్ నటనకూ ఆకర్షితులయ్యారు. సూపర్ హిట్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళ్తూ మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు సినిమా యూనిట్‌ను మెచ్చుకున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మూవీపై స్పందిస్తూ.. ‘ గీత గోవిందం గెలిచింది. సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక చాలా బాగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌లకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర బృందానికి కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు. దీన్ని వెన్నెల కిషోర్ రీట్వీట్ చేస్తూ.. మహేష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. -
‘గీత గోవిందం’ సినిమా చూసిన చిరు
-
యూఎస్‌లో దూసుకెళ్తోన్న ‘గీత గోవిందం’
‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బోల్డ్, ఫుల్ యాటిట్యుడ్, అగ్రెసివ్‌గా నటించిన విజయ్.. ‘గీత గోవిందం’ సినిమాలో తన నటనా వైవిధ్యాన్ని చూపించాడు. సరదాగా, అమాయకంగా కనిపించే పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. పాజిటివ్ బజ్‌తో బుధవారం (ఆగస్టు 15) రిలీజైన గీతగోవిందం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విజయ్ నటనను మెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్లో కూడా ఈ మూవీ వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే యూస్‌లో హాఫ్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. గోపిసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఛలో ఫేమ్ రష్మిక మందాన్న హీరోయిన్గా నటించింది. పరుశురామ్ ఈ సినిమాను తెరకెక్కించారు. -
‘గీత గోవిందం’ సినిమాపై రాజమౌళి ట్వీట్
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ.. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా చేసిన సినిమా ‘గీత గోవిందం’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఈరోజు(బుధవారం) విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా చూసిన అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి.. విజయ్ నటనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘‘గీత గోవిందం’ సినిమా చూసి చాలా నవ్వుకున్నాను. విజయ్ దేవరకొండ.. నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. కానీ అర్జున్ రెడ్డి వంటి సినిమా తర్వాత ఇది నీ బెస్ట్ చాయిస్. తానేం చేస్తున్నాడో విజయ్‌కు బాగా తెలుసు. సినిమా అంతా సరదా సన్నివేశాలతో నింపేశారు. సినిమాను చాలా బాగా తెరకెక్కించావు పరశురాం..’ అంటూ దర్శక ధీరుడు రాజమౌళి.. గీత గోవిందం టీమ్‌పై ప్రశంసలు కురిపించాడు. #GeethaGovindam was a laugh riot. @TheDeverakonda - what an unexpected but a spot on choice after Arjun Reddy. This guy clearly knows what he is doing. The film is full of subtle nuances and fun momemnts. Well written and handled by @ParasuramPetla. — rajamouli ss (@ssrajamouli) August 15, 2018 -
గీత లవ్స్ గోవింద్
-
‘గీత గోవిందం’ మూవీ రివ్యూ
టైటిల్ : గీత గోవిందం జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : పరశురామ్ నిర్మాత : బన్నీ వాస్ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ... మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సబ్జెక్ట్ తరువాత ఓ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా విజయ్ చేసిన గీత గోవిందం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది...? గీత గోవిందుల ప్రేమ కథ ఏంటి..? కథ ; విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) లెక్చరర్. చిన్నప్పటి నుంచి చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు విని పెరిగిన పద్ధతి గల కుర్రాడు. తను చేసుకోబోయే అమ్మాయి కూడా సాంప్రదాయబద్ధంగా, తన అమ్మలాగే ఉండాలని కలలు కంటుంటాడు. అలా ఓ అమ్మాయి వెంటే 6 నెలలు తిరిగిన తరువాత ఆ అమ్మాయికి పెళ్లయిందని తెలిసి నిరుత్సాహపడతాడు. కొద్ది రోజులకు గీత (రష్మిక మందన్న)ను గుడిలో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్) ఎలాగైన ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తన చెల్లికి పెళ్లి కుదరటంతో కాకినాడ బయలుదేరుతాడు విజయ్. గీత కూడా అదే బస్సులో విజయ్ పక్కన సీటులోనే కూర్చుంటుంది. ఎలాగైనా ప్రేమ విషయం చెప్పాలనుకున్న విజయ్, ఫ్రెండ్స్ చెప్పిన చెత్త సలహాల కారణంగా ఆమె దృష్టిలో ఓ రోగ్ అనిపించుకుంటాడు. అలా గీతకు దూరమైన విజయ్ తిరిగి ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..? ఈ మధ్యలో గీత, గోవింద్‌ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమాపై ఈ స్థాయిలో హైప్ క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారణం విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాలో తన యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన విజయ్, ఈ సినిమాలో పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్లో కనిపించాడు. భయస్తుడిలా హీరోయిన్ చుట్టూ మేడమ్..మేడమ్ అంటూ తిరిగే పాత్రలో విజయ్ నటన సూపర్బ్. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ప్రతీ సీన్లోనూ ఫన్ జనరేట్ చేయటంలో విజయ్ దేవరకొండ్ సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించే సెంటిమెంట్‌ను పండించాడు. హీరోయిన్ గా రష్మిక మరోసారి వావ్ అనిపించారు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, గీత పాత్రలో టాలీవుడ్‌కు మరింత చేరువయ్యారు. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని వేరియేషన్స్ చాలా బాగా చూపించారు. చాలా సన్నివేశాల్లో విజయ్ దేవరకొండతో పోటి పడి నటించారు. చాలా రోజుల తరువాత సుబ్బరాజుకు మంచి పాత్ర దక్కింది. ఇతర పాత్రల్లో రాహుల్ రామకృష్ణ, నాగబాబు, గిరిబాబు, అన్నపూర్ణ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న పరశురామ్. మరోసారి తనదైన కామెడీ, ఎమోషనల్ టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాత కథే అయినా.. కథనం, డైలాగ్స్‌తో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందించాడు. విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి ఇమేజ్ నుంచి బయటకు తీసుకువచ్చి డిఫరెంట్ స్టైల్లో చూపించటంలో సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగానే కాదు రచయితగాను ఫుల్ మార్క్స్ సాధించాడు. కావాలని కామెడీ సీన్స్‌ను ఇరికించకుండా లీడ్ క్యారెక్టర్స్‌తోనే మంచి కామెడీ పండించాడు. తొలి భాగం ఎంటర్టైనింగ్గా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. తరువాత వచ్చే ఎంటర్టైన్మెంట్తో అన్ని కవర్ అయిపోతాయి. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ గోపిసుందర్ సంగీతం. కథలో భాగంగా వచ్చిపోయే పాటలు ఆడియన్ను మరింతగా క్యారెక్టర్స్‌తో కనెక్ట్ చేసేస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఇలా అన్ని సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిగ్గా కుదిరాయి. ప్లస్ పాయింట్స్ : విజయ్ దేవరకొండ, రష్మిక నటన సంగీతం డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; పాత కథ అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆ రోజు క్లాసు ఎగ్గొటకపోతే బాగుండేది
‘‘నాకెవరైనా ఇది చెయ్యొద్దు.. అది చెయ్యొద్దు అంటే అస్సలు వినను. మా అమ్మా నాన్న చెప్తేనే వినను. వేరేవాళ్లు చెబితే ఎందుకు వింటాను. నేనెవర్నీ జడ్జ్ చెయ్యను. నన్నెవరైనా జడ్జ్ చేస్తే ఊరుకోను. విమర్శలు మాత్రం ఇష్టంగానే స్వీకరిస్తాను. వాటిని గౌరవిస్తాను. నేను చిన్నప్పటినుండి కొంచెం కన్ఫ్యూజ్డ్ టైపే. తెలిసి నేను తప్పు చేస్తే.. తెలిసే చేశాం కదా అని సర్దుకుపోతాను’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘గీత గోవిందం’. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు... కేబీఆర్ పార్క్ వైపు వస్తూ, నా పోస్టర్స్ చూసి, ‘ఇది నేనేనా’ అనిపించింది. ‘పెళ్ళి చూపులు’ తర్వాత తెలియకుండానే చాలా బిజీ అయ్యాను. ఆలోచించటానికి కూడా టైమ్ లేనంతగా పనిచేస్తున్నా. అయితే హెల్త్ పాడైపోయేలా పనిచేయకూడదు అనుకుంటున్నాను. ఈ బిజీ అయిపోగానే ఓ వారం రోజులు నిద్రపోతా ∙నేను చిన్నప్పుడు ఏదైనా బ్రాండ్ పెట్టి బిజినెస్ చేయాలనుకునేవాడిని. ఏడో తరగతి చదివేటప్పుడే ఇలాంటి అలోచనలు ఉండేవి. అప్పుడు నేను బట్టల కంపెనీ పెట్టాలనుకున్నా. దానికి ‘లావా’ (ఫీల్ ద హీట్) అనే పేరు కూడా పెట్టాను (నవ్వుతూ) ∙‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ‘గీత గోవిందం’కు ఒకే ఒక్క విషయం కామన్‌గా ఉంటుంది. అదేంటంటే తను ప్రేమించిన అమ్మాయి కోసం ఆ సినిమాలో అయినా ఈ సినిమాలో అయినా హీరో ఏం చెయ్యటానికైనా సిద్ధమే ∙ఈ సినిమాలో పాట పాడటానికి కొత్తవారిని ఎంకరేజ్ చేసే ప్రాసెస్‌లో వాళ్ల వాయిస్‌లను పంపమని అడిగాం. చాలామంది పంపారు. నాకు పర్సనల్‌గా ఓ రెండు వాయిస్‌లు నచ్చాయి. కానీ అరవింద్‌గారికి సచ్చలేదు. గోపిసుందర్ గారు కేరళ నుండి ట్రాక్ పంపితే ఓ పాట పాడాను. బాగానే పాడానని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను పాడిన ‘వాట్ ద లైఫ్’ బేసిక్ ట్యూన్ కాబట్టి లాగించేశాను. అంతేకానీ ‘ఇంకేం ఇంకేం కావాలి’ అనే పాట పాడాలంటే మినిమమ్ ఆరు నెలలు ప్రాక్టీస్ చెయ్యాలి ∙చిన్నప్పుడు ఒకటో తరగతిలో ‘సరిగమప’ అని పాడమంటే పాడాను. ఓ వారం రోజులు సంగీతం క్లాస్‌లో కూర్చోపెట్టారు. నాకు గేమ్స్ అంటే ఇష్టం ఉండటంతో ఆ క్లాస్ జంప్ కొట్టి గేమ్స్‌కు జారుకున్నాను. ఇప్పుడు అనిపిస్తోంది.. ఆ రోజు క్లాస్‌కు వెళితే బాగుండేదని ∙ ‘గీత గోవిందం’ స్క్రిప్ట్‌ను రెండుసార్లు విన్నాను. ఫుల్‌గా నవ్వాను. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నేను పర్సనల్‌గా త్రివిక్రమ్ గారి ‘నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి లాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తాను. ఈ సినిమా విషయానికొస్తే మేం ఎడిటింగ్ రూమ్‌లో సినిమాను ఎడిట్ చేస్తున్నాం. డైరెక్టర్ పరశురామ్ గారబ్బాయికి ఆరేళ్లు ఉంటాయి. అరవింద్‌గారు, మా నాన్న ఉన్నారు. నేను, ‘బన్నీ’ వాసు, మా తమ్ముడు.. ఇలా మూడు జనరేషన్స్‌కి సంబంధించిన వాళ్లందరం ఓ చోట ఉంటే, సినిమాను అన్ని జనరేషన్స్ వారు ఎంజాయ్ చేయటం గమనించాను. నాకు అది చాలా నచ్చింది ∙ఇప్పుడు నేను ఓ ఫేజ్‌లో ఉన్నాను. ఇది పర్మినెంట్ కాదని నాకు తెలుసు. కానీ ఈ ఫాలోయింగ్ వలన ఏదైనా చెప్తే ఈజీగా ప్రజల్లోకి వెళ్తుందని మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. నా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా ‘గీత గోవిందం’ని ఎందుకు ముందు విడుదల చేస్తున్నామంటే ఇందులో సీజీ పార్ట్ తక్కువ. ‘టాక్సీవాలా’లో సీజీకి ఎక్కువ స్కోప్ ఉండటం వల్ల తర్వాత విడుదల చేద్దాం అనుకున్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం ∙సినిమా ఫుటేజ్ లీకుల గురించి మాట్లాడుతూ ‘‘లైఫ్‌లో డ్రామా ఉండాలి. ఇప్పుడు జరిగింది అదే. అంతా ప్రశాంతంగా ఉంటే మజా ఏముంటుంది’’ అన్నారు. మీ తమ్ముడు హీరోగా రెడీ అవుతున్నారా? అనడిగితే – ‘‘నాకా విషయాలు తెలియవు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో వాడికి తెలియాలిగా’’ అన్నారు. -
పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్
‘గీత గోవిందం’ సినిమాలోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో టాలీవుడ్లో మరోసారి పైరసీపై చర్చ మొదలైంది. గుంటూరు కేంద్రంగా గీత గోవిందం సినిమా లీకవ్వటం, వెంటనే స్పందించిన చిత్రయూనిట్, పోలీసులు... లీకేజ్‌కు కారణమైన వ్యక్తులతో పాటు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేయటం తెలిసిందే. అయితే ఈ విషయంపై గీత గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్ మరో షాక్ ఇచ్చారు. గీత గోవిందం తో పాటు మరో మూడు సినిమాలు కూడా పైరసీ బారిన పడినట్టుగా వెల్లడించారు అరవింద్. అంతేకాదు వీటిలో ఓ భారీ చిత్రం కూడా ఉందని, ఆ సినిమాల గురించి ఆలోచిస్తే బాధ అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ భారీ చిత్రం ఏదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఇప్పటికే లీకేజ్‌కి కారణమైన వ్యక్తులు పట్టుబడటంతో ఆ సినిమాలు ప్రమాదం నుంచి బయట పడినట్టే అన్న వాదన వినిపిస్తోంది. -
నవ్వులతో థియేటర్ నిండిపోతుంది
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అగ్ర హీరోల సరసన నిలబడే సత్తా ఉన్న హీరో విజయ్ దేవరకొండ అని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. విజయ్ ఐదు, పది సినిమాలతో వెళ్లే రకం కాదన్న ఆయన వంద సినిమాలను కచ్చితంగా చేస్తాడని.. ఆ పట్టుదల ఆయనలో కనిపిస్తుందన్నారు. ఏయూలోని కాన్వొకేషన్ హాల్లో ఆదివారం గీత గోవిందం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ తమ బ్యానర్లో దర్శకుడు పరుశరాం రెండు సినిమాలు చేశారని, మూడో సినిమా కూడా చేయబోతున్నట్టు వెల్లడించారు. గీత గోవిందం సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు లీకైయ్యాయని, అందుకు కారణమైన 17 మంది విద్యార్థులు అరెస్టు అయ్యారని చెప్పారు. మా సినిమాతో పాటు రాబోయే మూడు పెద్ద సినిమాలకు సంబంధించిన సీన్లు వారి వద్ద ఉన్నాయన్నారు. అదే మమ్మల్ని ఆందోళనకు గురి చేసిందన్నారు. గీత గోవిందం సినిమా కుటుంబంతో సహా చూసి ఆనందించాలని కోరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నానికి సినిమా పరిశ్రమ రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ చాలా కాలం సినీ పరిశ్రమలో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్నది సాధించి తీరుతా.. ఎంత మంది ఎన్ని రకాలుగా తన ఎదుగుదలను అడ్డుకోవాలని చూసినా.. తాను అనుకున్నది సాధిస్తానని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. తనను తొక్కాలని సినిమాలను లీక్ చేయడం, తనపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఓ సినిమా చేయడానికి ఎంతో మంది ఎన్నో రోజులు కష్టపడతారని, అవేమి దృష్టిలో పెట్టుకోకుండా సినిమాకు నష్టం కలిగించే పనులు చేయడం దారుణమన్నారు. మూడు రోజులుగా మనసులో చాలా బాధగా ఉందని, ఉత్సాహం మొత్తం నీరుగారిపోయిందని కంటతడి పెట్టారు. అసలు ఈ రోజు ఫంక్షన్లో ఏమీ మాట్లాడకూడదని అనుకున్నానని, ఇక్కడికి వచ్చిన తరువాత తనలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. గీత గోవిందం సినిమా చూసినంతా సేపు నవ్వుకునే ఉంటారని, నవ్వులతో థియేటర్ నిండిపోతుందని అన్నారు. అనంతరం హీరోయిన్ రష్మిక తనకు చిత్ర యూనిట్‌తో కలిíసి డ్యాన్స్ చేయాలని కోరడంతో.. హీరో విజయ్, డైరెక్టర్ పరుశురాం, అల్లు అరవింద్‌లు వేదికపై డ్యాన్స్‌లతో అలరించారు. కాగా.. కార్యక్రమ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రేక్షకులు ఒకింత అసహనానికి గురయ్యారు. స్థానిక కళాకారులు నిర్వాహకుల తీరుతో అసంతృప్తికి లోనయ్యారు. -
విశాఖలో ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ వేడుక
-
గీత గోవిందం సినిమా కేసును ఛేదించిన పోలీసులు
-
‘గీత గోవిందం’ సినిమా కేసును చేదించిన పోలీసులు
-
‘గీత గోవిందం’ సినిమా లీక్‌పై విజయ్ స్పందన!
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ నెల 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న గీత గోవిందం సినిమాకు భారీ షాక్ తగిలింది. సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో చిత్రయూనిట్ షాక్ అయ్యింది. లీకేజ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఈ విషయంపై హీరోగా విజయ్ దేవరకొండ ఒకింత ఆవేదనతో స్పందించారు. సినిమా క్లిప్స్ లీకైన విషయాన్ని ప్రస్తావించకుండా ‘నేను నిరాశకు గురయ్యాను, బాధపడుతున్నాను. ఒకసారి కొపమొస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు విజయ్. దీంతో విజయ్ పైరసీని ఉద్దేశించే ఈ విధంగా ట్వీట్ చేశారని భావిస్తున్నారు ఫ్యాన్స్. I feel let down, disappointed, hurt. Okka sari kopam osthundi, inko sari edupostundi. — Vijay Deverakonda (@TheDeverakonda) 12 August 2018 చదవండి : ‘గీత గోవిందం’కు షాక్.. సోషల్ మీడియాలో సీన్స్ -
సోషల్ మీడియాలో లీకైన గీత గోవిందం సీన్స్
-
‘గీత గోవిందం’కు షాక్.. సోషల్ మీడియాలో సీన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీని లీకులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ లీకులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమా కూడా పైరసీ భారిన పడింది. సినిమాలోని కొంత భాగాన్ని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు అర్బన్ పోలీసులు కొంత మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న గీత గోవిందం సినిమాలోని కొంత భాగాన్ని దొంగిలించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. గుంటూరు చుట్టుపక్కల రెండు ప్రైవేట్ కాలేజీల విద్యార్ధులు సినిమాను షేర్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో చిత్ర టెక్నికల్ టీంకు చెందిన వ్యక్తి సినిమాలో కొంత భాగాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. వారు మరింత మందికి పంపించటంతో ఆ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే వీడియో క్లిప్స్‌ను సర్క్యూలేట్ చేసిన విద్యార్థులతో పాటు లీకేజికి పాల్పడిన అసలు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో తిరుగుతున్న సీన్స్‌ను డిలీట్ చేయించేందుకు చిత్ర నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు. -
అది అవాస్తవం
‘‘అర్జున్‌రెడ్డి’ సినిమాలోని పాత్రను బట్టి విజయ్ దేవరకొండ అలా అగ్రెసివ్‌గా నటించాడు. ‘గీత గోవిందం’ సినిమాలో డౌన్ టు ఎర్త్. ఫ్యామిలీ ఓరియంటెడ్, విలువలున్న ఓ మంచి వ్యక్తిగా పాత్రకు అనుగుణంగా నటించాడు’’ అని డైరెక్టర్ పరశురామ్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ పంచుకున్న విశేషాలు... రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో గోవిందానికి ఓ ఐడియాలజీ ఉంటుంది. గీతకు ఇంకో ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీల మధ్య వచ్చే సంఘర్షణే మా సినిమా. విజయ్ జూనియర్ సైంటిస్ట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసి ఉంటాడు. ఆ గ్యాప్‌లో ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తుంటాడు. గీత ఐటీ ఉద్యోగినిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో గీత పాత్రకి నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది. పది.. పదిహేను మంది హీరోయిన్లకు ఈ కథ చెప్పాను. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ కథ చెప్పని హీరోయిన్ లేదు. వారు రిజెక్ట్ చేసేంతగా ఏం లేదు. విజయ్ కొత్తవాడు.. పరశురాం అప్ కమింగ్ డైరెక్టర్.. ఇలా చాలా ఉంటాయి. ఏ పెద్ద హీరోయిన్‌కైనా స్టార్ హీరోతోనో, పెద్ద డైరెక్టర్‌తోనో చేయాలని ఉంటుంది కదా? హీరోయిన్ లావణ్యా త్రిపాఠితో కొద్ది రోజులు షూట్ చేశామనే మాట అవాస్తవం. విజయ్ డేట్స్‌కీ, లావణ్య డేట్స్‌కి కుదరలేదు. అందుకే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ‘గీత గోవిందం’ చిత్రంలో విలన్లంటూ ఎవరూ లేరు. గీతకు గోవింద్ విలన్.. గోవిందానికి గీత విలన్. పాటల్ని హిట్ చేసేద్దామనుకుంటే హిట్ అవ్వవు. ప్రతి సాంగ్‌కు ఓ సందర్భం ఉండాలి. మా సినిమాలో సాంగ్స్ అన్నీ అలానే ఉంటాయి. ప్రతి సాంగ్‌లో కథ నడుస్తు్తంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపి కూడా బాగా సహకరించాడు. విజయ్‌తో పాట పాడించాలనే ఐడియా నాదే. తను చాలా బాగా పాడాడు. కానీ, అది అనవసరంగా వివాదం అయింది. ఏ సినిమాకైనా నా బలం ఎమోషన్, కామెడీ. ఈ రెండూ మిస్ కాకుండా చూసుకుంటాను. నాలోని రచయితను, డైరెక్టర్‌ను విడదీసి చూడలేను. రచయితతో పాటు దర్శకుడిగా కూడా కష్టపడుతున్నాను. మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా చెయ్యాలి. గీతా ఆర్ట్స్‌లో ఇంకో సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. రెండు మూడు లైన్లు ఉన్నాయి.. కథ సిద్ధం చేయాలి. -
విజయ్ దేవరకొండకు సర్ప్రైజ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు సర్ప్రైజ్ లభించింది. విజయ్ హీరోగా నటించిన గీత గోవిందం ఈ నెల 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలె విడుదలైన ఈ చిత్ర గీతాలకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించే యోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈవెంట్‌కు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం. చిరు రాక విషయం తెలియగానే విజయ్ ఎంతో ఎగ్జైట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రటకన వెలువడాల్సి ఉంది. ఇంతకు ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. విజయ్-రష్మిక మందన్న జంటగా రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా డైరెక్టర్ పరుశురాం గీత గోవిందాన్ని తెరకెక్కించాడు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిచగా.. గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌పై చిత్రం రూపుదిద్దుకుంది. -
ఆంధ్రా కుర్రాడి కథ
గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’ రిలీజ్‌కు రెడీగా ఉన్న వెంటనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాను స్టార్ట్ చేసేశారు. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా రూపొందుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గోదావరి జిల్లా తోండంగిలో సోమవారం స్టార్ట్ అయింది. ‘‘ఇందులో విజయ్ ఆంధ్రా అబ్బాయిగా కనిపిస్తాడు. ఆంధ్రా యాసలో విజయ్ పలికే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సోషల్ రెస్పాన్సిబులిటీస్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: సుజిత్ సారంగ్. -
గీత...గోవిందం వస్తున్నారహో
ఇందు మూలంగా యావన్మంది ప్రేక్షక లోకానికి తెలియచేయడం ఏమనగా.. ‘గీత గోవిందం’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారహో. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ, ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నెల 15న సినిమా విడుదల చేస్తున్నారు. అల్లు అరవింద్ మాట్లాడూతూ– ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో లుక్ దగ్గర నుంచి పాత్ర వరకూ విజయ్ అందర్నీ ఆకట్టుకుంటాడు. పరశురాం దర్శకుడిగా మరో మెట్టు ఎక్కాడు. గీత పాత్రలో రష్మిక అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘గీతా ఆర్ట్స్‌లో నేను చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ‘గీత గోవిందం’ కూడా ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. గోపీసుందర్ పాటలు సూపర్ హిట్ కావటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు పరశురాం. ‘‘విజయ్ సూపర్ ఫెర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంటాడనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని తెరకెక్కించటం పరశురాంకి వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు ‘బన్ని’ వాసు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి. -
హీరోలు చేస్తే ఒప్పా?
టాలీవుడ్లో కథానాయికగా అడుగుపెట్టడానికి ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యారు కన్నడ నటి రష్మికా మండన్నా. రక్షిత్‌తో ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. ‘ఛలో’ తర్వాత తెలుగులో ఆమె చేసిన చిత్రం ‘గీత గోవిందం’. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత సినిమాలో మితి మీరిన రొమాన్స్ అవసరమా? అంటూ కొందరు నెటిజన్స్ రష్మికపై కామెంట్స్ విసిరారు. ఈ కామెంట్స్ గురించి రష్మిక స్పందన ఇలా ఉంది. ‘‘గీత గోవిదం’ పోస్టర్స్ చూసి కొందరు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. యాక్టర్‌గా నా ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా? అనిపిస్తోంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్స్‌తో హీరోలు రొమాన్స్ చేస్తున్నారు కదా? అది తప్పు కాదా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్స్ రొమాన్స్ చేస్తే మాత్రం వాళ్ల గౌరవం తగ్గిపోతుందా? ఈ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. నేను రక్షిత్‌తో ఎంగేజ్ అయ్యానని, విజయ్ దేవర కొండతో యాక్ట్ చేస్తున్నానని అసూయ పడేవాళ్లే నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారే మో’’ అన్నారు రష్మిక. -
‘గీత గోవిందం’ మూవీ స్టిల్స్
-
గీత గోవిందం ఆడియో విడుదల హైలైట్స్
-
‘గీత గోవిందం’ ఆడియో రిలీజ్
-
అర్జున్ రెడ్డి చూసి బాగా డిస్ట్రబ్ అయ్యాను
‘‘తెలుగులో కొంతమంది మంచి నటులు, గొప్ప నటులు ఉన్నారు. విజయ్ గ్రేట్ పెర్ఫార్మర్. ఇది ఫీమేల్ డామినేటెడ్ సినిమా. విజయ్ ఎంత బాగా చేశాడంటే హీరో.. హీరోయిన్‌కి సమానమైన కథలాగా చేశాడు. ఇద్దరూ ఈక్వల్ పాయింట్స్ కొట్టారు. పరశురామ్‌కి ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా బాగా తీశాడు’’ అని అల్లు అర్జున్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. జీఎ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నెల 15న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఆడియోను అల్లు అర్జున్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ –‘‘విజయ్ అడుగుతున్నాడు.. నేను ఎవరి కోసం ఈ ఫంక్షన్‌కి వచ్చాను అని. ‘బన్ని’ వాసు కోసమే వచ్చాను. ఇలా అన్నందుకు సారీ విజయ్. వాసు మంచి సినిమాలు తీస్తాడు. ఆల్ ది బెస్ట్. నా కెరీర్లో మా నాన్నగారి హెల్ప్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ హెల్ప్ వాసూది ఉంటుంది. ఈ సినిమా చూశా. చాలా అంటే చాలా బావుంది. విజయ్, రష్మిక ఇద్దరూ రాక్ చేశారు. నాకు గోపీ సుందర్ మ్యూజిక్ చాలా ఇష్టం. సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. నా ‘పరుగు’ సినిమాకు పరశురామ్ అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి మెట్టు మెట్టు ఎదుగుతున్నారు. రష్మిక కన్నడ ‘కిర్రిక్ పార్టీ్ట’లో బాగా చేసింది అని విన్నాను. చూడటం కుదర్లేదు. ఈ సినిమాలో బాగా చేసింది. ఈ కథ చాలా మంది పెద్ద హీరోయిన్స్ దగ్గరకు వెళ్లింది. కానీ రష్మికకే రాసిపెట్టి ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశాక వారం రోజులు నేను ఎవర్నీ కలవలేదు. ఏం సినిమాలు చేస్తున్నాం మనం? అనిపించింది. బాగా డిస్ట్రబ్ అయిపోయాను. విజయ్‌కు ఫిల్మ్‌ఫేర్ కచ్చితంగా రావాలి, వస్తుంది అనుకున్నాను. అవార్డ్ నామినేషన్స్‌లో ఉన్న హీరోల్లో విజయ్ అందరికంటే బాగా చేశాడు. మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. డాడీ (అల్లు అరవింద్) నీ గురించి ఏం చెప్పాలి? బాగా డబ్బులు సంపాదించాలి. నాకు మంచి కార్ కొనివ్వు (నవ్వుతూ). నా నెక్ట్స్ సినిమా ఏంటో నాకే తెలియదు (అభిమానులను ఉద్దేశిస్తూ). టైమ్ పడుతుంది. వెయిట్ చేయండి ప్లీజ్’’ అన్నారు. ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ – ‘‘బన్నీగారి ముందు మాట్లాడాలంటే టెన్షన్‌గా ఉంది. పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు బన్నీగారు ఓ మాట చెప్పారు. ‘100% లవ్’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అవుతుంది’ అన్నారు. కథకి హీరో ఎవరు అని అలోచిస్తుంటే విజయ్ ‘పెళ్లి చూపులు’ రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయింది. కచ్చితంగా స్టార్ అవుతాడు అనుకున్నాను. ఇతనితోనా మనం సినిమా తీయాల్సింది అని కంగారు పడ్డాం. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు గోపీ సుందర్’’ అన్నారు .విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నేను పాడిన పాటను విపరీతంగా క్రిటిసైజ్ చేశారు. నిద్రపట్టలేదు. మీరెవరైనా పాడి పంపండి. సినిమాలో పెడతాను. ‘బాబు.. నువ్వు ఆడియో ఫంక్షన్లో రచ్చ చేయొద్దు అని మా టీమ్ అంతా చెప్పారు (నవ్వుతూ). మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తుంటే ఆ విజయ్‌తో జాగ్రత్త రా అంటున్నారట. ఈ సినిమా మీ పేరెంట్స్ అందరికీ చూపించి నేను మంచోడినే అని చెప్పండి. బన్నీ అన్న ఈ ఆడియోకి నాకోసం రాలేదు. రీసెంట్గా సినిమా చూశారట. ఇక్కడికి రావడానికి అది కూడా ఓ కారణం అయ్యుంటుంది’’ అన్నారు.‘‘గీత (సినిమాలో తను చేసిన పాత్ర) మేడమ్ నుంచి ఏం నేర్చుకోవాలో తెలియాలంటే అందరూ ఆగస్ట్ 15న థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు రష్మిక. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ రెండేళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఈ కథ అరవింద్‌గారికి ఎంత ఇష్టమంటే నన్ను గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. రెండేళ్ల నుంచి ఏ సినిమా రావట్లేదేంటి అని చాలామంది అడుగుతున్నారు. మా ఆవిడ కూడా అడిగేది – ‘ఏం చేస్తున్నావు రోజూ ఆఫీస్‌కి వెళ్లి?’ అని! నా రెండేళ్ల ఎఫర్ట్ ఈ సినిమా. మా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ అయింది. విజయ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలని భయమేసింది. కానీ హిట్ ముందు ఎలా ఉన్నాడో తను ఇప్పుడూ అలానే ఉన్నాడు. ఒక్క సీన్, డైలాగ్, ఎక్స్ప్రెషన్ ఇలానే ఎందుకు? అని అడగలేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు. అనుకున్నదాని కంటే బాగా చేశాడు. గోపీ సుందర్ ఐదు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు’’ అన్నారు.‘‘పరశురామ్ ‘శ్రీరస్తు శుభమస్తు’ చేస్తున్నప్పుడు ఈ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది. నువ్వు వేసిన ముడి బావుంది, దాన్ని విప్పు అన్నాను. ఆ తర్వాత గంట కథ చెప్పాడు. బాగా నచ్చేసి అతన్ని ఆఫీస్‌లోనే కట్టేశాను.‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ తర్వాత కంగారు పడి కలిశాం. ఇతన్ని ఆడియన్స్ ఈ క్యారెక్టర్లో తీసుకోగలరా? అనిపించింది. విజయ్ జెంటిల్‌మేన్. మనిషి మంచోడు. ఏది ఉన్నా ఓపెన్‌గా మాట్లాడతాడు. అదే ట్రెండ్ అయిపోయింది. తను బాగా పాడలేదని క్రిటిసైజ్ చేస్తే దాన్ని కూడా పబ్లిసిటీగా వాడేశాడు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. ‘ఇంకేం కావాలే...’ సాంగ్ వేరే వాళ్లతో పాడించినది పెడదాం అనుకుంటే ‘వద్దు సిడ్ శ్రీరామ్ సాంగే కావాలి, అతనిది డిఫరెంట్ సౌండింగ్. క్లిక్ అవుతుంది’ అన్నాడు విజయ్. యంగ్‌స్టర్స్ అభిప్రాయాలకు విలువ ఇవ్వడమే నా సక్సెస్ అనుకుంటున్నాను’’ అన్నారు అల్లు అరవింద్. ∙బన్నీ వాసు, అల్లు అరవింద్, పరశురాం, విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా, అల్లు అర్జున్, గోపీ సుందర్ -
ఆ పాత్రల జోలికి వెళ్లను
గతేడాది ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యారు కథనాయిక రష్మికా మండన్నా. ప్రస్తుతం తెలుగు, కన్నడ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారామె. పాత్రల ఎంపికలో మీరు పాటించే విధానం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నను రష్మిక ముందుంచితే.. ‘‘నేను చేసే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందనిపించాలి. నటనకు ఆస్కారం ఉండాలి. కేవలం డబ్బు కోసమే నటించడం నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ సాంగ్స్‌లో డ్యాన్స్‌కే నా పాత్ర పరిమితం అయితే నాకన్నా డ్యాన్స్ బాగా చేసేవాళ్లూ ఉన్నారు కదా.. అని నా ఫీలింగ్. అందుకే అలాంటి పాత్రల జోలికి నేను వెళ్లను. అలా అని నా పాత్ర చుట్టూ సినిమా అంతా తిరగాలన్నది నా ఉద్దేశం కాదు. నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉన్న స్క్రిప్ట్స్‌నే నేను ఇష్టపడతాను అని చెబుతున్నా’’ అన్నారు రష్మిక. తెలుగులో ఆమె నెక్ట్స్ రిలీజ్ ‘గీత గోవిందం’. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. పరుశురామ్ దర్శకత్వం వహించారు. -
‘వాట్ ద ఎఫ్’ లొల్లి
విజయ్ దేవరకొండ గీతా గోవిందం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. రిఫ్రెష్మెంట్ యూత్ ఎంటర్టైనర్గా ఉంటుందన్న అంచనాలను దర్శకుడు పరుశురాం(బుజ్జి) అందించాడు. పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కావటంతో ఫ్యామిలీ సెక్షన్ ఆడియన్స్ సైతం మెప్పించే విధంగా ఉంటుందన్న టాక్ నడిచింది. అయితే నిన్న రిలీజ్ అయిన ‘వాట్ ద ఎఫ్ సాంగ్’ తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. విజయ్ దేవరకొండ స్వయంగా పాడిన ఈ పాటలో అభ్యంతరకర పదాలు ఉన్నాయంటూ పలువురు విమర్శలు గుప్పించారు. పురాణాల ప్రస్తావన తెస్తూ సాగిన పాటపై కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికితోడు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రోల్ కావటంతో యూట్యూబ్ నుంచి చివరకు ఆ పాటను తీసేశారు. అయితే ఈ పాటపై రచయిత శ్రీ మణి క్షమాపణలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తెలుగు ప్రజలందరికీ నమస్సుమాజంలి. ఈ రోజు విడుదలైన గీత గోవిందం లో ‘అమెరికా గాళ్ అయినా..’ అనే పాటలోని కొన్ని వాక్యలు కొంత మంది మనోభావాలను గాయపరిచాయని విమర్శలు రావటం జరిగింది. కానీ, మా భావనని తప్పుగా అర్థం చేసుకోవటం జరిగింది. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు... ..ఏది ఏమైనప్పటికీ అందరి మనోభావాలను గౌరవించటం మా ప్రాథమిక ధర్మం. ఆ కారణం చేత మేం సదరు పాటలోని అభ్యంతరకర పంక్తులను తొలగించి తిరిగి రచించిన ఆ పాటను యూ ట్యూబ్‌లో తిరిగి అప్ లోడ్ చేస్తామని తెలిజయేస్తున్నాం’ అంటూ శ్రీ మణి పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఆగష్టు 15న విడుదల కానుంది. -
గీత గోవిందుల కోసం బన్నీ
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఫస్ట్ లుక్, టీజర్లతో పాటు ఇంకే ఇంకే ఇంకే కావాలి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ స్వయంగా పాడిన వాట్ ద ఎఫ్ పాటను ఈ రోజు(గురువారం) రిలీజ్ చేశారు. ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన గీత గోవిందం సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జూలై 29 సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుకను అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. -
గీత గోవిందం మూవీ స్టిల్స్
-
ఏంటి? ఏంటి?
‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...’ ఈ పాట ‘గీత గోవిందం’ సినిమాలోనిదని సినీ లవర్స్ ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అంతలా ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘గీతగోవిందం’ చిత్రంలోని రెండో పాట ‘వాట్ ద వాట్ ద ఎఫ్’ ఈ రోజు విడుదల అవుతోంది. ఈ సాంగ్‌ను హీరో విజయ్ దేవరకొండనే పాడటం విశేషం. పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌దేవర కొండ, రష్మిక మండన్నా జంటగా రూపొందిన సినిమా ‘గీతగోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల 15న విడుదల కానుంది. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ‘ఇంకేం కావాలే’, టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గోపీసుందర్ మంచి సంగీతం అందించారు. ఈ రోజు ఫ్రస్ట్రేషన్ సింగర్‌గా విజయ్ దేవరకొండ పాడిన సాంగ్ రిలీజ్ అవుతుంది. ఈ నెల 29న పాటల విడుదల వేడుకను గ్రాండ్‌గా చేయబోతున్నాం’’ అన్నారు నిర్మాతలు. నాగబాబు, సుబ్బరాజు, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమాకు మణికందన్ ఛాయాగ్రాహాకుడు. -
‘వాట్ ద ఎఫ్’ అంటున్న విజయ్
అర్జున్ రెడ్డి సినిమాలో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ త్వరలో గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు పరుశురాం దర్శకుడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రేపు (గురువారం) ఓ పాటను రిలీజ్ చేయనున్నారు. వాట్ ద ఎఫ్ అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్ దేవరకొండ ఆలపించటం విశేషం. సాంగ్ బై వన్ ఫ్రస్ట్రేటెడ్ సింగర్ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ పాటను గురువారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. విజయ్ తొలిసారిగా పాడుతున్న ఈ పాటకు గోపి సుందర్ సంగీతమందించారు. విజయ్ దేవరకొండ సరసన ఛలో ఫేం రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. -
గీత గోవిందం టీజర్ విడుదల
-
హీరోయిన్ చెంపదెబ్బ.. హీరో కల చెదిరింది
అర్జున్ రెడ్డి తర్వాత ఓవర్‌నైట్ స్టార్ అయిన నటుడు విజయ్ దేవర్ కొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘ఇంకేం.. ఇంకేం.. ఇంకేం.. కావాలే..’తోనే గీత గోవిందంపై అంచనాలు రెట్టింపయ్యాయి. టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం మోస్ట్ వాంటెండ్ సినిమాగా మారింది. ప్రమోషన్లో భాగంగా టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ కలలు కనడం, హీరోయిన్ చెంపదెబ్బతో ఈ లోకంలోకి రావడం.. ఇంకొక్కసారి అమ్మాయిలు.. ఆంటీలు.. ఫిగర్లు అంటూ తిరిగావంటే యాసిడ్ పోసేస్తా.. అంటూ హీరోయిన్ వార్నింగ్ ఇవ్వడం... మొత్తంగా చూస్తే.. ఓ రొమాంటిక్ కామెడీ సినిమాగా గీత గోవిందం రాబోతుందనే ఫీలింగ్ కనిపిస్తోంది. ఇక మారవా అంటూ హీరోయిన్ డైలాగ్.. లేదు మేడం, ఐ యామ్ కంప్లీట్లీ డిసెంట్ నౌ అనడంతో నిజంగానే విజయ్ దేవర్కొండ డిసెంట్‌గా మారిపోయాడు. తొలి పాట, టీజర్‌తోనే అభిమానుల గుండెల్లో సరికొత్త ఫీల్‌ను కల్పిస్తున్న గీత గోవిందం, థియేటర్లలో మరెంత ఆకట్టుబోతోందనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఇంకేం కావాలే!
విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గీత గోవిందం’. జీఏ2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం కావాలే’ ని రిలీజ్ చేశారు. గోపీ సుందర్ మ్యూజిక్‌లో సిడ్ శ్రీరామ్ ఈ సాంగ్‌ను పాడారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ పాట రిలీజ్ చేసిన రెండు రోజుల్లోనే యూట్యూబ్‌లో రెండు మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా – ‘‘మా సినిమాలోని ఫస్ట్ మెలోడీ సాంగ్ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇదొక్క పాటే కాదు ఆల్బమ్‌లోని ప్రతి పాట ఇంతే అద్భుతంగా ఉండబోతోంది. సినిమాలో పాటలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. -
మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్ తనదైన స్టైల్లో ట్వీటర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ ఈ రోజు(మంగళ వారం) తొలి పాటను రిలీజ్ చేశారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే క్లాసికల్ మెలోడియస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యమందించిన ఈ పాటను సిద్ధి శ్రీరామ్ ఆలపించారు. పరుశురామ్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. -
గీత గోవిందం : తొలి పాటతో సిద్ధం
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్ తనదైన స్టైల్లో ట్వీటర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ జూలై 10న తొలి పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటను మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు.