
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ.. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా చేసిన సినిమా ‘గీత గోవిందం’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఈరోజు(బుధవారం) విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా చూసిన అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి.. విజయ్ నటనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
‘‘గీత గోవిందం’ సినిమా చూసి చాలా నవ్వుకున్నాను. విజయ్ దేవరకొండ.. నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. కానీ అర్జున్ రెడ్డి వంటి సినిమా తర్వాత ఇది నీ బెస్ట్ చాయిస్. తానేం చేస్తున్నాడో విజయ్‌కు బాగా తెలుసు. సినిమా అంతా సరదా సన్నివేశాలతో నింపేశారు. సినిమాను చాలా బాగా తెరకెక్కించావు పరశురాం..’ అంటూ దర్శక ధీరుడు రాజమౌళి.. గీత గోవిందం టీమ్‌పై ప్రశంసలు కురిపించాడు.
#GeethaGovindam was a laugh riot. @TheDeverakonda - what an unexpected but a spot on choice after Arjun Reddy. This guy clearly knows what he is doing. The film is full of subtle nuances and fun momemnts. Well written and handled by @ParasuramPetla.
— rajamouli ss (@ssrajamouli) August 15, 2018
Comments
Please login to add a commentAdd a comment