‘‘నాకు బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, త్రో బాల్ అంటే ఇష్టమే. కానీ, ఎందుకో క్రికెట్ అంటే ఇష్టం ఉండదు. అసలు ఆ ఆట నాకు అర్థం కాదు. అయితే ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో క్రికెటర్‌గానే నటించాల్సి వచ్చింది. అందుకే క్రికెట్ నేర్చుకుంటుంటే దానిపై ఫోకస్ పెరిగినట్టు అనిపించింది’’ అని రష్మికా మండన్న అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలైంది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి రష్మికా మండన్న గురువారం విలేకరులతో మాట్లాడారు.
‘గీత గోవిందం’ సినిమాకి నాకంటే ముందు వేరే హీరోయిన్లను సంప్రదించారు. వాళ్లు ఎందుకు కాదన్నారో తెలీదు. నేను మాత్రం డేట్లు టైట్‌గా ఉన్నా అడ్జస్ట్ చేసుకుని చేశా. ఇప్పుడు సూపర్ హ్యాపీగా ఉన్నా. నాకొచ్చే ప్రతి సినిమా గురించి మా ఇంట్లో, నా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తా. రియల్‌గా నేను చాలా సరదాగా ఉంటాను. ఎంత కోపం ఉన్నా లోపల దాచుకోవడానికే ప్రయత్నిస్తా. ‘గీత గోవిందం’ కోసం ఏడు నెలలు కోపంగానే నటించా. సినిమా చివరి 15 రోజులు సరదాగా ఉన్నా. సెట్లో విజయ్ దేవరకొండ ‘మేడమ్ మేడమ్’ అంటుంటే నవ్వు వచ్చేది.
మానిటర్‌లో సినిమా చూసుకునే అలవాటు నాకు లేదు. ప్రేక్షకులతో కలిసే చూస్తా. ‘గీత గోవిందం’ అలాగే చూశా. స్క్రీన్ మీద నేను ఉన్నాననే ధ్యాసే లేదు. అంత బాగా ఎంజాయ్ చేశా. అనవసరంగా చేసే విమర్శల గురించి స్పందిస్తూ నా సమయాన్ని వృథా చేసుకోను. నాకు, రక్షిత్‌కి పెళ్లి జరగదనే వార్తలు విని నవ్వుకున్నా. ఎందుకంటే మేమేంటో మాకు బాగా తెలుసు. నిశ్చితార్థం జరిగినప్పుడు రెండున్నరేళ్లలో చేసుకుందామనుకున్నాం. ఇప్పుడు ఇద్దరం వృత్తిపరంగా బిజీగా ఉన్నాం. అందుకే ఇంకా తేదీలు అనుకోలేదు.
నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది కన్నడ ప్రజలే. అందుకే అక్కడ సినిమాలు తగ్గించాలనుకోవడం లేదు. ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నా, మరో రెండు సంతకాలు జరుగుతున్నాయి. కథ నాకు నచ్చితే ఏ భాషలో సినిమా చేయడానికైనా రెడీ. అసలు గ్లామర్ అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాల్లో నేను ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగులో ‘డియర్ కామ్రేడ్, ‘దేవదాస్’ చిత్రాల్లో నటిస్తున్నా. నన్ను దృష్టిలో పెట్టుకుని ఓ నెగటివ్ పాత్ర రాయమని దర్శకుడు పరశురామ్‌కి చెప్పా. పీరియాడికల్ సినిమాల్లోనూ నటించాలని ఉంది.
నా పెళ్లి ఆగిందని విని నవ్వుకున్నా
Published Fri, Aug 17 2018 12:26 AM | Last Updated on Fri, Aug 17 2018 5:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment