
రష్మికా మండన్నా
గతేడాది ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యారు కథనాయిక రష్మికా మండన్నా. ప్రస్తుతం తెలుగు, కన్నడ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారామె. పాత్రల ఎంపికలో మీరు పాటించే విధానం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నను రష్మిక ముందుంచితే.. ‘‘నేను చేసే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందనిపించాలి. నటనకు ఆస్కారం ఉండాలి. కేవలం డబ్బు కోసమే నటించడం నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ సాంగ్స్‌లో డ్యాన్స్‌కే నా పాత్ర పరిమితం అయితే నాకన్నా డ్యాన్స్ బాగా చేసేవాళ్లూ ఉన్నారు కదా.. అని నా ఫీలింగ్. అందుకే అలాంటి పాత్రల జోలికి నేను వెళ్లను. అలా అని నా పాత్ర చుట్టూ సినిమా అంతా తిరగాలన్నది నా ఉద్దేశం కాదు. నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉన్న స్క్రిప్ట్స్‌నే నేను ఇష్టపడతాను అని చెబుతున్నా’’ అన్నారు రష్మిక. తెలుగులో ఆమె నెక్ట్స్ రిలీజ్ ‘గీత గోవిందం’. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. పరుశురామ్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment