తెలుగు సినిమా ఇండస్ట్రీని లీకులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ లీకులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమా కూడా పైరసీ భారిన పడింది. సినిమాలోని కొంత భాగాన్ని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే గుంటూరు అర్బన్ పోలీసులు కొంత మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న గీత గోవిందం సినిమాలోని కొంత భాగాన్ని దొంగిలించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. గుంటూరు చుట్టుపక్కల రెండు ప్రైవేట్ కాలేజీల విద్యార్ధులు సినిమాను షేర్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో చిత్ర టెక్నికల్ టీంకు చెందిన వ్యక్తి సినిమాలో కొంత భాగాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. వారు మరింత మందికి పంపించటంతో ఆ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే వీడియో క్లిప్స్‌ను సర్క్యూలేట్ చేసిన విద్యార్థులతో పాటు లీకేజికి పాల్పడిన అసలు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో తిరుగుతున్న సీన్స్‌ను డిలీట్ చేయించేందుకు చిత్ర నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment