మహేష్‌ ఆ దర్శకుడికి ఓకె చెప్పాడా? | Parashuram Narrated A Story To Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేష్‌ ఆ దర్శకుడికి ఓకె చెప్పాడా?

Published Thu, May 16 2019 4:23 PM | Last Updated on Thu, May 16 2019 4:23 PM

Parashuram Narrated A Story To Mahesh Babu - Sakshi

ఇటీవల మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌ స్టార్ మహేష్ బాబు, వరుసగా యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మహర్షి సక్సెస్‌ ఎంజాయ్ చేస్తున్న సూపర్‌స్టార్‌ త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మహేష్ రెగ్యులర్‌ స్టైల్‌కు భిన్నంగా అవుట్‌ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా మహేష్‌ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. గీత గోవిందం సినిమాతో ఘనవిజయం సాధించిన పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఓకె చెప్పాడట. పరశురామ్‌ చెప్పిన లైన్‌ నచ్చటంతో ఫుల్‌ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. అయితే ఈ వార్తలపై మహేష్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement