
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి.
Sarkaru Vaari Paata: Mahesh Babu Ma Ma Mahesha Full Song Released: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఇటీవల ఈ సినిమా నుంచి 'మ.. మ.. మహేశా' అనే పాట ప్రొమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో మ్యూజిక్, లిరిక్స్, మహేశ్ బాబు స్టెప్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, జొనిత గాంధీ, శ్రీకృష్ణ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రొమోకు రికార్డు స్థాయిలో వ్యూస్ రాగా, ప్రస్తుతం రిలీజైన పూర్తి పాట కచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుందని మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం (మే 7) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్రబృందం.
చదవండి: అభిమానుల కోసం మహేశ్‌బాబు లేఖ, నెట్టింట వైరల్