songs released
-
#WeLoveJagan: సీఎం జగన్‌పై సరికొత్త సాంగ్..
#WeLoveJagan.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. సీఎం జగన్ సంక్షేమంపై విడుదలైన పాటలన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో సరి ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక, తాజాగా ‘వీ లవ్ జగన్’ సాంగ్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక, ఈ పాటలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గుర్తించి వివరించడం జరిగింది. అలాగే, సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న అభిమానాన్ని కూడా చక్కగా వివరించారు. వీ లవ్ జగన్ అంటూ సాంగ్ సాగుతూ.. జగనన్న పాలనను వివరించారు. -
'చమక్ చమక్ పోరి’అంటున్న కిరణ్ అబ్బవరం.. లిరికల్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన చిత్రం ‘మీటర్’.ఈ చిత్రాన్ని రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంలి సమర్పణలో రంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చమక్ చమక్ పోరి అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్య ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అందులో భాగంగానే తాజాగా ‘చమక్ చమక్ పోరి..’అంటూ సాగే మాస్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్ంచినట్లు తెలుస్తోంది. ఈ పాటలో కిరణ్, అతుల్య రవి మాస్ డాన్స్‌తో అదరగొట్టారు. ఈ సాంగ్ లిరిక్స్ బాలాజీ అందించగా.. అరుణ్ కౌండిన్య, ఎంఎల్ గాయత్రి ఆలపించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: ఆస్కార్ వేదికపై దీపికా పదుకొణె.. ఇప్పుడు దాని గురించే చర్చంతా..!) -
‘వరహరూపం..’ కాంతార లిరికల్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంతార హావా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండ మొదట కన్నడ భాష చిత్రంగా వచ్చిన కాంతార ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ సినిమాకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ కాంతార విడుదల చేయగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు ఇక్కడ సైతం ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇక రీసెంట్గా హీందీలో రిలీజ్ కాగా నార్త్ ఆడియన్స్‌ను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కథ పరంగానే కాదు పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ‘వరాహరూపం.. దైవ వరిష్ఠం..’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: జపాన్‌లో తారక్‌కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్ ఈ పాట మేకింగ్ సన్నివేశాలను చూపిస్తూ రిలీజ్ చేశారు. సంప్రదాయ వాయిద్యాలతో సంగీత దర్శకుడు అజనీశ్ లోకనాథ్ స్వరాలు సమకూర్చడంతో మొదలైన పాట ఆద్యంతం అలరించేలా ఉంది. దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి ఈ పాటను తెరకెక్కిస్తున్న సన్నివేశాలు, ఆ పాత్రల్లో వివిధ నటులు కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. కాగా షాషిరాజ్ కవూర్ సాహిత్యం అందించిన ఈ పాటను గాయకుడు సాయి విఘ్నేష్ ఆలపించాడు. -
సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు: దర్శకుడు
Nee Kalle Diwali Song Out From Sudheer Gaalodu Movie: సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `గాలోడు`. పక్కా మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన `గాలోడు` టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో 13 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని లిరికల్ సాంగ్‌పై మరింత ఆసక్తిని కలిగించింది. తాజాగా `నీ కళ్లే దివాళి...` లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ స్వరపరిచిన ఈ పాట ట్రెమండస్ రెస్పాన్స్‌తో ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో సుధీర్ డ్యాన్స్, ఫారెన్ లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండడం విశేషం.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ - ```గాలోడు` ఫస్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు `నీ కళ్లే దివాళి` పాట కూడా ఇన్స్టంట్ హిట్ అయ్యింది. సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భీమ్స్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. శ్రీనివాస తేజ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. షాహిద్ మాల్య చక్కగా ఆలపించాడు. యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ పూర్తయ్యింది. ఫస్ట్ సాంగ్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం`` అని తెలిపారు. -
విజిల్ వేయించేలా 'ది వారియర్' విజిల్ సాంగ్..
Ram Pothineni The Warrior Whistle Lyrical Song Released By Surya: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోను 'బుల్లెటు' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను బయటకు వదిలింది చిత్రబృందం. ఈ సినిమాలోని 'విజిల్.. విజిల్..' అంటూ సాగే పాటను సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్‌తో అందరి చేత విజిల్ వేయించేలా మ్యూజిక్ అందించాడు. సాహితీ రాసిన క్యాచీ లిరిక్స్, సింగర్స్ ఆంటోని దాసన్, శ్రీనిషా జయశీలన్ అద్భుతంగా ఆలపించారు. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్, కృతిశెట్టి వేసిన స్టెప్స్ పాటకు హైలెట్‌గా నిలవనున్నాయి. విడుదలైన అతి కొద్ది సమయంలోనే ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. Here’s the #WhistleSong from #TheWarriorrhttps://t.co/4v4ED7InOz All the best for a super success!! @dirlingusamy @ThisIsDSP @RamSayz @AadhiOfficial @IamKrithiShetty — Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2022 -
‘మేజర్’ నుంచి మరో మెలోడీ సాంగ్, ఆకట్టుకుంటున్న పాట
యంగ్ హీరో అడవి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్రం బృందం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్‌ను వదిలారు మేకర్స్. ‘హృదయమా’ అంటూ సాగే ఈ పాటను సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్, రమేశ్ కుమార్‌లు సాహిత్యం అందించారు. చదవండి: Pushpa 2: రూ.400 కోట్ల బడ్జెట్.. పుష్ప 2కు ఆ సీన్ హైలైట్ అట ఇదిలా ఉంటే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండబోతున్నాయి. ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లో మేజర్ రిలీజ్ కానుంది. కాగా మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. -
సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా !
Sarkaru Vaari Paata: Mahesh Babu Ma Ma Mahesha Full Song Released: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఇటీవల ఈ సినిమా నుంచి 'మ.. మ.. మహేశా' అనే పాట ప్రొమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో మ్యూజిక్, లిరిక్స్, మహేశ్ బాబు స్టెప్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, జొనిత గాంధీ, శ్రీకృష్ణ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రొమోకు రికార్డు స్థాయిలో వ్యూస్ రాగా, ప్రస్తుతం రిలీజైన పూర్తి పాట కచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుందని మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం (మే 7) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్రబృందం. చదవండి: అభిమానుల కోసం మహేశ్‌బాబు లేఖ, నెట్టింట వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్ఫూర్తి నింపేలా...
కరోనా వైరస్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాటలు సిద్ధం చేస్తున్నారు మన సంగీత దర్శకులు. కోటి ‘‘లెటజ్ ఫైట్ కరోనా..’’ అంటూ వీడియో సాంగ్ విడుదల చేస్తే, యం.యం. కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ కూడా స్ఫూర్తి నింపే పాటలను కంపోజ్ చేసి, ఆడియోను విడుదల చేశారు. ‘వియ్ విల్ స్టే ఎట్ హోమ్’ అనే పాటను కీరవాణి స్వయంగా రాసి, ట్యూన్ చేసి ఆలపించారు. ఈ పాట కోసం ఆయన గతంలో ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాకి కంపోజ్ చేసిన ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాట ట్యూన్‌నే మళ్లీ తీసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్ ట్యూన్ చేసి, పాడిన ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం..’ పాటను నిజార్ రచించారు. -
విశాఖకు సినీ పరిశ్రమ
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖకు సినీ పరిశ్రమ రావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా మహేష్‌బాబు నచించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ రావడానికి అన్ని మౌలిక సదుపాయాలు, ప్రాంతాలు, పర్యాటక అందాలు ఉన్నాయన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నెంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా విజయవంతం కావాలని కోరారు. నిర్మాత అనిల్ సుంకరి మాట్లాడుతూ ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నామన్నారు. విశాఖ ఉత్సవ్ పురస్కరించుకుని సి నిమాలో ఓ పాటను విడుదల చేసినట్టు తెలిపారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భీమిలి, అరకు తదితర ప్రాంతాల్లో అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్నారు. నిర్మాత శిరీష్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. అలరించిన దేవిశ్రీ ఆట.. పాట విశాఖ ఉత్సవ్ భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరి అలరించింది. పాటలు పాడి.. స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ప్రధాన వేదికపై ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. శ్రావ్య, మానస, ధర్మేష్ నృత్యాలు బాగా నచ్చాయి. -
నోట్ల రద్దుపై రహమాన్ పాట
ముంబై: నోట్ల రద్దుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ బాణీలు కట్టాడు. ‘ది ఫ్లైయింగ్ లోటస్’ పేరుతో ఈ పాటను శుక్రవారం విడుదల చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నోట్ల రద్దు విషయంలో ప్రజలు చూపిన హర్షం, ఆగ్రహాలను తెలియజేయాలనుకున్నాను’ అని పేర్కొన్నారు. ‘2016 నవంబర్ భారత్‌కు చాలా ఆసక్తికరమైంది. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో ఆ నిర్ణయం తీసుకోవడంతో ప్రజల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నోట్ల రద్దు సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? వంటి అంశాలపై ది ఫ్లైయింగ్ లోటస్‌లో చూపేందుకు ప్రయత్నించాను’ అని వివరించాడు. -
కన్నయ్య తపన
‘ఎంత కష్టమైనా తాను అనుకున్నది సాధించాలన్నది ఆ యువకుడి తపన. తన లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు?’అనే అంశంతో తెరకెక్కిన చిత్రం ‘కన్నయ్య’. విపుల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రాన్ని రాజేష్ జాదవ్, కృష్ణంరాజు పగడాల, రవితేజ తిరువాయిపాటి నిర్మిస్తున్నారు. హర్షిత కథానాయిక. సత్యకశ్యప్, ఘంటసాల విశ్వనాధ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్. వేణుగోపాలచారి రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపుతో తెరకెక్కుతోన్న చిత్రమిది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. చిత్ర నిర్మాతలు, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర ప్రసాద్, మల్కాపురం శివకుమార్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.