Kiran Abbavaram Latest Meter Movie Chammak Chammak Pori Lyrical Song Release Today - Sakshi
Sakshi News home page

'చమక్‌ చమక్‌ పోరి’ అంటున్న కిరణ్‌ అబ్బవరం.. లిరికల్ సాంగ్ వచ్చేసింది

Published Wed, Mar 15 2023 5:56 PM | Last Updated on Wed, Mar 15 2023 7:42 PM

Kiran Abbavaram Latest Movie Meter Lyrical Song Release Today - Sakshi

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన చిత్రం ‘మీటర్‌’.ఈ చిత్రాన్ని రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ యలమంలి సమర్పణలో రంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చమక్ చమక్ పోరి అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్య 
 
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అందులో భాగంగానే తాజాగా ‘చమక్‌ చమక్‌ పోరి..’అంటూ సాగే మాస్‌ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్ంచినట్లు తెలుస్తోంది. ఈ పాటలో కిరణ్, అతుల్య రవి మాస్‌ డాన్స్‌తో అదరగొట్టారు. ఈ సాంగ్ లిరిక్స్ బాలాజీ అందించగా.. అరుణ్ కౌండిన్య, ఎంఎల్ గాయత్రి ఆలపించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. 

(ఇది చదవండి: ఆస్కార్ వేదికపై దీపికా పదుకొణె.. ఇప్పుడు దాని గురించే చర్చంతా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement