meter
-
ఈవీలకు ప్రత్యేక మీటర్.. విద్యుత్ కనెక్షన్లలో కీలక మార్పులు!
దేశంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే వారు ఇప్పుడు ఏడు రోజులకు బదులుగా కేవలం మూడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్లను పొందవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ఛార్జ్ చేయడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్‌ను పొందవచ్చు. ఈ మేరకు విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020ని సవరించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ కనెక్షన్ పొందేందుకు గల గడువును మహానగరాల్లో ఏడు రోజుల నుంచి మూడు రోజులకు, ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ఇక కొండ ప్రాంతాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కొత్త కనెక్షన్లు లేదా ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పుల కోసం వ్యవధి 30 రోజులు ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రూఫ్‌టాప్ సోలార్ రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడానికి డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాలపరిమితిని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిర్యాదులొస్తే అదనపు మీటర్ వినియోగదారులు మీటర్ రీడింగ్‌లు తమ వాస్తవ విద్యుత్ వినియోగంతో సరిపోలడం లేదని ఫిర్యాదులు చేసిన సందర్భాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజులలోపు అదనపు మీటర్‌ను ఏర్పాలు చేయాల్సి ఉంటుంది. ఈ అదనపు మీటర్ ద్వారా మూడు నెలలపాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తారు. కో-ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, నివాస కాలనీలు మొదలైన వాటిలో నివసిస్తున్నవారు పంపిణీ లైసెన్స్‌దారు నుంచి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనెక్షన్లు లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్‌ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. -
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!
ఇప్పుడిప్పుడే థియేటర్లలో వేసవి సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే మక్కువ చూపుతున్నారు. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా మిమ్మల్ని అలరించేందుకు ఏకంగా 21 సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈవారంలో థియేటర్లలో టాలీవుడ్ చిత్రాలు మాస్ హీరో రవితేజ నటించిన రావణాసుర, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సిద్ధమయ్యాయి. వాటితో పాటు ఈ వారంలో విడుదలయ్యే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలేవో తెలుసుకుందాం. రవితేజ రావణాసుర మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ నటింటారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ 'మీటర్' హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ‘ఆగస్టు 16, 1947’ ప్రముఖ దర్శకుడు ఆర్.మురుగదాస్ నిర్మించిన చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎన్.ఎస్ పొన్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం రాగా, ఆ మరుసటి రోజు ఏం జరిగింది? అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. గౌతమ్ కార్తిక్, రిచర్డ్ ఆస్టన్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే నెట్‌ఫ్లిక్స్ బీఫ్ (వెబ్‌సిరీస్) -ఏప్రిల్ 6 ఇన్ రియల్ లవ్ -(టీవీ షో) ఏప్రిల్ 6 చుపా (హాలీవుడ్)- ఏప్రిల్ 7 హంగర్ (హాలీవుడ్)- ఏప్రిల్8 జీ5 అయోథి (తమిళం) -ఏప్రిల్ 7 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ది క్రాసోవర్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 4 బుక్ మై షో బ్యాట్‌మ్యాన్ (హాలీవుడ్) ఏప్రిల్ 5 కాస్మోస్ (హాలీవుడ్) ఏప్రిల్ 7 -
కిరణ్ అబ్బవరం 'మీటర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను వదిలారు. ఏప్రిల్ 17న మీటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈనెల 29న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. #Meter is all set to hit its maximum levels with MASS and ENTERTAINMENT 🔥🔥#MeterTrailer Blasting on 29th March 💥💥#MeterOnApril7th @Kiran_Abbavaram @AthulyaOfficial #RameshKaduri #SaiKartheek @ClapEntrtmnt @SonyMusicSouth pic.twitter.com/zE9WwGX2Mw — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2023 -
'చమక్ చమక్ పోరి’అంటున్న కిరణ్ అబ్బవరం.. లిరికల్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన చిత్రం ‘మీటర్’.ఈ చిత్రాన్ని రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంలి సమర్పణలో రంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చమక్ చమక్ పోరి అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్య ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అందులో భాగంగానే తాజాగా ‘చమక్ చమక్ పోరి..’అంటూ సాగే మాస్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్ంచినట్లు తెలుస్తోంది. ఈ పాటలో కిరణ్, అతుల్య రవి మాస్ డాన్స్‌తో అదరగొట్టారు. ఈ సాంగ్ లిరిక్స్ బాలాజీ అందించగా.. అరుణ్ కౌండిన్య, ఎంఎల్ గాయత్రి ఆలపించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: ఆస్కార్ వేదికపై దీపికా పదుకొణె.. ఇప్పుడు దాని గురించే చర్చంతా..!) -
‘చమక్ చమక్ పోరి..’అంటున్న కిరణ్ అబ్బవరం.. మాస్ సాంగ్‌తో ప్రమోషన్స్
కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన త్రం ‘మీటర్’. నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంలి సమర్పణలో రంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని ‘చమక్ చమక్ పోరి..’అంటూ సాగే మాస్ లిరికల్‌ని తొలి పాటగాఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ‘‘పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మీటర్’. ‘చమక్ చమక్ పోరి..’ పాటలో కిరణ్, అతుల్య రవి మాస్ డాన్స్‌ను చూస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పెట్రోలు బంకులో మీటరు మాయాజాలం!
గుణదల (విజయవాడ తూర్పు): నిత్యం వందలాది వాహనాలతో కిటకిటలాడే ఒక పెట్రోలు బంకులో మీటర్ మాయాజాలం బట్టబయలైంది. లక్షలాది రూపాయాలు అక్రమంగా దండుకుంటున్న వ్యవహారం శనివారం రాత్రీ గుణదలలోని పడవలరేవు పెట్రోలు బంకులో వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. పడవలరేవు కూడలివద్ద దాదాపు మూడు దశాబ్దాలుగా విజయలక్ష్మీ ఎంట్రర్‌ప్రైజెస్ పేరుతో పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారిగా ఉన్న ఏలూరురోడ్డుపై ఈ పెట్రోలు బంకు ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వందలాదిగా వినియోగదారులు ఇక్కడ పెట్రోలు కొట్టిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ వినియోగదారుడు పెట్రోలు తీసుకుంటుండగా పంపు తీయగానే మీటర్ రీడింగ్ రూ. 14గా నమోదైంది. దీంతో తనకు పెట్రోలు ఇవ్వకుండానే మీటర్ రీడింగ్‌పై నగదు నమోదవ్వడాన్ని సదరు వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. ఇంతలో మరో వాహనచోదకుడికి ఇలాగే జరిగింది. పెట్రోలు బండిలో కొట్టకుండానే రూ.5 బిల్లు మానిటర్‌పై వచ్చేసింది. దీంతో వినియోగదారులకు బంకు సిబ్బందికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో మాచవరం ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వివరాలు సేకరించారు. గతంలో మూసివేత.... కల్తీ పెట్రోలు అమ్మకం, రీడింగ్‌లో అవకతవకల కారణంగా గతంలో రెండుసార్లు ఈ బంకుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అవకతవకలు బట్టబయలు కావటంతో రెండు సార్లు ఈ బంకు మూతపడింది. ఇటీవలే మరలా బంకును పునఃప్రారంభించారు. అదే తరహాలో మోసం బయటపడటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఆందోళన చేసినా బంకు యాజమాన్యం రాకపోగా, పనిచేస్తున్న సిబ్బంది పరారయ్యారు. -
షీలా దీక్షిత్ కు ఏసీబీ సమన్లు!
ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ కు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) సమన్లు జారీ చేసింది. వాటర్ మీటర్ కుంభకోణంపై ఆమెను విచారించేందుకు, ఆమె అందించే వివరాలను విచారణాధికారులు రికార్డు చేసేందుకు వీలైన స్థలాన్ని సూచించమంటూ కోరింది. వాటర్ మీటర్ కుంభకోణంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను ప్రశ్నించేందుకు యాంటీ కరప్షన్ బ్రాంచ్ శ్రీకారం చుట్టింది. 341 కోట్ల వాటర్ మీటర్ అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ షీలా దీక్షిత్ కు సమన్లు జారీ చేసింది. 2014 లో ఆమ్ ఆద్మీ పార్టీ 49 రోజుల పాలనా కాలంలో వాటర్ మీటర్ల కుంభకోణంతోపాటు, అప్పట్లో నమోదైన ఎఫ్ ఐ ఆర్ ల పై దర్యాప్తునకు ఆదేశించింది. షీలా దీక్షిత్ ఢిల్లీ జల బోర్డ్ (డీజేబీ) ఛైర్ పర్సన్ గా ఉన్నసమయంలో వాటర్ మీటర్ కుంభకోణం ఆరోపణలు చోటు చేసుకోవడంతో ఆమెకు సమన్లు జారీ చేసినట్లు ఏసీబీ స్పెషల్ పోలీస్ కమిషనర్ ఎం కె మీనా తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద గత శనివారం ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. వాటర్ మీటర్ కుంభకోణంపై వివరణ ఇచ్చేందుకు ఆమెకు అనువైన స్థలాన్ని సూచించమని కోరాయి.