ఇప్పుడిప్పుడే థియేటర్లలో వేసవి సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే మక్కువ చూపుతున్నారు. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా మిమ్మల్ని అలరించేందుకు ఏకంగా 21 సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈవారంలో థియేటర్లలో టాలీవుడ్ చిత్రాలు మాస్ హీరో రవితేజ నటించిన రావణాసుర, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సిద్ధమయ్యాయి. వాటితో పాటు ఈ వారంలో విడుదలయ్యే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలేవో తెలుసుకుందాం.
రవితేజ రావణాసుర
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ నటింటారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్‌లలో విడుదల కానుంది.
కిరణ్ 'మీటర్'
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.
‘ఆగస్టు 16, 1947’
ప్రముఖ దర్శకుడు ఆర్.మురుగదాస్ నిర్మించిన చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎన్.ఎస్ పొన్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం రాగా, ఆ మరుసటి రోజు ఏం జరిగింది? అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. గౌతమ్ కార్తిక్, రిచర్డ్ ఆస్టన్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే
నెట్‌ఫ్లిక్స్
- బీఫ్ (వెబ్‌సిరీస్) -ఏప్రిల్ 6
- ఇన్ రియల్ లవ్ -(టీవీ షో) ఏప్రిల్ 6
- చుపా (హాలీవుడ్)- ఏప్రిల్ 7
- హంగర్ (హాలీవుడ్)- ఏప్రిల్8
జీ5
- అయోథి (తమిళం) -ఏప్రిల్ 7
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ది క్రాసోవర్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 4
బుక్ మై షో
- బ్యాట్‌మ్యాన్ (హాలీవుడ్) ఏప్రిల్ 5
- కాస్మోస్ (హాలీవుడ్) ఏప్రిల్ 7
Comments
Please login to add a commentAdd a comment