నోట్ల రద్దుపై రహమాన్‌ పాట | AR Rahman releases The Flying Lotus, a song on demonetisation notes | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై రహమాన్‌ పాట

Published Sat, Oct 7 2017 4:23 AM | Last Updated on Mon, Aug 20 2018 3:51 PM

AR Rahman releases The Flying Lotus, a song on demonetisation notes - Sakshi

ముంబై: నోట్ల రద్దుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ బాణీలు కట్టాడు. ‘ది ఫ్లైయింగ్‌ లోటస్‌’ పేరుతో ఈ పాటను శుక్రవారం విడుదల చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నోట్ల రద్దు విషయంలో ప్రజలు చూపిన హర్షం, ఆగ్రహాలను తెలియజేయాలనుకున్నాను’ అని పేర్కొన్నారు. ‘2016 నవంబర్‌ భారత్‌కు చాలా ఆసక్తికరమైంది. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో ఆ నిర్ణయం తీసుకోవడంతో ప్రజల ఫీలింగ్స్‌ ఎలా ఉన్నాయి? నోట్ల రద్దు సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? వంటి అంశాలపై ది ఫ్లైయింగ్‌ లోటస్‌లో చూపేందుకు ప్రయత్నించాను’ అని వివరించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement