కరోనా వైరస్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాటలు సిద్ధం చేస్తున్నారు మన సంగీత దర్శకులు. కోటి ‘‘లెటజ్ ఫైట్ కరోనా..’’ అంటూ వీడియో సాంగ్ విడుదల చేస్తే, యం.యం. కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ కూడా స్ఫూర్తి నింపే పాటలను కంపోజ్ చేసి, ఆడియోను విడుదల చేశారు. ‘వియ్ విల్ స్టే ఎట్ హోమ్’ అనే పాటను కీరవాణి స్వయంగా రాసి, ట్యూన్ చేసి ఆలపించారు. ఈ పాట కోసం ఆయన గతంలో ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాకి కంపోజ్ చేసిన ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాట ట్యూన్‌నే మళ్లీ తీసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్ ట్యూన్ చేసి, పాడిన ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం..’ పాటను నిజార్ రచించారు.
Comments
Please login to add a commentAdd a comment