ముంబై: ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ బాబా సెహగల్ కరోనాపై అవగాహన కల్పిస్తూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ప్రస్తుతం దేశంలో కరోనాతో పోరాడుతున్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని బాబా సెహగల్ ఈ పాటను రూపొందించారు. ఏకకాలంలో పియానో, గిటార్, డ్రమ్స్ వాయిస్తూ తనదైన ర్యాప్‌తో పాటను పాడుతూ ఉర్రూతలూగించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
ఇక దేశంలో కరోనా కోరలు చాస్తుంది. రోజుకు నాలుగు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,01,078 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 4,187 మంది మరణిచారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,34,083కు చేరింది. కాగా దేశంలో ఇప్పటివరకు 1,79,30,960 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 37,23,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదవండి: సింగర్ సునీత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment