Baba Sehgal
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాబా సెహగల్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ బాబా సెహగల్ కరోనాపై అవగాహన కల్పిస్తూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ప్రస్తుతం దేశంలో కరోనాతో పోరాడుతున్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని బాబా సెహగల్ ఈ పాటను రూపొందించారు. ఏకకాలంలో పియానో, గిటార్, డ్రమ్స్ వాయిస్తూ తనదైన ర్యాప్‌తో పాటను పాడుతూ ఉర్రూతలూగించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక దేశంలో కరోనా కోరలు చాస్తుంది. రోజుకు నాలుగు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,01,078 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 4,187 మంది మరణిచారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,34,083కు చేరింది. కాగా దేశంలో ఇప్పటివరకు 1,79,30,960 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 37,23,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: సింగర్ సునీత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ -
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న బాబా సెహగల్ పాట
-
ఆ నటుడిది ఆత్మహత్యే..!
ముంబై : నటుడు కుశాల్ పంజాబీ బలవన్మరణానికి పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడి మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని కుశాల్ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. అదే విధంగా తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కుమారుడికి సమానంగా పంచాలని కోరాడు. కాగా కుశాల్ పంజాబీ హఠాన్మరణం చెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కుశాల్ స్నేహితుడు, నటుడు కరణ్వీర్ బోహ్రా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సెలబ్రిటీలు అతడి మృతికి సంతాపం తెలిపారు. అయితే ప్రస్తుతం కుశాల్ ఆత్మహత్య విషయం తెలిసి వారంతా షాక్‌కు గురవుతున్నారు. (టీవీ నటుడి హఠాన్మరణం.. ) ఇక రియాలిటీ షో జోర్ కా జట్కాలో విజేతగా నిలిచిన కుశాల్ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్ ఫాక్టర్, నౌటికా నావిగేటర్స్ ఛాలెంజ్, ఝలక్ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. ఫర్హాన్ అక్తర్ లక్ష్యా, కరణ్ జోహార్ కాల్ సినిమాలతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. కాగా కుశాల్ మృతిపై ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ విచారం వ్యక్తం చేశాడు. ‘కుశాల్ లేడంటే నమ్మలేకపోతున్నాను. సవాళ్లను ఎదుర్కునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తను ఓ మంచి తండ్రి. నా తమ్ముడి వంటి నీ ఆత్మకు శాంతి చేకూరాలి కుశాల్’ అని ట్వీట్ చేశాడు. I just cannot come to the terms that Kushal is no more. Always ready to face challenges of all kinds and such an adorable father. He was a friend but more like a younger brother to me. RIP #KushalPunjabi pic.twitter.com/GZxdgp5t3A — Baba Sehgal (@OnlyBabaSehgal) December 27, 2019 -
'సీరియస్ ఇష్యూ .. ఈ పాట వినాల్సిందే'
ముంబయి: ఆత్మహత్యలపై ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ బాబా సెహగల్ సీరియస్‌గా స్పందించారు. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. నిర్ణయం తీసుకున్న తర్వాత చివరి క్షణాల్లోనైనా ఓసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. ప్రత్యూష బెనర్జీ మరణం తనను ఎంతో కలిచివేసిందని చెప్పిన ఆయన ఈ విషయంపై సీరియస్ గా స్పందిస్తూ ఓ సీరియస్ గీతాన్ని ఆలపించారు. ఆయన పాట పాడుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో ఆత్మహత్యలు చేసుకున్న వారి ఇమేజ్ నమునాలు కనిపిస్తూ మరోపక్క.. బతకాలనే స్ఫూర్తినిచ్చేలా కొన్ని చిత్రాలు కనిపించేలా ఆయన ఈ సాంగ్ డిజైన్ చేశారు. ఆశతో జీవించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో హెచ్చుతగ్గులు, ఇబ్బందిపెట్టే బ్రేకప్‌లు, డబ్బు సమస్యలు మనిషిని ఆత్మహత్యకు పురికొల్పుతాయని ఇలాంటి సందర్భాల్లో ఆలోచించినా ఒక మంచి ఆశా కిరణం కనిపిస్తుందని చెప్పారు. ఈ గీతాన్ని కూడా ఆత్మహత్యకు పాల్పడిన ప్రత్యూష బెనర్జీకి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. -
పొట్టచెక్కలయ్యేలా ట్వీట్ చేశాడు!
'కోహీ మానే నా మానే, కీప్ ఇటప్ అంజిక్యా రహానే!' 'ఘోడాసే బోలి ఘోడీ, ధోనీ అండ్ విరాట్ ఆర్ రామ్ లక్ష్మణ్ కి జోడీ' 'నహీ కరేగా ఫెయిల్.. హేల్ విరాట్ హేల్..' మనకు బాబా సెహగల్ సింగర్ గానే తెలుసు. 'దేఖో దేఖో గబ్బర్ సింగ్..' అంటూ తెలుగులో ఎన్నో ఉర్రూతలూగించే పాటలు పాడిన ఈ ప్రఖ్యాత సింగర్ సోషల్ మీడియాలోనూ ఫేమస్. సమయోచితంగా జోకులు పేలుస్తూ తన అభిమానులను ఆకట్టుకోవడం ఇతని స్పెషాలిటీ. తాజాగా భారత్-వెస్టిండిస్ సెమీస్ మ్యాచ్ సందర్భంగా తనదైన కామెడీ ట్వీట్స్‌తో.. అభిమానుల్ని పొట్ట చెక్కయ్యేలా చేశాడు. సందర్భానికి తగ్గ కామెంట్‌తో అభిమానులు హాయిగా నవ్వుకునేలా చేశాడు. అతడు చేసిన కొన్ని ట్వీట్స్ ఇవి.. ఆస్వాదించండి. koi maane ya na maane, keep it up ajinkya rahane👍 — Baba Sehgal (@OnlyBabaSehgal) 31 March 2016 ghoda se boli ghodi, dhoni & virat are ram laxman ki jodi.. — Baba Sehgal (@OnlyBabaSehgal) 31 March 2016 piya piya o piya piya, 150 for 2 india.. — Baba Sehgal (@OnlyBabaSehgal) 31 March 2016 nahi karega fail, hail virat hail.. — Baba Sehgal (@OnlyBabaSehgal) 31 March 2016 bhindi ka plural is not bhindis, it was absolute luck win for west indies😊 — Baba Sehgal (@OnlyBabaSehgal) 31 March 2016 jiska IQ strong hai, uski life mein hoga thrill, fool toh fool hee rahega chahe january ho ya april.. — Baba Sehgal (@OnlyBabaSehgal) 1 April 2016 -
‘పవనిజం’ ఆడియో ఆవిష్కరణ
-
బలహీనతలు...
ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లల జీవనశైలి ఎలా ఉంటోంది? డ్రగ్స్‌కి ఎలా ఆకర్షితులవుతున్నారు? వాళ్ల బలహీనతను సంఘ విద్రోహ శక్తులు ఎలా సొమ్ము చేసుకుంటున్నాయి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఓవర్ డోస్’. అమర్, మిలన్, పరినిధి నాయకా నాయికలుగా చేస్తున్న ఈ చిత్రంలో బాబా సెహగల్ ప్రతినాయకునిగా నటిస్తున్నారు. కృష్ణ మన్నేరి దర్శకత్వంలో విజయలక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. రమణ గోగుల స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీకృష్ణ పైడిమరి, పాటలు: కాసర్ల శ్యామ్. -
విలన్‌గానే నటిస్తాను
- గాయకుడు బాబాసెహగల్ బాబా సెహగల్ది దాదాపు పాతికేళ్ల కెరీర్. కానీ ఇప్పటికీ యువతరం గాయకులతో పోటీపడుతూనే ఉన్నారాయన. నిత్యనూతనమైన తన గాత్ర సౌరభంతో భారతీయ శ్రోతలందర్నీ ఊర్రూతలూగిస్తున్నారు. 19 ఏళ్ల క్రితం ‘రిక్షావోడు’ సినిమా కోసం తొలి తెలుగు పాట పాడారు బాబా. ‘రూప్‌తేరా మస్తానా.. నీకు డేరా వేస్తానా...’ అంటూ సాగే ఆ పాట నాటి యూత్నే కాదు, నేటి యువతరాన్నీ అలరిస్తూనే ఉంది. దటీజ్ బాబా. ‘జల్సా, ఆర్య2, గబ్బర్‌సింగ్, రగడ...’ ఇలా చాలా సినిమాల్లో బాబా పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. పాప్-ర్యాప్ సంగీతపు దాహార్తిని తీర్చి... పాప్ ఆల్బమ్స్‌కి ఓ గౌరవం తెచ్చిపెట్టిన గాయకుడు బాబా. ఇండియాలో ఇప్పుడొస్తున్న పాప్ గాయకులకు ప్రేరణ ఆయనే. అందుకే.. ‘ఇండి పాప్’కి ఇంటిపేరుగా బాబా సెహగల్ని అభివర్ణిస్తుంటారు. ఇప్పటివరకూ గాయకునిగా అలరించిన ఈ ఎవర్గ్రీన్ సింగర్... తొలిసారిగా తెలుగుతెరపై మెరవనున్నారు. వీనుల విందు చేసిన ఆ నేపథ్య స్వరం... త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలోని ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’తో తెరపై ప్రతినాయకునిగా హూంకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ హాటెస్ట్ సింగర్... లేటెస్ట్ విలన్‌తో జరిపిన ముచ్చట్లు... ఏమిటి... హైదరాబాద్‌లోనే ఎక్కువ కనిపిస్తున్నారు? ఇప్పుడేంటి? దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు సినీరంగంతో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చి పోతూనే ఉన్నాను. ఈ మధ్యే హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొన్నాను. అంతేకాకుండా దేశంలోనే ఫస్ట్ హిప్హాప్ డ్యాన్స్ అకాడమీని ఇక్కడ నెలకొల్పాను. దీంతో హైదరాబాదీనే అయిపోయా. అయితే ముంబైని వదిలేసినట్టేనా? జన్మతః నేను పంజాబీ. చదివింది, పెరిగింది లక్నోలో. ఉద్యోగం, పాప్ ప్రవేశం అంతా ముంబైలోనే. ‘జల్సా’ తర్వాత హైదరాబాద్‌కు రాకపోకలు పెరిగాయి. ఇక్కడ అకాడమీ, తెలుగు సినీగీతాలు పాటలు, సినిమాలో విలన్‌గా నటిస్తుండడం... దీంతో ఇప్పుడు దాదాపు ఇక్కడకు షిప్ట్ అయిపోయా. నా డ్రైవింగ్ లెసైన్స్ కూడా ఇక్కడే తీసుకున్నా. ఓటర్ గుర్తింపు కార్డ్ కూడా తీసుకోనున్నా. అంత మాత్రాన ఒక ఊరిలో నివసిస్తుంటే మరో ఊరిని వదిలినట్టేనని అనలేం. అవునూ... యాక్టింగ్ వైపు రూటు మార్చారేమిటి? గతంలో నాలుగైదు హిందీ సినిమాలు చేశాను. కొన్ని తెలుగు ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అన్నీ కుదరడంతో నటిస్తున్నాను. ‘రుద్రమదేవి’ సినిమా అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీగా తెరకెక్కుతోన్న సినిమా. అంతేకాకుండా గుణశేఖర్ లాంటి గొప్ప దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం ఇది. మీ పాత్ర నచ్చిందా? అద్భుతంగా ఉంది. నాగదేవుడు గెటప్ పోషిస్తున్నప్పుడు వింత అనుభూతి కలుగుతోంది. ఇలాంటి సినిమాలు చేయడమంటే మనకు తెలియని నాటి విషయాలెన్నో తెలుసుకోవడానికి ఉపకరించే పాఠం లాంటిది. ఇంకో విషయం తెలుసా? ఈ పాత్ర కోసం నేనే తెలుగులో డబ్బింగ్ సైతం చెపుతున్నా. మరింకేం... తెలుగులో నటన కొనసాగిస్తారన్నమాట... నాకు నచ్చిన పాత్రలు వస్తే చేస్తాను. ‘రుద్రమదేవి’ తర్వాత మరికొన్ని ఆఫర్లు వచ్చాయి. చర్చల దశలో ఉన్నాయి. అయితే ఒకటి.. పక్కా విలన్ క్యారెక్టరైతేనే చేస్తా. పాప్ సింగర్‌గా నటించే ఛాన్స్ వస్తే... ఓ... బ్రహ్మాండంగా. ఇక అందులో అయితే నటించాల్సిన పని కూడా లేదు. (నవ్వేస్తూ) గతంతో పోలిస్తే ప్రైవేట్ పాప్ ఆల్బమ్స్ రాక తగ్గిపోయినట్టుంది... పెద్ద పెద్ద ఆడియో కంపెనీలు మూతపడ్డాయి. పైగా పొద్దున్న పాడి సాయంత్రం కల్లా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేస్తే చాలు... ప్రపంచం అంతా చుట్టేస్తుంది. -ఎస్.సత్యబాబు -
సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ లో హోలీ వేడుకలు
-
‘పవనిజం’ సినిమా స్టిల్స్
-
దేశం కోసం బతకడమే ‘పవనిజం’
‘జనగళమున జనం స్టార్... పద కదమున పవర్‌స్టార్.... చెడు జరిగితే ఖబడ్దార్..’ ‘పవనిజం’ చిత్రం కోసం శ్రీమణి రాసిన పాట ఇది. పవన్‌కల్యాణ్ అభిమానులు తలచుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాబా సెహగల్ పాడిన ఈ పరిచయగీతం హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర దర్శకుడు ఇ.కె.చైతన్య చెప్పారు. దేశం కోసం బతకడమే పవనిజం అని, యువతలో చైతన్యం నింపేలా ఈ సినిమా ఉంటుందని, జనవరికి చిత్రీకరణ పూర్తి చేసి వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మధు, సుధీర్, సింధు, జయంతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, కెమెరా: సతీశ్ ముత్యాల, నిర్మాత: శ్యామ్ శ్రీన్. -
హలో చిరు..హలో చిరు హౌ ఆర్ యూ
-
'హలో చిరు..హలో చిరు హౌ ఆర్ యూ'
ముంబై: జల్సా చిత్రంలోని 'కరో కరో జరా జల్సా' పాటతో పాపులర్ అయిన బాబా సెహగల్.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి ఓ పాటను కానుకగా ఇవ్వనున్నాడు. బాబా సెహగల్ ఇటీవలే చిరంజీవిపై ఓ పాటని రాశాడు. సెహగల్ ఓ స్పెషల్ ట్రీట్ తో అభిమానుల ముందుకు రానున్నాడు. సెహగల్ రాసిన ఆ పాటకి చిరు అని పేరు పెట్టాడని ఆయన తెలిపాడు. చిరంజీవి గారి కోసం పాట రాస్తున్న విషయాన్ని గతంలో చెప్పిన సెహగల్ తాజాగా ట్రీజర్ ను విడుదల చేశారు. 'హలో చిరు..హలో చిరు హౌ ఆర్ యూ' అంటూ సాగే ఈ పాట త్వరలోనే రిలీజ్ అవుతుందని’ చెప్పాడు. గత కొద్ది రోజుల క్రితమే బాబా సెహగల్ ‘పవ పవ పవన్ కళ్యాణ్’ అంటూ సాగే ఓ పాటని పవన్ కళ్యాణ్ కి ట్రిబ్యూట్ గా చేసారు. ఆ పాట పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఈ సారి చిరంజీవి కోసం ఎలాంటి పాటతో వస్తున్నాడో వేచి చూడాల్సిందే.