దేశం కోసం బతకడమే ‘పవనిజం’ | baba sehgal song highlight in pawanism movie | Sakshi
Sakshi News home page

దేశం కోసం బతకడమే ‘పవనిజం’

Published Fri, Dec 27 2013 12:35 AM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

దేశం కోసం బతకడమే ‘పవనిజం’ - Sakshi

దేశం కోసం బతకడమే ‘పవనిజం’

‘జనగళమున జనం స్టార్... పద కదమున పవర్‌స్టార్.... చెడు జరిగితే ఖబడ్దార్..’ ‘పవనిజం’ చిత్రం కోసం శ్రీమణి రాసిన పాట ఇది. పవన్‌కల్యాణ్ అభిమానులు తలచుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాబా సెహగల్ పాడిన ఈ పరిచయగీతం హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర దర్శకుడు ఇ.కె.చైతన్య చెప్పారు. దేశం కోసం బతకడమే పవనిజం అని, యువతలో చైతన్యం నింపేలా ఈ సినిమా ఉంటుందని, జనవరికి చిత్రీకరణ పూర్తి చేసి వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మధు, సుధీర్, సింధు, జయంతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, కెమెరా: సతీశ్ ముత్యాల, నిర్మాత: శ్యామ్ శ్రీన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement