pawanism
-
‘దేవదాసు’ రోజులు గుర్తొచ్చాయి...
‘‘ ‘రేయ్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నా ‘దేవదాసు’ సినిమా రోజులు గుర్తొచ్చాయి. మా క ష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ‘పవనిజం’ సాంగ్‌ను సెన్సార్ చేసి త్వరలోనే సినిమాకు జత చేస్తాం’’ అని వైవీయస్ చౌదరి తెలిపారు. సాయిధరమ్‌తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ ముఖ్యతారలుగా బొమ్మరిల్లువారి పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రేయ్’ ఇటీవల విడుద లైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీనికి కారణం వైవియస్ చౌదరిగారు. ఆయన కృషి, పట్టుదల కారణంగానే సినిమా ఇంత ఘన విజయం సాధించింది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్, నోయెల్, జానీ మాస్టర్, శ్రీధర్ సీపాన, మణికిరణ్, హరీష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కళ్యాణ్ ను కలిసిన పవనిజం టీమ్
-
యువతలో చైతన్యం నింపేలా...
పవన్‌కల్యాణ్ అభిమానులు తలచుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ‘పవనిజం’. ఇ.కె.చైతన్య దర్శకుడు. శ్యామ్ శ్రీన్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘దేశం కోసం బతకడమే పవనిజం. యువతలో చైతన్యం నింపేలా ఈ సినిమా ఉంటుంది. పవన్‌కల్యాణ్ అభిమానులు పండగ చేసుకునే సినిమా ఇది’’ అని చెప్పారు. మధు, సుధీర్, సింధు, జయంతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, కెమెరా: సతీశ్ ముత్యాల, నిర్మాత: శ్యామ్ శ్రీన్. -
‘పవనిజం’ ఆడియో ఆవిష్కరణ
-
రాజా లేరంటూ.. పవన్ ఫ్యాన్స్ దుష్ప్రచారం
పవన్ కల్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించిన హీరో రాజాపై పవన్ అభిమానులు తీవ్ర దుష్ప్రచారం చేశారు. కొత్తగా పెళ్లయిన రాజా.. రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలలో విపరీతంగా దుష్ప్రచారం చేశారు. రాజా ఆత్మకు శాంతి కలగాలంటూ అతడి ఫొటోను పోస్ట్ చేసి కామెంట్లు చేశారు. అయితే.. ఇదంతా అబద్ధపు ప్రచారం. వాస్తవానికి రాజాకు ఎలాంటి ప్రమాదం జరగనేలేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. కేవలం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించిన పాపానికే ఆయన మీద పవన్ ఫ్యాన్స్ ఇలాంటి దుష్ప్రచారానికి దిగారు. ఇది ఎంతవరకు సబబని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రశ్నించడానికే తన జనసేన పార్టీ ఉందని చెప్పుకొన్న పవన్, ఆయన అభిమానులు.. పవన్‌ను ఎవరైనా ప్రశ్నిస్తే సహించరా? ఏకంగా వారి చావు కోరుకుంటారా? బతికున్న వారినే చంపేస్తారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. పవన్ అభిమానుల వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదన్న పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఒకప్పుడు తాను విమర్శించిన చంద్రబాబునే గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. పనిలోపనిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన విషం కక్కుతున్నారు. సినీ నటుడు రాజా ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏం పోరాటం చేశారంటూ పవన్‌ను నిలదీశారు. రాజా ఏం అన్నారంటే.. పవన్ కల్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని శనివారం సినీ హీరో రాజా ఆరోపించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుల మీద ఆధారపడి మాట్లాడటం కాదని....చేతనైతే ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడాలని పవన్ కల్యాణ్‌కు సూచించారు. సినిమా ఇండస్ట్రీలో అన్యాయం గురించి ఎప్పుడైనా స్పందించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ఎదిరించిన ఒకే ఒక్క సింహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన అభివర్ణించారు. టీడీపీ, బీజేపీలకు జగన్ ఫోబియా పట్టుకుందని అన్నారు. అంతే పవన్ ఫ్యాన్స్ ఆవేశంతో రెచ్చిపోయి ఇలా తప్పుడు ప్రచారానికి దిగారు. -
దేశం కోసం బతకడమే ‘పవనిజం’
‘జనగళమున జనం స్టార్... పద కదమున పవర్‌స్టార్.... చెడు జరిగితే ఖబడ్దార్..’ ‘పవనిజం’ చిత్రం కోసం శ్రీమణి రాసిన పాట ఇది. పవన్‌కల్యాణ్ అభిమానులు తలచుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాబా సెహగల్ పాడిన ఈ పరిచయగీతం హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర దర్శకుడు ఇ.కె.చైతన్య చెప్పారు. దేశం కోసం బతకడమే పవనిజం అని, యువతలో చైతన్యం నింపేలా ఈ సినిమా ఉంటుందని, జనవరికి చిత్రీకరణ పూర్తి చేసి వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మధు, సుధీర్, సింధు, జయంతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, కెమెరా: సతీశ్ ముత్యాల, నిర్మాత: శ్యామ్ శ్రీన్.