![యువతలో చైతన్యం నింపేలా... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51411323175_625x300.jpg.webp?itok=BvIMzueH)
యువతలో చైతన్యం నింపేలా...
పవన్‌కల్యాణ్ అభిమానులు తలచుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ‘పవనిజం’. ఇ.కె.చైతన్య దర్శకుడు. శ్యామ్ శ్రీన్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘దేశం కోసం బతకడమే పవనిజం. యువతలో చైతన్యం నింపేలా ఈ సినిమా ఉంటుంది. పవన్‌కల్యాణ్ అభిమానులు పండగ చేసుకునే సినిమా ఇది’’ అని చెప్పారు. మధు, సుధీర్, సింధు, జయంతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, కెమెరా: సతీశ్ ముత్యాల, నిర్మాత: శ్యామ్ శ్రీన్.