బలహీనతలు... | Over Dose movie | Sakshi
Sakshi News home page

బలహీనతలు...

Published Thu, May 22 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

బలహీనతలు...

బలహీనతలు...

ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లల జీవనశైలి ఎలా ఉంటోంది? డ్రగ్స్‌కి ఎలా ఆకర్షితులవుతున్నారు? వాళ్ల బలహీనతను సంఘ విద్రోహ శక్తులు ఎలా సొమ్ము చేసుకుంటున్నాయి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఓవర్ డోస్’. అమర్, మిలన్, పరినిధి నాయకా నాయికలుగా చేస్తున్న ఈ చిత్రంలో బాబా సెహగల్ ప్రతినాయకునిగా నటిస్తున్నారు. కృష్ణ మన్నేరి దర్శకత్వంలో విజయలక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. రమణ గోగుల స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీకృష్ణ పైడిమరి, పాటలు: కాసర్ల శ్యామ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement