'సీరియస్ ఇష్యూ .. ఈ పాట వినాల్సిందే' | Baba Sehgal is Here With a Very Serious Song About Suicide | Sakshi
Sakshi News home page

'సీరియస్ ఇష్యూ .. ఈ పాట వినాల్సిందే'

Published Sun, Apr 24 2016 9:35 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

'సీరియస్ ఇష్యూ .. ఈ పాట వినాల్సిందే' - Sakshi

'సీరియస్ ఇష్యూ .. ఈ పాట వినాల్సిందే'

ముంబయి: ఆత్మహత్యలపై ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ బాబా సెహగల్ సీరియస్గా స్పందించారు. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. నిర్ణయం తీసుకున్న తర్వాత చివరి క్షణాల్లోనైనా ఓసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. ప్రత్యూష బెనర్జీ మరణం తనను ఎంతో కలిచివేసిందని చెప్పిన ఆయన ఈ విషయంపై సీరియస్ గా స్పందిస్తూ ఓ సీరియస్ గీతాన్ని ఆలపించారు.

ఆయన పాట పాడుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో ఆత్మహత్యలు చేసుకున్న వారి ఇమేజ్ నమునాలు కనిపిస్తూ మరోపక్క.. బతకాలనే స్ఫూర్తినిచ్చేలా కొన్ని చిత్రాలు కనిపించేలా ఆయన ఈ సాంగ్ డిజైన్ చేశారు. ఆశతో జీవించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో హెచ్చుతగ్గులు, ఇబ్బందిపెట్టే బ్రేకప్లు, డబ్బు సమస్యలు మనిషిని ఆత్మహత్యకు పురికొల్పుతాయని ఇలాంటి సందర్భాల్లో ఆలోచించినా ఒక మంచి ఆశా కిరణం కనిపిస్తుందని చెప్పారు. ఈ గీతాన్ని కూడా ఆత్మహత్యకు పాల్పడిన ప్రత్యూష బెనర్జీకి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement