దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజూ 4లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి పరిస్థిత్లుల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం హీరో విజయ్ దేవరకొండను రంగంలోకి దించింది. ప్రభుత్వం తరపున కరోనా పట్ల ప్రజలకు కీలక సూచనలు చేస్తూ విజయ్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. 'కరోనా సెకండ్ వేవ్ అందరినీ ఎంతో ఇబ్బందిపెడుతోంది. 2020లో మనమందరం ఎంతో కష్టపడ్డాం. బయపడ్డాం అనుకునేలోపే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యింది. కరోనా చాలా వేగంగా వ్యాపిస్తుంది. అయితే అందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.
మీకు జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలుఘుంటే అది కోవిడ్ అయి ఉంటుంది. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోండి. టెస్టులు చేయించుకొని రిజల్ట్ వచ్చే వరకు ఎదురుచూడొద్దు. ఎందుకంటే టైం అన్నింటికంటే ముఖ్యం. పైన చెప్పిన లక్షణాలు మీకు ఉంటే వెంటనే డాక్టర్ సూచనలతో చికిత్స తీసుకోండి. ఎంత త్వరగా ట్రీట్‌మెంట్ మొదలుపెడితే అంత మంచిది. అయితే ట్రీట్‌మెంట్ చాలా చిన్నది. కొన్ని ట్యాబెట్లు ఉంటాయి. మీ దగ్గర్లోనిఘే గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లినా మీకు అవి కిట్ రూపంలో ఇస్తారు. భయపడకండి. జాగ్రత్తగా ఉండండి' అంటూ విజయ్ తెలిపారు. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి : ఇక షూటింగ్‌కి అనుమతి లేదు
తెలంగాణలో కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు
Comments
Please login to add a commentAdd a comment