
Jayasudha Tested Positive For Covid-19: కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా సహజనటి జయసుధ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక జయసుధకి కరోనా అని తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అభిమానులు సహా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.